[29/07, 8:30 pm] Porla Venu Gopala Rao: *మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *29-07-2023- శనివారం*
అంశము: *బాలసాహిత్యం(య వత్తు సంయుక్తాక్షర పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *సత్యమైన విడుపు చాటవమ్మ!*
ప్రక్రియ: *పద్యము(ఆట వెలది)*
*********************
*(1)*
*సత్యమునకు నెలవు!నిత్య సత్యస్ఫూర్తి*
*కార్యమేదియైన ఘనుడు తాను!*
*భార్యనమ్మె తుదకు!భళియనె దేవతల్!*
*సత్యమైన విడుపు చాటవమ్మ!*
*(2)*
*ఆర్యుడనిన తాను!నడవిలో గడిపెను!*
*సూర్యవంశమునకు చుక్క యతడు!*
*భార్యనడవికంపి వలవలా రోదించె!*
*సత్యమైన విడుపు చాటవమ్మ!*
*(3)*
*శౌర్యమునకు పేరు!సరిసాటి మరిలేరు!*
*బాల్యమందు విడిచె పడతి కుంతి!*
*తుదకు స్నేహమయ్యె దుర్యోధనునితోడ!*
*సత్యమైన విడుపు చాటవమ్మ!*
*(4)*
*నాట్యమనిన ప్రీతి!నటనజీవితమాయె!*
*కాలుపోయెను చెడు ఘటనలోన*
*ధైర్యమంతపొంది తన నృత్యమునుజూపె!*
*సత్యమైన విడుపు చాటవమ్మ!*
*(5)*
*రంతిపురపు రాజు!రాజ్యము త్యజియించె!*
*సన్యసించి యడవి చనెను తాను*
*త్యాగమునకు పేరు!తనయన్నమును బంచె!*
*సత్యమైన విడుపు చాటవమ్మ!*
*(6)*
*వాక్యమందునుండు! వార్ధక్యముననుండు!*
*లక్ష్యమందు నుండు!లౌక్యమందు!*
*వియ్యమందు లేదు!నెయ్యాన లేదురా!*
*సత్యమైన పొడుపు చాటవమ్మ!*
*(7)*
*సత్యభామకు పతి! సరసన రుక్మిణి!*
*అష్టభార్యలైన యిష్టుడతడు!*
*వేణుగాన ప్రియుడు!వేదవేద్యుడతడు!*
*సత్యమైన పొడుపు చాటవమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*నా పొడుపు పద్యములను ఆదరిస్తున్న కవిమిత్రులు అందరికీ నా ధన్యవాద నమస్సులు. ఎంతో ఓపికగా శనివారం కార్యక్రమంలో సమీక్షణం/నిర్వహణ చేస్తున్న డి.యస్వీ.గారికి, సోదరుడు కృష్ణుడికి అభినందనలు.. విడుపులకై యత్నించగలరు. లేనిచో జవాబులు వచ్చేవారం*
*శనివారం బాల్యంలోకి వెళ్ళే*
*వేణుగోపాలుడు*
😊🙏🌹🙏🌹🙏🌹🙏
[29/07, 8:43 pm] +91 98482 38453: 1.హరిశ్చంద్రుడు
2. శ్రీరాముడు
3.కర్ణుడు
4.మయూరి
5.రంతిదేవుడు
6.య..సంయుక్తాక్షరము
7.శ్రీకృష్ణుడు
[29/07, 9:49 pm] +91 99890 18003: 3️⃣0️⃣
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*గారు
శీర్షిక: *సత్యమైన విడుపు చాటవమ్మ!*👌👌👌👌👌👌👌🤗🤗🤗🤗
*(1)*
సత్యమునకు నెలవు
👉 సత్యహరిశ్చంద్ర
*(2)*
*ఆర్యుడనిన తాను!నడవిలో గడిపెను!*
👉రాఘవుడు
*(3)*
*శౌర్యమునకు పేరు!సరిసాటి మరిలేరు!*
👉 కర్ణుడు
*(4)*
*నాట్యమనిన ప్రీతి!నటనజీవితమాయె!*👉 సుధా చంద్రన్
*(5)*
*రంతిపురపు రాజు!రాజ్యము
👉రంతిదేవుడు
*(6)*
*వియ్యమందు లేదు!నెయ్యాన లేదురా!*
👉 య సంయుక్త అక్షరాలు
*(7)*
*సత్యభామకు పతి! సరసన రుక్మిణి!*
శ్రీ కృష్ణుడు
👉డి.యస్వీ.గారికి, సోదరుడు కృష్ణుడికి అభినందనలు..
👉మీ అభినందనలకు వందనాలు
👉 అధ్బుతమైన పొడుపు పద్యాలు కు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూసేను .
👉సరళమైన పదాలు
👉సప్త రత్నాలు
👉 సంయుక్తాక్షర ఆటవెలదుల ఆటలు అవధులు లేని ఆనందాలు
👉*శనివారం బాల్యంలోకి తీసు కెళ్ళే మహతీకి *వేణుగోపాల వారు*వేసే పొడుపులకు సమూహమంతా చైతన్యం నిండుతుంది . ఈ పొడుపులు బాలలకు
పండుగ. అభినందనలు 🎉🙏💐
😊🙏🌹🙏🌹🙏🌹🙏
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *01-07-2023- శనివారం*
అంశము: *బాలసాహిత్యం(త వత్తు- సంయుక్తాక్షర పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *గుర్తుపట్టి విడుపు కూర్చవమ్మ!*
ప్రక్రియ: *పద్యము(ఆటవెలది)*
*********************
*(1)*
*భర్తలైదుగురట!పాంచాలి యనిపేరు*
*పతులకు తగినటుల వర్తనంబు!*
*కష్టకాలమందు కర్తవ్యమును దెల్పు!*
*గుర్తుపట్టి విడుపు కూర్చవమ్మ!*
*(2)*
*హస్తమందు నుండు!విస్తరిలోనుండు!*
*పుస్తకములనుండు!మస్తకమున!*
*సంస్థ లోన లేదు! సంస్థానముల లేదు*
*గుర్తుపట్టి విడుపు కూర్చవమ్మ!*
*(3)*
*అస్తికొరకు నూట యైదుగురు పెనగ*
*విస్తుపోయిరంట వీధిజనులు!*
*ప్రస్తుతించిరంట పంచ వీరుల జూచి*
*గుర్తుపట్టి విడుపు కూర్చవమ్మ!*
*(4)*
*సృష్టికర్త యతడు! శ్రీవాణి భర్తయౌ!*
*భక్త సులభుడయ్యి వరములిచ్చు!*
*ముక్తిగోరినంత భూలోకమున పంపు!*
*గుర్తు పట్టి విడుపు కూర్చవమ్మ!*
*(5)*
*వాస్తవమున నతడు వసుదేవ తనయుడు!*
*ఆస్తియాయె నిద్దరమ్మలకును!*
*రక్తి,ముక్తి,భక్తి రంజిల్లె వేణువై!*
*గుర్తు పట్టి విడుపు కూర్చవమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*నా పొడుపు పద్యాలను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న కవిమిత్రులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు*
*విడుపుకై యత్నించండి. జవాబులు వచ్చేవారం*
*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
[03/06, 3:34 pm] Porla Venu Gopala Rao: *మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *03-06-2023- శనివారం*
అంశము: *బాలసాహిత్యం- క-వత్తు సంయుక్తాక్షర పదాలు*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *పల్కులోన విడుపుజిల్కవమ్మ*
ప్రక్రియ: *పద్యము(ఆటవెలది)*
*********************
*(1)*
*పల్కు పల్కుచుండు పల్కులకేరాణి!*
*కెంపుముక్కునున్న కీరవాణి!*
*కొమ్మపైనగుల్కు క్రొత్తయందాలతో*
*పల్కులోన విడుపు జిల్కవమ్మ!*
*(2)*
*పల్కె తెలుగునతడు!వహ్వాగ!తుళురాజు!*
*స్థానమిచ్చెనతడు!సత్కవులకు!*
*తెలుగుభాషలోన దిక్కరీన్ద్రములైరి!*
*పల్కు లోనవిడుపు జిల్కవమ్మ!*
*(3)*
*తర్కమందు చంద్ర తారార్కమౌ మేటి!*
*విక్రమార్క జోడి!వీడడెపుడు!*
*పల్కకున్న కాళి, ప్రాణమే యిచ్చేను*
*పల్కులోన విడుపు జిల్కవమ్మ!*
*(4)*
*సహజ దానశీలి!సత్కార్యములు జేసె!*
*నర్కపుత్రుడయ్యి నవని వెలసె!*
*తుదకు రాజుకొఱకు దుష్కార్యములు జేసె!*
*పల్కులోన విడుపు జిల్కవమ్మ!*
*(5)*
*తానుబుట్టెనంట తస్కరశాలలో!*
*భారతంబునతడు భాస్కరుండు!*
*చల్లజిల్కునట్టి గొల్లభామలు తోడు!*
*పల్కులోన విడుపు జిల్కవమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*నా పొడుపు పద్యాలను ఆదరిస్తున్న ప్రియమిత్రులు అందరికీ ధన్యవాదనమస్సులు! జవాబులను యత్నించగలరు.. నా విడుపు వచ్చేవారం*
*ధన్యవాదాలతో*
*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
[03/06, 3:51 pm] +91 96406 22018: నా సమాధానములు:
1. చిలుక
2. శ్రీకృష్ణదేవరాయలు
3.భట్టి
4. కర్ణుడు
5.శ్రీకృష్ణుడు.🙏🙏
**పరిచయ పద్యాలు*
*(1)*
*నింగి కట్టెనంట నీలిమబ్బుల చీర*
*నెంత యందమొలికె వింత రంగు!*
*పసిడి కిరణములవి! పారాడు కుచ్చెళ్ళు!*
*గగనకాంతకెంత గర్వ మాయె!*
*(2)*
*నదినియప్పునడిగి హృదినిదాచినదంత*
*మరల తిరిగి ఇచ్చు మనకు తాను*
*కుంభవృష్టినిచ్చి గొంతులు తడిపేను*
*మేఘమాల కన్న మిన్న యెవరు?*
*(3)*
*ప్రియతమునికి జేర్చు ప్రేయసి సందేశ*
*ములను తప్పకుండ ముచ్చటగను*
*కాళిదాసు జెప్పె ఘనమేఘ సందేశ*
*మందు భావమంత సుందరముగ*
*(4)*
*వేడి బాష్పమంత పేర్మితో గ్రహియించి*
*చల్లబరచుదానినుల్లమందు*
*నాకలంతదీర్చు నన్నపూర్ణయెతాను!*
*పయము గురియు నపుడు వర్షమందు!*
*(5)*
*రాసలీలలందు రాయబారిగమారి*
*ప్రేమ విన్నవించు ప్రియతమునకు*
*మేఘమాల యునికి మేలుజేసెను చాల*
*మిగుల కొంటె జాణ! మెరుపువీణ!*
*********************
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*కవన కిరణాలు*
తేదీ: *07-05-2023-ఆదివారం*
అంశము: *ఐచ్ఛికం(నాకు నచ్చిన పాట)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *గాలికదుపు లేదు..*
ప్రక్రియ: *చిత్రగీత సమీక్షణం*
*********************
*కవన కిరణాలు సాహితీ మిత్రులందరికీ సాయంకాలపు నమస్సులు*
*పాటల ప్రియులైన ఆత్మీయులు అందరికీ హృదయ పూర్వక స్వాగతం!*
*ఈవారం "నాకు నచ్చిన పాట" శీర్షికలో మనం ముచ్చటించుకోబోయే పాట "ఇది కథ కాదు" చిత్రంలోని 'గాలికదుపు లేదు' పాట*
*1979 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. అవన్నీ చర్చించుకోబోయే ముందు పాటకు ప్రాణం అయిన పల్లవిని ఓసారి చూద్దాం*
*పల్లవి:-)*
*ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..*
*గాలికదుపు లేదు.. కడలికంతు లేదు*
*గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా*
*ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా!*
*గాలికదుపు లేదు.. కడలికంతు లేదు*
*గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా!*
*ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా!*
*ఆ..ఆ..ఆ..ఆ..ఆ..*
*సారీసా సరిసరిసరిగ రీసాగ*
*సారీసా సరిసరిసరిగ రీసాగ*
*సారీసా సరిసరిసరిగ రీసాగ*
*సారీసా సరిసరిసరిగ రీసాగ*
*చూసారా!ఎంతటి అద్భుతమైన సాహిత్యం! గీత రచయిత ఎవరనుకున్నారు.. మనసు కవిగా పేరొందిన మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు*
*ఇక చిత్రం విషయానికి వస్తే.. భరత్ ఫిలిమ్స్ పతాకంపై తెలుగులో నిర్మితమైన ఈ చిత్రానికి మూలం కె. బాలచందర్ గారు తమిళంలో నిర్మించిన "అవర్ గళ్(వారు) అనే చిత్రం*
*బాలచందర్ గారు స్వయంగా కథను తయారు చేసిన ఈ చిత్రానికి తెలుగులో ప్రముఖ మాటల రచయిత శ్రీ గణేష్ పాత్రో గారు సంభాషణలు అందించారు.. నేటి ప్రముఖ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్.. వీరందరూ కె.బాలచందర్ గారి స్కూల్లో విద్యార్థులే..*
*చిరంజీవి విలన్ గా నటించారు అంటే నేటి తరానికి ఆశ్చర్యం కలగవచ్చు.. ఆ కాలంలో ఆయన అసలైన నటన అలాంటి చిత్రాల్లోనే కనబడుతుంది. ఒక శాడిస్ట్ భర్త సుగుణాకర్ రావ్ పాత్రలో చిరంజీవి, సుహాసినిగా సహజనటి జయసుధ, ఆమె ప్రేమించిన భరణిగా శరత్ బాబు నటించిన ఈ చిత్రం ఎన్నో కేంద్రాల్లో ఆరోజుల్లో శతదినోత్సవం జరుపుకుంది కూడా. రేడియోలో ఎన్నో సార్లు విన్న ఈ పాట గాయని శ్రీమతి ఎస్. జానకి గారికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది.. ఇప్పుడు మొదటి చరణం చూద్దాం*
*చరణం:-1)*
*ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో*
*ఆ..ఆ..ఆ..*
*ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో*
*ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో..*
*ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో..*
*అ.. అ.. ఆ..*
*తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు?*
*మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు?*
*గాలికదుపు లేదు.. కడలికంతు లేదు..*
*గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా..*
*ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా?*
*చూశారా.. ఓ శాడిస్ట్ భర్త బాధలను భరించలేక స్వేచ్ఛను కోరుకునే ఆడదాని మనోగతాన్ని కవి ఎంత హృద్యంగా.. మనసుకు హత్తుకునేలా వర్ణించారో*
*గాలికి, కడలికి లేని అదుపు, హద్దు.. గాలిలా అనంతమైన.. కడలిలా లోతైన ఆడమనసునకు ఎలా ఉంటుంది మరి? శాడిస్ట్ భర్తగా చిరంజీవి, అతని వల్ల బాధించబడే భార్య పాత్రలో జయసుధల నటన వర్ణించనలవి కాదు.. చూసి తీరవలసిందే!*
*మరల స్వేచ్ఛ వచ్చి.. మబ్బులా, నెమలిలా, లేగదూడలా గంతులు వేయాలని ఆశ పడే ఆ హృదయం ఎంతగా నలిగిపోయి ఉంటుందో చెప్ప నవసరంలేదు*
*తమిళ మూలంలో శాడిస్ట్ భర్తగా రజనీకాంత్, జయసుధ పాత్రలో ప్రముఖ నటి సుజాత నటించిన ఈ చిత్రంలో.. రెండు వెర్షన్ లలో హీరోయిన్ ను ప్రేమించే ఆఫీసర్ పాత్రలో.. కమల్ హాసన్ నటించడం ఓ విశేషం*
*ఇప్పుడు రెండో చరణం చూద్దాం*
*చరణం:-2)*
*ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ*
*ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ*
*తల్లి మళ్ళి తరుణయ్యింది.. పూవు పూసి మొగ్గయ్యింది*
*గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ*
*గాలికదుపు లేదు.. కడలికంతు లేదు*
*గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా*
*ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా*
*ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. *
*ఎంతటి అద్భుతమైన సాహిత్యం.. ఎంత భావగర్భితంగా రాశారు.. సరళమైన పదాల్లో.. చూడండి*
*ఉరికే మనసుకు గిరి గీయడం సరికాదు.. సాధ్యం కాదు.. దానిని కేవలం ప్రేమతోనే గెలుచుకోవాలి అని చెప్పే ఈ చిత్రంలోని పాటలకు సంగీత మాంత్రికుడు ఇసై జ్ఞాని.. శ్రీ ఎం.ఎస్. విశ్వనాథన్ గారు అద్భుతమైన బాణీలను అందించారు.. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి.. మనందరం విన్న ఇంకో హిట్ సాంగ్ *జూనియర్..జూనియర్* కూడా ఈ చిత్రంలోనిదే..
*వెంట్రిలాక్విజమ్(మాట్లాడే బొమ్మ) ఆధారంగా చిత్రీకరణ చేసిన ఈ పాట గురించి మరో సందర్భంలో ముచ్చటించుకుందాం*
*మీకు నా సమీక్షణం నచ్చినట్లయితే.. ఈ పాటను/చిత్రాన్ని తప్పకుండా యు ట్యూబ్ లో చూడండి.. ఆనందించండి, ఆశీర్వదించండి, అభిప్రాయాలను పంచుకోండి.. మళ్ళీ వచ్చేవారం మరో అద్భుతమైన పాటతో కలుద్దాం.. అంతవరకు సెలవు*
*నీ వలపే బృందావనం* అని అతడు అంటే..
*నీ పిలుపే మురళీరవం* అని ఆమె బదులిచ్చిందిట.
*నీలి గగనాలలో తేలి ఉండాలిలే* అని ఇద్దరూ అనుకున్నారట.. *ఎవరా ఇద్దరు.. యేమా కథ.. తెలుసుకోవాలంటే.. వచ్చే వారం దాకా ఆగాల్సిందే..*
*శుభసాయంత్రం*
*మీ*
*వేణుగోపాలుడు*
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
1.మహాభారతం*
*2. దీపావళి*
*3. చందమామ*
*4. నాలుక*
*5. శ్రీకృష్ణుడు*
మీ పొడుపులకు నా విడుపులు కరెక్టేనా వేణుగోపాల్ సర్ ...
**మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *06-05-2023-శనివారం*
అంశము: *బాల సాహిత్యం-వ వత్తు పదాలు*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *నువ్వు విడుపునివ్వు!రవ్వ లడ్డు!*
*********************
*(1)*
*అవ్వ బువ్వ బెట్టె నైదు జేతులలోన!*
*నాలినవ్వు జేసె నడవిపాలు!*
*గవ్వలాట రణపు తొవ్వజూపేనురా!*
*నువ్వు విడుపునివ్వు!రవ్వ లడ్డు!*
*(2)*
*కెవ్వు కెవ్వుమనుచు దవ్వు జేరగ ప్రజ*
*తరలివెడలి హరియె నరకు జంపె*
*దివ్వెలన్ని వెలుగ నవ్వులే పూచేను*
*నువ్వు విడుపునివ్వు!రవ్వలడ్డు!*
*(3)*
*పువ్వుగాదు నింగి పూయును ప్రతిరోజు*
*నవ్వు గాదు గనగ నందమిచ్చు*
*దివ్వెగాదు రేయి దీపాల వలెదోచు*
*నువ్వు విడుపునివ్వు!రవ్వలడ్డు!*
*(4)*
*గువ్వకాదు గాని గూటిలోపలనుండు*
*క్రొవ్వు పెరిగెనేని గొడవ జరుగు!*
*నవ్వు నవ్వెనేని నలుగురూ జూచేరు!*
*నువ్వు విడుపునివ్వు!రవ్వలడ్డు!*
*(5)*
*ద్వాపరంబునందు పాపడై తాబుట్టె*
*స్వామిజూచి జనులు సంతసించె*
*పాలబువ్వ తినెడి బాలగోపాలుడే!*
*నువ్వు విడుపునివ్వు!రవ్వలడ్డు!*
*********************
పొడుపు విడుపు.
1పాండవులు2 దీపావళి
3చందమామ 4 గుండె
5కృష్ణయ్య
హామీపత్రము: *స్వీయరచన*
*నా పొడుపు పద్యములను ఆదరిస్తున్న ఆత్మీయ కవిమిత్రులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదనమస్సులు*
*విడుపుకై యత్నించగలరు.. లేనిచో వచ్చేవారం*
గతవారం జవాబులు
1.మంచు
2.గజ్జెలు
3.ఉల్లి
4.చిల్లి(chilli)
5.శ్రీకృష్ణుడు
ధన్యవాదాలతో మీ
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *08-04-2023-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(మ-వత్తు పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!*
ప్రక్రియ: *పద్యము(ఆటవెలది)*
*********************
*(1)*
*సృష్టిజేయు బ్రహ్మ! సృజియించు జన్మిచ్చి!*
*తొమ్మిదినెలలైన తొట్రుపడక!*
*రొమ్ముపాలనిచ్చి కమ్మగా పెంచురా!*
*పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!*
*(2)*
*బ్రహ్మ రాత వలన వనజాతిలోబుట్టె!*
*బొమ్మజేసి గురుని పూజ జేసె!*
*దమ్ముజూపెనతడు ధనువునే సంధించి*
*పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!*
*(3)*
*కొమ్మకొమ్మనుండు!కోటిపాటలు పాడు!*
*కమ్మదనము పంచు!నెమ్మదిగను!*
*నిండు నలుపునున్న నిర్మలమౌ పక్షి!*
*పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!*
*(4)*
*అమ్మ భారతాంబ నాస్కారు వరియించె!*
*కమ్మనైన పాట ఘనత పొందె!*
*దుమ్ములేపి తెలుగు దమ్ముజూపేనురా!*
*పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!*
*(5)*
*ధర్మరక్ష కొరకు ధరణిలో జన్మించె!*
*మధురలోన బుట్టె! మర్మయోగి!*
*నర్మగర్భరీతి కర్మనే బోధించె!*
*పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*జవాబులు*
*1. అమ్మ*
*2. ఏకలవ్యుడు*
*3. కోకిల*
*4. నాటునాటు..పాట*
*5. శ్రీకృష్ణుడు*
*నా పొడుపు పద్యములను ఆదరించి.. అభిమానిస్తున్న మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాద నమస్సులు*
*కమ్మగ వేణువునూదేవాడు*
*వేణుగోపాలుడు*
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *17-12-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(శ గుణింతం పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *పొర్లవారి పద్య పొడుపు విప్పు!*
ప్రక్రియ: *పద్యము(ఆటవెలది)*
*********************
*(1)*
*శక్తికతడు భర్త! శరవణునకు తండ్రి!*
*శశి నిలిచెను సిగన శాశ్వతముగ!*
*శిరముపైన గంగ శీతలమొనరించు!*
*పొర్లవారి పద్య పొడుపు విప్పు!*
*(2)*
*శతసుతులనుగనెను!సరసన గాంధారి!*
*శక్తిలేని రేడు!యుక్తి మెండు!*
*శకుని బావమరిది! శంతనుడే తాత!*
*పొర్లవారి పద్య పొడుపు విప్పు!*
*(3)*
*శ్రితజనాశ్రయుండు! శిఖిపింఛధారుండు!*
*శుభములొసగువాడు! చోరుడయ్యె!*
*శకటసారథియయె! సర్వము నడిపించె!*
*పొర్ల వారి పద్య పొడుపు విప్పు!*
*(4)*
*శ్రేష్ఠి కులమునందు శ్రేష్టుడై జన్మించె!*
*శారదాంబ కృపల చదువు జదివె!*
*శ్వేతజాతి దొరల చిత్తుగానోడించె!*
*పొర్ల వారి పద్య పొడుపు విప్పు!*
*(5)*
*శక్రుని సుతుఁడతడు! శౌరికి బావయయె!*
*శరమునెక్కుబెట్ట సురలె వణకు!*
*శిరము వంచడెపుడు! శ్రీకృష్ణుని సఖుడు!*
*పొర్లవారి పద్య పొడుపు విప్పు!*
*(6)*
*శరణమనె కపోత! శరణిచ్చెనారాజు!*
*శాస్త్ర న్యాయములను చదివెనతడు!*
*శమముతోడనిచ్చె సమమగు మాంసంబు!*
*పొర్లవారి పద్య పొడుపు విప్పు!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*జవాబులు*
*1. శంకరుడు*
*2. ధృతరాష్ట్రుడు*
*3. శ్రీకృష్ణుడు*
*4. మహాత్మా గాంధీ*
*5. అర్జునుడు*
*6. శిబి చక్రవర్తి*
*పొడుపు పద్యములను ఆదరిస్తున్న కవిమిత్రులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములతో*
*మీ*
*వేణుగోపాలుడు*
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
*పరిచయ పద్యము*
*(1)*
*నవరసంబులందు నాణ్యమైన రసము!*
*కరుణరసమునందు గలదు సృష్టి!*
*సాటివారిపైన చక్కగా కురిపించు!*
*జనులకీవునచ్చు! జగతి మెచ్చు!*
*(2)*
*తాను తినెడి తిండి తనవారికిచ్చెను!*
*కొంత మిగిలియుండ కుక్క తినెను!*
*లాభమెఱుఁగనట్టి రంతిదేవుని జూడు!*
*కరుణగలిగియున్న ఘనుడవీవు!*
*(3)*
*పావురమును గాచె పరగయా శిబిరాజు!*
*తనదు తొడనుగోసి దాతయయ్యె!*
*వసుధ జనులగాచు వాడేను రాజురా!*
*మకుటమేమిజేయు! మనసులేక!*
*(4)*
*ఆకలనెడివారి యార్తిని బాపంగ*
*పక్క నుండి లేచి వంటవండె!*
*ధరణినన్నపూర్ణ! దాతయా సీతమ్మ!*
*డొక్కవారియింట లెక్కలేదు!*
*(5)*
*బుడగవంటి బ్రతుకు! పుటుకున పగిలేను!*
*ఉన్న నాల్గు నాళ్ళు నుంచుగరుణ!*
*వెంటవచ్చునివియె! వేలాది జోతలై!*
*కరుణజూపవయ్య!ఘనత పొంది!*
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *10-12-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(వ గుణింతం పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *విప్పిచెప్పవమ్మ! వెన్నెలమ్మ!*
ప్రక్రియ: *పొడుపు పద్యాలు*
*********************
*(1)*
*వరుసలోనయుండు! వాక్కున తోడ్పడు!*
*వివిధ భక్ష్యములను పిండిజేయు!*
*విరిగి కొన్ని వీడు!వృద్ధాప్యమున వూడు!*
*విప్పిచెప్పవమ్మ!వెన్నెలమ్మ!!*
*(2)*
*వనితలంతమెచ్చు! వర్ణంబులే నచ్చు!*
*విరిసినంత చాలు! కురియు సొగసు!*
*వొక్కటున్న చాలు!వుద్యానవనములో!*
*విప్పిచెప్పవమ్మ!వెన్నెలమ్మ!!*
*(3)*
*వసుధలోన యుండు!వాణి చేతిన యుండు!*
*వినిన కొలది విందు! వీనులకును!*
*విశ్వమంత మ్రోగు! వేయిరాగాలతో!*
*విప్పిచెప్పవమ్మ! వెన్నెలమ్మ!*
*(4)*
*వనముకేగెనతడు! వానర మిత్రుడు!*
*వినయశీలుడతడు!వీరుడతడు!*
*వసుధనేలెనతడు! వైదేహి నాథుడై!*
*విప్పిచెప్పవమ్మ! వెన్నెలమ్మ!!*
*(5)*
*వెన్నదొంగయతడు! వేణువునూదును!*
*వేలగోపికలకు వెన్నుదన్ను!*
*విశ్వమంత నడుపు! వీక్షణముల తోడ!*
*విప్పిచెప్పవమ్మ! వెన్నెలమ్మ!*
*(6)*
*వెండికొండనుండు! వేల్పుల తొలివేల్పు!*
*వృషభ వాహనుడయె! విషము త్రాగె!*
*వందనములుజేయ వందేళ్ళు బ్రతికించు!*
*విప్పిచెప్పవమ్మ!వెన్నెలమ్మ!!*
*********************
హామీపత్రము: *స్వీయరచన!*
*పొడుపు పద్యాల ప్రక్రియను ఆదరిస్తున్న కవిమిత్రులు అందరికీ ధన్యవాదాలు.. పిల్లల్లో పద్యాల పట్ల ఆసక్తిని పెంచడానికి ఇటువంటివి ఎంతో సహాయ పడగలవు.. దయచేసి మీమీ పాఠశాలల్లో పిల్లల వద్దకు వీలైనన్ని చేరవేయగలరు!*
*జవాబులు:-*
1) *దంతములు*
2) *పుష్పములు*
3) *వీణ*
4) *శ్రీరామచంద్రుడు*
5) *వేణుగోపాలుడు*
6) *పరమశివుడు*
*ధన్యవాదాలతో*
*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏🌹🙏
No comments:
Post a Comment