🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*శ్రీ మద్రామాయణం ఈ-కవితా సంకలనం*
అంశము: *రామాయణం*
*10.ఆవిష్కరణ తేది: 25-04-2021,సా॥6-00 గం*
శీర్షిక : శ్రీ రామ కధ :
రాముడు శ్రీరాముడు దశరధానందుడు
రాజీవ నెేత్రుడు రఘకులవరభుాషణుడు
భరత లక్ష్మణ శతృఘ్నుల భ్రాత పరంధాముడు
స్మిత సిత వదనారవిందుడు సీతామనోహరుడు ॥
తల్లి బాస ఎరిగినాడు , తండ్రి మాట జవదాటడు.
ధను శరముల బట్టినాడు.ధరణిజ గొని చిన్నవాడు-
అడవి కేగి అసురుల తెగ ద్రుంచిన రణ భీముడు.
దండకారణ్యములో దైర్య వాసమున్నవాడు ॥
మాత సీత ముచ్చటపడి మాయ లేడి తెమ్మనడుగ
మాయ దెలిసి మారీచుని తరిమి తరిమి చంపినాడు
అదనుచుాసి రావణుండు అతివనపహరించినాడు
సీత బాసి శ్రీరాముడు సుగ్రీవుని కలసినాడు ॥
కిష్కింధకు రాజతడు రాముని ఋణగ్రస్తుడు
రమణి సీత వెదుకమని కపులనతడు పంపినాడు॥
సంద్ర మధ్యమున ఘనమౌ సుందర పురమది లంక, కృుారుడు దశ కంఠుడురావణుడు రేడసురులకు ॥
రామ బంటు హనుమంతుడు సీత వార్త చెప్పినాడు
లంక కేగి రాముడపుడు దశకంఠుని దునిమినాడు.
జనులు సంతసించినారు సంబరములు జరిపినారు
రామనమి దినమున శ్రీరామచంద్రు గొల్చినారు.
------------------------------------------------------------
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021
No comments:
Post a Comment