25/04/2022.
సాహితీ గోదావరి --
వార్షిక కవితా పోటీల కొరకు.
శీర్షిక : అక్షరోద్యమం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
ఎందరో పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యం .
మరెందరో అమరులై సాధించిన విజయం ..
ఉద్యమాల బాటలో ఉచ్చుముళ్ళ బాటలో
ఉబికి పారిన రక్తాక్షర చరితల త్యాగ ఫలం ॥
ఈనాటికీ సమసిపోని కులమతాల జాడ్యం.
పెరిగిన స్వార్ధంతో లోపించిన మానవత్వం, ॥
అంతులేని అకృత్యాల కుాపం లో
అబలల ఆత్మరక్షణ కరువైన శాపం.॥
అసత్య వాగ్దానాల పరిపాలనా విధానం.
అక్రమ బాటలో అబద్ధాల వేటతో సాధించిన
తీర్పు రాని తీర్మానాలతో అమాయకులను
మభ్య పెడుతున్న న్యాయ స్థానాల లోపం ॥
నీతి లేని జనారణ్యంలో జన- గణ -మణ-ల
జాతీయ గీతం, ముాడు రంగుల ముసుగులో
ముడతలు పడి ముడుచుకుపోయింది.
ధర్మ చక్రం అధర్మాల వేడికి వెలసిపోయింది ॥
నోట్ల బందీతో బడుగు జీవితాల భవిత
భత్యం లేని లోటు గోతిలో కుారుకుపోయింది ॥
అవినీతి అక్రమాల అణుబాంబుల పేలుళ్ళకు
నీతి న్యాయాలు విచ్ఛిన్నమై కరగిపోయాయి ॥
నేటి ప్రైవేటీకరణల ప్రారబ్దానికి
దేశం స్వాతంత్ర్యం తిరిగి కోల్పోతోంది .
బానిసత్వపు సంకెళ్ళ రాపిడి తలచుకొని
భరత భవిత అసహనంతో కుంగిపోతోంది॥
చరిత పుటల్లో మరో అధ్యాయం చేరనుంది.
చరితని తిరిగి రాసేందుకు అక్షరోద్యమం
ఆవేశపు ఊపిరి పోసుకుంటోంది. ॥
దేశ దుస్థితికి యువత రక్తం మరగిపోతోంది .
భగత్సింగ్ బాటలో మరో క్రాంతి సైన్యం
దేశమాత రక్షణకై అడ్డు గోడ కట్టబోతోంది .
రాక్షస ముళ్ళను కుాకటివేళ్ళతో పెకిలించబోతోంది.॥
హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన .
No comments:
Post a Comment