పాట వెలది పద్య ప్రక్రియలో సుందరాకాండ.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
రుాపకర్త.: శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
కల్యాణ్. : మహారాష్ట్ర .
120.
స్వర్గ మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె సాగరమున కల్ల గాదు ॥
121.
అనుచు జెప్పె త్రిజట అసురి నులతొ
భయము చెంది వార భయము కోరె
రాత్రి గడిపి రెటులొ రణము దలచి
రమణి సీత విడిరి రగుల భయము ॥
122.
శోక వనిని సీత శోక మిడుచు
కడగ రాము దలచె కమల నేత్రి
ప్రాణ త్యాగ మెంచి ప్రణతు లిడుచు
మెడకు జుట్టె జడను మేలు ఉరిగ ॥
123.
కనుల నీరు నిండె కఠిన గతికి
దుఃఖ మినుమడించ తుాలె సీత
అంత లోనె వింత వనిని జరిగె
శుభ శకునములను సుదతి గాంచె ॥
124.
సీత జేయు పనిని చిత్రముగను
గనిన హనుమ మదిని కలవరపడె
ఆలసింప అగును అశుభ మనుచు
తరుణి సీత గావ తలపు నెంచె॥
125.
రామ బంటు ననిన రమణి మనదు
రక్కసుండ వనుచు రగులు సీత
వేష ధారి వనుచు వేయు నింద
ఏమి చేదు నింక ఎరుక జేయ ॥
126.
యొాచ నెంచి అతడు యొాగ్యమైన
రామ కధను పాడె రమణి వినగ
పావనమ్ము గాధ పరమ శుభము
పలుక తేనె లొలుకు భవుని చరిత ॥
127.
వినియు రామ చరిత వివశయౌచు
సీత అగి చుాచె చిత్ర ముగను
ఉరిని వేయుటాపి ఉరికె సీత
పాట వినిన దెసకు పరుగు లిడగ ॥
128.
సీత వినుట గనుచు శీఘ్ర గతిని
రామ గుణము లెల్ల రసము లొలుక
పలికె హనుమ శ్రావ్య పాట రీతి.
సంత సించ సీత సరసి జాక్షి ॥
129.
సత్య వంతుడతడు సర్వ శుభుడు
యశము లేలువాడు యజ్ఞ ఫలుడు
ధశరధాత్మజుండు ధరణి నేలు
రామచంద్రుడతడు రఘుకులజుడు ॥
130.
తండ్రి మాట వినెడు తనయు డతడు
ధర్మ మార్గ మెంచు ధర్మ ధవుకు
జ్ఞాన ధనుడతండు దాన గుణుడు
దశరధాత్మజుండు ధర్మ ప్రభువు ॥
131.
సభను సభికులంత సమ్మ తిడగ
రాజ పట్టమిడగ రాము నకును
జేయ నిర్ణ యించె జయము గాను
దశరధుందు ధర్మ దాశరధికి ॥
132.
సంతసమ్ము తోడ సతుల జేర
చిన్న భార్య కైక చిందె విషము
మున్ను బాస లిడిన ముాడ్వరముల
ముందు ఇమ్మ నడిగె ముార్ఖముగను ॥
133.
మాట తప్పనన్న మగని జుాచి
కరకు కైక కోరె కటు వరములు
వనము కంప మనెను వర సుతుడను
కట్ట వలె భరతుకు పట్ట మనెను ॥
134.
రాము వీడ మనెను రాజ్య సుఖము
కడకు పంప మనెను కాన నముకు
పదియు నాలుగేండ్లు పరిమి తిడెను
కఠిన మనము నిండు కపటి కైక ॥
135.
దద్దరిల్లె నభము ధరణి పగిలె
మాట విన్న రాజు మదిని రగిలె
ఏమి కోర్కె ఇదని ఏడ్చుచడిగి
దశరధుండు కుాలె ధరణి పైన ॥
136.
ముక్కుపచ్చలారు ముద్దు సుతుని
అడవికంప లేను అడుగ నీవు
కనికరమ్ము తోడ కరుణ గొనుమ
అనుచు ధశరధుండు అడిగి సోలె ॥
137.
కరగ లేదు మనసు కఠిన గుణికి
దీను డతడు వేడ ధక్కరించె
మాట ఇచ్చితీవు మరల కనుచు
పట్టు బట్టి కైక పతిని రోసె ॥
138.
తండ్రి మాట వినెడు తనయు డతడు
తల్లి కోర్కె దీర్చ తరల వనికి
వల్క ధారి యుౌచు వదలె పురము
చెదర నీక నగవు చేసి నమము ॥
139.
రాము విడవ లేని రమణి సీత
వెంట నడచె నతని వెలుగు వలెను
రాము గుాడి నడచె లక్ష్మణుండు
రాము డున్న చోటె రక్ష యనుచు ॥
140.
కామ రుాపులైన కర్కసులను
హతమొనర్చె రాముడడవి లోన
దండకా అరణ్య దాపు నతడు
దానవులను దృంచె, దరిమి తరిమి ॥
141.
సుారు డతని గనెన సుార్ఫణఖయె
పెండ్లి యాడ గోరి ప్రేమ దెలిపె
కోసె ముక్కు చెవులు కోపి అతడు
రామ అనుజు డతడు రక్షకుండు
142.
లక్ష్మణుండు అతడు లక్ష ణుండు.
సీత గాచు నతడు చిన్న వాడు .
రావణాసు చెల్లి రక్కసామె
రగిలె బాధ తోడ రక్కసామె ॥
143.
అన్న రావణునకు అంత జెప్పె
చెల్లి మాట వినుచు చెలగె నతడు
అనుజు మారి చునకు ఆజ్ఞ జేసె
మాయ లేడి గాను మార నతడు ॥
144.
అన్న రావణు మాట నమలు జేసి
మారిచుండు వెడలె మాయ తోడ
మృగము జుాచి మురిసె ముదిత సీత
స్వర్ణ మృగము కోరె స్వయము సీత ॥
145.
సీర కోర్కె దీర్చ సిద్ధ మౌచు
రాము మృగము తరిమె రమణి కొరకు
మాయ తెలియు రేడు మాటు వేసి
మారిచునను జంపె మహిమ తోడ ॥
146.
జాప్య మగుట గాంచి జడిసె సీత
పంపె లక్ష్మణునదె పడతి వనికి.
దానవులది మాయ దడవ కనుచు
గీరి దాట కనుచు గీత గీసె ॥
147.
కృుద్ధ రావ ణుండు కృుారు డతడు
మానినపహరింప మాయ పన్నె
సాధు రుాప మెత్తి సమయ మిదని
రమణి దరికి పోయె రావణుండు.॥
148.
బిక్షు వేష కునకు బిక్ష మిడగ
సీత మాట మరచి గీత దాటె.
కపట రుాప ధారి కరుణ వీడి
మాతనపహరించె మాయ తోడ ॥
149.
ఇంతి బాసి వగచె ఇనకులజుడు
అడవి దారి బట్టె అవనిజ గన.
వృద్ద గ్రద్ద జెప్పి వ్రాలె నంత
ప్రాణ ములను బాసె ప్రభువు చెంత ॥
150.
లంక పురము వెదుక లక్ష్యమునిడి
రేయి పవలు దిరిగె రేడు విసిగె .
నగవు లేలి నట్టి నాధు డలసె
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
151.
వాలి గుాల్చె నతడు వనమునందు
వాని తమ్ము జేసె వనికి రాజు
రామ సుగ్రివులదె రాగ మలర
మిగుల ప్రీతి మెలగు మితృలైరి.॥
152.
సంత సమున విభుని సత్కరించె
వానరులకు రేడు వరలు భక్తి .
సిరుల నేలు ముఖము చిన్న బోవ
విషయ మేమనడిగె విభుని రేడు ॥
153.
రాముడశృవులతొ , రమణి దలచి
విషయ మంత జెప్పె వివర ముగను .
విషయ మంత వినిన విభిషణుండు
తరుణి వెదికు దేను ,తప్పకనెను ॥
154.
ప్రతిగ మేలు జేతు ప్రభువు కనుచు
కపుల పిలచి జెప్పె కబురు నతడు
రమణి వెదుక మనెను రాజ్య మంతా
రామ కార్య మిదనె , రాజసమున ॥
155.
కామ రుాపు లైన ఘనులు కపులు
వెదుక నాల్గు దెసలు వెడలి రంత.
పక్షి రాజు మున్ను పలుకు బాట.
కడకు సాగరమును గనిరి కపులు॥
156..
సాగరమును దాట సాధ్య మౌన
నట్ట నడుమ గలదు నగర లంక
ఎగుర గలమ మనము, ఏమి దారి..?
చేత నౌన మనకు జేర లంక. ॥
157.
వగచు కపుల జుాచి వాయు సుతుడు
తనదు మాట జెప్పె తరుణ మిదని
అంజనీసు తుడను హనుమ నేను
కడలి దాటుదేను గన కమలిని ॥
158.
అనుచు పలుకు నాకు అనుమ తిడెను..
విభుడు రక్ష నాకు విడ పదములు .
రామ దాసు డేను రమణి నమ్ము
అనుచు పలికె హనుమ ఆదరమున ॥
159.
ప్రభువు నాజ్ఞతోడ పయన మైతి
జేర వస్థి లంక జయము తోడ
మాత! సీత వెదుక మదిని దలచి
ఓర్మి శాఖ లందు ఒదిగి యుంటి.॥
160.
అనుచు పలుకు నట్టి , హనుమ జుాచి
విస్మయమ్ము తోడ వినెను సీత.
వేల కిరణ ద్యుతుల వెలుగు వాని
కపిని జుాచె సీత కడు ముదమున ॥
********************************
161 :
చిన్నదైన రుాపు చిత్రముగను
శ్రియము గానె తోచె సీత కపుడు
నన్ను తెమ్మ నంపు , నాధు బంటు
నమ్మకస్తు డితడు నరుడు కాదు ॥
162.
వనచరుండు ఇతడు వానరుండు
అసురు డితడు కాడు అతి బలుండు
రామ భక్తి నిండు రక్షకుండు
అనుచు మురిసె సీత హనుమ జుాచి ॥
163.
కనులు చెమ్మగిల్లు కాంత జుాచి
హనుమ పలికె నపుడు అర్ద్రముగను
రక్కసులకు జిక్కు రమణి మణివి
ఎవరు నీవు తల్లి ఏమి గాధ ॥
164.
సర్వ లక్షణ సార సగుణ వతివి ,
సిరుల నెలవు సాధ్వి సీత సతివ ?
రాము బాసి నట్టి రమణి మణివ ?
తెలుపు మమ్మ నీవు తెరలు తొలుగ ॥
165.
అనుచు హనుమ బల్క అవనిజపుడు
కపి కులజుని జుాచి కదలి వచ్చి
పలికె శిరము వంచి భయము వీడి
కనుల నీరిడుచును కమల నయని ॥
166..
జనక రాజు పుత్రి జానకేను
పుాజ్య దశరధునకు పుత్ర వధువు
ప్రీతి రాఘవునకు ప్రియసతేను
వరలు సీత నేను వానరేంద్ర ॥
167..
కపట వేష మునను కఠిను డౌచు
అపహరించి నాడు అతడసురుడు.
లంక కతడు రాజు లాలసుండు
చెరను బెట్టె నన్ను చెడుపు గుణుడు.॥
168.
గడువు రెండు నెలలు గడచి నంత
దాన వుండు దునుము దయను వీడి
విధి బలీయ మనుచు వివశనౌచు
విధిగ వేచి యుంటి విభుని కొరకు ॥
169.
అనుచు పలికి నట్టి అవనిజ గని
హనుమ చెంత నిలచె అంజలిడుచు.
విభుడు నీదు వార్త వినగ నెంచి
నన్ను పంపి నాడు నమ్మ వమ్మ ॥
170.
నీదు క్షేమ వార్త నిశ్ఛయముగ
దీను డైన విభుకు దీర్ఛు చింత.
రాముడుండ లేడు రమణి విడచి
రయము నతడు వచ్చు రాగ మలర ॥
171.
విభుడు కుశల వార్త వినగ నెంచి
వేచి యుండు నవల వేయి కనుల.
వానరులను గుాడి వచ్చు నతడు.
సాగరమ్ము దాటి సాయు ధునిగ ॥
172.
అలరు తేజ ముార్తి అభయకరుడు
అనుజు లక్ష్మణుండు అతని నీడ
కరుణ నేలు వాడు కమల ముఖుడు
రామచంద్రుడతడు రఘుకులజుడు॥
173.
రామ కధలు పలుక రమ్య ముగను
హర్ష మిడుచు సీత హాయి నొందె
భయము విడెను సీత భక్తు గనుచు
నమ్మె హనుమ మాట నాధు దలచి ॥
174.
ముదము నిండు సీత ముఖము గాంచి
హనుమ పలికె మరల అలరు భక్తి
రామ దుాత నేను రాసి సుగుణి
కులజు డతడు విభుడు కుశల మమ్మా ॥
175.
అనుజు లక్ష్మణు డంపె ఆది నమము
దీవెనిడెను విభుడు దీర్ఘ శుభము
మదిని కోరె కపులు మంగళములు
శుభము నీకు తల్లి శుభము గల్గు ॥
176.
మిమ్ము జేర వారు మించు గతిని
కమ్ము కొనిరి దిశల నమ్మవమ్మ
అన్న రాముడిచ్చె ఆనవాలు
అంగుళీక మిదియె అంబుజాక్షీ ॥
177.
అమృత తుల్య మాయె హనుమ పలుకు
విన్న సీత మురిసె విభుని మాట
ఆనవాలు గొనెను అవని జాత
కారె కంట నీరు కలుగ సుఖము ॥
178.
చుట్టు ముట్టి లంక మట్టు బెట్ట
వానరులను గుాడి వచ్చు నెపుడు..?
రాము డెపుడు వచ్చు రధము నెక్కి
రావణాసు గుాల్చ రణము నందు ॥
179.
బ్రతుక జాల నేను బ్రతుకు బరువు
ఎదురు జుాతు నేను ఎదరు జుాతు
గడువు ముగిసి నంత గాన క్షణము
అనుచు సీత పలికె హనుమ తోడ ॥
180.
అన్నపాన ములను అన్ని విడచి
అహరహములు నిన్నె అతడు తలచు.
శోక తప్తు డౌచు సొమ్మసిల్లు
నిత్య వేద నొందు నీ విభుండు ॥
181.
మదిని కలచు మాట మాత సీత
వినగ లేక వగచె వివర మింక
వేగ పోవు మయ్య వేగ హనుమ
అనుచు తొందరించె అవని జాత ॥.
182.
విచలితాయె సీత విభుని గతికి
చేత కనులు ముాసె భీత హరిణి
నాదు కుశల వార్త నాధు దెలిపి
అర్తి దీర్చు మయ్య హనుమ నీవు ॥
183.
మారు మాట రాక మానినిచ్చె...
మాత కురుల ముడియు మాన్య మణిని
నాదు జ్ఞాపి కిదని నాధు కొసగు
అనుచు జెప్పె సీత ఆర్ద్ర ముగను ॥
184.
జడుడు నన్ను జేరి జంప మున్నే
నాధు జేరి జెప్పు నాదు వినతి
విభుకు దెల్పి రమ్ము వివరముగను
వేచి యుందు నేను వేగ రమ్ము ॥.
185.
పలికి తివిగ హనుమ భక్తి తోడ
ఓర్మి రామ కధను ఒద్దికగను
నిండె మదిని శాంతి నిజము హను
ధైర్య మిపుడు కలిగె కార్య సుార ॥
186.
ముఖ్యుడ వని ఎరిగి మురియు చుంటి
వేగ పోయి రమ్ము వేచి యుందు.
మాసము లవి రెండు మరువ బోకు
తొలుత గడువు దెల్పి తోడ్క రమ్ముబ॥
187.
అనుచు కంట నీరు అదె శ్రవింప
భారమాయె మనసు భక్తవరుకు
శోక మేల నమ్మ శోభ నయని
భీతి వీడు మమ్మ భీత హరిణి.॥
188.
సంశయమ్ము వీడి సంతసమున
ముాపు నెక్కుమమ్మ ముప్పు తొలగ
తోడ్క పొిదు నిన్ను తొందరగను
చెరను విడచి రమ్ము చేర విభుని ॥
189.
అనుచు పలికె హనుమ ఆదరమున
నవ్వె సీత వాని నాత్రముగని
కనగ బాలు డంటి కపివి నీవు
పట్టి ఎగుర గలవ పవన మందు ॥
190.
నింగి నెగుర బోవ నీకు వశమా ..
జలధి దాట గలవ జక్కగాను.
జార్చి వేతు వేమొ జలధి నన్ను
జంకు చుంటి నేను జడియు చుంటి ॥
200.
అనుచు సీత పలికె నలర నగవు
ముదము నొంది మదిని మురిపెముగను
చిన్న బోయె హనుమ చిందె సిగ్గు
కామ రుాపు విడచె కాంత ఎదుట ॥
******************************
No comments:
Post a Comment