మహతీ సాహితీ కవి సంగమం
చిత్రకవిత-14
(24-10-2022).
శీర్షిక : స్త్రీ అబల కాదు సబల .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రీస్తు పుార్వం నుండే జరుగుతున్న
ఎన్నో అరాచకాలు అన్యాయాలు
నిరంకుసత్వం నిండిన నిజాం పాలనలో
ప్రబలిన బరువైన బానిసత్వాలు॥
స్త్రీ లకు స్వాతంత్ర్యం లేని
బ్రతుకు తీపినెరుగనీయని నియంత్రణలు
ఆచారాల పేరుతో అణచివేతలు
ఆధిపత్య సాధింపులతో నిండిన అగచాట్లు ॥
ఉద్యమాల బాటలో ఆహుతైన దేశ ప్రేమికులు
స్త్రీ ల సంక్షేమానికై ఉబ్నతి నిండిన పథకాలు.
నిరక్షరాస్యత నిండిన జనుల్లో చైతన్యం కలిగించే
కధలు కావ్యాలు నిండిన విరివైన గ్రంధాలయుాలు॥
రామాయణాది మహా కావ్యాలలో
మానవత్వపు విలువలు నిండిన
పాలనా సమర్ధతల సందేశాలు
గీతా బోధనలో చాటిన జన్మ కర్మ సిద్ధాంతాలు ॥
మన సంస్కృతి సాంప్రదాయాలలో
సాధించవలసిన మనిషి నడవడికలు
మన పండగలు పబ్బాలలో
చెడుపై మంచి సాధించిన విజయాలు ॥
భగవంతుడనే భావనకిచ్చే ప్రాధాన్యతలు -
లోకాతీత శక్తికి తలవంచిన రాక్షస ప్రవృత్తులు
అమ్మగా, ఆది అవతారిణిగా స్త్రీ రుాపాలు
వేల సాహసోపేత శక్తులకు నిదర్శనాలు ॥
నేటి చరిత్రలొ ఎన్నో సంకుచిత మనస్తత్వాలు
వావి-వరుసలు మరచిన పాపుల తాపాలు॥
పురుషాధక్యతకు నలిగిపోతున్న
ఆబలల ఆత్మహత్యలు ॥
నేటికినీ మారని చరితల సందేశాలు
మార్గదర్శకత్వం చేస్తున్న పుస్తక పుటలు.
మంచి నిండిన మార్పు కోరుతుా చేస్తున్న
శాంతియుత ప్రయత్నాల వ్యయ ప్రయాశలు ॥
ప్రాశస్త్యత నిండిన మన పండలు పబ్బాలు.
ప్రతీ వత్సరానికి వస్తున్న సదాచారాల సందేశాలు॥
మరచిన చరితలను వెలికితీసే ప్రయత్నాలు.
శక్తి రుాపిణిగా స్త్రీల అవతారాల ఆవశ్యకతలు
భేద భావాలు చుాపని పురోగతికి సాధనాలు
నేటి రాజకీయ, సాంఘీక, వ్యవహారాల్లో
మార్పు కోరికల పట్టు కొమ్మలు॥
నేర్వండి,నేర్పండి మన చరితల్లో దాగిన నిజాలు.
స్త్రీ పురుష సమానతల సందేశాత్మక నినాదాలు.
మన పండగల్లో దాగిన అతి కీలక విషయాలు
నేటి స్త్రీ లందరుా అరాచకాలనణచివేసేందుకు
సిద్ధమైన సత్యభామలు.॥
No comments:
Post a Comment