2/04/2021.
"సాహితీ బృందావన జాతీయ వేదిక "ఆధ్వర్యంలో ఉగాది జాతీయ పురస్కారాలు కవి సమ్మేళనం ,అంతర్జాల వేదిక .
*అంశం :సంస్కృతుల నవోత్సవం ఉగాది పర్వదినం*
శీర్షిక : స్వాగతం-సు స్వాగతం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
వత్సరాని కొకసారి మనకోసం
వచ్చే మన యుగాది నెచ్చెలి ,
వసంత కోయిలల వలపు రాగానికి
పులకించే పల్లవై ఆనంద లోకాల
ఆరంభ గీతం తానే కావాలని , ,
సుఖ- దుఃఖ సమానతల , జీవిత
సారామృతాల దివ్య ఓషధులతో
ఆరోగ్య యుగాదికి ,ఆనందం కారణం
తానే కావాలని , చల్లని తేట నీటి
వనరులను సమృద్ధిగా ఇచ్చే
" ప్లవ "నామ కన్యను కుాడా తోడ్కొని
మన మధ్యకు ఆనందంగా వస్తోంది.
వెతలను మాపే వేక్సీన్ తీసుకొని ,
కాలుష్య నిర్ముాలనా పధంలో
పర్యావరణ రక్షాదీక్ష పుాని,
కరోనాను తరిమి కొట్టే కట్టు బాట్ల
నియమాలకు నిత్య బద్ధులమై,
సామాజిక దుార నియమాలను
పాటిస్తుా ,పండగ కళల శోభలతో
సుగంధ పరిమళాలు మేళవించిన
ఛందోబద్ధ కవన సుమ హారాలతో
సాంప్రదాయ రీతుల వారికి
"స్వాగతం" పలుకుదాం రండి.
-------------------------------------
No comments:
Post a Comment