వాగ్దేవి కళాపీఠం
తేదీ: 14/6/2021
అంశం : స్వేచ్ఛ కవిత
ప్రక్రియ: బుల్లెట్ పాయింట్స్
⭐ *బుల్లెట్ పాయింట్స్* 👇✍
(నూతన లఘు ప్రక్రియ)
👇👇👇👇👇👇👇👇👇
రచన/రూపకర్త:
తాడూరి కపిల(కపిల శ్రీనివాస్)
వరంగల్ అర్బన్
*****************************
👉 అక్షరమే ఆయుధము!
సంస్కరించు సాధనము!!
👉వంచకుల మాటలు!
నీటిపై రాతలు!!
👉మతమన్నది మార్గము!
ఒకటేగా గమ్యము!!
👉 రగులుతున్న సూర్యుడు!
విప్లవానికి ఆద్యుడు!!
👉అడ్డదారి ప్రయాణం!
కాకూడదు ప్రమాణం!!
👉పసిపిల్లల మనస్సు!
చక్కని ఇంద్రధనుస్సు!!
👉తడబడనీయకు అడుగు !
పడుతున్నా పిడుగు!!
👉 కోరికల గుర్రాలను..
కళ్లెమేసి ఆపవలెను!
👉 తీరుతుంది ఆయువు!
తరిగితే ప్రాణవాయువు!!
✍✍✍✍✍✍✍✍✍
No comments:
Post a Comment