Sunday, December 18, 2022

వృద్ధాశ్రమాలు

అంశం : వృద్ధాశ్రమాలు.
ప్రక్రియ : సున్నితం .
 రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .

మాతృత్వానికి పెట్టుబడిగా రక్తమాంసాలు
క్షీరామృతధారలతో  పంచిన   ప్రేమానురాగాలు 
బాధ్యతల  బరువుకుడిగిన జవసత్వాలు
 చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
 
పెంచిన పాపానికి  ప్రేమకానుకలు.
పెరుగుతున్న స్వార్ధానికి వెలుగురేఖలు.
వాడ-వాడల్లో వెలసిన వృద్ధాశ్రమాలు.
 చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
 
అమ్మ-నాన్నల  ప్రేమకు చెల్లుబడి
హరించుకుపొియిన ఆస్థిత్వంతో అమ్మవడి
వృద్ధాశ్రమాలల బాటల్లో  కన్నీటిసడి
 చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
 
 నాలుగు గోడల నరకకుాపంలో
 మాటలకందని  భావాల అలజడి
  ఎదురుచుాపుల నైరాశ్యాలకు "చదువుబడి"
   చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
   
బీటలుబారిన బంధాలకు చేయుాతలు
ఆశలుడిగిన అస్థిత్వాలకు ఆశ్రయాలు
మానవత్వానికి ప్రతీకగా వృద్ధాశ్రమాలు
  చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
  

No comments:

Post a Comment