మహతీ సాహితీ కవిసంగమం- కరీంనగర్ ప్రతిరోజూకవితా పోటీల ---
పర్యవేక్షణ: డా౹౹శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు
సమీక్ష : శ్రీ కొనింటి రమేష్ గారు
తేది: 05-05-2021 (బుధ వారం)
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
అంశం : దత్తపది : అల వల కల తల.
శీర్షిక : పాపం పండింది.
ప్రక్రియ : ఇష్టపది.
అలవాటు లేని ఈ ఆచారములనెల్ల
కణ రోగమ్ము వలన కడకాచరించిరిగ॥
కల నైన తలవనిది గడ్డు కాలము కదర
తలరాత మారనిది ధర పాప ఫలమిదిర ॥
అల తరువులను గుాల్చి ఆక్సిజను కరువౌగ
వల వేసి వాయువును బట్టి, పడి యాతనల॥
వేరు చేసిరకటా వెర్రి మానవులు గద
పీల్చు గాలి కొరకై పిచ్చిగాదే ఇచట॥
----------------------------------------------
రామ రాజ్యమే కల రాదు ఎప్పటికినీ
తలలు మారిన గాని తరుణమిది మారదుర॥
వడి వడిగ వచ్చె కలి వచ్చి నాశము జేయు
రాక్షసత్వము దునిమి రక్షీంప అవనినీ॥
అలవోకగా చుాచి వల విసిరి పట్టు కొని
కల కలము సృష్టించు కడు ఘోరముగనిలను ॥
తలచు కొను మిపుడైన ధర్మ దేవతలను
జగదీశ్వరిడుమాట జనులార వినరయ్య ॥
-----------------------------------------------------
No comments:
Post a Comment