Thursday, April 8, 2021

పాటవెలది సుందరాకాండ 61 to 100

61.
వానప్రస్థ మేల వాయు సుతుడు
నిత్య నియమ మేలె  నిష్ట తోడ
చంద్ర, సుార్యు లాది జయ గ్రహములు
ప్రబలు గౌరవముల పణతు లిడెను ॥
62.
వనము లెన్నొ తిరిగి వడలి -జేరె 
శోభ లలరు వని కశోక వనికి
విరిగ కురియు తేనె విందు జేయ
గ్రోలు భృంగము లవె గోల గాను ॥
63.
పక్షి గుంపు లెల్ల పరవశమున
కిచల రవము జేసె కీచు గాను
నెమలు లాడె నచట నేర్పు కళల
గంధ వీచి సోకె గాడముగను ॥
64.
రాలు పుాల పండ్ల రసము గ్రోలి
కపి వరుండు ఆడె కడు విధముల
ఆట పాట తోడ అరచి విరచె
మంచి మేలు తరుల మర్కటుండు.॥
65.
పుావులనిన పుాల తావులనిన
పరవసించు నెంతొ పసిడి కాంత
తేనెలుారు వనము తేట వీచి
తధ్య మిచటె నుండు తరుణి సీత ॥
66.
అనుచశోక వనము నదెగ జుాచి
చెట్టు నెక్కె హనుమ  గుట్టు గాను
నేల వాలి కుంగి ఏడ్చు చున్న
యువతి గాంచె నతడు ఉత్సు కతను ॥
67.
చిక్కి శల్య మైన చిన్న దాని
గనెను హనుమ నామె కరుణ తోడ
 జుట్టు ముట్టి రామె జట్టు గాను
 లంక సురుని చరులు లంఖిణీలు ॥
 68.
వృక్ష శాఖ లందు వరుస సరులు
మణులు మరకతముల మాల లెన్నొ
కర్ణ వేష్ట హస్త కంకణములు
హనుమ జుాచె వాటి నచ్చెరువున ॥
69.
రమణి వీడి నట్టి రతన ధనము
గురుతు పట్టి హనుమ మురిసె మదిని
సర్వ లక్షణముల సార సుగుణి
సీత దక్క ఎవరు సిరుల నెలవు ॥
70.
జానకమ్మ ఒకతె జగతి లోన
రామ మదిని దోచు రమణి సాధ్వి
పదియు నాలు గేండ్లు పావనిచట
దుర్దయెంత గనెనొ దుఃఖ పడెనొ ॥
71.
అనుచు దలచి మదిని హనుమ వగచె
తల్లడిల్లె హనుమ తరుణి జుాచి 
జయము కలుగు నీకు జగతి ననుచు 
శుభము పలికె హనుమ సుఖము లేలు ॥
72.
కఠిన కాల మిదియె కష్ట ములకు
తొలగి పోవు నమ్మ త్వరిత గతిని
నీదు జాడ తెలియ నిక్క ముగను
రావణునదె చంపు రామ శరము ॥
73.
అనుచు హనుమ సోలె నచటె నిలచి
 ఝాము లాయె ముాడు జాగ రణతొ 
మధుర వాద్య ఘోష మంగళములు
ఆలకించె హనుమ హాయి మీర ॥
74.
మరపు రాని సీత,  మదిని కలచ
మేని తాప మలర మేలు కొనిన
రావణుండు నెరపె  రాజ సమున
శాస్త్ర యుక్త ముగను సర్వ విధుల ॥
75.
అప్సరసల బోలు అతివలతని
సేవ జేయ వచ్చి చెంత  నిలచె
సార భుాషణముల సరిగ దాల్చి
వెడలశోక వనము  వేగ తెమిలె ॥
76.
సతులు నుార్గు రతని సరస జేిరి
మెరయు సరుల జుాచి మెచ్చి రతని
రమణి దలచి మదిని రక్కసుండు 
నవ్వి రావణుండు నడచె వనికి ॥
  77.
రామ గుణ గణముల రాత్రి పవలు
జపము జేయు పుణ్య చరిత జుాడ
రావణుండు కదలె రాజసమున
మేని సరుల జాపి మెప్పు పొంద ॥
78.
మసక రుాపు తోడ మసలె హనుమ
రావణాసు గాంచి రగిలె మనము
శింశుపావనమున  సీత సాధ్వి
 ఏక వస్త్ర అమె ఎరుగ దేమి ॥
 79.
అనుచు తలచి హనుమ అదె పరుగున
వనము జేరె నంత పలుక హితము
విషయ మెల్ల జెప్ప వివర ముగను 
లంక సురుకు బోధ లదెగ జేయ. ॥
80.
దాన సామ భేద దండములతొ
సానుకుాల పరచ సాధ్వి దరికి
జనెను రావణుండు జతన ములతొ
జేరి సీతను గని జెప్పె మనసు ॥
81.
ఏలుకొందు నిన్ను ఏల చింత
రాణి వాస మేలు రమణి నీవు
లోక సుందరీవు లోల నేత్రి
వన  నివాస మొదులు వనజ నేత్రి ॥
82.
వనము లేలు వాని వశము గాదు
వలయు సుఖము లిడగ , వట్టి మాట
నన్ను జేర రమ్ము నమ్మ కమున
సుఖము లేల గలవు సుందరాంగీ ॥
83.
అడవి దిరుగు రాము డల్పు డతడు
నన్ను గెలవ తరమ నరుడతండు
ఇంద్ర దేవతలను  ఇట్తె గెలిచి
ధామ సర్గ మేలు ధవుడ నేను ॥
84.
మరచి పొమ్ము వాని మరచి రమ్ము 
సర్గ సుఖము లిత్తు సరసి జాక్షి
అనుచు వాతలాప మధిగ జేసె 
చెడుపు మాట లనుచు జేర వచ్చె ॥
85.
సీత ధవుని దలచి శిరసు వంచి
నమము జేసె మదిని నాధు దలచి
గరిక మించు హీన గుణుడ వనుచు
పెరికి గడ్డి పరక పెట్టె నడ్డు.॥
86.
పిరికి పంద వలెను ప్రియుని చాటు
అపరించి తీవు యడవి జొచ్చి
కపట వేస మునను కరుణ లేక
పట్టి తెచ్చి తీవు పలికి కల్ల ॥
87.
వదరు బోతు వీవు వంచకుడవు
పనికి రాని వట్టి పలుకు లాపు 
శరణు వేడు మతని శరణటంచు
రాము డతడు ఘనుడు రక్ష కుండు ॥
88.
భీతి నొందు వట్టి  భీరు డీవు
నీతి లేని గుణము నీచ బుద్ధి
గుణుడు రాము డొచ్చి గుాల్చు నిన్ను 
లంక దగ్ధ మొౌను శంక లేదు ॥
89.
అనుచు సీత బల్క నదిరె నతడు
కోప మాప లేని  క్రోధి యగుచు
ఎంత జాణ వీవు యెంచ తరమా !
కరకు మాట నీదు కనివినెరుగ ॥
90.
నీదు మాటలు విని  నిలువ జాల
గడువు రెండు నెలలు గడచి నంత
కనికరించ నేను కాంత వనుచు
చంపి వేతు నిన్ను చపల నేత్రి॥
91.
రాను ఇచటి కింక రానటంచు
 అరచె రగుల నతడు అదరె లంక
 క్రొవ్వు దేరు మేను క్రోధ మునకు
 కరిగి కారె చమట కరకు మేని ॥
 92.
రాము నాజ్ఞ  లేక రక్ష లేక
పలుకు లేక యుంటి పరుష మొప్ప
పరమ సాధ్వి నేను పతివ్ర తేను  
తృణము బోలు నిన్ను తృటిని గుాల్తు ॥
93.
కలికి పలుకు లోన కఠిన ముగని
రగిలె రావణుండు రమణి జుాచి
నివురు గప్పు నట్టి నిప్పు యట్లు
మాట లాడె సీత మాయ  గాదె ॥
94.
అనుచు పలికి నతడు అవని గాచు
అక్కసు నదె పిలచె రక్కసులను
రాయి వంటి దైన రమణి మనసు 
మార్చు మనుచు  జెప్పి మరలె నతడు ॥
95.
గడువు రెండు నెలలు  గడచి నంత
వినదు అన్న మాట విననటంచు
మాట వినగ జేయ మసలు మనుచు 
కరుగ జేయ మనెను కాంత మనసు ॥
96.
అటుల జేయకున్న ఆగ్రహింతు
అబల లనియు జుాడ నాగ్ర హింతు
శిక్ష వేదు జంపి శిలువ వేతు
అనుకు క్రోధి వెడలె  అవనిజదరె ॥
97.
మరలె రావణుండు మదిని కృంగి
కొరకొరనుచు జుాచి కోమలి దెస
ఎర్రనైన కనుల నెగుర వేసె
ఆగి తొడను చరచె  నహము తోడ ॥
98.
కనికరమ్ము వీడి కరుణ లేని 
 రక్కసుల్లు జేరి రమణి రోసె
 కంట ధార లాయె కనుల నీరు
 బేల యౌచు వాలె బెదరి సీత ॥
 99.
ముదుసలైన త్రిజట ముప్పు నెరిగి
మాతకడ్డు నిలచె మండి పడుచు
సీత జేరి నంత సీమ లంక
దగ్ధమౌనటంచు దరిమి గొట్తె ॥
100.
ప్రళయ కాల మిదియె ప్రాణ ములకు
దానవులకు కీడు దాపు రించె
అనుచు త్రిజట పలుక అదరసురిలు
బెరకు తనము తోడ బెదరి చెదరె ॥
------------------------------------------------






No comments:

Post a Comment