Thursday, October 15, 2020

భగవద్గీత రాయుటకు తొలి వందనాలు.

ఓం  శ్రీ  గణేశాయ నమః
--------------------------------

"ఇష్టపదుల" ప్రక్రియలో " శ్రీమద్భగవద్గీత" ను రాయ సంకల్పించిన , శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి యైన నేను,
నా తల్లిదండ్రులు , గురువులు , శ్రేయొాభిలాషులు,నా రచనకు  సహకారమందించిన ఇంటి వారలకు, పెద్దలందరకుా మనఃపుార్వక ధన్యవాదాములతో పాదాభివందనాలు సమర్పిస్తుా, నేను రచియించిన "ఇష్టపది గీతా కావ్య" మునకు ముందుగా జేసిన తొలి వందనములు.

శ్రీమద్భగవద్గీతా కావ్యము.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------

॥ తొలి వందనం ॥
సంఖ్య  1 

జన్మ నిచ్చిన తల్లి జగమునామె వేల్పుగ
అమృతమయి ఆమ్మకును ఆమె చుాపు ప్రేమకు॥

పావని పాదములకు  పాదాభి వందనం
తల్లీ గొను వందనం తరచి తరచి వందనం ॥

పెంచి పోషించుటకు  పంచి జన్మ నంతయు
ఎలమి నున్నతి కోరి  , నెరపు కర్మ,  ధ్యేయకు

జగతి మసలు బాటను  జయము దీవెన లొసగు
తండ్రి పాదములకుా తరచి తరచి వందనం ॥

మార్గదర్శి  తానై మము  మలచు విశ్వ కర్మకు
విద్య దాత గురువుకు వినయముతో వందనం ॥
--------------------------------------------------------------
సంఖ్య 2.

మెట్టినింటను నాదు  మేలుకోరిన తల్లి ।
ముద్ధుమురిపాలనను ముంచి మురిసే తల్లి ।

అట్టి అత్తమ్మ మా  అమ్మ ఈశ్వరమ్మకు।
శిరము వంచి సేతు చిత్తముతో వందనం।

నన్నంటి నా వెంటే   నా కష్ట సుఖములను।
తనవిగా జేసుకొని   తట్టి అండగ నిలచి।

గీతార్ధ సారమును ఇష్టపదుల రాయగా।
ప్రోత్సహించు నాధుని కొనరింతు వందనం.॥

సంఖ్య..3.

ఇష్టపది సృష్టి కర్త      ఇల సదయ్య  భ్రాతగ
మేటి బిరుదు లందిన  మేలు గురుకు వందనం ॥

ధర్మ సార బోధకు  కర్మ గీత సారకు
చదువరులకు, హితులకు, సాదర ఘన వందనం॥

సంకల్ప సిద్ధిడిన    సద్భాగ్య దాతకుా
సహకారమందించు సజ్జనులకు వందనం ॥

జయ గీత రచనతో జన్మ ధన్య మాయెను
ఈశ్వరిడె భక్తి తో  ఇష్ట దైవ వందనం॥
-------------------------------------------------------
ఇష్టపదులు.
  "శ్రీమద్భగవద్గీత"
--------------------------.
సర్వ దేవతా ప్రార్ధన.
3.గణపతి వందనం.
------------------------

అంబ ఈశుని పుత్ర  ఆది పుాజ్యుడవయ్య
అహరహము నిను గొల్తు నార్తిబాపగదయ్య ॥

ఆది -అంత్యము లేని  ఆది గురుడవు నీవు
అర్చించు నీశ్వరికి ఆపదలు బాపయా ॥ 

ముజ్జగమ్ముల ఒజ్జ  ముద్దు గణపతి రాయ.
విఘ్నముల బాపేటి   విఘ్నేశ్వరుడవయ్య॥

ఇష్టపదులను రాయు నిచ్ఛ దీర్చగ రార
ఈప్సితములీడేర్చి  ఈశ్వరిని బ్రోవరా ॥

4.గురు వందనం.
.---------------------
శ్రితజనుల బ్రోవగా  షిరిడి పురమునందున
శ్రీశ నీ వాసమే  శ్రీ నిలయమై ఒప్ప-॥

సర్వ మత సమ్మతిని సరళముగ జెప్పేవు
సకల తీర్ధములన్ని      నీదరినె జుాపేవు..॥
.
ఖండయొాగివి నీవు ఖలు సంతరణ జేయు
కరుణా సముద్రుడవు  కమలనయన సునేత్ర॥

కలత లన్నియు బాపి  కావుమయ్యా మమ్ము   
శ్రీ షిరిడి శ్రీ వాస  శ్రీ పదాంబుజయుగళ ॥

5.గురు వందనం.

వందనము శ్రీసాయి         వందనము గురుదేవ
వందనము చేకొనగ          వేగ రావగదయ్య ॥

వేడుచుంటిని నిన్ను         వేల కీర్తుల తోడ
వరద హస్తముతోడ          వరలు సాయిాశ్వరా ॥

నింబ వృక్షము నీడ        నిత్య తపమును జేసి
సర్వ జన సమ్మొాద       సామరస్యపు భావ-॥

మలరు సాయిాశ్వరా     మా నమము నీకయా
ఇల గాచు ఇలవేల్ప       ఈశ్వరిని  బ్రోవరా..॥

6.సరస్వతీవందనం.

విద్యలకు కొలువైన   విలువ పలుకుల తల్లి
విజయ పథములేలు  విశ్వ జన శ్రీ వల్లి   ॥

విద్య- బుద్ధుల నెల్ల  విశ్వ  వేదిక కొసగు
తల్లి శారద నీవె  తరుణి బ్రాహ్మ్మీ శివే ॥

నా పుాజలను కొమ్మ  నగుమొాము పుాబోణి   
వివరములు నాకొసగు విజయ పథ సామ్రాజ్ఞి.

నాదు జిహ్వను నిలచి నను బ్రోవు మాయమ్మ
నలువ కొమ్మా నిత్య నీరాజనములమ్మ ॥..

అంబికా వందనం

గణ నాధ షణ్ముఖా ఘన పుతృలకు తల్లి
గణనలే  లేనట్టి గుణ కల్పవల్లివిగ

దుష్టులను దునుమాడి దురితములు పోగొట్టి
దుర్మదాంధులనణచు దుర్గమాంబవు నీవు.

గౌరవర్ణముతోడ  గౌరివై భాసిల్లు
మంగళస్వరుాపవు మాంగళ్య దాతవు

దివ్య  శక్తుల నేలి దీనార్తులను బ్రోవు          
ఈశ్వరీ నుత పాద  ఈశు రాణివి నీవు

మేటి రుాపము లెత్తి మేలుజేయగ నిలను
నవ దుర్గ రుాపాల నరుల బ్రోవగ వచ్చి

దైత్యులను కృుారులను దునుమాడి దుర్గవై
దశ హస్త శస్త్ర  వై ధరణిలో వెలసేవు॥

హిమగిరిసు పుత్రికవు హిమగిరి పురీశ్వరివి
హరుని పట్టపురాణి   హరి భగిని పార్వతివి॥

హంస వాహిని సఖివి హరునర్ధరుాపిణివి
అంబ జగదీశ్వరిని అహరహము కావవే॥
-------------------------------------------------------------------
ధ్యానం   (సంఖ్య  8    ) 

గీత వర్ణ సారపు  గీతాక్షర సుమములు
సుాత్ర ధర్మమందిడి  మాత్ర మాలగ వేయ॥

వాగ్దేవతల గొలిచి  వ్రాయ గోరితి నేను
గీతార్ధ సారమును  గీర్వాణ వేదమును॥

కోటి మదన సుందర కోమలుని శ్యామలుని
ఆపద్బాంధవుండు అవని యదు నందనుని॥

దీప జ్యోతుల జుాపి  దీవెనలను కోరితి  
అవతారపురుషుని  ఆది నారాయణుని ॥

Saturday, September 26, 2020

కృపణాలు కొత్త ప్రక్రియ.

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/F8ruv0UEI34L5GCf3wV6dW

రూపకర్త:-
 *రాజశ్రీ ఎల్మల*  
*నియమాలు* 
*#. నాలుగు పాదాలు* 
*#. 1,3  పాదములో 5 అక్షరాలు మాత్రమే ఉండాలి.*
*#.2,4 పాదాల్లో 8 అక్షరాలు మాత్రమే ఉండాలి*
*#. 1,3 పాదాలలో మొదటి అక్షరం ఒకేలా ఉండాలి.*
*#.  1,4 పాదాలలో ఒక  అంత్య ప్రాస ఉండాలి*
 *#2,3 పాదాల్లో ఒక అంత్యప్రాస ఉండాలి.*
 *#.4వ పాదంలో8 అక్షరాల తర్వాత ఒక సూర్య గణం తో మకుటం ఉండాలి.* ఉ" పసిడి (III), సింహ(UI)..
*రోజుకు  2 "కృపాణాలు" మాత్రమే రాయాలి .*

*ఓ* ప్రియత *మా*
నాపై ఎందుకింత క *సి*
*ఓ* సి రాక్ష *సి*
ప్రేమలో ఇంత కోప *మా* పసిడి.

*కృపాణాలు e-సంకలనం కొరకు*

తేది.28-09-2020 నుండి 30-09-2020.
సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే.

పేరు:
ఊరు:
మొబైల్ నెంబర్:

1)కృపాణాలు......


2)కృపాణాలు".....


3)కృపాణాలు".....
.

విడిగా మీ ఫోటో...

పై ఫార్మెట్లో పంపించండి.

*విజయదశమి రోజు ప్రశంసా పత్రాలు అందజేస్తాము.*

ఉస్మానియా తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు.
 
*ప్రశాంత్ కుమార్ ఎల్మల*..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నా నీ లు నియమాలు.

1.నాలుగు పాదాలు ఉం డా లి
2.20 నుండి 25 అక్షరాలు ఉండాలి 
3. చివరిలో సరుపు బలంగా ఉండాలి 
4. మొదటి రెండు పాదాలు ఒక భావంశం .మిగతా రెండు పాదాలు ఒక బావంశం ఉండాలి

Thursday, September 24, 2020

చిలకపలుకులు. ««««7 నుండి 14 అక్షరాల లోపు ఉండాలి.4 పాదాలుండాలి.అంత్య ప్రాసలుండాలి.సెప్టెంబరు మాసం రోజువారి అంశాలు

చిలకపలుకులు.  ««««
7 నుండి 14 అక్షరాల లోపు ఉండాలి.
4 పాదాలుండాలి.
అంత్య ప్రాసలుండాలి.
సెప్టెంబరు మాసం రోజువారి అంశాలు ఒకరోజుకు ఒకటి మాత్రమే పంపాలి.
1. మలయ సమీరం
2. కౌముది
3. పవనం
4. పరిమళం
5. ప్రణవం
6. ప్రణయం
7. పరిణయం
8. పరిచయం
9. మంగళసూత్రం
10. తలంబ్రాలు
11. సన్నిహిత్యం
12. జ్యోత్స్న
13. ప్రత్యూషం
14.తామసి
15. ఉషఃస్సు
16. తారక
17. సంధ్య
18.వ్యత్యాసం
19. అనురాగం
20. అభియోగం
21.అభిమానం
22. అవమానం
23. ఆత్మగౌరవం
24. అంతఃపురం
25. శిఖరం
26. పద్మవ్యూహం
27. శ్రీమతి
28.మానసము
29. విచక్షణ
30. వివక్ష
01. భిక్ష
02.హోమం
03.అగ్నిగుండం
04.నాతిచరామి
05.కలికాలం
06.మృగం
07.హరిణము
08.హరితము
--------------------

శీర్షిక.
మలయ సమీరం.
------------------------
1. చిలకపలుకు.
-----------------------
మంద్రంగా వీచే మలయ సమీరం.
మధుర సుమ గంధాల మల్లెల సారం.
చంద్ర ప్రతి బింబపు  సరోవర తీరం.
సుధ లొలికే మాధవ వేణు నాదం ॥
-----------------------------------------------
2. 
కౌముది.
----------
 కౌముది వెన్నెల రేయి లో
ఆమని సొగసుల అందాలు.
కొమ్మల చాటున కోయిలలుా
కమ్మగ పాడెను గీతికలు.
--------------------------------
3 . పవనం.
------------------
పవనం మంద్రంగా వీచితే వరం.
పవనం ఉధృతంగా వీచితే దుమారం.
మన ఉచ్ఛ్వాశ నిశ్వాసాలకు ముాలం.
పవనం సర్వ ప్రాణులకు జీవాధారం.॥
-----------------------------------------------
4. పరిమళం .
-------------------
పుావులు పరిమళం ఇస్తాయి.
చెట్లు  చల్లటి  నీడనిస్తాయి.
నీళ్ళు దాహం తీరుస్తాయి.
జాతి మత బేధాలు ప్రాణాలు తీస్తాయి.
----------------------------------------------------
5.ప్రణవం.
------------
ఓంకార నాదం ప్రణవం.
ఓజస్సు తో నిండేది  దైవం.
జీవన సాఫల్యం ,  జ్ఞానం మార్గం.
జ్ఞానానికి గురువే   మార్గదర్శకం.
(ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా)
--------------------------------------------------
6.ప్రణయం.
శీర్షిక .
విశ్వ చైతన్యం.
--------------------
శివ-పార్వతుల ప్రణయం విశ్వ చైతన్యం.
అర్ధనారీతత్వం  జగతిలో ఆదర్శం.
ఆ తల్లి రుాపాలు అనంతం.  
తల్లిని మించిన దైవం లేదన్నది సత్యం.॥
-------------------------------------------
7..పరిణయం.
-----------------------
రెండు కుటుంబాల మద్య సంబంధం.
ఒకరి -కొకరై పంచుకొనే ప్రేమ బంధం.    
వధుా వరుల జీవితాంత ఒప్పందం.
కష్ట మైనా, నష్ట మైనా వీడని వాగ్దానం.
----------------------------------------------
8. పరిచయం.
------------------ 
చిలకపలుకుల పరిచయం ,అద్భుతం.
పలుకు కవిత్వం, సాహిత్యానికి అందం.
కుల -మతాలు లేకుంటే జగతినానందం.
ఇల మనిషి జీవితం మధురానందం.
------------------------------------------------
9. మంగళసుాత్రం.
--------------------------
ముాడు ముళ్ళతో వేసే బంధం.
ఇరు కుటుంబాల బాధ్యతల బంధం.
రెండు మనసులు ఒకటైన  అందం.
శరీరార్ధ భాగాలు ఒకటై ప్రమాణం ॥
----------------------------------------------
10.తలంబ్రాలు.
-----------------------
ఇరు మనసులు ఒకటైన సాక్ష్యాలు.
ఇరువురి తలపుల పంపకాలు. 
సరియైన బద్ధ ప్రమాణపు ఒప్పందాలు.
వర మై కురియు మంగళ తలంబ్రాలు.
.-----------------------------------------------
  .11. సన్నిహిత్యం.
------------------------
సాన్నిహిత్య బంధం భార్యా భర్తలది.
ఎన్ని అవాంతరాలొచ్చినా వీడనిది.
మన్నింపులు , లాలలనకు అతీతమైనది.
సున్నితత్వం  నిండు సత్యమైన ప్రేమది.॥.--
----------------------------------------------
 12. మరీచిక.
-------------------
స్పష్టత లెేని జీవన బంధాలు.
దుష్ట కరోనా చంపిన ఆశలు.  
కష్ట- సుఖాలు కావడి కుండలు.
శ్రేష్ట నాయకులు ఎడారి మరీచికలు ॥
-----------------------------------------
12.జ్యోత్స్న.అంటే ఆధునిక
-----------------------------------------
జ్యోత్స్నా  ప్రక్రియలు అనంతం.
ఉత్సాహం ఇనుమడీంచే విధం
సంక్షిప్త పదాలు కావాలి అవగతం. 
అద్భుత గుళికలు,ఇదియదార్ధం.
-----------------------------------------
13.ప్రత్యుాషం
--------------------
హాయి గొలిపే ప్రత్యుాష సమయం.
కోయిలమ్మల కుహుా రవం.
రేయి విరిసిన పుాల సౌరభం.
తీయని వసంతాల సుందర వరం.
-----------------------------------------
14.తామసి.
-------------------
బడుగు బ్రతుకుల్లో కన్నీటి తామసి
అడుగడుగు అవరోధాలకు వగచి
వేడుక విధి వింత లీలకు అలసి .
కడు వెతల కీలు బొమ్మలై నిలచి.
-----------------------------------------
 15.  ఉషఃస్సు.
-----------------------
ఉషోదయపు  సుార్య కిరణాలు.
తిమిర సంహరణాల కారణాలు.
భాషోద్యమ కారణ ఫలితాలు.
సరళ భాషా సౌలభ్య సాఫల్యాలు.
-----------------------------------------
 : 16. తారక.
-----------------------
ఆకాశంలో  మెరిసే అందాల తారక
రాకా శశి ముఖుని  వలపు దీపిక
నేకానేక నక్షత్రాల మెరుపులిక  .
నాకానంద తలపుల నిండు వేదిక.
----------------------------------------
: 17. సంధ్య.
------------------
అల్లన యమునా నదీ  తీరం.
చల్లని గాలుల సంద్యా సమయం
అల్లరి కృష్ణుని మురళీ నాదం.
ఝల్లను మనసే ఆనందనిలయం.॥
---------------------------------------
: 18. వ్యత్యాసం.
--------------------------
కలసి ఉంటే కలదు సుఖం.
కలనైనా వీడకు నీ ధర్మం.
ఇలలో భాషా జాతులనేకం.
కుల మతాలంటుా చుాపకు వ్యత్యేసం.
--------------------------------------
 19 . శీర్షిక .
 అనురాగం.
 -----------
తల్లిదండ్రులుల పై గౌరవం.
చెల్లి తమ్ముళ్ళపై అనురాగం.
అల్లుకున్న బంధాలపై అభిమానం.
ఎల్లలు లేని ప్రేమానుబంధం.
--------------------------------------
 20. అభియొాగం.
--------------------------
మొాపకు నాపై అభియొగం
చుాపకు నాపై అనురాగం.
ఓపలేను నీ వియొాగం.
మనిద్దరి కలయిక ఒక సంయొాగం.
--------------------------------------------
 21 అభిమానం.
-----------------------
మనిషికి ఆత్మాభిమానం ఉండాలి.
మనుగడలో నీకు మచ్చ రానీయదు.
పనిలో నిబద్ధత అన్నది ఉండాలి-
అన్నది  అవమానాలకు తావీయదు.
----------------------------------------------------
22.అవమానం.
------------------------
అమానుషమైన చర్యలతో ఎపుడుా
సమాజాన్ని కలుషితం చేయకు.
నీమాటలమీద నమ్మకాన్ని ఉంచినపుడు
అమాయకులని అవమానం చేయకు.
-----------------------------------------------
 23.అంశం.
ఆత్మ గౌరవం.
------------------
సమాన గౌరవం ఇచ్చి పుచ్చుకో
నీమంతో  పోరాడి  గెలు పందుకో
శ్రమ చేసి ఫలితం సాధించుకో
ఆత్మ గౌరవాన్ని కాపాడుకో ॥
-------------------------------------
24. శీర్షిక 
 అతఃపురం
   ----------------
పంజరంలో అందాల చిలకమ్మ  వాసం
కొంచ మైనా  స్వేచ్ఛ లేని బతుకు శాపం.
అంతఃపురం లో అందాలేలే  రాణివాసం.
వింత। అన్నీ ఉన్న , అంతరాల కుాపం 
-------------------------------------------
25. శీర్షిక 
శిఖరం .
----------
కైలాశ శిఖరాన ఈశ్వరుడు
ఫాల నేత్రముతో నున్న వాడు.
అల వైకుంఠ పురీశ్వరుడు.
శిల యై వెలసిన వేంకటేశుడు.॥
------------------------------------------
26.అంశం.
పద్మవ్యుాహం.
--------------------------
రాజకీయం ఒక పద్మవ్యుహం వంటిది
లోపలికి వెళితే  బయటకు రాలేవు.
నాయకత్త్వం  తీరని దాహం వంటిది.
దానికై ఏం చేయడానికీ వెనుకాడవు.
------------------------------------------------
రచన,  శ్రీమతి.
పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021

Wednesday, September 23, 2020

తేనియలు. సెప్టెంబర్ 2020.

సెప్టెంబర్  నెల 2020..లో   రాస్తున్న తేనియలు.
తేనియలు.
7 . 13 నుంచి 15 లోపల మాత్రలు. 2-4 పాదాల చివర అంత్య ప్రాస.
-----------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
------------------------
1.రక్ష.
----------
మనిషికి  జ్ఞానం అవసరం.
విద్య  నేర్చుకో అను నిత్యం.
పర్యావరణ రక్షణ చేయి
అదే  మన ఆరోగ్య  సత్యం  ॥
-----------------------------------
2.శిక్ష.
----------
మనుషుల్లో కక్షలు పెరిగితే
తన పర బేధాలు కనలేవు
మది నిండే స్వార్ధ చింతనలు.
ప్రేమించే వారిని కొనలేవు.
----------------------------------
  3. ప్రగతి.
  ----------
మనందరి వరం , మన సంస్కృతి .
సాహిత్యానికి  తెలుగు వెలుగు. 
దేశ ప్రగతి , సభ్య సమాజం .
మంచి మాటతో, మన్నన  కలుగు.
-----------------------------------
4. బంధం.
--------------
భార్యను ఎపుడుా ద్వేషించకు.
బంధాలవి, సడలి పోతాయి.
కన్నుల నీరు పెట్టనీయకు.
సిరి సంపదలు ,వదిలి పోతాయి.
------------------------------------
5.  తెలుసుకో.
---------------
ఒకరి తప్పు చుాపేముందు
నీ తప్పును నువు తెలుసుకో
గోరంతలు కొండత చేయకు
గౌరవాన్ని నువు నిలుపుకో॥
------------------------------------
6. పుాజ.
--------
పంచ గవ్యాలు ఓషధులు.
కనక ,గోమాతను పుాజించు
తల్లిదండ్రులు ఇల పోషకులు.
ఇల పెద్ద వారిని గౌరవించు. ॥
------------------------------------
7..అవసరం.
-------------
సమాజంలో చాలా ముఖ్యం.
ఆలోచించి మాట్లాడడం.
చదువుకుంటే నే సరిపోదు.
తగ్గించు కో పోట్లాడడం..॥
--------------------------------------
8.శీర్షిక .
మొాడీ.
-----------
మొాడీ మంచి నాయకుడు మనకి  .
మొాసాలను  వెలికి తీసేడు.    
ఆరేళ్ళ సవ్య పాలనలో.....    .
అరాచకాలు అరికట్టేడు .॥      
--------------------------------
9అంశం.
మాట.
----------
మాట కు పదునెక్కువంటారు.
పొరపాటునదె నోరు  జారకు.
మనసు మందిరమని అంటారు.
కపటమనే మలినం చేర్చకు.
--------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
19/9/2020.

10.శీర్షిక.
చేటు.
------
ఇంటి గుట్టు లంకలు చేటట
మరి ఎక్కడా నోరు జారకు.
మంచి మాటకు విలువ ఎక్కువ
చెడు మాట్లాడు వారిని  చేరకు ॥
-------------------------------------------
11.శీర్షిక.
ముఖ్యం.
------------
వయసు పెరిగితే సరిపోదు
జ్ఞానం  పెరగడంమే  ముఖ్యం.
బతకడమే ముఖ్యం  కాదు.
ఆనందం  అన్నది ముఖ్యం.॥
--------------------------------------------
12.శీర్షిక .
దేముళ్ళు
---------------
తల్లిదండ్రులు దైవ రుాపులు
వారినెపుడుా అవమానించకు.
వారి ప్రేమ సాటి లేనిది.
వృద్ధాశ్రమాల్లో ఉంచకు.
--------------------------------
8.శీర్షిక .
మొాడీ.
-----------
మొాడీ మంచి నాయకుడు మనకి  .
మొాసాలను  వెలికి తీసేడు.    
ఆరేళ్ళ సవ్య పాలనలో.....    .
అరాచకాలు అరికట్టేడు .॥   
--------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
20/9/2020.

13.శీర్షిక .
అరిటాకు.
---------------
అరిటాకు ముల్లు పైన పడతే
అరిటాకు కే నష్టమంటారు.
ముల్లు అరిటాకు మీద పడినా
అరిటాకు కే నష్టమంటారు.
--------------------------------------
14. అందం శతృవు స్త్రీ జాతికి
అణకువ స్త్రీ లకది భుాషణం.
అహం మగవారికది శతృవు
ఉద్యోగం పురుష లక్షణం ॥
--------------------------------------
15.ఆరోగ్యం ఉదయం నడిస్తే
సంకల్పం చేస్తే  సాధ్యం.
అనారోగ్యం,  అది అతినిద్ర.
ఆరోగ్యమే  మహా భాగ్యం.॥
----------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
21/9/2020.
--------------------
16.శీర్షిక .
కవిత్వం.
------------
వసంతం చిగురిస్తే చాలు
కవిత్వమే, వెల్లువౌతుంది
కవితలు మనసుని అలరిస్తే
అంతరంగం పులకిస్తుంది.॥
-----------------------------------------
17.శీర్షిక .
పుాజ.
---------
దేవుని పుాజ మాత్రం చేత
పాపాలన్నీ  తొలగుతాయి
మానవత్వమది చుాపిస్తే
కలతలన్నీ కరగిపోతాయి..
------------------------------------
18. శీర్షిక .
నాడు-నేడు.
----------------
కలసి ఉంటే కలదు సుఖం.
ఉమ్మడి కుటుంబాలు కరువు.
సంతానమే సౌబాగ్యం.
ఇద్దరు కన్నా ఎక్కువ బరువు.
-------------------------------------

22/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021

శీర్షిక .
అంజలి.
-----------
19.
పాల జలధి లోన పవ్వళించు
పరమ పురుషుడతడు మాధవుండు.
అర్ధ నారీశ్వరుడతడు  శివుడు
భోళా శంకరుడుమా ధవుండు ॥
------------------------------------------
20.
శీర్షిక .
తరాజు.
----------
అంతరంగం అద్దం వంటిది
న్యాయాన్యాయాలు చుాపుతుంది.
బుద్ధి వక్రపు  తక్కెడ వంటిది.
చెడు వైపే మొగ్గు చుాపుతుంది.॥
------------------------------------------
శీర్షిక .
సాయం.
----------
21.
కర్మ కొలదీ  ఫలితమంటారు.
అందుకే మంచి పనులను చేయి.
కరోనా కష్ట కాలం లో ని
బీదా బిక్కి కి సాయం చేయి.॥
-----------------------------------------

23/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
శీర్షిక.
22.తోడు.
----------
నిండు  పున్నమి  ఆకాశంలో
అందమైన వెన్నెల రేడు
పొంగే   కవితా వేశంలో
చల్లని వెన్నెల మనసుకు తోడు॥
--------------------------------------------
23.
రెండు కుటుంబాల కలయిక.
పెళ్లంటే నుారేళ్ళ పంట.
రెండు మనసులు కలసి మెలసి
రానీయకు కన్నీరు కంట.
------------------------------------------
24.
అమ్మా  నాన్నలు నీ పాలకులు.
మనస్తాపం కలిగించకు.
పిల్లలు భావి భారత పౌరులు.
వారిలో  ద్వేషం రగిలించకు.॥
----------------------------------------
25.
అన్యాయాన్ని సహించకెపుడుా
కావలసినవారైనా సరే ..
అబద్ధమాడీ మొాసగించకు
లోకంలో ఎవరైనా సరే ॥
------------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
24/9/2020.
26.తేనియలు.
శీర్షిక .
పతనం.
-------------
ఈర్ష్య నిన్ను పతనం చేస్తుంది.
సంతోషంగా ఉండలేవు.
ఓర్వలేని తనం నీ ఓటమి.
ఎప్పటికీ పైకెదగలేవు.
---------------------------------
27.
శీర్షిక .
మరువకు.
---------------
గాలిలో మేడలు కడుతుా
కలల ప్రపంచం లో తేలకు.
గమ్యానికి చేరాలంటే
కష్ట పడాలన్నది మరువకు.॥
----------------------------------------
28.
శీర్షిక .
భరత చరిత.
-----------------
భరత దేశం భోరుమంటోంది
ఉద్యమాలు ఊసులయ్యేయి నిదురపోయేయి.నినాదాలు. చ

రితలు పుటల కెక్కేయి.

------------------------------------------

29.
శీర్షిక.
ఆనందం.
--------------
మనిషికి వ్యక్తిత్వం     "ఆభరణం."
మాటలోని మర్యాద    "అందం."
గంభీర గుణం   మదే  " గౌరవం"
త్యాగ నిరతి మనసు   "కానందం".
--------------------------------------------

సెప్టెంబర్  నెల    12 /9/  2020..నుండి   రాస్తున్న తేనియలు.
తేనియలు.
7 . 13 నుంచి 15 లోపల మాత్రలు. 2-4 పాదాల చివర అంత్య ప్రాస.
-----------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
------------------------
1.రక్ష.
----------
మనిషికి  జ్ఞానం అవసరం.
విద్య  నేర్చుకో అను నిత్యం.
పర్యావరణ రక్షణ చేయి
అదే  మన ఆరోగ్య  సత్యం  ॥
-----------------------------------
2.శిక్ష.
----------
మనుషుల్లో కక్షలు పెరిగితే
తన పర బేధాలు కనలేవు
మది నిండే స్వార్ధ చింతనలు.
ప్రేమించే వారిని కొనలేవు.
----------------------------------
  3. ప్రగతి.
  ----------
మనందరి వరం , మన సంస్కృతి .
సాహిత్యానికి  తెలుగు వెలుగు. 
దేశ ప్రగతి , సభ్య సమాజం .
మంచి మాటతో, మన్నన  కలుగు.
-----------------------------------
4. బంధం.
--------------
భార్యను ఎపుడుా ద్వేషించకు.
బంధాలవి, సడలి పోతాయి.
కన్నుల నీరు పెట్టనీయకు.
సిరి సంపదలు ,వదిలి పోతాయి.
------------------------------------
5.  తెలుసుకో.
---------------
ఒకరి తప్పు చుాపేముందు
నీ తప్పును నువు తెలుసుకో
గోరంతలు కొండత చేయకు
గౌరవాన్ని నువు నిలుపుకో॥
------------------------------------
6. పుాజ.
--------
పంచ గవ్యాలు ఓషధులు.
కనక ,గోమాతను పుాజించు
తల్లిదండ్రులు ఇల పోషకులు.
ఇల పెద్ద వారిని గౌరవించు. ॥
------------------------------------
7..అవసరం.
-------------
సమాజంలో చాలా ముఖ్యం.
ఆలోచించి మాట్లాడడం.
చదువుకుంటే నే సరిపోదు.
తగ్గించు కో పోట్లాడడం..॥
--------------------------------------
8.శీర్షిక .
మొాడీ.
-----------
మొాడీ మంచి నాయకుడు మనకి  .
మొాసాలను  వెలికి తీసేడు.    
ఆరేళ్ళ సవ్య పాలనలో.....    .
అరాచకాలు అరికట్టేడు .॥      
--------------------------------
9అంశం.
మాట.
----------
మాట కు పదునెక్కువంటారు.
పొరపాటునదె నోరు  జారకు.
మనసు మందిరమని అంటారు.
కపటమనే మలినం చేర్చకు.
--------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
19/9/2020.

10.శీర్షిక.
చేటు.
------
ఇంటి గుట్టు లంకలు చేటట
మరి ఎక్కడా నోరు జారకు.
మంచి మాటకు విలువ ఎక్కువ
చెడు మాట్లాడు వారిని  చేరకు ॥
-------------------------------------------
11.శీర్షిక.
ముఖ్యం.
------------
వయసు పెరిగితే సరిపోదు
జ్ఞానం  పెరగడంమే  ముఖ్యం.
బతకడమే ముఖ్యం  కాదు.
ఆనందం  అన్నది ముఖ్యం.॥
--------------------------------------------
12.శీర్షిక .
దేముళ్ళు
---------------
తల్లిదండ్రులు దైవ రుాపులు
వారినెపుడుా అవమానించకు.
వారి ప్రేమ సాటి లేనిది.
వృద్ధాశ్రమాల్లో ఉంచకు.
--------------------------------
.13..శీర్షిక .
అరిటాకు.
---------------
అరిటాకు ముల్లు పైన పడతే
అరిటాకు కే నష్టమంటారు.
ముల్లు అరిటాకు మీద పడినా
అరిటాకు కే నష్టమంటారు.
--------------------------------------
14
.అందం శతృవు స్త్రీ జాతికి
అణకువ స్త్రీ లకది భుాషణం.
అహం మగవారికది శతృవు
ఉద్యోగం పురుష లక్షణం ॥
--------------------------------------
15.
ఆరోగ్యం ఉదయం నడిస్తే
సంకల్పం చేస్తే  సాధ్యం.
అనారోగ్యం,  అది అతినిద్ర.
ఆరోగ్యమే  మహా భాగ్యం.॥
----------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
21/9/2020.
--------------------
17.శీర్షిక .
కవిత్వం.
------------
వసంతం చిగురిస్తే చాలు
కవిత్వమే, వెల్లువౌతుంది
కవితలు మనసుని అలరిస్తే
అంతరంగం పులకిస్తుంది.॥
-----------------------------------------
18.శీర్షిక .
పుాజ.
---------
దేవుని పుాజ మాత్రం చేత
పాపాలన్నీ  తొలగుతాయి
మానవత్వమది చుాపిస్తే
కలతలన్నీ కరగిపోతాయి..
------------------------------------
19 శీర్షిక .
నాడు-నేడు.
----------------
కలసి ఉంటే కలదు సుఖం.
ఉమ్మడి కుటుంబాలు కరువు.
సంతానమే సౌబాగ్యం.
ఇద్దరు కన్నా ఎక్కువ బరువు.
-------------------------------------
శీర్షిక .
అంజలి.
-----------
20.
పాల జలధి లోన పవ్వళించు
పరమ పురుషుడతడు మాధవుండు.
అర్ధ నారీశ్వరుడతడు  శివుడు
భోళా శంకరుడుమా ధవుండు ॥
------------------------------------------
21.
శీర్షిక .
తరాజు.
----------
అంతరంగం అద్దం వంటిది
న్యాయాన్యాయాలు చుాపుతుంది.
బుద్ధి వక్రపు  తక్కెడ వంటిది.
చెడు వైపే మొగ్గు చుాపుతుంది.॥
------------------------------------------
శీర్షిక .
సాయం.
----------
22.
కర్మ కొలదీ  ఫలితమంటారు.
అందుకే మంచి పనులను చేయి.
కరోనా కష్ట కాలం లో ని
బీదా బిక్కి కి సాయం చేయి.॥
-----------------------------------------
శీర్షిక.
23.తోడు.
----------
నిండు  పున్నమి  ఆకాశంలో
అందమైన వెన్నెల రేడు
పొంగే   కవితా వేశంలో
చల్లని వెన్నెల మనసుకు తోడు॥
--------------------------------------------
23.
రెండు కుటుంబాల కలయిక.
పెళ్లంటే నుారేళ్ళ పంట.
రెండు మనసులు కలసి మెలసి
రానీయకు కన్నీరు కంట.
------------------------------------------
24.
అమ్మా  నాన్నలు నీ పాలకులు.
మనస్తాపం కలిగించకు.
పిల్లలు భావి భారత పౌరులు.
వారిలో  ద్వేషం రగిలించకు.॥
----------------------------------------
25.
అన్యాయాన్ని సహించకెపుడుా
కావలసినవారైనా సరే ..
అబద్ధమాడీ మొాసగించకు
లోకంలో ఎవరైనా సరే ॥
------------------------------------
26.తేనియలు.
శీర్షిక .
పతనం.
-------------
ఈర్ష్య నిన్ను పతనం చేస్తుంది.
సంతోషంగా ఉండలేవు.
ఓర్వలేని తనం నీ ఓటమి.
ఎప్పటికీ పైకెదగలేవు.
---------------------------------
27.
శీర్షిక .
మరువకు.
---------------
గాలిలో మేడలు కడుతుా
కలల ప్రపంచం లో తేలకు.
గమ్యానికి చేరాలంటే
కష్ట పడాలన్నది మరువకు.॥
----------------------------------------
28.
శీర్షిక .
భరత చరిత.
-----------------
భరత దేశం భోరుమంటోంది
ఉద్యమాలు ఊసులయ్యేయి
సమర చరితలు పుటల కెక్కేయి.
నినాదాలు నిదురపోయేయి.॥
-------------------------------------------
29.
శీర్షిక.
ఆనందం.
--------------
మనిషికి వ్యక్తిత్వం     "ఆభరణం."
మాటలోని మర్యాద    "అందం."
గంభీర గుణం   మదే  " గౌరవం"
త్యాగ నిరతి మనసు   "కానందం".
--------------------------------------------
30.తేనియలు.
శీర్షిక .
జీవితం.
-----------
రాయి ఉలిదెబ్బకు భయపడితే
శిల్పమై కాలేదు , పుాజితం.
ఆటుపోట్లు తట్టుకో పోతే
మనిషి  గెలవేలేడు జీవితం.
-------------------------------------


24/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
శీర్షిక .
భరత చరిత.
-----------------
28.తేనియ.
భరత దేశం భోరుమంటోంది
ఉద్యమాలు ఊసులయ్యేయి నిదురపోయేయి.నినాదాలు.
సమర చరితలు పుటల కెక్కేయి.
------------------------------------------
25/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
25/9/2020.
శీర్షిక .
లోపం.
-----------------------
31.
మనుషులలో మంచి తనం లోపం.
మానవత్త్వం మరుగు పరచింది..
స్వార్ధం పెరిగిన సమాజంలో
ప్రజలకు రక్షణ లోపించింది.
-------------------------------------
32.
మంచి వారితో స్నేహం చేయి.
సన్మార్గపు బాటది ఉత్తమం.
దుష్టులకు దుారంగా ఉండుము.
చెడు స్నేహాలన్నవి ప్రమాదం..॥
-----------------------------------------
ఆదివారం 27 ని క్రిందివి అన్నీ పంపాలి

25/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
25/9/2020.
తేనియలు.
శీర్షిక .
లోపం.
-----------------------
31.
మనుషుల్లో లోపాలు సహజం.
మానవత్త్వం లోపించింది
స్వార్ధం పెరిగిన సమాజం
ప్రజలకు చుక్కలు చుాపించింది.
-------------------------------------
32.
మంచి వారికి స్నేహం పంచు.
సన్మార్గపు బాట ప్రమొాదం.
దుష్టులను దుారంగా ఉంచు.
చెడు స్నేహాలు ప్రమాదం..॥
-----------------------------------------
26./9/2020
33..తేనియ.
------------------------
ఉరుములు,మెరుపుల సందడి తో
మేఘాలు కురిసే వర్షమై
చిటపట   చినుకుల  జల్లుల తో .
రైతుల మది నిండె హర్షమై  ॥
  -----------------------------------------
27/9/2020.
34. తేనియ.
------------------
శీర్షిక .
శిక్ష.
--------
కోపం వివేక నాశనం..
తన శాంతమే తనకు రక్ష.
ముార్ఖత్వం జీవిత శాపం.
తనకు తా వేసుకున్న  శిక్ష ॥
---------------------------------------
28/9/2020.
35. తేనియ.
-------------------
కష్టపడి పని చేసుకుంటే
లేమి  ఎప్పుడుా బాధించదు.
తన స్వార్ధమే చుాసుకుంటే.
బంధుత్వమెపుడుా రాణించదు.
------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
-------------------------
29/9/2020.
36. తేనియ.
శీర్షిక .
ప్రయత్నం.
---------------
కావాలనుకున్న దేదైనా
ప్రయత్నిస్తే లభిస్తుంది.
సాధించే పంతముంటే
లక్ష్యానికి దగ్గర చేస్తుంది.
------------------------------------
37.-తేనియ.
ఎవరి మనసుా  నొప్పించకు.
బాధ  అన్నది మరువలేనిది.
గాయమైతే మానిపోతుంది
మాట గాయం చెరుపలేనిది..
---------------------------------------.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
-------------------------
39/9/2020
.. తేనియ.
-------------------
మనసనేది అద్దం లాంటిది.
ఒకసారి పగిలితే అతకదు.
మాట కత్తిలా పదునైనది.
నోరు జారిన మమత బతకదు.॥
-----------------------------------------
తేనియ.
అంశం.
ఆశించకు.
-------------
నచ్చితే  ఉపకారం చేయి
కానీ ఫలితం ఆశించకు.
నచ్చక పోతే దుారం చేయి.
అనవసరంగా దుాషించకు.
-----------------------------------
30/9/2020.
తేనియ.
---------------------
ఉంటే చాలు.దాన గుణం.
వేరే పుణ్య చేయక్కరలేదు.
సద్భావనుంటే చాలు.
వేరే ప్రేమ చుాపక్కరలేదు.
-----------------------------------
1/10/2020.
47.తేనియ.
------------------
నేడు అక్రమాలు బోలెడు.
న్యాయానికి  కళ్ళు ఉండవు.
ఏళ్ళు గడచినా రాదు తీర్పు.
నిజానికి సాక్ష్యాలు ఉండవు.
--------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
-------------------------
4/10/2020
48.తేనియ.
శీర్షిక .
మానవత్త్వం.
-------------------
మావత్త్వం లేని చోట
స్త్రీ శీలానికి విలువ లేదు.
మనసున్న మనుషుల మనసుకు
లోక తీరు తో పనిలేదు.॥
------------------------------------
శీర్షిక .
సుాన్యం.
-----------
49. తేనియ.
-------------------
మాటలు కోటలు దాటుతాయి-
ఆచరణలు మాత్రం సుాన్యం.।
అయ్యొా । అంటుానే వేయరు-
ముష్టకి పిడికెడు ధాన్యం ॥

-------------------------------------
5/10/2020.
50. తేనియ.
శీర్షిక .
బరువు
------------
గాంధీ పుట్టిన దేశం ఇది
స్వాతంత్ర్య మన్నది కరువైంది.
రాముడేలిన రాజ్యమన్నారు
నీతి -న్యాయం,బరువైంది.
----------------------------------
51 తేనియ.
-----------------
ప్రతి రోగానికీ మందుంది
కరోనా మాయల మహమ్మారి.
అందరం జాగర్త పడాలి.
మందుకు లొంగని మాయలమారి.
--------------------------------------------




















తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* 💐

*తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు*  💐

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు 
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం 
●మాలపిల్ల  - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు 
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర 
●దిగంబర కవిత - దిగంబర కవులు 
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ 
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి 
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు 
●అంపశయ్య – నవీన్ 
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య 
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం 
●జానకి విముక్తి – రంగనాయకమ్మ 
●స్వీయ చరిత్ర – కందుకూరి 
● మహోదయం - కెవి రమణారెడ్డి 
●నారాయణరావు - అడవి బాపిరాజు 
●విశ్వంభర – సినారె 
●దాశరథి కవిత – దాశరథి 
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య 
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య 
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం 
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి 
●పారిజాతాపహరణం - నంది తిమ్మన 
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు 
●రాజశేఖర చరిత్ర – కందుకూరి 
●రాధికా సాంత్వనము - ముద్దు పళని 
● స్వప్న లిపి – అజంతా 
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి 
●శృంగార నైషధం – శ్రీనాథుడు 
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు 
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు 
●అను క్షణికం - వడ్డెర చండీదాస్ 
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ 
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్ 
●గద్దర్ పాటలు – గద్దర్ 
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
 ●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్ 
●కుమార సంభవం - నన్నే చోడుడు 
●మైనా - శీలా వీర్రాజు 
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి 
●మోహన వంశీ – లత 
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి 
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి 
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు 
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి 
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం 
●స్వేచ్ఛ – ఓల్గా 
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి 
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
●తృణకంకణం – రాయప్రోలు 
●హృదయనేత్రి - మాలతీ చందూర్ 
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్ 
●నీతి చంద్రిక - చిన్నయ సూరి 
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●నీలిమేఘాలు – ఓల్గా 
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల 
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ 
●కొయ్య గుర్రం – నగ్నముని 
●నగరంలో వాన – కుందుర్తి 
●శివారెడ్డి కవిత – శివారెడ్డి