Tuesday, October 11, 2022

దత్తపది

అంశం : దత్తపది: మరి  పరి   చరి సరి
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మ.సా.క.సం.  19.

సీసపద్యము.


(మరి)యాద గలవారు మహిలోన కనరారు
(పరి)చయ స్థులగుాడ  ఫలము లేదు
(చరి)యింతు రుగవారు చేటుచేయగనెంచు
(సరి)సత్య బాటనే సాగు సుఖము ॥

(మరి)పించు మాటలా మురిపించు పాటలా 
 పరికించి పలుకుటే  ఫలము జయము  
(చరి)తహీ నులిలను చక్కగా చరియింప
( సరి)ధర్మ  మునకిల  స్థాన మేది  ॥
 
ఆటవెలది.

చెప్ప సిగ్గు గాదె  చేటుమా టలనాడ
ఒప్పు కొనరు తప్పు ఒక్క రైనా
నిప్పు లాంటి దిగద   నివురుగ ప్పునిజము
సాక్షి నీదు మనసె సత్య మిలను ॥




No comments:

Post a Comment