Wednesday, April 7, 2021

పాట వెలదిలో సుందరాకాండ..111 to 121.

111.
సుారు డతడు యెక్కె సుాకరమును
ఒరిగె కుంభకర్ణు డొంటె పైన
మదము నింద్రజిత్తు మకరమెక్క
దక్షిణంబు దెసగ తరలి ,  పడిరి ॥
112.
అసురు లదెగ జచ్చె అవని నిండె
మట్టి గలిసి రంత మహిమ గాదె
భయము భీకరమ్ము , బడక బాధ 
కదలి పారి పొండు వదలి లంక ॥
113.
అనిన త్రిజట తోడ అసురు నాజ్ఞ
చెప్పి రపుడు వారు చేయు పనిని
సీత మనక యున్న  శీఘ్ర గతిని
చంపు రావణుండు చరచి మమ్ము ॥
114.
నీదు మాట వినిన నీల ఘనుడు
రాము డొచ్చి చంపు రమణి రోయ
ఏమి సేయ వలయు ఏది సబబు
తెలియ జెప్పు మాకు తెలివి మీర ॥
115.
అనిన త్రిజట జెప్పె అసలు మాట
రాము డొచ్చు మాట   రక్క సులకు
తెల్ల గంధము నదె దేహ మలది
వచ్చె వేల్పు లిటకు  వనిత వెదుక ॥
116.
తెలుపు వలువ లిడిరి తెలుపు సరులు
ధారణమ్ము జేసి , ధాశరధులు
చంద్ర కాంతి జిమ్ము ఛత్రము గల
తెల్ల కరిని ఎక్కి తేలి ఎగిరె ॥
117.
మంగళములు  మ్రొాగె మధుర గతిని
దండ మిడుచు వచ్చె దనుజు డొకడు
వినయ ముగను రామ విభుని కడకు
వీరుడతడు గనవి  భీషణుండు.॥
118.
విశ్వ కర్మ జేయు విజయ లంక
అమరెనందముగను అదియె నిజము
రావణుండు రసిక రాజ విభుడు
ఏక ఛత్ర ముగను ఏలె లంక ॥ 
119..
రామ దుాత యొకడు రాత్రి జేరె
 తిక్క వానరుండు  తిరుగు బోతు
 వాలమంట నిప్పు  వాడె గాల్చె
 మంట లెగసె మారె మసిగ  లంక ॥
120.
స్వర్గ  మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె  సాగరమున కల్ల గాదు ॥

No comments:

Post a Comment