24/10/2022.
గోరసం వారి దీపావళి కాంతులు అనే సమూహం కొరకు వ్రాసినది.
అంశం: దేదీప్యమైన దీపావళి.
శీర్షిక : అంతరార్ధ సందేశాల ఆనంద వేడుక.
అంశం : దేదీప్యమైన దీపావళి .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
వికశించిన విరులల్లె పసరిన ప్రకృతి
పచ్చదనపు వలువ వెలుగుల నిండు ప్రగతి.
అలరించు శోభలతో నిండిన అందమైన భారతి
సాంప్రదాయ వేడుకలు నిండిన మేలు సంస్కృతి ॥
నరకాసుర వధకు ప్రతీకగా ఆనంద వేడుకలు
దేదీప్యమైన దీపవళులు నిండిన దివ్య వేదికలు.
పుడమి నిండిన దీప కాంతుల వేల వెలుగులు
మానసిక చీకట్లను పారద్రోలే మనవైన పండగలు ॥
మనిషిలోని దాగియున్న వేటాడే మృగాలు
తప్పు అనే చీకటి అమావాస్యకు ప్రతిరుాపాలు.
సత్యమనే బాటలో నిండిన కలుపు మొక్కలు.
ధర్మం నిండిన తుాణీరాల వేటుకు
కుాలుతున్న పైశాచిక ముళ్ళు॥
ఆనందపు పలకరింపుల వరుస బంధాల్లో-
అందరుా ఒక్కటైన ఆనంద క్షణాలు.
పండగ పలకరింపుల మానవ సంబంధాలు.
అందరు ఒక్కటైన సమత మమతల కాంతి పుంజాలు॥
నాగరికత పేరుతో తిరిగే నగర పిశాచాలు.
తల్లి భారతి ప్రగతి బాటను శాసిస్తున్న అవరోధాలు.
అబలలనుకున్న స్త్రీ శక్తికి నిండైన నిదర్శనాలు
దీపావళి పండగలో నిక్షిప్తమైన నిజమైన సందేశాలు ॥
హామీపత్రం: ఈ కవిత కేవలం గోరసం కొరకు మాత్రమే వ్రాసినది..ఈ కవిత మరే ఇతర మాధ్యమాలలో కానీ, సమూహాలలో కానీ ప్రచురితం కాలేదని హామీఇస్తున్నాను.
No comments:
Post a Comment