మే డే సందర్భంగా..
శీర్షిక : నిత్య శ్రామికుడు
తరాలు మారుతున్నా
తలరాతలు మారని ఒకే ఒక్క
బడుగు జీవి కార్మికుడు.
అంటరాని వాడిగా అగౌరవ పరుస్తున్నా
అందరి ఇంటి వాడిగా , మన ఇంటి
చెత్తను ,తీసి మన ఒంటి బట్టను
ఉతికి ఆరేసే ఏకైక శ్రమజీవి కార్మికుడు.
భుా గర్భ గనుల నుండి , అంతరిక్ష
క్షిపణులవరకు గల అన్ని పనుల్లోనుా
తమ వంతుగా కష్టపు చమటను
చిందస్తున్న ఏకైక జీవి కార్మికుడు.
అంగడి అమ్మకాల నుండి
అకాశహార్మ్యాలవరకు గల అన్ని
రంగాల లోనుా శ్రమిస్తుా, ఎదుగు
లేని జీవితాన్ని ఒదుగుతుా
గడుపుతున్న నిత్య జీవన పోరాటకుడు.
ఎలక్షన్ల సమయంలో ఏలికల
స్వార్ధ పుారిత బాసలు నమ్మి ,
ఏనాటికైనా ,తమ బతుకులు
బాగుపడవా...అన్న ఆశతో బ్రతుకుతుా
తమ విధ్యక్త ధర్మాని నీతిగా నిర్వర్తిస్తున్న
నిత్య ధర్మ పోరాటకుడు, శ్రామికుడు.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.
---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ
ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment