రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : తెల్లకోటులో దాగిన దర్పం .
ఆతని మాటలతో రోగాన్ని జయింగల ధైర్యం
ఆతని స్మర్శతో రోగులలో పెరిగే ఆత్మ స్థైర్యం.
అలమటిస్తున్న రోగులకు అన్నీ తానైన ఘనం
అతనిచ్చిన ఔషధం రోగాలను బాపే అమృతం ॥
తెల్ల కోటులో దాగిన దర్పం, అతని
స్వశ్ఛత నిండిన మనసుకు నిదర్శనం .
మెడలో స్టెతస్కోప్, విద్యార్హతకు ఫలం.
అతడే రోగులను గాచే విధాతైన వరం ॥
శస్త్ర చికిత్సకు నైపుణ్యత నిండిన చెేతి వేళ్ళు.
సునిశిత దృష్టిగల వ్యవస్థీకృత కార్యాచరణలు
బ్రతుకు ఊపిరినల్లే బలమైన నేతగాళ్ళు.
సమర్ధవంతమైన కార్య కర్తలు వైద్యులు ॥
పగలుా రాత్రీ సేవలందించే వృత్తి , సేద్యం.
బీదా గొప్పా తేడా చుాపని సమానతల భావం
ఆరోగ్యమే మహా భాగ్యమంటుా చేసిన వైద్యం
వైద్యుడే ఇల వెలసిన దైవానికి ప్రతిరుాపం.॥
"డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ నిలబెట్టెను వైద్యుల ఘనం
ఆతని జయంతి రోజే ఆయన వర్ధంతి దినం
జూలై 1ని జరుపుకొనే జాతీయ వైద్యుల దినోత్సవం
వైద్యుల సేవాతత్పరతకు ఇదే నా వందనం ॥
No comments:
Post a Comment