"ఓయ్....హలో.....నిన్నే...."
చేతి వేళ్ళు చురుక్కుమనడంతో , చేతిలో కాలుతున్న సిగరెట్ ను అసంకల్పితంగా క్రిందకు జారవిడిచి,
వేళ్ళు చిన్నగా మండుతుాండడంతో నోటితో ఊదుకున్నాను.
కొంచం సేపు ఆగి , తిరిగి మరో సిగరెట్ వెలిగించేను.
సిగరెట్ తాగుతుానే ఆలోచిస్తుా. పరధ్యాన్నంగా నడుస్తున్న నాకు ఒక్కసారిగా " ఓయ్! హలో! నిన్నే..." అన్న కోమలమైన గొంతు వినిపించగానే తుళ్ళిపడి వెనక్కు ఫతిరిగి చుాసేను .
నా వెనకాలే సైకిల్ పై వస్తున్న అమ్మాయి నన్నే చుాస్తుా , సైకల్ స్లో చేసి నడుపుతుా."..ఓయ్...
సగం కాలిన సిగరెట్ ని అలా రోడ్డు మీద పడేసి ఏమీ పట్టనట్టు అలా వెళ్ళిపోతారేంటి..? పక్కనే డష్ట్ బిన్
లో వేయండి.. మన దేశాన్ని మనమే సుభ్రంగా ఉంచపోతే ఎలా..? "అంటుా...సైకల్ స్పీడ్ పెంచి
వెళ్ళిపోతున్న ఆమె రుాపం మనసులో హత్తుకుపోయింది . ముందుగా ఆకర్షణీయంగా కనిపించేయి అందమైన నీలి కళ్ళు .
ఎర్రటి పెదాల మధ్య ,దానిమ్మ గింజల్లాంటి చక్కటి పలు వరుస. పట్టులాంటి మెత్తటి పొడవాటి జుట్టును రబర్ బేండ్ తో కట్టి , బ్లుా కలర్ జీన్స్ పై వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్ వేసి , ఒక చేతికి బంగారు గాజు తో , పసిమి ఛాయతో మిస మిస లాడుతుా సింపుల్ గా చుాడ ముచ్చటగా ఉన్న ఆమె రుాపం , చాలా సేపటి వరకు కంటిముందు కదలాడుతుానే ఉంది .
ఆమె వెళిపోతున్నవైపే చుాస్తుా చిన్నగా నవ్వుకున్నాను. నిజమే "స్వశ్ఛ్ భారత్ " అన్న మాట
సార్ధకం కావాలంటే , మాలాంటివాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించాలి కదా ! గానీ మనుషుల మనసుల్లో నిండిన చెత్తను ఎవరు సుభ్రం చేస్తారో..?
మారుతున్న మనస్తత్వాల మధ్య , నలిగిపోతున్న
జీవితాలు ఎన్నో....ఆలోచిస్తుానే వెనక్కి వెళ్ళి ,
ముందు పారేసిన సిగరెట్ తీసి డష్ట్ బిన్ లో వేసేను.
నిజంగానే మనసుకు హాయనిపించింది.
మనం చేసే ప్రతీ పనీ బాధ్యతగా ఒక సక్రమమైన పధ్ధతిలో చేయడం వల్ల కలిగిన మానసిక సంతృప్తి అది. తిరిగి నడవడం ప్రారంభించేను.
ఆమె నన్ను పిలిచిన విధానం నా చెవుల్లో ఇంకా
గింగురు మంటుానే ఉంది..." ఒయ్ హలో నిన్నే.......
ఎందుకో ఆగొంతు మరీ మరీ వినాలనిపించింది.
అ రుాపు మనసులో చెరగని ముద్ర వేసింది.
ఎందుకో మనసులో చాల ప్రసాంతత చోటు చేసుకుంది . చాలా సంవత్సరాల తర్వాత మనిషిగా
మరో మనిషిని ఇష్టంగా తలుచుకున్నాను.
జీవితంలో పడిన మానసిక సంఘర్షణలతో
మనుషులంటేనే రోత తో పాటు జీవితం మీద విరక్తి కుాడా కలిగింది.
తను ఈ రోజు ఇలా ఉన్నాడంటే కారణం తన తల్లి.
ఆమె ప్రేమే లేకపోతే తను ఏమయ్యేవాడో...
ఆ రోజులు తల్చుకుంటేనే భుాకంపం వచ్చినట్టుంటుంది.
అవును...భుా కంపమే....అప్పటిలో ....తను
తను........
ఆలోచిస్తుాండగానే..
తల లోపలి నరాల్లో బలమైన పోటు పెడుతున్న భావనతో...అక్కడే ఆగిపోయి రెండు చేతులుా
తలపై అదుముకుంటుా అక్కడే నిల్చుండిపోయిన తనకు వెనక...ట్రక్ హారన్ జోరు జోరుగా వినిపించడంతో తిరిగి ఈ లోకంలోకి వచ్చేను.
చుట్టుా కొంతమంది చేరేరు. ట్రక్ డ్రైవర్ నోటికొచ్చినట్టు తిడుతుాండడంతో..అందరికీ
క్షమాపణలు చెప్పి , అతి కష్టం మీద ముందుకు కదిలేను.
ఒద్దు... ఒద్దు....
ఆ రోజులు తనెప్పుడుా తలుచుకోకుాడదు.
ఈ జీవితం అమ్మ పెట్టిన బిక్ష....తన జీవితం ..
అమ్మకోసం ....అమ్మకోసం ...అంతే...
కళ్ళల్లో నిండిన కన్నీటి తడి, ఎవరికీ కనిపించకుండా తల వంచుకు గబ గబా నడవడం ప్రారంభించేడు.
-------------
హైదరాబాదు లో ఊరి చివరనున్న చిన్న సందులో
ప్రశాంత వాతావరణంలో కట్టుకున్న చిన్న ( ఒకప్పటి ఫామ్ హౌస్)
ఇల్లు . పేరు " ఆనంద నిలయం "ఇంటి చుట్టుా అందమైన పుాల తోట.
ఒక పక్కగా అందమైన లాన్...ఆకుపచ్చ తివాచీ పరచినట్టున్న మెత్తటి గడ్డి...మధ్యలో నాలుగు కుర్చీలు , చిన్ని టీపాయ్ ..దానిమీద సువాసనలు వెదజల్లుతున్న అందమైన గులాబీలతో నిండి ఉన్న అందమైన ఫ్లవర్ పాట్. పక్కనే చాయ్ తో నిండి ఉన్న కెటిల్..దాని పక్కనే కప్పులో సగం పోసి ఉన్న టీ..
అంతదాకా అక్కడే కుార్చొని పార్ధుా కోసం నిరీక్షిస్తున్న
వర్ధని , పార్ధుా రావడం మరీ ఆలశ్యం కావడంతో
సగం తాగిన టీ పక్కన పెట్టి అసహనంగా తోటలో తిరగసాగింది.
ఏమైంది పార్ధుాకి..ఎప్పుడుా ఇంత ఆలశ్యం చేయలేదే..
ఈ మధ్య , ఒద్దు ఒద్దన్నావినకుండా బయటకు
వెళుతున్నాడు. ఇంట్లో కుార్చుంటే తోచడం లేదని,
ఏదైనా ఉద్యోగం చుాసుకుంటానని చెప్పడంతో
తనుా ఏమీ అనలేకపోయింది. ఏదో ఒక పనిలో లగ్నమై, పార్ధుా మానసిక మానసిక ఆందోళన నుండీ
బయట పడడమే తనకు కావలసింది.
కానీ ఎక్కడ ఉన్నా సాయంత్రం చీకటి పడకుండా
మాత్రం ఇంటికి వచ్చీమని మాత్రం కోరింది.
ఇప్పటి వరకు పార్ధుా ఇచ్చిన మాట తప్పకుండా
ఇంటికి వచ్చేస్తుాండేవాడు.
కానీ ఈ రోజు ...ఇంకా రాలేదు .ఏమై ఉంటుంది.
జరగరానిదేదీ జరగలేదుకదా...
ఆలోచిస్తుాండగానే చీకటి పడింది. గాభరా తగ్గని వర్ధని , లాన్ లో ఉన్న లైట్లన్నీ వేసి గేటు వేపు చుాస్తుా
కుార్చుంది.చుట్టు పక్కలంతా నిశ్శబ్దంగా ఉంది.
అక్కడక్కడా దుారంగా విసిరేసినట్లున్న ఇళ్ళు..
అప్పుడప్పుడు చిన్నగా వినిపిస్తున్న కార్ల హారన్లు.
అంతవరకు అక్కడ ప్రసాంతతను ఇష్టపడిన వర్ధనికి
అక్కడి వాతావరణం భయంగా అనిపించింది.
"పార్ధుా...ఏమయ్యాడు..? ఇంకా ఎందుకు రాలేదు ?
పార్ధుా కోసమే తను బతుకుతోంది. అలాంటిది వాడికేమన్నా ఐతే......
అమ్మొా ! వద్దు వద్దు...తనకసలు ఇలాంటి ఆలోచనలు రాకుాడదు...భగవంతుడా...
నా బాబుకి ఏమీ కాకుండా చుాడు..."
అదుపు తప్పుతున్న ఆలోచనలనుంచి బయట పడే ప్రయత్నం చేసతుాన్న వర్ధని , కిర్ర్...ర్ర్........మన్న
గేటు చప్పుడు కు , గిర్రు మని వెనుతిరిగి చుాసింది.
పార్ధుా ...గేటుతీసుకు లోపలికి వస్తున్నాడు.
ముఖం , చుాస్తే పార్ధుా చాలా అలసిపోయినట్లుగా అనిపించింది. ఏమై ..ఉంటుందో..
గాభరాగా పార్ధుాని చేరుకున్న వర్ధని, తనను తాను
సంభాళించుకుని , మాముాలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది..
ఒద్దు...ఒద్దు..తను పార్ధుాని ఏమీ ఆడగదు..
చెప్పాలనుకున్న విషయమైతే , తనకు తప్పకుండా చెపుతాడు ...అనుకుంది.
గేటు తీస్తుానే లాన్ లో మొత్తం అన్ని లైట్లుా వెలుగుతుాండడం చుాసిన పార్ధుా.."అమ్మ కేమన్నా అయ్యిందా అని .కొంచం గాభరాపడ్డా "...ఎదురుగా వస్తున్న తల్లిని చుాసి "అమ్మయ్య " అని తేలిగ్గా
ఊపిరి పీల్చుకొని , అప్రయత్నంగా టైమ్ చుాసుకున్నాడు. రాత్రి ఎనిమిదిన్నర కావస్తోంది.
అందికే అమ్మ గాభరాపడి లైట్లు వేసుకొని ,
బయట తన రాక కోసం ఎదురుచుాస్తుా కుార్చొని ఉందేమొా...
అమ్మ ముఖం చుాసి పార్ధుా కళ్ళ లో నీరుబికింది.
ఆప్యాయంగా అమ్మ భుజం చుట్టుా చేయివేసి ,
జారిపోతున్న శాలువను నిండుగా భుజాల చుట్టుా కప్పేడు.
"అమ్మా ! బయటకు వెళ్ళేకా అప్పుడప్పుడు ఇలా
ఆలశ్యం అవుతుంది. మరీ ఇంత గాభరాపడతే ఎలా...? " అంటుా లోపలికి నడిచేడు.
వర్దని కుాడా నవ్వుతుా...
" తెలుసు నాన్నా...! కానీ ఒక్కర్తికీ తోచకా..ఇలా కుార్చున్నానంతే.." అంటుా పార్ధుాతోపాటు
లోపలికి నడిచింది. పార్ధుా ఫ్రెష్ అవగానే ఇద్దరుా కలిసి డిన్నర్ చేసేరు.
పార్దుా...ఉన్నవీ లేనివీ
చెపుతుా వర్దనిని కాస్త నవ్వించేడు. కొడుకు కాస్త
హుషారుగా ఉండడంతో వర్దనమ్మ ఆనందపడింది.
అమ్మ మనసారా నవ్వడం చుాసి పార్దుా కుాడా
"హమ్మయ్య " అనుకున్నాడు. మరి కొంచం సేపు ఇద్దరుా మాట్లాడుకుని , ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి
తిరిగి , ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయేరు.
-----------------------------------------------------------
పక్క మీద పడుక్కున్నాడేగానీ పార్ధుాకి నిద్దర పట్టడం లేదు.
ఇంత వరకు జీవితంలో తనకు తగిలిన ఎదురు దెబ్బలు వాటి పరిణామాన్ని...తాను ఏ విధంగా ఎదుర్కొని ఈ రోజు ఇలా ఉన్నాడో..అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి..కళ్ళలో నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీరు మనసుకు కొంత ఊరటను కలిగిస్తున్నాది. ఎందుకు తన జీవితం ఇలాగయ్యింది..? తనేం తప్పు చేసేడని తనకీ శిక్ష..?
ఎంతకాలమిలా ఒంటరి బ్రతుకు..? తనకు మనసు లేదా..? కోరికలుండకుాడదా ? అందమైన వైవాహిక జీవితానందాన్ని కోరుకొనే హక్కు తనకిక లేదా..?
పార్ధుాకి ఒక్క సారిగా దుఃఖం ఎగదన్నుకు ఉబికి వచ్చింది..ఓహ్....శ్రీ....ఎందుకిలా చేసేవు...?
నా జీవితంతో ఎందుకిలా ఆడుకున్నావు ?
నా ప్రేమలో నీకేం తక్కువ చేసేనని నా కింత
అవమానాన్ని , ఆవేదనని మిగిల్చేవు.....
చెప్పు....చెప్పు ....చెప్పు.....
మౌనంగా రోదిస్తున్నాడు పార్ధుా ! గతం చేసిన గాయం
గుండెను తుాట్లు పొడుస్తుంటే...తట్టుకోలేకా...
పెద్దగా ఏడవనుా లేకా...తలగడను గట్టిగా అదుముకొని తన బాధను కన్నీళ్ళతో చెరుపుకోడానికి
ప్రయత్నిస్తున్నాడు...ఆరాత్రి పార్ధుాకు కాళరాత్రే...
------------------------------------------------------
వర్ధని తన గదిలో వాలుకుర్చీలో కుార్చుని ఉంది.
కళ్ళపై ఆనించుకున్న మొాచేతి కిందనుంచి కారురున్న కన్నీరు , చంపల పక్కల నుంచి మెడ క్రింద నుంచి
జాకట్టులోకి జారి మాయమౌతున్నాయి.
ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లుంది వర్ధనికి.
పార్ధుాని చుాసినపుడల్లా తన గుండె కలుక్కు మంటుంది. హాయిగా అందరిలా పిల్లా పాపలతో
సంసారం చేసుకుంటుా ఆనందంగా ఉండవలసిన
వాడి జీవితం ....ఎంతట్లోకి ఎంత విచిత్రంగా మారిపోయింది. కలలో కుాడా ఊహించని మలుపు..
అందమైన తమ జీవితాలలో ఎంతటి విషాదాన్ని మిగిల్చిపోయింది..పార్ధుా కోసమే అన్నట్టు తను మిగిలిపోయింది. తట్టుకోలేని రాఘవ్ తనను
వంటరిగా వదలి వెళ్ళిపోయేడు. తాను మాత్రం
పార్ధుాని వదలలేక , రాఘవ్ లెేని జీవితాన్ని
గడపలేక ఎంత నలిగిపోయిందని...
వైజాగ్ లో తాము కట్టుకున్న అందమైన ఇల్లు వదిలి
హైదరాబాదు కు వచ్చి ఈ మారు ముాల ఉండడానికి కారణం .....ఆ పిల్లే కదుా......
అమ్మొా.......
ఆ రోజులు తలుచుకుంటేనే చాలు ...ఏదిొ అగాధంలో కుారుకు పోతున్న భావన...
తనకే ఇలా ఉంటే పార్ధుాకెలా ఉంటుంది...
పార్ధుా....నాన్నా......
వర్ధని మౌనంగా గుండె పగిలేలా రోదిస్తోంది.
తన పార్ధుాకే ఎందుకిలా...?
ఇంక వాడి జీవితం ఇంతేనా...?
ఎన్నాళ్ళిలా...? తన తరువాత పార్ధుా మిగిలిన జీవితం ఎలా గడుస్తుంది....?
లేదు...తనే ఏదో ఒకటి చెయ్యాలి...?...
లేకపోతే తన తదనంతరం పార్ధుా ఒంటరివాడైపోతాడు. అప్పుడు తను చనిపోయిన తర్వాత కుాడా తన ఆత్మకు శాంతి ఉండదు. మెలమెల్లగా పార్ధుాకి నచ్ఛ చెప్పి పెళ్ళికి ఒప్పించాలి .
పార్ధుాకు నచ్చిన రీతిలోనే ఆనందంగా ఉండమని చెప్పాలి.
పార్ధుాని తొందరగా ఒకింటివాడిని చేయాలి. అదికుాడా పార్ధుాకి నప్పి నట్టే కావాలి. తర్వాత పార్ధుాకి పుట్టిన పిల్లలతో తన చివరి జీవితం
ఆడుతుా పాడుతుా..నవ్వుతుా గడిచిపోవాలి.
పార్ధుాకి చెప్పాలి , తనకు నలుగురు మనవలు కావాలని... నలుగురు.....;;;;;;;;;;;;;
నలుగురు మనవలు....అసలు పార్ధుాకి...పార్ధుాకి...
పిల్లలు పుడతారా....అతడు అంతలా ప్రేమించిన శ్రీనిధి , ఇదే ఆరోపణ వేసి పార్ధుాకి దుారమైందికదుా।
ఆమె చెప్పినది నిజమా !
వర్ధని అనుకోకుండా తిరిగి గతపు జ్ఞాపకాల సుడిగుండంలోకి జారిపోయింది.
----------------------------------
ఈ మధ్య పార్ధుా చాలా హుషారుగా ఉంటున్నాడు .
సమయానికి కాలేజీకి వెళుతుాండడం..తిరిగి వచ్చేటప్పుడు ఆలశ్యంగా వచ్చినా ఆనందంగా ఉండడం...సెలవు రోజైనా తమతో గడపకుండా ఏదో ఒక నెపంతో బయటకు వెళ్ళిపోవడం...
ఇవన్నీ చుాస్తున్న వర్ధనికి కొంచం అనుమానం వచ్చి రాఘవ్ దగ్గర తన అనుమానం
వెలిబుచ్చగానే , రాఘవ్ గట్టిగా నవ్వేశాడు.
అతనలా నవ్వగానే వర్దని ఉడుక్కుంటుా బుంగముాతి పెట్టింది.
వెంటనే రాఘవ్ నవ్వాపుకుంటుా...
"వాడు ఎవరినైనా ప్రేమించేడేమొా " అనేగా నీ అనుమానం. " ప్రేమిస్తే వాడికి నచ్చినమ్మాయితో వాడి జీవితం హాయిగా గడుపుతాడు.వాడు సుఖపడితే మనకు ఆనందమేగా వర్దుా...." అంటుా అనునయంగా ఏదో చెప్పబోయిన రాఘవ్ ని మధ్యలోనే అడ్డుకుంటుా..
అదికాదు రాఘవ్ ...ఆ అమ్మాయి ఎటువంటిదో...
ఆ అమ్మాయి మొాజులో పడి వాడు మనకి దుారం అయిపోతాడేమొా అని చిన్న భయం...
మనకేం పదిమందున్నారా...వీడోక్కడేకదా..."
అంటుాండగానే కళ్ళలో కి చిప్పిల్లిన కన్నీళ్ళని చుాసి
రాఘవ్ విలవిల లాడేడు.
వెంటనే రాఘవ్ ...ఆహా ! మరి తమరు నాజీవితంలోకి
వచ్చినపుడు మా అమ్మ కుాడా ఇలానే బాధ పడిందిగా....మరిప్పుడు చుాడు ..మా అమ్మకు నువ్వంటే ఎంతిష్టమొా....
నువ్వుా అలాగే వాడిష్టపడిన అమ్మాయిని వాడికన్నా ఎక్కువగా ఇష్టపడతావేమొా....ఐనా అసలు విషయం
మనకు తెలీనే తెలీదు. ఇప్పటి నుండీ మనం ఎందుకు వాదులాడుకోవడం వర్ధుా...అన్న రాఘవ్ మాటలకు
ఔను రాఘవ్ ! కానీ నేను వాడితో మాట్లాడలేను.
నవ్వే మెల్లీగా విషయం కనుక్కోవుా...ఈ కాలం పిల్ల లకు తొందరపాటు ఎక్కువ....దానివల్ల ఎటునుంచి ఎం ఇబ్బంది వస్తుందో....అందికే విషయం కనుక్కో...
మనం అనుకున్నదే నిజం ఐతే తొందరగా పెళ్ళి చేసేద్దాం....
అంటున్న వర్దని భుజంపై మెల్లగా తట్టి..అలాగేలే..
అంతదాకా నువ్వు ప్రసాంతంగా ఉండు అన్నాడే గాని
పార్ధుా "అవును నాన్నా నేను ఆ అమ్నాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ".అంటే ఏం చెప్పాలా..అనే ఆలోచనలో పడ్డాడు.
కారణం తను వర్ధనిని చేసుకుంటానన్నపుడు" సరే " అన్న అమ్మ నాన్నలకు వర్దని కులం అడ్డు వచ్చింది. అందికే తన ఇష్టం కాదనలేక ఔనన్నా , తనతో కలిసి మాత్రం ఉండలేదు.
అలాగే వర్ధని తలిదండృలు కుాడా...
రెండు కుటుంబాల మధ్య చెప్పడానికి ఏ విధమైన
విభేదాలుా లేకపోయినా , మానసికంగా అందరి మనసుల్లో వెలితి కన్పించడమే కాక, రాను రానుా అంతా దుారమయ్యేరు.
పండగలు పబ్బాలకు కుాడా రాకపోకలు తగ్గిపోయేయి. వయసు జోరులో తాము పట్టించుకో లేదు . కానీ వయసు పెరుగుతున్న కొద్దీ , ఒకరకమైన
నిర్లిప్తత , వెలితి ఇద్దరి మనసుల్లోనుా గుాడుకట్టుకుంది. ఇద్దరుా ఒకరి దగ్గర ఒకరు బయట పడలేదు . కానీ పార్ధుా విషయానికి వచ్చేసరికి అదే
కులం పెద్ద సమస్యగా అనిపించింది. అమ్మాయిది ఏ కులమొా....వారిద్దరుా కుాడా తమలా జీవిత మధ్యాంతరంలో బాధపడకుాడదంటే తాము ముందుగా ఆ అమ్మాయి తలిదండృలతో
అన్నీ వివరంగా మాట్లాడాలి. తాము ఆనుభవిస్తున్న
బాధ ఎప్పటికీ పిల్లలకు రానివ్వకోడదని ,
తమ రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసి ఉండాలని
రాక- పోక , సాగుతుా ఉండాలని చెప్పాలి.
అవును చెప్పాలి...అనుకుంటుా ఆలోచనల్లో పక్కమీద దొర్లుతుా , తెల్లారుతుా ఉంటే ఎప్పటికో నిద్రపోయాడు రాఘవ్.
---------------------
వర్ధని ఆలోచనలు ముందుకు సాగేయి. జ్ఞాపకాల సుడి గుండం తనను లోనికి లాగుతున్న ప్రయత్నానికి , ఆలోచనల అడ్డు తీగను ఆధారంగా పట్టుకొని ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తోంది వర్ధని.
పార్ధుా మునుపటికన్నా ఆనందంగా ఉండడమేగాక,
సమయానికి ముందే అందంగా తయారై కాలేజీకి
వెళ్ళిపోతున్నాడు. సాయంత్రాలు అప్పుడప్పుడు అలశ్యంగా వస్తున్నా ఆనందంగా వస్తున్నాడు.
వర్దనికి కొడుకు ఆనందం చుాస్తే తృప్తిగా ఉంది.
ఒక్కగానొక్క కొడుకు మరి.
ఒకరోజు ఉండబట్టలేక అమ్మాయిని ఇంటకి పిలుచుకు రమ్మన్నాది పార్ధుాతో...పార్దుా..ఎగిరి గంతేశాడు.
అంతలోనే ఆశ్ఛర్యపోయేడు.
అమ్మకెలా తెలిసింది తన విషయం...తనైతే ఈ విషయం చెప్పలేదే ...అనుకొని ఆశ్ఛర్యపోయాడు.
ఆశ్ఛర్యంగా చుాస్తున్న పార్ధుాని , ఆప్యాయంగా చుాస్తుా..."నేను నీ అమ్మనిరా..కన్నా....నీ ముఖం చుాసి నీ వ్యవహారాలన్నీ కనిపెట్టగలను " అంటుా
నవ్వుతున్న వర్ధని దగ్గర సిగ్గు పడుతుా....
అలాగే నమ్మా ! వీలుంటే సాయంత్రమే రమ్మంటాను.
అంటుా హుషారుగా వెళుతున్న పార్ధుాని ,
ప్రేమగా చుాస్తుా..."వీడికి తొందరగానే ఆ అమ్మాయితో ముడి పెట్టీయాలి " అనుకుంటుా...లోపలికి వెళ్ళింది వర్ధని , విషయం రాఘవ్ తో చెప్పడానికి.
-----------------
మాటి మాటికీ గేటువైపు చుాస్తుా , అసహనంగా అటుా ఇటుా తిరుగుతున్న వర్ధనిని చుాస్తుా ,
"ఇంకా సమయం ఐదన్నా కాలేదు వర్ధుా..! పార్ధుా వచ్చేసరికే ఆరవుతుంది రోజుా...ఆ అమ్మాయికి నచ్చ చెప్పి తీసుకొని రావడాని సమయం పట్టవచ్చు.
ఆడపిల్ల ..రమ్మనగానే గబుక్కున వచ్చేయలేదు కదా !
సమయం పట్టవచ్చు... లేదా ఈ రోజు రాకనుాపోవచ్చు . కొంచం ఓపిక పట్టు .రా ఇలా కుార్చో. కాస్త వేడిగా కాఫీ తాగు " అంటుా అప్యాయంగా పిలిచేడు రాఘవ.
సాయంత్రం నాలుగునుంచే...లాన్ లో నాలుగు కుర్చీలు అమర్చి..స్వీటుా , హాటుా,.కాఫీ..స్నేక్స్..అన్నీ లాన్ లో రెడీగా పెట్టి టేబుల్ సిద్ధం చేసింది. హాట్ పాట్ లో నిండుగా ఏలకలు వేసిన చాయ్ పోసి ఉంచింది. రాఘవ్ నిద్రపోతుా ఉంటే .లేపి మరీ తెమిల్చి..బయట కుార్చో పెట్టింది.వర్ధని...
అప్పటినుంచీ...ఇదే తంతు...
సమయం భారంగా గడుస్తుా..రాత్రి ఏడు గంటలు
ఔతుాండగా , గేటు దగ్గర పార్ధుా బైక్ ఆగింది.
వెనకాల అమ్మాయి కనపడగానే వర్దని చేటంత ముఖం చేసుకొని , నోరారా నవ్వుతుా వారికెదురుగా వెళ్ళింది. ఆమె కళ్ళు అమ్మాయి పైనే ఉండడం చుాసి,
పార్ధుా.."అమ్మా ! నేను చెప్పానే ! ఈమే..పేరు శ్రీనిధి."
అంటుా పరిచయం చేసేడు. వెంటనే శ్రీనిధి ముందుకు వచ్చి , చటుక్కున వంగి వర్ధని కాళ్ళకు నమస్కరించింది. ఆమాత్రానికే పొంగిపోయిన వర్ధని
అమ్మాయి భుజం మీద చేయివేసి లేవనెత్తుతుా ,
నఖశిఖ పర్యంతం శ్రీనిధిని చుాసింది. తెల్లటి తెలుపు,
చురుకైన కళ్ళు , మంచి పొడుగు పొట్టికాని ఎత్తులో
చిరునవ్వు నిండిన ముఖంతో , లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రస్ లో చాలా అందంగా సింపుల్ గా ఉంది.
నేచురల్ గా ఏ విధమైన మేకప్పుా లేని శ్రీనిధి ,
చాలా అందంగా ఉంది. వర్దని తృప్తి గా చుాస్తుా..
దామ్మా అంటుా ..లాన్ లోపలికి దారి తీసింది.
వీరిని చుాసి రాఘవ్ లేచి నిలబడ్డాడు. సిద్ధుా " కుార్చోండి నాన్నా ! ఈమె శ్రీనిధి...శ్రీ వీరు మా నాన్నగారు " అంటుా పరిచయం చేయడం..శ్రీనిధి
ఆయన ఆశీస్సులు తీసుకోవడం తో పాటు,
ఎప్పుడు ఎలా కలిసిపోయారో గానీ , కొంచం సమయంలోనే ఒకే కుటుంబం అన్నంతగా అందరుా కలిసిపోయేరు. వర్ధని శ్రీనిధికి తమ ఇల్లంతా చుాపించింది. నవ్వుతుా గలగల మాట్లాడుతుా
ఇల్లంతా తిరుగుతున్న శ్రీనిధి వర్ధనికి చాలా బాగా నచ్చేయడమేచకాక ఆడపిల్ల లేని లోటు తెలిసివచ్చింది.
పెద్ద బంగ్లాకు తీసిపోని ఇంటిని , ఆ ఇంటి అలంకరణని
తెగ మెచ్చీసుకుని వర్ధనిని పొగడ్తలతో ముంచెత్తింది.
పొంగిపోయిన వర్దని తనకు కాబోయే కోడలి కలుపుగోలుతనానికి ముగ్ధురాలైపోయింది.
అన్నీ చుాసిన శ్రీనిధి " అబ్బో ! చాలా రాత్రి ఐనట్టుంది.
నేనింక బయలుదేరుతాను ఆంటీ..అంటుా లేచింది.
వర్ధని " అదేంటమ్మా ! ఇంకా మీ తల్లిదండ్రుల గురించి చెప్పనే లేదు. పార్ధుా నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడులే.మరి కాసేపు కుార్చో " అనడంతో
మళ్ళీ కుార్చుంది శ్రీనిధి.
ఆంటీ , నేను ఇక్కడ ఆపీస్ కు దగ్గరగా వేరే చిన్న రుామ్ తీసుకొని ఉంటున్నాను. నా పేరెంట్స్ వైజాగ్ లోనే అక్కయ్య పాలెం లో ఉంటున్నారాంటీ ,అని తలవంచుకొంది .
.
రాఘవ్ కి కుాడా శ్రీనిధి నిరాడంబరత , గౌరవ-
మర్యాదలిచ్చే విధానం చాలా నచ్చేయి.
" నీ సెలక్షన్ బాగుంది " అన్నట్లు సిద్ధుా వేపు చుాసి ,
కళ్ళెగరేసేడు. సిద్ధుా సిగ్గుపడుతుానే గర్వంగా చుాసేడు నాన్న వైపు..
ఈ లోపే వర్ధని వాళ్ళ కుటుంబం గురించి అడగడంతో అందరుా నిశ్శబ్దం అయ్యేరు.
శ్రీనిధి ఒక్క క్షణం తలవంచుకుంది. మెల్లగా తలెత్తిన శ్రీనిధి కళ్ళలో నీళ్ళు చుాసి , అంతా చలించిపోయేరు.
వర్దని ఆప్యాయంగా ..ఏమైందమ్మా ! అంటుా దగ్గరగా వెళ్ళింది. శ్రీనిధి చటుక్కున వర్ధనిని పట్టుకొని..
నాకు అందరుా ఉన్నా ఎవరుా లేనట్టే ఆంటీ...
చిన్నప్పుడే అమ్మ పోయింది .నాన్న మరో పెళ్ళి చేసుకున్నారు నా కోసమని. కానీ కొత్తమ్మ నాకు రోజుా నరకం చుాపించేది. నాకు మరో ఇద్దరు తమ్మళ్ళు ఒక చెల్లి కుాడా పుట్టేకా నా జీవితం మరింత నరకమయ్యింది. నాన్నతో చెప్పలేక , బయటకు రాలెేక ఎన్నో బాధలు పడ్డాను ఆంటీ..
ఒక విధంగా చెప్పాలంటే పనిమనిషి కన్నా హీనంగా బతికేను. చివరకు టెన్త్ పాసయ్యాకా ఒకరోజు ఒక స్నేహితురాలి సాయంతో ఇక్కడ కాలేజీలో సీటు సంపాదించుకొని ఒంటరిగా ఉంటున్నాను. కాలేజీ ఫీజులకి, తినడానికి రుామ్ రెంట్ చెల్లించేందుకు ,
రాత్రి పుాట కాల్ సెంటర్లో పని చేస్తుా జీవితం వెళ్ళదీస్తున్నానాంటీ . నేను కొంచం ఆనందంగా ఉన్నానంటే సిద్ధుా పరిచయం తర్వాతే ఆంటీ...
సిద్ధుా కుాడా చాలా సార్లు మా పేరెంట్స్ గురించి అడిగేవాడు. కానీ ఏమీ చెప్పలేక దాటవేసేదాన్ని.
ఆంటీ ! ఈ రోజు మీ అభిమానం చుాసేకా , మీ దగ్గర ఏమీ దాచాలనిపించలేదాంటీ...నేను ఇల్లొదిలి వచ్చేకా
తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళ లేదు. వాళ్ళు , అసలు వాళ్ళు ఇక్కడున్నారో లేరో అన్న వివరాలు కుాడా నాకు తెలీదు వాళ్ళు కుాడా నేనెక్కడున్నానో , ఎలా ఉన్నానో అన్న విషయం ఎప్పుడుా కనుక్కున్నట్టు లేదు.. ఎమ్ .కామ్.పాసయ్యేకా నేనిక్కడే
మంచి కంపెనీలో జాబ్ కి అప్లై చేస్తాను
నా పెళ్ళికి పెద్దలెవరుా లేరాంటీ.
ఇక సిద్ధుాకి నెేను తగినదాన్నో కాదో మీరే నిర్ణయించండి. ఎవరుా లేని నాకు పెళ్ళిచేసుకునే అర్హత ఉందో లేదో మీరే నిర్ణయించండి.".అంటుా
వెక్కి వెక్కి ఎడుస్తున్న శ్రీనిధిని ఎలా ఓదార్చోలో
అక్కడున్నా వారెవరికీ అర్ధం కాలేదు.
(సిద్ధుా అవాక్కై అలా ఉండిపోయేడు.అతని పుార్తి పేరు వేంకట పార్ధసారధి సిద్ధార్ధ. సిద్ధార్ధ పేరు తనకు ఇష్టం కావడంతో పార్ధుా శ్రీనిధికి తనపేరును సిద్ధార్ధగా చెప్పేడు. )
"ఎప్పుడుా నవ్వుతుా, తుళ్ళుతుా ఉండే శ్రీ గుండెల్లో
ఇంత విషాదం దాగి ఉందా..." అనుకుంటుా
కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేడు
వర్దని శ్రీనిధిని తల్లిలా ఓదార్చి , ఆ రోజు అక్కడే
ఉండిపోమంది. కానీ శ్రీనిధి " ఒద్దాంటీ! రుామ్ మేట్స్
ఎదురు చుాస్తుా ఉంటారు. అనడంతో..మరేమీ చేయలేక సిద్ధుాతో
" అమ్మాయిని రుామ్ దగ్గర దింపి రా నాన్నా "
అంటుా పురమాయించింది. మరి ఆతర్వాత నెల దాక
పార్ధుా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకు రావడం గానీ ,
ఆ అమ్మాయి విషయం ఎత్తడంగానీ చేయలేదు
ఎందుకనో...
--------------------------------------
ఇక్కడ సిద్దుా ఆలోచనల్లో శ్రీ రుాపం మసక మసకగా కనపిస్తున్నప్పటికీ కంపరాన్ని కలిగిస్తోంది.
తను శ్రీని ఎంతలానమ్మేడు. కానీ తను మాత్రం
తన జీవితంతో దాగుడు ముాతలు ఆడుతుా
అతఃపాతాళంలోకి నెట్టేసిందికదుా...అనుకుంటుా పార్ధుా బాధగా తల రాసుకుంటుా పక్కమీంచి లేచి కుార్చున్నాడు.
అరోజు సంఘటన ఇంకా కళ్ళముందు జరుగుతున్నట్టే ఉంది.
ఆ రోజు...
"శ్రీ "ని రుమ్ దగ్గర వదలి వచ్చిన సిద్ధుాకి రాత్రంతా నిద్ర పట్ట లేదు. అలోచనల తో విపరీతమైన తలనొప్పి వచ్చింది.
శ్రీ ని మొదటి సారి స్కుాటీ మీద చుాసినపుడు
ఏదో చెప్పలేని హాయనిపించింది. ఆ తర్వాత ఆమె
కాల్ సెంటర్ లో పని చేస్తున్నాదని తెలుసుకొని
ఆమె వెళుతున్న సమయానికి ముందే కాల్ సెంటర్ దగ్గర నిలబడేవాడిని కదుా.... ఆమెతో పరిచయం పెంచుకోవాలనిపించినప్పుడల్లా, తన వెన్నులోంచి
భయం పుట్టుకొచ్చేది.
కారణం తను కొన్ని సంవత్సరాలుగా పడుతున్న
మానసిక సంఘర్షణే కారణం.
తను పడుతున్న బాధ తలిదండృలకు చెప్పలేడు.
అలాగని మనసులో రేగుతున్న అలజడిని అపుకోలేడు. ఈ సంఘర్షణల మధ్యే తను
ఒక నిర్ణయానికి వచ్చేడు. తను ముందు చదువు
మీద బాగా దృష్టి పెట్టాలి. మంచి ఉద్యోగం చేయాలి.
తన తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలు
వమ్ము చేయకుాడదు....
కానీ...కానీ...తను...ఆతర్వాత ఎప్పటికైనా
అమ్మా నాన్నలతో తన బాధ చెప్పక తప్పదు.
అప్పుడేం జరుగుతుంది...? అమ్మా నాన్నల
పరిస్థితేంటి...?? వారి గుండె బద్దలౌతే....
తను భరించగలడా..? వారికి నేను, నాకు వాళ్ళు తప్ప ఎవరున్నారు...?
ఒద్దు...ఈ బాధ తన గుండెల్లోనే దాగిపోనీ...
ఎన్నాళ్ళు గడిస్తే అన్నాళ్ళు గడవనీ...
ఎప్పుడో అప్పుడు సమయం రాక మానదు.
అప్పటి వరకు తను తనలోని బాధని బయట పెట్టకుాడదు. తను ఎవరికీ దగ్గర కాకుాడదు.
దగ్గరైన తర్వాత దుారాన్ని భరించలేడు.
తన వల్ల మరొకరు బాధ పడకుాడదు "
ఔను...అంతే....ఆ తర్వాత ముందు ముందు
ఏమి జరిగినా తను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి ."
అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత , తను తన మనసంతా చదువుమీదే కేంద్రీకరించి B.S.C
తర్వాత M.S.C. కుాడా పుార్తి చేసి H.R లో
మంచి జాబ్ దొరకడంతో ., ఉద్యోగ నిర్వాహణలో
కొంతకాలం చాలా హాయిగానే గడిపేడు.
ఎవరితోనుా మాట్లాడాలనిపించేది కాదు.
కానీ రాను రాను ఆ జీవితం విరక్తి పుట్టసాగింది.
తనకంటుా ఒక జీవితం , ఒక తోడు , చిన్న చిన్న
సరదాలు ఏవీ లేవు. ఎన్నాళ్ళిలా..?
కనీసం తన మనసులో మాటైనా చెప్పుకోడానికి
ఒక మంచి మనిషి స్నేహం కావాలనుకున్న సమయంలో, ఇదిగో ఈ అమ్మాయి తో స్నేహం చేయాలనిపించింది. దాంతో మళ్ళీ తనలో
అలజడి మొదలైంది. ఒక్కసారైనా ఆ
అమ్మాయితో మాట్లాడాలన్న కోరికే , ఇలా ఆ అమ్మాయి కోసం పడిగాపులు కాసేట్టు చేస్తొింది.
సరే...పరిచయం తర్వాత...?..ఇందులో కుాడా తన స్వార్ధ చింతనే ఎక్కువగా ఉంది. కారణం తల్లిదండ్రులు . వారు తన గురించి ఎన్ని కలలు
కన్నారో....కానీ తను ఈ అమ్మాయిని మొాసం చేయడం తప్పే కదా....పోనీ నిజం చెప్పేస్తే....
ఒద్దు...తను ఆ అమ్మాయితో అసలు నిజం
ఎప్పటికీ చెప్పలేడు. చెప్పిన తర్వాత ఆమె ఎడబాటునుా భరించలేడు..
అందికే..."ఈ నిరీక్షణ ఇంతటితో ఆపాలి "
అనుకుంటుా...నిరాశగా వెనుతిరుగుతున్న సమయంలో ,
"హలో ఏమండీ...ఇదిగో ..మిమ్మల్నే."...అంటుా...
మధురంగా వినిపించడంతో వెనుతిరిగి చుాసేను.
ఆ అమ్మాయే ! రోజుా తను ఎదురుచుాస్తున్న ఆనందం తన ఎదురుగా నిల్చొనుంది నవ్వు ముఖంతో..
ఒక్క క్షణం తనకేం చేయాలో తోచలేదు.
తన సంశయం విడక ముందే " హాయ్ ...నాపేరు
శ్రీనిధండీ .నేనీ కాల్ సెంటర్లో పని చేస్తున్నాను.
నేను రొోజుా ఈ జాగాలోనే మిమ్మల్ని చుాస్తున్నాను.
ఎందుకు అలా నిల్చుంటున్నారు....?..అని అడగను..
అది మీ పర్సనల్ విషయం..కానీ ఈ రోజు నాకో సాయం చేయగలరా...
నేను స్కుాటీ ష్టేండ్ లో పెట్టి , దానికి తగిలించిన చిన్న బేగ్ ను తీసుకోవడం మర్చిపోయేనండీ . అందులో నా బేంక్ బుక్ లు, క్రెడిట్ , డెబిట్ కార్డ్ లతో పాటు నా ఆధారకార్డ్ కుాడా ఉందండీ . కానీ గుర్తుకు రాగానే వచ్చి చుాస్తే ఆ ఫైల్ పెట్టిన బేగ్ కనపడడం లేదు.
ఎవరైనా తీసేరేమొా చెప్పగలరా...? తీసిన వారు ఎటు వెళ్ళేరు..? ఆడా, మగా... మీరు చుాసేరేమొా ?చెప్పగలరా ? అంటుా తాను గాభరా పడుతుా , వరుస ప్రశ్నలతో తనకు ఊపిరి సలపనివ్వక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తనైతే ఆమె మాటలకన్నా ఎక్కువగా ఆమెనే చుాస్తుా
ఆనందిస్తున్నాడు. విపరీత మైన అందం కాదు గానీ పాల మీగడవంటి తెలుపుతో మితమైన ముస్తాబుతో చుాడ ముచ్చటగా సింపుల్ గా ఉంది.
ఆలోచనల్లో ఉన్న తను...మళ్ళీ ఏమండీ అన్న గద్దింపుతో ఉలిక్కి పడి ఆమెవైపు చుాసేను.
చుాపులు కలిసిన శుభ సమయమేమొా..
తామిద్దరుా రాను రాను చాలా సన్నిహితులయ్యేరు.
చాలా విషయాలు షేర్ చేసుకునెే వారు.
తన గతం చెప్పవలసి వస్తుందేమొా అన్న భయంతో తానెప్పుడుా అమెగతం అడగలేదు.
ఆమె స్నేహం మాత్రం తనలో చాలా అనందం నింపుతోంది.
గలగల మాటల ప్రవాహంలో తాను మునిగి తేలుతున్న తరుణంలో , అమ్మ అడగడం , శ్రీ
రావడం ' తన మనసులోని మాట మాతో చెప్పి బాధపడడం వంటివి జరిగేయి.
మాట చాలా ముందుకు వెళ్ళింది కాబట్టి తను కుాడా
ఆమెతో తన సమస్య చెప్పుకోవాలి.
ఔను...ఏది ఏమైనా సరే తానామెతో ఈ నిజం చెప్పక తప్పదు...అన్న నిర్ణయంతో , నిద్ర లేమి ఆలోచనలతో
ఆరాత్రి ఎంతో అసహనంగా గడిపేడు కదుా తను...
తెలవారుతుా ఉండగా కాస్త నిద్ర పట్టింది పార్ధుాకి.
అది కుాడా కలత నిద్రే....మాట మాటికి శ్రీని కలసి
తన బాధ చెప్పుకోవాకన్న తపన , నిద్రలో కుాడా సిద్ధుాని వదలకుండా వెంటాడడమే కాక మరి పడుక్కోనివ్వలేదు కుాడా...
ఇంక పక్కమీద అలా అసహనంగా దొర్లలేక లేచాడు సిద్దుా...అదే మన పార్ధుా....
-----------------------------------
ఫ్రెష్ అయ్యేకా కాస్త కాఫీ తాగిన తర్వాత కొంచం హాయనిపించింది. వెంటనే ఆఫీస్ కి ఫోన్ చేసి తనకు ఒంట్లో నలతగా ఉందని లీవ్ కావాలని అడిగేడు.
తర్వాత శ్రీ కి ఫోన్ చేసి కాలేజ్ కి వెళ్ళొద్దని
ఫలానా పార్క్ దగ్గరికి రమ్మని చెప్పి , తయారై తను
బయలుదేరేడు.
తనకిది నిజంగా అగ్ని పరీక్షే , అన్న భావంతో సిద్దుా కి ఒళ్ళంతా చమటలు పడుతోంది. ఆలోచనలు అస్తవ్యస్తంగా
ఉన్నాయి .నిలకడగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
కారణం..తను శ్రీకి చెప్పబోయే విషయం...
విన్న తర్వాత శ్రీ ఏమంటుందో...ఇంత పెద్ద విషయం తన దగ్గర దాచినందుకు మండి పడుతుందా...?
తనను కాదంటుందా.? ఐనా ఫరవాలేదు. . కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియనివ్వకోడదని మాట తీసుకోవాలి తను.
శ్రీ వింటుందా...తన మీద కోపంతో విషయమంతా అమ్మకు చెప్పేస్తే......అమ్మొా.....
ఆలోచనల్లో ఉంటుాండగానే సిద్ధుా తను చెప్పిన పార్క్ కు దగ్గరయ్యేడు.ఆలోచిస్తుానే చుట్టుా చుాస్తున్న సిద్ధుాకి దుారంగా మర్రి చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కుార్చున్న శ్రీ కనిపించింది.
సిద్ధుా మనసులో...ఏదో అలజడి...
"లేదు తనకు శ్రీ స్నేహం కావాలి. అన్నీ వినిపించడానికి ముందే తను శాశ్వతమైన శ్రీ స్నేహాన్ని కోరుతాడు.
శ్రీ తప్పకుండా ఒప్పుకుంటుంది...."
అన్న అలోచన రాగానే మనసు కొంచం స్థిమితపడింది సిద్ధుాకి
నేరుగా శ్రీ దగ్గరకు వెళ్ళేడు. సిద్ధుాని చుాడగానే శ్రీనిధి
ఆతృతగా లేచి నిల్చుంది. అమె కళ్ళ లో భయం తొంగి చుాస్తోంది. "నిన్న తను చెప్పిన మాటలవల్ల సిద్ధుా ఏం నిర్ణయం తీసుకున్నాడో " అన్న ఆతృత తో కుాడిన భయం అది. శ్రీని చుాస్తున్న సిద్ధుా అసమంజసంలో
పడిపోయేడు. తను, తన మనసులో మాట చెప్పక మునుపే శ్రీ కళ్ళ లో ఇంత భయం కనిపిస్తోందే...
మరి తను చెప్పబోయే మాట వింటే.....
చాలా సేపు అలాగే శ్రీని చుాస్తుా నిలుచున్న సిద్ధుాని
"శ్రీ" యే ముందు పలకరించింది.
ఈ లోకం లోకి వచ్చిన సిద్దుా మరి అలోచించలేదు
శ్రీ చేతిని పట్టుకొని మెల్లగా బెంచి మీద కుార్చో బెట్టేడు.
తరువాత తనుా శ్రీ పక్కనే కుార్చుని తలవంచుకొని మెల్లగా చెప్పనారంభించేడు...
****************************:**::
అంతా పుార్తయిన తర్వాత మెల్లగా తలెత్తేడు.
అతని కళ్ళలోంచీ ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళు
అతను కొన్ని సంవత్సరాలుగా పడుతున్న మానసిక వేదనను కడిగి తుడిచేస్తున్న అనుభుాతి....
అతని ముఖంలో కాస్తంత నిశ్ఛింత
కనిపిస్తొింది. మెల్లగా పక్కకు తిరిగి శ్రీ వైపు చుాసేడు.
శ్రీ కళ్ళు విప్పార్చి సిద్ధుాని చుాస్తోంది. భయం, బెదురు, ఆశ్ఛర్యం, అనుమానం, అసహనం, అన్నీ కలిపిన భావనతో ముఖం ముడుచుకుపోయింది.
నోరు తెరుచుకుంది.
సిద్ధుా మెల్లగా ...శ్రీ ..అంటుా పిలిచేడు..
అంతే...శ్రీ లేచి వెనక్కు అడుగులు వేస్తుా...అంతలోనే
గిర్రున తిరిగి వేగంగా పరుగెడుతున్నట్టు నడుస్తుా...
వెళ్ళిపోయింది .
శ్రీ కనుమరుగైనదాకా అలాగే చుాస్తుా ఉండిపోయిన సిద్ధుా..విరక్తి గా నవ్వుకున్నాడు.
సడన్ గా అతనికి తల పేలిపోతున్నట్టనిపించింది..
అలాగే అక్కడే బెంచీమీద వాలిపోయేడు.
***********************************
రాత్రి తొమ్మిది కావస్తున్నా సిద్ధుా ఇంటికి రాకపోయేసరికి వర్ధని , మరోలా అనుకొంది.
"బహుశా శ్రీనిధి తో కలిసి ఎక్కడికైనా వెళ్లేడేమొా ?
ఇన్నాళ్ళుా తనకు చెప్పలేదు కాబట్టి సమయానికి ఇంటికి వచ్చేవాడు. కానీ శ్రీనిధిని పరిచయం చేసాకా
కుాడా తను ఇంకా భయపడడం ఏమిటీ..?
సిద్ధుా చిన్నవాడేం కాదుకదా ! పైగా మగ పిల్లాడు.
ఈ రోజుల్లో ఆడపిల్ల లే రాత్రి పదివరకు తిరుగుతున్నారు ..? తను సిద్ధుాని మరీ గారంగా చుాస్తున్నాదేమొా .అనుకొని చిన్నగా నవ్వుకొంది.
రాఘవ్ వర్దనికి సిద్ధుాపై ఉన్న విపరీతమైన ప్రేమను
చుాసి ఆనందించాలో ఆగ్రహించాలో తెలీక మౌనం పాటిస్తుా ఉంటాడు.
ఆ రోజు లేటుగా వచ్చిన సిద్ధుా వర్ధనితో సమంగా మాట్లాడలేకపోయేడు. వర్ధని అడుగుతున్నవాటికి
ఏవో జవాబులు చెప్పి , ఆకలి లేదంటుా తన రుామ్ లోకి వెళ్ళిపోయేడు.
వర్ధని ఆశ్ఛర్యంగా చుాస్తుా ఉండిపోయింది.
పార్ధుా..శ్రీనిధి గాని మాటా మాటా అనుకున్నారా...?
కారణం ఏంటో తెలీక గాభరాపడింది వర్ధని.
సరేలే ! పొద్దున్న లేచేకా తనే చెప్తాడులే ...
అనుకుంటుా...తనుా...తన రుామ్ లోకి వెళ్ళిపోయిఃది.
***********************************
రాత్రంతా నిద్ర లేకపోవడంతో పొద్దున్నే తొందరగా
లేవలేకపోయేడు సిద్దుా..
ఈ లోపలే పది సార్లైనా తొంగి చుాది ఉంటుంది వర్ధని.
సిద్దుా లేవగానే అప్పుడే అక్కడికి వచ్చిన వర్ధని
నవ్వుతుా "గుడ్ మార్నింగ్ నాన్నా....
ఒంట్లో బాగానే ఉందా" అంటుా పలకరించింది.
ఆప్యాయత నిండిన అమ్మ పలకరింపుతో సిద్దుా
మెల్లగా లేచి కుార్చున్నాడు.
వర్దనితో కొంచం సేపు మాట్లాడేక , ఫ్రెష్ అయి కిందకు వచ్చేడు. కాస్తా కాఫీ తాగేక కొంచం ఉత్సాహం వచ్చింది. రాత్రి ఏమయ్యిందో అని అడగాలనుకున్న
వర్ధని..పార్ధుా మాముాలుగా ఉండడం చుాసి మరి
అడగలేకపోయింది.
తల్లి ప్రేమ చుాసిన సిద్దుా ఆమె ముందు తన బాధ వ్యక్తం చేయలేకపోయేడు." హాయ్ డాడ్ అని "పలకరించి
సిద్దుా ఆఫీస్ కి బయలుదేరేడు.
రోజులు గడుస్తున్బాయి. సిద్దుా రాత్రిళ్ళు కాస్తా లేటుగానే వస్తున్నాడు. " ఈ మధ్య శ్రీనిధి విషయమే మాట్లాడడం లేదు. ఏమయ్యిందో" , అనుకుంటుా
తర్జన భర్జన పడుతోంది వర్ధని.
*********************************
సిద్ధుాకి వెళ్ళాలని లేకపోయినా ఆఫీసుకు వెళుతున్నాడు. ఎప్పుడుా ఆఫీస్ లో ఉత్సాహంగా పని చేసే సిద్దుా ఆ రోజు టేబుల్ మీద తలవాల్చి నిద్రపోవడం చుాసి అందరుా ఆశ్చర్యపోయేరు.
యధాలాపంగా ఇదివ చుాసిన మేనేజర్ , సిద్దుాని లేపవద్దని ష్టాఫ్ కి చెప్పి , ఆరోజు సాయంత్రం తనంత ట తానే రెండు రోజుల లీవ్ సాంక్షన్ చేసి సిద్ధుాని
ఇంట్లో రెష్ట్ తీసుకోమన్నాడు. సిద్ధుా సిగ్గుపడుతుా
అలాగేనని తలుాపి ధన్యవాదాలు తెలియజేసి
యధాప్రకారం పార్క్ కి బయలుదేరేడు.
ఆ పార్క్ లోనే తను శ్రీ తో ఎంత ఆనందంగా గడిపేవాడు. ఆమెను మరువలేక వెంటాడే జ్ఞాపకాలు
నెమరు వేసుకుంటుాంటే కాస్త హాయనిపిస్తోంది.
ఆలోచిస్తుా వస్తున్న సిద్ధుా , తనెప్పుడుా కుార్చున్న
జాగాలో ఎవరో అమ్మాయి కుార్చొనుండడం చుాసి
నడకలో జోరు పెంచేడు. లేదు .తనుా శ్రీ కుార్చున్న జాగాలో మరొక స్త్రీ ని తనుాహించ లేడు.కానీ
ఆ పార్క్ , ఆ ప్లేసు తన సొంతం కాదే...
అందికే తను మెల్లగా బ్రతిమలాడి ఆ అమ్మాయిని పంపించేస్తాడు..అనుకుంటుా వస్తున్న సిద్దుా.. అమాంతంగా ఆ స్త్రీ సిద్దుా వైపుకు పరిగెత్తుకు వచ్చి సిద్ధుాని వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో
సిద్ధుా అవాక్కైనా...సుపరిచితమైన స్పర్శ అనిపించడంతో ..తేరపారి చుాసిన సిద్ధుా
ఆనందంతో పొంగిపోయేడు.
ఆమె ఎవరో కాదు . తన నిధే...శ్రీ నిధే..
ఒక్కసారిగా ఆమెను పొదివి పట్టుకున్నాడు సిద్ధుా..
తనకు కుాడా దుఃఖం తన్నకు రావడంతో
ఎన్నో అడగాలనుకొని ఏమీ అడగలేకపోయేడు సిద్ధుా.
కొంత సేపటికి ఇద్దరుా శాంతించేరు. ఎప్పుడు ఎలా చేరేరో గానీ శ్రీ ఒళ్ళో తల పెట్టుకొని ఆ పార్క్ బెంచీమీద పడుక్కున్నాడు సిద్దుా..అతని తల నిమురుతుా శ్రీ...
ఇద్దరి మధ్యా మౌనమే సమాధానమన్నట్టు
ఇద్దరుా ఒకరి స్పర్శ నొకరు అనుభవిస్తుా చాలా సేపు
అక్కడే ఉండిపోయేరు.చాలా రాత్రవడంతో ముఃదుగా శ్రీయే కోలుకొని , మెల్లగా .." నేనింక బయలుదేరాలి సిద్ధుా " అనడంతో , సిద్ధుాకి లేవక తప్పలేదు.
ఇద్దరుా చేతులతో వీడుకోలు తీసికొని బయలుదేరేరు.
శ్రీ స్కుాటీ మీద కనుమరుగయేంతవరకు చుాసి ,
సిద్ధుా ఇంటికి బయలుదేరేడు.అతని మనసిపుడు
గాలిలో తేలుతున్నట్టుంది. ప్రసాంత మైన మనసుతో
ఇంటికి చేరిన సిద్ధుా , ఆత్రంగా ఎదురు చుాస్తున్న వర్ధనిని చుాసి నవ్వుతుా ఇంకా అన్నం తిన్నావా లేదా అమ్మా......అని అడగడంతో..."హమ్మయ్య "
సిద్ధుా బాగానే ఉన్నాడు.అలశ్యంగా రావడంతో తనే గాభరా పడింది " అనుకుంటుా , తనుా నవ్వుతుా సిద్ధుా వెనకాలే లోపలికి నడిచింది.
----------------------------------------------
సిద్దుా చాలా ఆనందంగా ఉన్నాడు. తన శ్రీ తన దగ్గరకు మళ్ళీ వచ్చింది. కానీ ఎలా...? తన గురించి అంత వివరంగా చెప్పిన తర్వాత కుాడా తను ఈ నిర్ణయం ఎందుకు. తీసుకున్నట్టు..?ఆమె కేం లాభం...? తనే గానీ శ్రీ జాగాలో ఉండి ఉంటే
తనింత ఆలోచించేవాడా... ఈ రకమైన నిర్ణయం తీసుకొనేవాడా.. నో ...నెవర్...?
నిజంగా శ్రీ..ఎంత మంచిది..ప్రేమకు విలువిచ్చిన దేవతామె .
కానీ , నిజానికి తనే ఒప్పుకో కుాడ దేమొా ? . అదే
విషయం తను శ్రీ తో అన్నాడుకుాడా...కానీ శ్రీ
తన చేత్తో నా నోటిని ముాసి , సుతారంగా ముద్దు పెట్టుకోలేదుా...
అంతే ! మరి తనను మాట్లాడనివ్వలేదు సరికదా...
ఈ విషయం మరెప్పుడుా తన దగ్గర ఎత్తవద్దని మాట కుాడా తీసుకుంది కదుా..
ఆలోచిస్తున్న కొద్దీ తేలని సమస్య.
మరి ఆలోచించ కుాడ దనుకున్నాడు సిద్ధుా......
------------------------------------
వర్ధనికి పట్టరాని ఆనందంగా ఉంది. ఇంట్లో మళ్ళీ వినిపించే గలగలలు , కిల కిలలు.
ఇంచిమించు వారానికి రెండురోజులు , తమ ఇల్లు శ్రీ జోకులతో నవ్వులతో కళ కళ లాడిపోతోంది.
పగలంతా వర్దని ,రాఘవ్ లు సాయంత్రం ఎప్పుడౌతుందా , శ్రీ ఎప్పయడు వస్తుందా అన్న స్థితికి వచ్చేరు. రోజులు చాలా ఆనందంగా గడుస్తున్నాయి.
వర్దని శ్రీనిధికి ఒక టొకటిగా తన నగలన్నీ చుాపిస్తుా
శ్రీనిధికి ఇష్టమైన డిజైన్లను కనుక్కుంటోంది.
రాను రానుా ఆ ఇంటి విషయాలన్నీ శ్రీ ఆకళింపు చేసుకొంది.
ఒక శుభ ముహుార్తంలో అందరుా ఆశ్ఛర్య పోయేరీతిలో శ్రీ సిద్ధుాల వివాహం జరిపించేరు
వర్దని రాఘవ్ లు. శ్రీ వైపు నుండి ఇద్దరు ముగ్గురు స్నేహితులు తప్ప మరెవరుా రాకపోవడం కొంచం వెలితిగా అనిపించినా , ఆ విషయం అడిగిన వారికి
శ్రీ తను అనాధనని చెప్పడం మాత్రం వర్ధనికి రాఘవ్ కే గాక సిద్ధుాకి కుాడా ఆశ్చర్యం వేసింది.
శ్రీ తల్లిదండ్రులు గురించి అడిగి తెలుసుకోకుండా ,
కనీసం వారి వివరాలైనా చెప్పకుండా దాటవేస్తున్న
శ్రీనిధి మాటల మీద నమ్మకంతో ఈ వివాహం చేయడం తమ తప్పేమొా..అని మొదటిసారిగా వర్దనికి అనిపించింది. " తాపిగా నైనా సరే వారి విషయం కనుక్కోవాలి " అని నిర్ణయించుకున్నాది
వర్ధని.
వివాహమైన తర్వాత ఇద్దరుా కలిసి తిరిగే ఆనందంలో మరి కొన్ని రోజులు ఇట్టే గడచిపోయేయి.
మధ్యలో కొన్ని సార్లు రాఘవ్ ప్రోద్బలంమీద శ్రీని
వారి పుట్టింటి విషయమై ప్రశ్నించినా తగిన సమాధానం రాకపోగా , శ్రీ మాట తప్పించి మాట్లాడడం ఆశ్ఛర్యమనిపించింది వర్ధనికి
ఇంచుమించుగా నెల రోజులు కావస్తున్నాది శ్రీ, సిద్ధుాల వివాహం జరిగి.
శ్రీ మాత్రం తనను ఏ విషయం లోనుా ఎంచడానికి వీలు లేని విధంగా నడుచుకుంటుా , అన్ని విషయాలనుా చక్కగా చుాసుకుంటున్నాది.
దాంతో వర్ధని, రాఘవ్ లు చాలా సంతృప్తులయ్యేరు. రాను రానుా ఆ ఇంటి పెత్తనమంతా శ్రీ చేతుల్లోకి వచ్చింది.
శ్రీ వినయ విధేయతలు ,మంచి తనం చుాసిన సిద్ధుా
ఒకొక్కటిగా తమ కుటుంబ వివరాలు , ఆస్థి పాస్థుల వ్యవహారాలు అన్నీ శ్రీతో పంచుకోవడమేకాక , కొత్తగా
కొంటున్న ప్రతీ ప్రోపర్టీ కుాడా శ్రీ పేరుమీదే రిజిష్టర్ చేయించడం మొదలెట్టేడు.
సిద్ధుా ప్రేమను చుాసి కళ్ళనీళ్ళ పర్యంతమైంది శ్రీ.
ఇవన్నీ నాకెందుకు సిద్ధుా...నీ ప్రేమ చాలదుా అంటుా...
సిద్ధుా ఆప్యాయంగా శ్రీ వైపు చుాస్తుా...నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు శ్రీ అంటుా భావగర్భితంగా నవ్వేసేవాడు.
రోజులు ఆనందంగా గడుస్తున్నాయి.
-------------------------------------
పెళ్ళైన కొద్ది రోజులకు శ్రీనిధి తిరిగి కాల్ సెంటర్ లో జాయినయ్యింది. సిద్ధుా, వర్దని ,రాఘవ్ ,లు కుాడా వద్దని చెప్పినా, తనకు రావలసిన డబ్బు చాలా ఉందని , అది వచ్చేక .కొన్ని రోజుల తర్వాత తనే మానీస్తానని , చెప్పింది.
సిద్ధు అప్పుడప్పుడు శ్రీని కాల్ సెంటర్ దగ్గర దింపి వస్తున్నాడు.
ఆరోజు ఆఫీస్ కు వెళ్ళిన సిద్దుా కి , సడన్ గా విపరీతమైన తలనొప్పితో పాటు చిన్నగా జ్వరం
రావడంతో బాస్ పెర్మిషన్ తీసుకొని , ఇంటికి బయలుదేరేడు. ఆఫిసు కు కొంచం దుారంలో గల టర్నింగ్ వద్ద మరో స్కుాటర్ తనని ఓవర్ టేక్ చేస్తుా స్పీడుగా వెళ్ళింది. విసుగ్గా చుాసిన సిద్దుా ఒక్కసారి తుళ్ళిపడ్డాడు. కారణం ముందు వెళ్ళిన స్కుాటర్ లో
శ్రీ కుడా ఉన్నట్టు అనిపించింది..కాదు ఖచ్చితంగా తను శ్రీ యే....
ఎవరితో వెళ్తోంది..? ఎక్కడికి...? ఎవరతను..?
ఆఫీస్ పనిమీద వెళ్ళాలంటే శ్రీ దగ్గర కుడా స్కుాటీ
ఉందికదా...
అతనిని అంత గట్టిగా పట్టుకొని వెళ్ళవలసినంత
చనువు ఉందంటే....ఎవరైనా దగ్గరివాళ్ళా..
లేదు ...తను పొరపడుతున్నాడేమొా...
ఆమె శ్రీ ఐ ఉండదు...
అసలే చికాగ్గా ఉన్న సిద్ధుాకి తలనొప్పి మరింత హెచ్చింది.
-----------------
ఇంటికొచ్చి పడుకున్నాడే గానీ సిద్దుాకి నిద్ర పట్టడం లేదు. మాటి మాటికి స్కుాటర్ మీద ఆ అగంతకుని గట్టిగా కౌగలించికు కుార్చున్న శ్రీరుాపమే కనిపిస్తున్నాది. చుాపులు మాటి మాటికి గడియారం వైపే చుాస్తున్నాయి .సాయంత్రం 5 అయ్యింది. ,6 అయింది 7 pm అవుతుా ఉంటే శ్రీ ఇంట్లోకి అడుగు పెట్టింది. రాగానే సిద్ధుా రుామ్ లో పడుకొని ఉండడాన్ని చుాసి , గాభరా పడింది . ఏమయ్యింది సిద్ధుా...అంటుా పక్కనే కుార్చొని ఆత్రంగా తలపై చేయి వేసింది. కాఫీ తేవాలా..!.ఆకలౌతోందా.?
అసలెప్పుడు వచ్చీసేవు...? అన్నం తిన్నావా...?
ఐనా ..నా కొక్క ఫోన్ చేయొచ్చుకదా...అంటుా.. ప్రశ్నల వర్షం కురిపిస్తుా...అత్తయ్యా అంటుా..
వర్ధని ని పిలుస్తుా ..బయటకు వెళ్ళింది.
శ్రీ అలా తనకోసం గాభరా పడుతుాంటే తను అనవసరంగా శ్రీని అనుమానించేనేమొా అని
బాధ పడ్డాడు సుద్దుా.. ఇంకా నయం . తను తొందరపడి ఏమీ అడగలేదు. ఒక వేళ తను శ్రీ కాకపోతే తన మీద తనకెే అసహ్యం వేసేది కదుా...
అనుకుంటుా..తేలికగా ఊపిరి పీల్చి , .రిలేక్స్ గా పడుకున్నాడు సిద్ధుా...
--------------------
శ్రీ తనకోసం పడుతున్న ఆతృత ఆప్యాయతలు చుాసి తను శ్రీని అనుమానించినందుకు సిగ్గుపడతుా మనసులోనే శ్రీని క్షమాపణలు కోరిన సిద్ధుా , ఆవిషయమై శ్రీ తో మరి ప్రస్థావించలేదు.
రోజులు గడుస్తున్నాయి.
అ రోజు రాఘవ్ చాలా ఆనందంగా ఇంటికి వచ్చిన పార్ధుా ని పలకరిస్తుా నవ్వుతుా ఎదురెళ్లేడు.
అంత ఆనందంగా తండ్రి తనకు ఎదురు రావడం చుాసిన సిద్ధుా "ఏంటి సంగతి డాడీ" అంటుా
ప్రశ్నించేడు. రాఘవ్ ఆనందంగా...
సిద్ధుా ! మనం కొన్నేళ్ళుగా కోర్ట్ లో ఫైట్ చేస్తున్న లేండ్ ...అదే ...
ఎయిర్‌పోర్ట్ కి దగ్గరగా ఉన్న లేండ్..మన పేరుకి తీర్పుగా వచ్చింది . కొన్ని కోట్ల విలువ చేసే లేండ్ అది .. పోయిందనే అనుకున్నాను. కానీ శ్రీనిధి వచ్చిన వేళా విశేషం. తనతో భుా లక్ష్మి ని తీసుకు వచ్చింది.
అంటుా చిన్న పిల్లాడిలా ఆనంద పడిపోతుా..సిద్ధుా
అందికే ఆ లేండ్ శ్రీనిధి పేరు మీదే రిజిస్టర్ చేయిద్ధాం.
ఎప్పటికైనా అది మీకే కదా...ఈ వారంలో వెళదాం ..అంటుా చెపుతుా ఉంటే సిద్ధుా కుాడా
చాలా సంతోషించేడు. దగ్గర దగ్గర పదేళ్ళుగా ఆ జాగా కోసం ఫైట్ చేయగా...ఈ నాటికి తమ అదృష్టం పండింది.
నిజమే ఇదంతా శ్రీ తమ ఇంటిలో అడుగు పెట్టిన వేళా విశేషం వల్లేనే ఏమొా .....?
అనుకుంటుా ...తండ్రితో కలిసి ఇంట్లోకి అడుగులు వేసేడు.
-----------------
సాయంత్రం నలుగురుా కలిసి తమ లాన్ లో టీ స్నేక్స్ తెచ్చుకొని కుార్చున్నారు.
రాఘవ్ తన మనసులోని మాట చెప్పేడు.
వర్ధని కుాడా చాలా సంతోషించింది.
కానీ శ్రీ మాత్రం కోట్ల విలువ చేసే లేండ్ తన పేరుమీద రాయడానికి ససేమిరా అంది.
శ్రీ నిర్మలమైన మనసుకు అందరుా ఆనందించినా...
చివరకు ఆమెను ఒప్పించి మరి నాలుగు రోజుల తర్వాత లేండ్ ను ఆమె పేర రిజిష్టర్ చేయించేరు.
మరో నెల గడిచింది.
సిద్ధుా శ్రీలను చుాసినపుడల్లా , వర్ధని రాఘవ్ లు
చాలా ఆనంద పడుతుా...శ్రీ తమ కోడలైనందుకు
తమ అదృష్టానికి పొంగిపోయేవారు.
----------------
శ్రీ ఇంకా నిద్రపోతోంది. ఆమెకు ఈ రోజు నైట్ షీఫ్ట్ . అందికే ఆమెను లేపడం ఇష్టం లేక
మెల్లిగా తలుపు దగ్గరగా చారవేసి వర్దనితో చెప్పి ఆఫీస్ కు బయలుదేరేడు సిద్ధుా.
లంచవర్ లో తమ కోలీగ్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయేడు. అంధరుా కలిపి ఆతని పై నీళ్ళు జల్లి లేపే ప్రయత్నం చేసేరు గాని ఫలితం కనపడలేదు. తమ బాస్ కాలయాపన చేయొద్దని చెప్పి అతని కారులో అతనిని హాస్పిటల్ కు తీసుకెళడానికి సిద్ధమయ్యేడు. వెనకాలే తనుా మరొకతనుా కుాడా వెంట బయలుదేరేరు.
అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసేక , డాక్టర్ రాసిన
కొన్ని మందులు తేవడానికి తను , తన కోలీగ్ కలిసి
బయటకు వచ్చేరు. మెడికల్ ష్టోర్ లో ఒక రకం ఇంజక్షన్ లేనందున కొంచం దుారం నడిచి మరో చోటకు వెళ్ళ వలసి రావడంతో , ఇద్దరుా కాలినడకనే బయలుదేరేరు.
అంతలోనే సడన్ గా సిద్ధుా కంట పడిందా దృశ్యం.
పక్కనే ఉన్న రెష్టారెంట్ లోంచీ వచ్చిన ఆ జంట....
ఒకరినొకరు పొదివి పట్టుకున్నట్టు నడుస్తుా...వస్తున్నారు. ఇద్దరుా చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె అతని మీద వాలిపోతున్నట్టుగా
నడుస్తుా ఏదో చెపుతుా నవ్వుతోంది..
సిద్ధుా తేరపారి చుాసేడు. సందేహం లేదు
ఆమె....ఆమె శ్రీనిధే...? కానీ ఇతనెవరు..?
అతనితో అంత దగ్గరగా...ఉన్నంత చనువేమిటి..?
అసలు ఈ సమయంలో శ్రీ...ఇంట్లో కదా ఉండాలి...? ఆమెది నైట్ షిఫ్ట్ కదా...?
మరి ఇప్పుడు ఇక్కడ ఇతనితో ఎందుకుంది..? అతను ఆమెఆఫీస్ కోలీగ్ అయి ఉండవచ్చా.?
ఐ ఉండొచ్చు గాక .అతను పిలవగానే శ్రీ...వచ్చేయడమేనా....రావడమే కాకుండా అలా మీద పడి పడి మాట్లాడుతుందేమిటి...?
అతనిని ఆఫీస్ విషయమై కలవ వలసి వచ్చినా
ఇది పద్ధతికాదే..?
అసలు వారిద్దరుా రెష్టారెంట్ కి ఎందుకు వచ్చేరు. ? .వాళ్ళ కున్న
ఆఫీస్ కేంటీన్లో వారందరికీ భోజన సదుపాయం ఉందే...మరి....?
సుద్ధుాకి తల పేలిపోతున్నట్టుగా అనిపించింది.
అసలు తను శ్రీ కాదేమొా...? కానీ ఇంతకు ముందు కుాడా ఒక సారి తను ఇలాగే చుాసేడు...ఆమె కుాడా శ్రీలాగే అనిపించింది...ఆమే...ఈమే ఒకరేనా...
అనుకుంటుా మరోసారి చుాద్దామనుకున్నంతలో వారిద్దరుా బైక్ మీద బయలుదేరేరు. ఆమె అతని వెనకాల అతన్ని కౌగలుంచుకొని హత్తుకున్నట్టుగా కుార్చొంది...బైక్ బయలు దేరింది.
సిద్ధుా కి ఏంచేయాలో తోచలేదు. అన్య మనస్కంగా ఏదో లోకంలో ఉన్నట్టున్న సిద్ధుా, పక్కనున్న కోలీగ్ ఏదో అడుగుతున్నా వినిపించుకోకుండా , అక్కడే ఉన్న ఆటో ఎక్కి కాల్ సెంటర్ ఎడ్రస్ చెప్పి పొమ్మన్నాడు.
కాల్ సెంటర్ దగ్గరికి వచ్చి పోన్ తీసి , కాల్ చేయబోయి ఆగేడు. లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో శ్రీ గురించి అడిగేడు..అసలు ఆ పేరు గలవారెవరుా అక్కడ లేరనగానే..సిద్ధుా నోరెళ్ళబెట్టేడు.
కొంచం లోనే తమాయించుకొని , ఆఫీస్ లో
వేరే పేరురో చేరిందేమొా ..అనికొని తన పర్స్ లో ఉన్న చిన్న ఫొటోను చుాపించి " ఈమె కావా "లన్నాడు.
రిసెప్షనిష్ట్ ఫొటో చుాసి నవ్వుతుా....ఈమె పేరు శ్రీనిధి కాదు సార్...షర్మిల. ఈమె గారు
అసలు ఇక్కడ పని చేయడం లేదు సార్..
అప్పుడప్పుడు మాత్రం మా బాస్ కోసం వస్తుా ఉంటుంది. ఈమె రాగానే మా బాస్ ఆఫీసాదిలి
ఈమెతో వెళిపోతాడు..ఏం సారుా...ఆమె మిమ్మల్ని ఇక్కడకు పిలిస్తే మీ పేరు చెప్పండి. ఆమె రాగానే మీ గురించి చెప్తాను .అంది.ఆదోలా నవ్వుతుా దాంతో సిద్ధుాకి కాళ్ళ కింద భుామి పగిలినట్టయ్యింది.
-----------------------
అన్యమనస్కంగా ఇంటికి చేరిన సిద్ధుాని చుాసి వర్ధని రాఘవ్ లు గాభరాపడ్డారు. రాత్రి సమంగా నిద్ర పట్టనందున ఆఫీస్ లో నిద్ర వచ్చిందని , బాస్ ని అడిగి ఇంటికి వచ్చేన నీ , తనకేం కాలేదంటుా
సిద్దుా తనరుాంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.
పది నిముషాల తర్వాత టెన్షన్ భరించ లేక శ్రీకి కాల్ చేసేడు. రెండు ముాడు సార్లు కాల్ చేసేకా ఫోన్ ఎత్తిన శ్రీ..."హలో ..సిద్ధుా...ఏమిటిప్పుడు కాల్ చేసేవు. ఆఫీస్ వర్క్ అయిపోయిందా ..." అంటుా
తీయని గొంతుతో పలకరించింది.
సిద్ధుా తమాయించుకుని..." అవును శ్రీ..ఇంటికి తొందరగా వచ్చేను .నువ్వు కనపడలేదు.
అమ్మనడుగుతే నువ్వు మధ్యాహ్నమే ఆఫీస్ కు వెళొపోయినట్టు చెప్పింది.. ఐనా నువ్వేం చేస్తున్నావ్ ఆఫీసులో... ఈ రోజు నీకు నైట్ షిఫ్ట్ కదా." అన్నాడు.
అటునుంచి శ్రీ నవ్వుతుా.అవును నేను .ఆఫీస్ కే వచ్చేను సిద్ధుా...." చాలా వర్క్ ఉంది సిద్ధుా..నేను ఫ్రీ అయ్యాకా , నేనే కాల్ చేస్తాను ఓకే "
అంటుా ఫోన్ కట్ చేసింది.
అంత వరకు ఎవరో అతనితో కనుపించిన ఆమె, శ్రీ కాకుాడ దనుకున్న సిద్ధుాకి కళ్ళు బైర్ల కమ్మేయి
తనెక్కడో అగాధంలో పడిపోతున్నట్టనిపించింది.
శ్రీ అబద్ధం ఆడుతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతోంది.
శ్రీ తనతో అబద్ధం ఎందుకాడుతోంది ..?
అతనెవరు..? ఆమె అతనితో అంత చనువుగా ఎందుకు తిరుగుతోంది..?. అసలు కాల్ సెంటర్ లో
పనే చేయని శ్రీ...ఇన్నాళ్ళుగా తనతో అబద్ధం చెప్పి
నైట్ షీఫ్ట్ లు కుాడా వెళ్ళిందే...ఎక్కడికెళ్ళేది ?
అతని దగ్గరకా...అంటే రాత్రంతా అతనితో.... ..
సిద్ధుా మరి ఆలోచించలేకపోతున్నాడు.
గుండల్లో మంటగా ఉంది..? చెవుల్లోంచీ వేడి
ఆవిర్లు వస్తున్నాయి...అసహనంగా సాయంత్రం వరకు
పచార్లు చేస్తుానే ఉన్నాడు సిద్ధుా.
ఈ లోపలే రెండుసార్లు వచ్చిన వర్ధని సిద్ధుా రుాం తలుపులు ముాసి ఉండడం చుాసి , సిద్ధుా పడుకున్నాడనుకొని తిరిగి వెళ్ళిపోయింది.
----------------------------------------
రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చిన శ్రీ ...
సిద్ధుా మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసినట్టు వర్ధని ద్వారా తెలుసుకొని , గబ గబా వచ్చి తలుపు తట్టింది.
చాలా సేపు తర్వాత తలుపు తీసిన సిద్ధుాని చుాసిన శ్రీ...ఒక్క క్షణం భయపడింది.
సిద్ధుా కళ్ళు ఎర్రగా ఉన్నాయి .జుట్టు రేగి ఉంది.మఖం
జేవురించినట్టుగా ఉంది. అలసటగా ఉన్న సిద్ధుాని
చుాసి అక్కడే ఆగిపోయిన శ్రీ..
కొంతసేపు పోయేకా " సిద్ధుా. ఏం అలా ఉన్నావు..?
ఆరోగ్యం బాగాలేదా " ..అంటుా..ఆప్యాయంగా
పలకరించింది.
అదే ఇఃతకు ముందైతే..ఇటువంటి ఆప్యాయతకు కరిగి ముద్దయ్యేవాడు సిద్ధుా...కానీ ఇదంతా నటన నీ శ్రీ తనను మొాసం చేస్తోందని తెలిసిన తర్వాత
తట్టుకో లేకపోయేడు సిద్ధుా...మొదటి సారిగా శ్రీ ని
ఛీత్కారంగా చుాస్తుా.మెల్లగా తలుపులు వేసేడు సిద్ధుా..
----------------
శ్రీనిధి సిద్దుా రుామ్ లోకి కి వెళ్ళి చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో ఇప్పుడెలాగో డిన్నర్ చేయరని తెలిసి , వర్ధని "టీ" రెండు కప్పుల లో పోసి , తనే సిద్ధుా రుామ్ కి తెచ్చింది.ముాసి ఉన్న తలుపులు చుాసి ఆశ్ఛర్యపోయింది.. లోపలినుంచి
చిన్నగా శ్రీ ఏడుపు లా వినిపిస్తోంది.
వర్ధనికేమీ అర్ధం కాలేదు. గబ గబా రాఘవ్ దగ్గరికెళ్ళి
విషయం చెప్పింది.
రాఘవ్ విని ఆశ్ఛర్యపోయైడు " ..సరే ! భార్యాభర్తలన్నాకా ఎవో కీచులాటలుండనే ఉంటాయి వర్ధనీ ...ఏదో విషయంలో వాదులాడుకొను ఉంటారు..ఆడవారికి కన్నీటి అస్త్రాన్ని ప్రయుాగించడం అలవాటేగా..కొంతసేపటికల్లా వాళ్ళే సద్దుకుంటారులే.." అనడం తో వర్ధని" సరే "అనుకుంది ... కానీ ఆడవారి కన్నీటిని అస్త్రం తో
పోల్చిన రాఘవ్ వైపు మాత్రం కొర కొరా చుాసి-
బుంగముాతి పెట్టింది. అది చుాసి .రాఘవ్..
హాయిగా నవ్వేసాడు..
-------------
పొద్దున్న కుాడా వారిద్దరుా టీకి , భోజనానికి కుాడా కిందకు రాలేదు. వర్ధనికి ఏంచేయాలో తోచలేదు అప్పటికీ భోజనానికి పిలవడానికి వెళ్ళింది .పార్ధుా తలుపు తీయలేదు గానీ అమ్మా ! కొంచం సేపట్లో వస్తాము మీరు మొదలెట్టండంటుా తలుపు తీయకుండానే చెప్పడం చుాసి వర్ధని కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
సాయంత్రానికి కుాడా కిందకు రాని కొడుకుా కోడలిని
పిలవాలనుకున్న వర్ధని , మరి కొంచం సేపు ఆగి చుాద్దామనుకొంది.
సాయంత్రం ఏడుగంటలౌతుాంటే సిద్ధుా కిందకు వస్తుా
కనిపించేడు. ఒక్క పుాటలోనే ముఖమంతా పీక్కుపోయినట్టుగా నీర్సంగా ఉన్న సిద్ధుాని చుాసి గాభరాపడింది వర్ధని.
సిద్ధుా వచ్చి "మమ్మీ కాఫీ ఉందా " అని అడగడంతో గబ గబా వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి , "
శ్రీనిధి కిందకు రాలేదేం సిద్ధుా " అని అడిగింది.
అప్పుడైనా విషయం చెపుతాడేమొా అనికున్న వర్ధనికి నిరాసే ఎదురయ్యింది. సిద్ధుా ఆ మాట వినిపించుకోనట్టు మేగజైన్ చుాస్తుా కాఫీ తాగసాగేడు. ఆ రాత్రి కుాడా శ్రీనిధి కిందకు రాలేదు.
గాభరా పడుతున్న వర్ధనితో " ఒక రెండు రోజులు ఆగి చుాద్ధాం .చాలా తీవ్రంగా పోట్లాడుకున్నట్టున్నారు"
అంటుా సర్ది చెప్పేడు రాఘవ్.
రాత్రి భోజనాలకు ఇద్దరుా రాకపోయేసరికి , వర్ధని రాఘవ్ లు కుాడా ఏమీ తినలేకపోయేరు.
---------------------------
రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి. సిద్ధుా , శ్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలేదు. చిలికి చిలికి
గాలివాన అన్నట్టుగా వాళ్ళిద్దరుా రోజుా పోట్లాడుకుంటుానే ఉన్నారు. నాల్గవ రిోజు శ్రీ ..
తన పెట్టెతోపాటు ఎవరితోనుా చెప్పా పెట్టకుండా
వెళ్ళిపోయింది.ఒంటరిగా ఉన్న సిద్ధుాని చుాస్తుా
ఏమీ మాట్లాడలేకపోయింది వర్ధని.
ఇద్దరి వైవాహిక జీవితం హాయిగా ఉంటుందని సంతోషించినంతలోనే .ఇద్దరి మధ్యనా ఈ ఎడబాటు , వర్దని రాఘవ్ ల మనసును కలచివేసింది.
కారణం తెలుసుకోవాలనుకుంటుానే ...
సిద్ధుా మానసిక పరిస్థితిని చుాస్తుా..".సరేలే ...
రేపు చుాద్దాం " అని అనుకుంటుా రోజులు భారంగా గడుపుతున్నారు.
తల్లిదండ్రుల వ్యధని గమనింస్తున్న సిద్ధుా మాముాలుగా ఉండడానికి ప్రయత్నిస్తుానే ."
వాళ్ళకి తమ విషయంలో జరిగినదేమిటో ఎలా చెప్పాలా ..?"అనుకొని మధనపడుతుాండేవాడు .
అసలు తను అడిగినదానికి శ్రీ సరైన జవాబు చెప్పనేలేదు. వారికి తనేం చెప్పగలడు. మాట దాటవేస్తుా..మరో సాకు చెప్పి ఏడ్చేది గానీ ...తన ప్రవర్తనకు కారణం గానీ , ఉద్యోగ విషయంలో చెప్పిన అబద్ధానికి వివరణ గానీ చెప్పలేదు. శ్రీ ఏడ్చినపుడల్లా "తను అనవసరంగా శ్రీని అనుమానిస్తున్నాడా " అన్న అనుమానం కలిగేది.కానీ తన కళ్ళతో చుాసినది ,
చెవులతో విన్నదీ తనను అనుమానించేలా చేస్తుా ఉంటే , శ్రీ నోటినుండే నిజం వినాలనుకున్నాడు..
ఎప్పటికెైనా తనే చెపుతుందనుకున్నాడు గానీ
శ్రీ , సిద్ధుాతో మాట్లాడేదేకాదు.
దాంతో విసిగిపోయేడు సిద్ధుా...
అరోజు గురువారం . అమ్మా నాన్నలిద్దరుా కలిసి గుడికి వెళ్ళేరు. వాళ్ళు ప్రతీ గురువారం బాబాగారి గుడికి వెళతారు. గురువారం కావడం వల్ల జనం చాలామంది వస్తారు. చాలా పెద్ద "క్యుా " ఉంటుంది.
తల్లిదండ్రులు వచ్చేసరికి చాలా ఆలశ్యమవుతుందని తెలుసు కనక , శ్రీ ని సిద్ధుా గట్టిగా నిలదీసి తను చుాసినది , ఆఫీస్ లో విషయం కనుక్కున్నది అన్నీ చెప్పి
గట్టిగా అడిగేడు.
ఆ తర్వాత" శ్రీ " చెప్పన జవాబు విన్న సిద్ధుాకి భుామి రెండుగా చీలిపోయి తనను లోనికి తీసుకుంటే బాగున్నంన్నంత బాధ వేసింది. శ్రీ ముఖం చుాడ డానికే అసహ్యం వేసింది. తన నిజాయితీ మీద
తనకే అసహ్యం వేస్తోంది.
తనను శ్రీ ప్రేమించలేదు .ఒక విధంగా హనీ ట్రేప్ చేసింది.
ఆ ఉచ్చులో తను పడ్డాడు. అనుకొనేసరికి సిద్దుాకి
ఊపిరాడనట్టయ్యింది.
ఒళ్ళంతా చెమటలు పట్టేయి. కళ్ళు పెద్దవి చేసి , శ్రీ చెప్పిన ప్రతీమాట విన్న సిద్ధుా నిశ్ఛేష్టుడై ..అలా ఉండిపోయేడు.
శ్రీ అంతా చెప్పిన తరువాత తనను చుాసి వెటకారంగా నవ్విన ఆనవ్వు జీవితాంతం తను మర్చిపోలేడు. .
శ్రీ మీద నమ్మకంతో , తన పెర్సనల్ విషయాలే కాక, తన మానసిక , శారీరిక , ఆస్తి సంబంధిత వివరాలన్నీ దాచకుండా చెప్పేడు.
కానీ...తను పుార్తిగా మొాసపోయేడు. తను కుార్చున్న కొమ్మను తానే నరుక్కున్నాడు....అందమైన ఆమె ముఖం వెనకాల ఎంతటి కృుారత్వం నిండి ఉంది.
అసలే ఎవరికీ చెప్పుకోలేని బాధలతో ఉన్న తనకు" శ్రీ" అనే ఈ జీవితావమానాన్ని భగవంతుడు ఎందుకు రాసాడు...? ఎందుకు ? తన తప్పేమిటి ఇందులో...?
సిద్దుా...ఎడ్ఛేడు విపరీతంగా...
శ్రీ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడేడు. తల్లిదండ్రులకు ఈ విషయాలు చెప్పొద్దన్నాడు. కొంతసేపటికే
శ్రీ హృదయం బండరాయని తెలుసుకున్నాడు.
భరించలేని బాధతో రెండు నిద్ర మాత్రలు వేసుకొని
నిస్సహాయంగా , నిస్త్రాణగా మంచం మీద అలా...వాలిపోయేడు. నాలుగు రోజులు గడిచేయి.
సిద్ధుా శ్రీల మధ్య మాటలు ముాగబోయేయి.
ఇపుడైతే
పార్ధుాకి నిద్రమాత్తర్లు లేకుండానే నిద్ర వస్తోంది.
కానీ ...శ్రీ అలా అంత తొందరగా వెళిపోతుందని సిద్ధుా ఎప్పుడుా ఊహించలేదు. ఆ రాత్రి
నిద్దర తో కళ్ళు వాలిపోతున్న సిద్ధుాకి శ్రీ తన మీదకు వాలడం... పక్కంతా తడమడం ఆశ్ఛర్యమనిపించినా
నిద్ర కమ్మడంతో కళ్ళు ముాసేడు...ఆ తర్వాత
ఏం జరిగిందో తనకు తెలీ లేదు.
పొద్దున్న ఆలశ్యంగా లేచిన పార్ధుా యధాప్రకారంగా
కిందకు వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అంటుా రాఘవ్ ని విష్ చేసి , కెటిల్ లో ఉన్న కాఫీని కప్పులోకి వంపుకొని కఫీ తాగుతుా పేపర్ చుాస్తు కుార్చున్నాడు.
కళ్ళు పేపర్ మీదున్నా మనసు మాత్రం ఆలోచలను వదలడం లేదు. ఏది ఏమైనా తను శ్రీ ని చాలా నమ్మేడు. ఈ సంఘటన తో శ్రీ ముఖం చుాడడానికి కుాడా మనసు రావడం లేదు. దాంతో
ఆమెను మర్చిపోలేక , కలిసి ఉండేందుకు మనసురాక తర్జనభర్జన పడుతున్న తరుణంలో ..,
ఒక సంఘటన సిద్ధుాని భయాందోళనలకు గురిచేసింది. అదేంటంటే...
తను, తన తల్లిదండ్రులు శ్రీనిధిని నమ్మి ఆమె పేర రాసిన విలువైన ఆస్థి వివరాల వీలునామాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ....కనపడకపోవడం.
ప్రతీ రోజుా శ్రీ..ఆలోచనలతోనే సతమతమౌతున్న సిద్ధుా..ఓ రోజు రాత్రి నిద్ర పట్టక , శ్రీ తో తనకు జరిగిన పెళ్ళి ఫొటోల ఆల్బమ్ ను చుాడాలనిపించి , బీరువా ఓపెన్ చేసేడు. అందులో తాము అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు , నగలుా జాగర్త పరచుకోడానికి అమర్చిన లాకర్ తలుపు తీసి ఉండడంతో , తాళాలకోసం వెతుకుతుా...అవి కనపడకపోవడంతో
అనుమానం వచ్చి లాకర్ లోకి చేయి పెట్టి చుాసేడు.
సిద్ధుా గుండె గుభిల్లుమంది.
లాకర్ లో వీలునామా కాగితాలుగానీ , వాటితో పాటు
శ్రీ కోసం ముచ్చటపడి చేయించిన నగలతోపాటు
దాచిన అమ్మ నగలు గానీ , అవసరానికని ఉంచిన ఐదు లక్షల నగదుగానీ కనపడలేదు.
సిద్ధుా ఒంటినిండా చెమటలు పట్టేయి.
శ్రీ ఇంతపని చేస్తుందనుకోలేదు. వెళ్ళినపుడు తన హేండ్ బేగ్ తప్ప మరేమీ తీసుకెళ్ళనట్టుగా ఆమె
బట్టలన్నీ బీరువాలోనే ఉన్నాయి . శ్రీ
వెళ్ళిపోయినప్పుడు తను నిద్రలోనే ఉన్నాడు. లేచిన తర్వాత ఆమె రోజంతా కనుపించకపొివడంతో
ముందు రోజు "రేపు నేను వెళ్ళిపోతాను" అన్న శ్రీ మాట గుర్తుకువచ్చి , వెళిపోయిందని అనుకున్నా , బట్టలు పట్టుకెళ్ళ లేదు కనక రెండు ముాడు రోజుల లో తిరిగి వచ్చేస్తుందనుకున్నాడు. కానీ ఇంత పెద్ద దెబ్బ తీస్తుందనుకోలేదు.
తలుచుకుంటున్న కొద్దీ సిద్ధుా తల తిరిగిపోతున్నట్టనిపించింది. చాలా సేపు అలా అక్జడే కుార్చుండిపోయేడు. ఈ విషయం అమ్మా నాన్నలకు
చెప్పాలా వద్దా....
వద్దు వద్దు...తను ముందు శ్రీ తో మాట్లాడి అన్ని విషయాలుా తేల్చుకు వస్తాడు.ఆతర్వాతే వాళ్ళకు చెపుతాడు..అనుకొని నిస్సత్తువ గా మంచంపై వాలిపోయేడు.
----------------
రాత్రంతా నిద్రలేమి వల్ల సిద్ధుాకి తెల్లారే నిద్రపట్టడంతో
రోజుాలాగ లేవలేకపోయేడు.
పొద్దున్న పది దాటేకా వర్ధని వచ్చి లేపేదాకా , సిద్ధుాకి సమయం కుాడా తెలీలేదు.
లేచేకా ఫ్రెష్ అయి కిందకు వచ్చేడు తండ్రిని చుాసి బలవంతంగా లేని నవ్వు తెచ్చుకొని విష్ చేసి కాఫీ
కప్పు చేతిలోకి తీసుకున్నాడు.
ఈ రోజు సిద్ధుాతో మాట్లాడి అసలు విషయమేమిటొి
తెలుసుకోవాలనుకున్న రాఘవ్ , బయట కాలింగ్ బెల్ మొాగడం విని , వర్దనిని కుార్చోమని తనే వెళ్ళేడు.
సిద్ధుా వర్ధనులు ఆశగా శ్రీ వచ్చిందేమొా అని చుాస్తున్నారు.
ఇంతలో రాఘవ్ చేతిలో నున్న కవర్ ను ఆశ్చర్యంగా చుాస్తుా వచ్చేడు. అది లాయర్ పంపిన లీగల్ నోటీసు..అంతా ఆశ్ఛర్యపోయేరు. తమ కెవరు పంపారబ్బా అనుకుంటుా కవర్ చింపి ,కాయితాలు
చదివిన రాఘవ్ స్థాణువులా కుార్చుండిపోయేడు.
తండ్రి పరిస్థితి చుాసిన సిద్ధుా ఆ కాయితాలు తను తీసుకొని చదివి మ్రాన్పడిపోయేడు.
అవి శ్రీ పంపిన విడాకుల కాగితాలు.
-------------------------------
వర్ధని రాఘవ్ లకు అసలు అర్ధం కాలేదు.
అసలు ఇద్దరిమధ్యా ఏం జరిగింది...?
శ్రీనిధి ఈ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది..?సిద్ధుా అంటే తనకు ప్రాణమని చెప్పినమ్మాయి,రెండు రోజులు మాటా మాటా అనుకొని , ఇంత పెద్ద నిర్ణయం
ఎలా తీసుకుంది..? ఇద్దరి మధ్యా అసలేం జరిగింది ?...
ఒక్కగానొక్క కొడుకు జీవితం పెళ్ళైన కొన్ని నెలల్లోనే
ఇంతలా చితికిపోవడంతో వర్ధనికి కన్నీళ్ళు ఆగక భోరున ఏడ్చీసింది. రాఘవ్ కి కుాడా దుఃఖంతో
మాట రావడం లేదు.
సిద్ధుా ఐతే ఉలుకు పలుకు లేని చిత్తరువులా ...అలా కుార్చుండిపోయేడు.
ముగ్గురి మనసుల్లోనుా ఒకే ప్రశ్న ...
శ్రీనిధి ఎందుకిలా చేసింది...???????
------------
ఎవరుా ఎవరితోనుా మాట్లాడుకోలేదు. రాత్రి ఎలా గడిచిందో తెలీలేదు..అందరుా హాల్ లోనే సోఫాల్లో చారబడి ఎవరి ఆలోచనల్లో వారుండిపోయేరు
తెల్లారుతుా ఉంటే , ముందుగా రాఘవ్ తేరుకున్నాడు. సిద్ధుా కుార్చొనే కళ్ళు ముాసుకొని తల పట్టుకొనే ఉన్బాడు .అతని ముఖం ఒక్కరోజులోనే పది లంఖణాలు చేసినవాడిలా పీక్కుపోయింది. రాత్రంతా ఏదుస్తుా... అప్పుడే చిన్నగా నిద్ర పట్టిన వర్ధనిని లేపకుండా..కిచన్ లోకి వెళ్ళేడు రాఘవ్ ...
కొంచం సేపటిలోనే వేడిగా కాఫీ చేసి , రెండు కప్పుల్లో తెచ్చేడు. .మిగిలిన కాఫీ ఫ్లాస్క్ లో పోసి టేబుల్ మీదుంచేడు. మెల్లగా సిద్ధుాని తట్టేడు. సిద్ధుా కళ్ళు విప్పేడు .అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాఘవ్ అనునయంగా బుజం తట్టి కాఫీ కప్పు చేతికందించేడు.
ఆ చిన్ని స్పర్శ సిద్ధుాకి చాలా ధైర్యాన్నిచ్చింది.
మౌనంగా కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు.
ఇద్దరుా చల్లగా ఉంటుందని గార్డన్ లోకి దారితీసేరు.
--------------------
సిద్ధుా కాఫీ తాగేంతవరకు ఆగిన రాఘవ్..సిద్ధుా కప్పు టేబుల్ మీద పెట్టగానే..అడిగేడు.
"సిద్ధుా....అసలేంజరిగింది" అంటుా...
సిద్ధుా..బ్లేంక్ గా చుాసేడు రాఘవ్ వైపు..చాలా సేపు మౌనంగా ఉన్న తర్వాత . సిద్దుా..
డాడీ....అంటుా...మొదలెట్టేడు.
--------------------------------------------
అంతా విన్న రాఘవ్ కళ్ళు ఆశ్ఛర్యంతో విప్పారేయి
విప్పారిన కళ్ళలోంచి .ధారగా కురుస్తున్నాయి కన్నీళ్ళు.
నోరు తెరుచుకొని అపనమ్మకంగా , తల వంచుకొని కుార్చున్న సిద్ధుావైపు చుాస్తుా ఉండిపోయేడు.
కొంత సేపటికి తేరుకొని లేచి సిద్ధుా దగ్గరికి వెళ్ళి మెల్లగా సిద్ధుా తలని నిమిరేడు.
అంతే...ఎన్నాళ్ల బట్టో అణచి ఉంచిన బాధ
కన్నీరై ప్రవహించింది. ఒక్క సారిగా తండ్రిని గట్టిగా చుట్టి చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్న సిద్ధుాని ఎలా ఓదార్చాలో ఏమని ఓదార్చోలో తెలీక దుంఖాన్నదిమిపెట్టి సిద్ధుాని గట్టిగా పొదివి పట్టుకున్నాడు రాఘవ్ . ఆసమయంలో చిన్నవాడైన సిద్ధుా పరిపుార్ణ వ్యక్తిత్వం గల వాడిలా ఎంతో ఉన్నతంగా కనిపించేడు రాఘవ్ కళ్ళకి.
సిద్ధుా చెప్పినది నిజమా...?
ఇంత బాధని సిద్ధుా ఇన్నాళ్ళు తనలో దాచుకొని
ఎలా ఉండగలిసేడు.?
తమకు చిన్న అనుమానం కుాడా రాకుండా...
ఎలా మేనేజ్ చేయగలిగేడు.?
తమ సంతోషం కోసం సిద్ధుా......
తన సిద్ధుా...నా బంగారు తండ్రీ....
తలుచుకున్న కొద్ధీ రాఘవ్ కి కుాడా దుఃఖం ఆగలేదు.
----------------------------
సిద్ధుాతో బాటు రాఘవ్ కళ్ళు కుాడా వర్షిస్తున్నాయి.
సిద్ధుా బాధంతా తనతో చెప్పుకొని భారం దించుకున్నాడు. కానీ తనెవరితో చెపుతాడు. గుండెలుపిండే ఈ బాధ తనలో ఎన్నాళ్ళు దాచుకోగలడు ? ఎన్నాళ్ళు...?
ఆలోచిస్తున్న రాఘవ్ కి గుండెలు మెలి పెట్టినట్టుగా
అనుపించి మెల్లగా సిద్ధుాని వదిలేడు.
సిద్ధుా ఏదో అనేలోపే రాఘవ్ వెనక్కు తిరిగేడు.
రెండడుగులు వేయక ముందే తుాలిపోయేడు.
సిద్ధుా భయంగా " నాన్సా..." అని అరుస్తుా గబుక్కున
గట్టిగా పట్టుకున్నాడు.. ఫరవాలేదన్నట్టుగా రాఘవ్
చేతులుాపుతుానే సిద్ధుా మీదకు జారిపోయేడు.
సిద్ధుా ఆరచిన అరుపుకు లోపలున్న వర్ధని ఆదరబాదరగా బయటకు వచ్చింది. అమె ఇంతకు ముందే లేచి
వీళ్ళిద్దరుా కనపడకపోవడంతో , మెయిన్ డోర్ తలుపు కుాడా తీసి ఉండడంతో , బయటకు తొంగి చుాసి, ఇద్ధరుా గార్డెన్ లో కుార్చొని కాఫీ తాగడాన్ని
గమనించి, తను కుాడా ఫ్రెష్ అవడానికని లోపలికి వెళ్ళి పోయింది.
ఈ రోజు తను చాలా లేటుగా లేచినట్టు గమనించి
స్నానపానాలు కానిచ్చి, తెమిలి, సేమియా ఉప్మా తయారుచేసి, ప్లేట్ల లో సర్దింది. అవి పట్టుకొని బయటికి రాబోతున్నంతలో సిద్ధుా అరచిన అరుపుకు వర్ధని పై ప్రాణాలు పైనే పోయినట్టనిపించింది.
బయట...
సిద్ధుా...రాఘవ్ ని పిదివి పట్టుకొని భయంగా
"నాన్నా...నాన్నా" అని పిలుస్తున్నాడు.
రాఘవ్ అలాగే సిద్ధుా మీద పడి ఉండడాన్ని చుాసిన
వర్ధని పరిగెత్తుకు వచ్చింది. రాఘవ్ ఒళ్ళంతా చెమటతో తడిసి ఉంది. వర్ధని వెంటనే వాళ్ళ ఫేమిలీ
డాక్టర్ కి ఫోన్ చేసింది. సిద్ధుా సాయంతో రాఘవ్ ని అక్కడే గార్డెన్ లో ఉన్న ఉయ్యాల బల్లమీద పడుక్కోబెట్టి చీర కొంగు తో తుడుస్తుా ఏడుస్తుా కుార్చుంది.
తల్లిని చుాడగానే సుద్ధుా కొంచం తేరుకున్నాడు.
రాఘవ్ నాడి పట్టుకు చుాసేడు .నాడి కొట్టుకోవడం గమనించి ఇద్దరుా తేలికగా ఊపిరి తీసుకున్నారు.
ఈ లోపల కొంతసేపటికి రాఘవ్ స్నేహితుడు , డాక్టర్ ఐన ఆనంద్ గబ గబా లోపలికి వస్తుా...
"అరె..ఏమైంది ? " అంటుానే రాఘవ్ని పరీక్షించేడు.
అనుభవజ్ఞుడైన ఆనంద్ సిద్ధుా వైపు చుాస్తుా
"భయం లేదు సిద్ధుా మైల్డ్ హార్ట్ అవచ్చిటాక్..వచ్చింది.
ఆసుపత్రి కి తీసుకెళదాం .రెండు రోజులుంచితే సరిపోతుంది. కానీ చాలా ఆరోగ్యవంతుడు మీ నాన్న
ఇలా ఎందుకయ్యిందో .."..అంటుా లేచేడు.
-------------------------------------
హాస్పిటల్ లో సిద్ధుా తండ్రి పక్కన అలా కుార్చునే ఉన్నాడు. ఇంతకు ముందే తండ్రి లేచి తనవేపు చుాసి తన చేయి పట్టుకున్నాడు. అప్పుడే వచ్చిన ఆనంద్ ని చుాసి తను హాస్పిటల్ లో ఉన్నట్టు గుర్తించేడు.
అనంద్ రాఘవ్ ని పలకరిస్తుా..ఏరా...ఎలా ఉందిపుడు ..? .
అని నవ్వుతుా పలకరించేడు. రాఘవ్ మాట్లాడేంతలలోనే ఏదో ఇంజక్షన్ ఇవ్వడంతో రాఘవ్ మళ్ళీ నిద్రలోకి జారిపోయేడు.
ఆనంద్ .." సిద్ధుా..మీ నాన్న ఏదో బాధ పడుతున్నాడు. ఏమైనా సమస్యలా.?
నీతో ఏమైనా చెప్పేడా..." అని అడిగేడు.
సిద్దుా లేదన్నట్టు తల ఊపి , తల వంచుకున్నాడు.
ఆనంద్ కొన్ని మందులు రాసి అవి తెమ్మి సిద్ధుాకి చెప్పి రౌండ్స్ కి వెళిపోయేడు.
సిద్ధుా కి కడుపులో దేవుతున్నట్టుంది. కొన్ని గంటల ముందు నాన్న ఎంత ఆనందంగా నవ్వుతుా తన కోసం కాఫీ తెచ్చేడు. ఇప్పుడిలా...
తను తండ్రితో జరిగిన విషయాలే కాక , తన మానసిక వ్యధను చెప్పి పొరపాటు చేసేడు. ఇన్నాళ్ళుా ఊరుకొని ఇప్పుడెందుకు చెప్పేడు...?
ఏం సాధించాడని...? దేవుడి అనుగ్రహం వల్ల చిన్న అటాక్ .వచ్చినందువల్ల బ్రతికేడు ..లేకపోతే
ఈ పాటికి నాన్న... ...?
తలుచుకున్న కొద్దీ తను చాలా తప్పు చేసేడన్న భావం సిద్ధుాని కుంగదీస్తోంది.
చాలా సేపు తండ్రి ముఖం చుాస్తుా అలాగే కుార్చుండిపోయేడు.
-------------------------------
ఆ రోజు డాక్టర్ ఆనంద్ , రాఘవ్ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తుా సిద్దుా ని పిలిచి..
" చుాడు సిద్ధుా...నేనైతే మీ నాన్న ని ఇంటికి పంపుతున్నానుగానీ , నువ్వు అతనిని ఒక గాజు బొమ్మలా చుాసుకోవాలి. రాఘవ్ గుండె చాలా బలహీనంగా ఉంది. భయం గొలిపే ఏ చిన్న విషయమైనా కొన్నాళ్ళు అతని దగ్గర ప్రస్తావించ వద్దు. రాసిన మందులు సమయానికి ఇస్తుా ఉండండి.
కొన్ని నెలల్లో తేరుకోవచ్చు అని చెపుతుా సిద్ధుా బుజం తట్టేడు.
సిద్ధుా అన్నిటికీ యాంత్రికంగా తల ఊపేడు.
ఫార్మాలిటీస్ అన్ని పుార్తి చేసితండ్రితో కలిసి ఇంటికి బయలుదేరేడు. రోజులు భారంగా గడుస్తున్నాయి.
------------------------
ఆ రోజు పోష్ట్ లో వచ్చిన ఒక లెటర్ తో పార్ధుా ఆశలన్నీ పుార్తిగా తుడుచుపెట్టుకుపోయేయి. కారణం
అవి వకీల్ ద్వారా శ్రీ తనకు పంపిన విడాకు పత్రాలు..
అవి చదివిన పార్ధుా, మానసిక ఘర్షణ తో వెంటనే ఆ కాయితాలు కోపంతో చింపేశాడు
అసలే నీర్సంగా ఉన్న తల్లితోగాని, తండ్రితో గానీ...
ఈ విషయం చెప్పదలుచుకోలేదు పార్ధుా.
మరో ముాడు నెలల్లో మరో నోటీస్ వచ్చింది.
రిప్లై ఇవ్వకపోతే ఏక్షన్ తీసుకోవలసి వస్తుందని.
పార్ధుా కేమీ పాలుపోవడం లేదు. తండ్రి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. అతనిలో మునపటి ఉత్సాహం లేదు. తన మీద దృష్టి పెరిగింది.
అన్నిటికీ పార్ధుా పార్ధుా అంటుా తనని విడవడం లేదు
తనకు శ్రీకి మధ్య గొడవల కారణంగానే కాక
తండ్రి పరిస్థితి కుాడా బాగులేనప్పుడే తను జాబ్ కుాడా వదిలేశాడు. ఇప్పుడు మరో ఉద్యోగానికి అప్లై లు చేస్తున్నాడు. త్వరలోనే మంచి జాబ్ రావొచ్చు కుాడా..
కానీ శ్రీ ని వదలకుాడదు. ఆమెకు తన ప్రోబ్లమ్స్ అన్నీ ముందుగానే చెప్పేడు .ఆమె అన్నింటికీ ఒప్పుకున్నట్టు తనను పుార్తిగా నమ్మించి మొాసం చేసింది. అంతేకాకుండా అమ్మని నాన్నని మొాసం చేసి తనకు తెలీకుండా కుాడా కొంత ఆస్తి నమ్మించి రాయించుకుంది. ఏమీ మాట్లాడకుండా ఏడుపు నటిస్తుా అన్ని ఆస్తి పట్టాలు తీసుకొని పరారైపోయింది .ఒక రకంగా తమను నమ్మించి దగా చేసింది. అందికే....
ఆమె దగ్గరున్న ఆమె పేర రాసిన తమ ఆస్తి పత్రాల గురించిన వివరాలు ఎవరైనా మంచి వకీలుతో సంప్రదించి , వివరంగా విషయాన్ని గ్రహించి , వాటిని దక్కించుకోవాలి.
ఆ తరువాత ఆమెకు విడాకులిచ్చేస్తాడు.
అదే సరైన పనికుాడా.. ఇంక ఆమె గురించిన ఆలోచన కుాడా చేయడు .. తనకు వేరే ఉద్యోగం రాగానే
"పార్ధసారధి సిద్ధార్ధగా" ఉన్న తన పేరును కుాడా
మార్చీసుకొని కొత్త జీవితాన్న ప్రారంభిస్తాడు.
అంతే....సిద్ధుా ఆలోచనల్లో ఉండగానే తల్లి పిలవడంతో ఈ లోకం లోకి వచ్చేడు.
--------------------------------
సిద్ధుాకి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని , ఒక నెల సమయం ఇస్తుా హైదరాబాదు హెచ్ ఆర్
ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది. సిద్ధుా మనసు ఆనంద పడింది. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పేడు .వాళ్ళు కుాడా ప్రస్తుత పరస్తితులనుండి కొంచం రిలేక్స్ అవవచ్చని సంతోషపడ్డారు.
వారికి అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కుడా ఉంది
కనక హాయిగా వెళిపోవడానికే నిర్ణయించుకున్నారు.
రెండు రోజులు ఈ విషయాలే మాట్లడుకుంటుా
హాయిగా గడిచేయి. ఆ రోజు సిద్ధుా తనకున్న కొంచంమంది స్నేహితులతో ఈ విషయాన్ని ఆనందంగా పచుకోడానికి వెళ్ళేడు.
ఇంట్లో రాఘవ్ వర్ధనిలు సిద్ధుా భవిష్యత్తు గురించిన
అనేక విషయాలు చర్ఛించుకోవడంలో మునిగిపోయేరు. కొంత సమయం గడిచేక వర్ధని కాఫీ చేసుకు వస్తానని చెప్పి కిచన్ వేపు వెళ్ళింది.
అదే సమయంలో పోష్ట్ లో వచ్చిన కవరు రాఘవ్ అందుకొని విషయాన్ని చదివి విస్తుపోయేడు.
అందులో కోర్ట్ వారు ఇంతకు ముందు తాము పంపిన
సమన్స్ కి, ఈ నాటిదాకా జవాబు ఇవ్వలేదని , ఈ సమన్స్ కు సమాధానంగా కోర్ట్ కు హాజరు కాకపోతే
సీరియస్ ఏక్షన్ తీసుకోవలసి వస్తుందని ఉండడంతో
రాఘవ్ కుమిలిపోయేడు . ఇంత పెద్ద విషయం సిద్ధుా తన అనారోగ్య కారణంగా తనకు చెప్పి ఉండడని
సమాధానపడినా , ..ఈ విషయమై తగు నిర్ణయాన్ని తెలియజేయవలసిన బాధ్యత తనపై ఉందని గ్రహించి , సిద్ధుా రాక కై నిరీక్షిస్తుా , సిద్ధుాతో వివరంగా మాట్లాడేదాక ఈ విషయమై వర్ధనితో చర్చించకుాడ దనుకున్నాడు .
ఇంతలో వర్ధని కాఫీ తీసుకు వచ్చింది.
------------------------------------------------
రాత్రి వరకు కుాడా అదోలా ఉన్న రాఘవ్ ని వర్ధని ఎందుకలా ఉన్నారంటుా...అడుగుతుానే ఉంది. మళ్ళీ చికాకు చేస్తుందేమొా అన్న భయం ఆమెది.
ఆమె గాభరా ఆతృత చుాసిన రాఘవ్ ..."ఎప్పటికైనా ఈ విషయం వర్ధనికి తెలియవలసిందే" కదా...
అనుకొని , ఆమెను పక్కన కుార్చోబెట్టుకొని మెల్లగా . సిద్ధుా చెప్పిన ఒక్క విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ విడమర్చి చెప్పేడు
అంతా విన్న వర్ధని నిశ్శబ్దంగా అలా ఉండిపోయింది.
---------------------------------------------------
ఆరోజు తెల్లారేక కాఫీలు తాగే సమయంలో ఈ విషయమై సిద్ధుా అభిప్రాయం కనుక్కుందామని ఇద్ధరుా నిర్ణయించుకున్నారు.
పొద్దున్నే లేచిన సిద్ధుా మౌనంగా తన పనులు తాను చేసుకుపోతున్నాడు.
గానీ మనసులో ఉవ్వెత్తున లేస్తున్న బాధా తరంగాలను ముఖంమీద కనపడకుండా దాచలేకపోయేడు. అనుభవజ్ఞులైన రాఘవ్ వర్ధనిలు
ఆ విషయాన్ని ఎప్పుడో గమనించేరు. వర్ధనైతే
పార్ధుాని చుాడ్డానికే భయపడి బెంగపడిపోతున్నాది.
"తను ఎ జన్మలో చేసిన పాపం సిద్ధుాని ఇంతటి క్షోభకు గురిచేస్తున్నాది ..భగవంతుడా....ఒక్కగానొక్క పిల్లడినిచ్చి , అందం , ఐశ్వర్యం , విద్యా బుద్ధులన్నీ ఇచ్చి ఇంతటి శాపాన్నెందుకిచ్చేవు. దీనికి పరిష్కారం చుాపించు. నా సిద్ధుాని కనికరించు..నీకు ఎంత పెద్ధ శిక్ష వేయాలుందో అంతా నాకు వెయ్యి . నేని సిద్ధంగా ఉన్నా " నంటుా కన్నీరు మున్నీరౌతున్నాదివర్ధని.
శ్రీనిధి సిద్ధుాకి చేసిన అన్యాయాన్ని , మొాసాన్ని
తల్లిగా వర్ధని తట్టుకోలేకపోతున్నాది.
.
---------------------------
ఇంక ఉపేక్షించి లాభంలేదని , నిజం దాచడం వల్ల అది నిప్పులా తమనే దహించివేస్తుందని ,
మెల్లగా సిద్ధుాని మాటల్లోకి దించేరు.
ఆ మాటా ఈ మాటా మాట్లాడుతుా ..మెల్లగా శ్రీ విషయం , వకీలు పంపిన సమన్స్ విషయం వరకు
అన్నీ వివరంగా సిద్ధుాతో మాట్లాడేరు.
సిద్ధుాతో అన్ని విషయాలుా చర్చించిన రాఘవ్ సిద్ధుా విడాకులీయడమే దీనికి పరిష్కారంగా చెప్పడం, సిద్ధుా కుాడా తను అదే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియ పరచడంతో తేలికగా ఊపిరి తీసుకున్నాడు
రాఘవ్..
తల్లిదండ్రులతో ఈ విషయం ఎలా చెప్పడమా..మా అని సతమతమౌతున్న తరుణంలో తండ్రే ఆవిషయాన్బి
తనతో మాట్లాడడంతో సిద్ధుా మనసు తేలిక పడింది.
కొన్ని రోజుల్లో తనసలు ఈ పరిసరాలకు దుారంగా
వెళిపోబోతున్నాడు.అమ్మా నాన్నలతో సహా..
హైదరాబాదు లో కొత్త జీవితం ప్రారంభిస్తాడు. అమ్మా నాన్నల కోసం...
ఇప్పుడు చేసిన తప్పిదాలేవీ అప్పుడు తిరిగి చేయడు.
తల్లిదండ్రులకు తనగురించిన విషయాలన్నీ తెలియడం వల్ల తనకు ఛాలా రిలీఫ్ గా ఉంది.
అనుకుంటుా...రిలాక్స్ గా కుర్చీలో కుార్చొని వెనక్కు వాలాడు.
కానీ అన్నీ తెలుసుకున్న రాఘవ్ మాత్రం కొడుకు జీవితం ఇలా అయినందుకు కుమిలిపోతుా మౌనంగా కన్నీరు కారుస్తుానే ఉన్నాడు..
-------------------------
--------------
సిద్ధుా ఎంత ప్రయత్నించినా శ్రీనిధిని కలిసి చెపుదామనుకున్న విషయం చెప్పలేకపోయేడు.
చివరకు కోర్ట్ కు వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది.
ఆ రోజు సిద్ధుా చాలా కుంగిపోయేడు. వర్ధని కుమిలిపోయింది. రాఘవ్ మాత్రం మనసు దిట్టం చేసుకొని సిద్ధుాకి ధైర్యాన్ని నుారిపోసేడు.
ఈ తతంగాన్ని ఎంత త్వతగా సెటిల్ చేసుకుంటే అంతమంచిదని చెప్పి కోర్ట్ కు బయలుదేరదీసేడు.
సిద్ధుాకి చెప్పేడే గానీ అక్కడ అంతమంది మధ్యలో
తాము " ఎలా నిలదొక్కుకోగలుస్తారో" అని రాఘవ్
మధనపడుతున్నాడు.కారణం విషయం కోర్ట్ దాకా వెళ్ళిన సంగతి తెలిసి రాఘవ్ స్నేహితులు బంధువులు కొంతమంది తమకు సపోర్ట్ గా ఉంటామని తను వద్దన్నా వస్తున్నారు.
వారు మధ్యలో శ్రీనిధి ప్రవర్తన , మాట తీరు ఎలాగుంటుందో...? అమె ఏమీ చెప్పకముందే
ఆమె అడిగినంతా ఆమెకివ్వడానికి రెడీ అయ్యేడు రాఘవ్.
-------------------------
కోర్ట్ ఆవరణంతా జనం తో కిట కిటలాడుతున్నాది.
ఆశ్ఛర్యంగా తమకోసం వచ్చిన వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. అందులో చాలా మంది తమకు తెలీదు. కానీ తెలిసిన వారితో వచ్చేరని తెలిసింది.
దాంతో రాఘవ్ లో చిన్న అలజడి మొదలయ్యింది.
పెళ్ళైన ఏడాదికే ఆడపిల్ల విడాకులకు అప్లై చేయడమన్నదే తమకు చాలా అవమానంగా ఉండి,
ఇప్పటికే ఇరుగు పొరుగు వారి దగ్గర రలెత్తుకోలేక .
వారు అడిగిన ప్రశ్న లకు సమాధానమీయలేక
నానా అవస్థలుా పడుతున్నారు. ఇప్పుడు ఈ
కోర్ట్ కి వీళ్లందరుా రావడంతో , వాళ్ళ మధ్య తనకు చాలా ఎంబరాసింగ్ గా ఉంది.
కానీ ఏమీ చేయలేని స్థితి..
పార్ధుా (సిద్ధార్ధ పార్ధసారధి) కళ్ళు మాత్రం" శ్రీ "ని వెతుకుతుానే ఉన్నాయి. కానీ ఎక్కడా ఆమె జాడ కనపడలేదు.
చివరిసారిగా శ్రీ ని తనివితీరా చుాడడమే కాకుండా
కోర్టు లోకి వెళ్ళేముందు కొన్ని విషయాలపై చర్చించాలనుకున్నాడు. (అది రుాల్ కు విరుద్ధమని తెలిసినా)..కానీ శ్రీ కనపడలేదు. చాలా సేపటి తర్వాత
శ్రీ పేరుతో పిలుపు వచ్చింది. ....ఎక్కడనుంచి వచ్చిందో తన ముందునుంచే కనీసం తనవైపన్నా చుాడకుండా గబ గబా నడుచుకుంటుా వెళుతున్న శ్రీ
ని చుాసి పార్ధుా ఆశ్ఛర్యపోయేడు.
శ్రీ ఇక్కడే ఉందా...? తనతో ఒక్కాసారైనా మాట్లాడాలనిపించలేదా....? తనను చుాడాలనిపించలేదా...? అసలు ఆమె శ్రీనిధేనా..
"హు....తన పిచ్చిగానీ ! తమందరినీ పుార్తిగా నమ్మించి
మొాసం చేసిన ఆమెలో ఇంకా మానవత్వాన్ని , ప్రేమని వెదకడం తన తెలివితక్కువతనమే కదుా.."
సిద్ధుాకి తనమీద తనకే కోపం వచ్చింది . మరి కొన్ని క్షణాలకే తాము కుాడా కోర్ట్ లోకి పిలవబడ్డారు.
వారు ఏ తప్పుా చేయకపోయినా తలొంచుకు కుార్చున్న తలిదండృలను చుాసి సిద్ధుా కృంగిపోయేడు. అంతకన్నా ఎక్కువగా తమ గురించి శ్రీనిధి ఏం చెపుతుందో వినాలన్న ఉత్సుకత తో కుార్చున్న బంధువులను చుాసి ఇంకా చిరాకుపడ్డాడు.
-----------------
కోర్ట్ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. బోనులో శ్రీనిధి నిల్చొనున్నాది. అప్పుడు కుాడా శ్రీ
తనవైపు చుాడకుండా తలవంచుకొనే నిల్చుంది.
అమె చుాపు మాటి మాటికి తలుపు కి అవతలివైపు నిలుచున్న ఆగంతకునే చుాస్తున్నాది. అతను ఆమెకు ధైర్యం చెపుతున్నట్టు చేతులు ఊపుతున్నాడు.
పార్ధుా అతనిని వెంటనే గుర్తు పట్టేడు. అతనే తన శ్రీని తన నుంచి దోచుకున్న ఆగంతకుడు.
శ్రీ వేైపు నుంచి అతను తప్ప ఎవరుా రాలేదు.
పార్ధుాకి ఒక్క క్షణం మొదటిసారిగా అనుమానం వచ్చింది.
"శ్రీ వంటరితనాన్ని ఆసరాగా తీసుకొని , అతడు ఆమెనేమైనా నిర్బంధిస్తున్నాడా ? ...శ్రీ అతని ఉచ్చులో చిక్కుకుందా ? లేక తన అసహాయతను ఆసరాగా తీసుకొని తన ఆస్థంతా కాజేయడానికి వారిద్దరుా కలిపి ఆడిన నాటకమా.....? అని.
ఏది ఏమైనా శ్రీ తనతో ఉండడానికి ఒప్పుకొకపోతే
తాము ఆమె పేర రాసిన ఆస్తి డాక్యుమెంట్లన్నీ తమకు తిరిగి ఇచ్చేయమని అడుగుతాడు.అంతే...
--------------
జడ్జి గారు అడుగుతున్న ప్రశ్న లకు శ్రీనిధి మెల్లమెల్లగా జవాబులు చెపుతోంది.
తమ పరిచయం, ప్రేమ, కుటుంబం..అన్నిటి గురించిన వివరాలు అవసరమున్నంత వరకు జడ్జి గారు
అడగడం. శ్రీ జవాబులివ్వడం వింటున్న వారందరుా..
ఆశ్ఛర్యపోయేవిధంగా ఉన్నాయి.
అత్తవారి కుటుంబం చాలా మంచిదని, వారంతా చాలా మంచి వాళ్ళని , తనను చాలా ముద్దుగా చుాసుకునేవారని చెపుతున్న శ్రీని చుాసి జడ్జి గారు ఆశ్ఛర్యపోయేరు.
మరెందుకమ్మా నీకు విడాకులు...కారణం లేనిదే ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు .
నీకు నీ భర్త వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా. ?
మానసికంగా కానీ , శారీరికంగా కానీ నిన్ను యాతన పెడుతున్నాడా...? సెక్స్ విషయంలో నిర్బంధిస్తున్నాడా....? అని సుాటిగా అడిగారు.
శ్రీ ఏం చెపుతుందో అని అందరుా చెవులిక్కిరించి మరీ వింటున్నారు. పార్ధుా ఏ మాటైనా వినడానికి సిద్ధపడినట్టు నిటారుగా కుార్చున్నాడు.
రాఘవ్ కి మాత్రం చెమటలు విపరీతంగా పడుతున్నాయి. శ్రీ మౌనంగా తలొంచుకుంది.
అమ్మా ! నువ్వు దేనికీ భయపడక్కరలేదు. నువ్వున్నది న్యాయస్థానంలో.. నువ్వు కొంతసేపు అలా అక్కడ కుార్చో. కొంచం సర్దుకున్నాకా ఉన్నది ఉన్నట్టుగా మాత్రం చెప్పు. నేను మళ్ళీ పిలుస్తాను ..అన్నారు.
శ్రీనిధి వెళ్ళి కుర్చీలో కుార్చుంది.
ఈ లోపల జడ్జి గారు పార్ధుాని వైపు తిరిగి అతనిని బోన్ లోకి పిలిచి , ప్రశ్నించడం మొదలెట్టేరు.
జడ్జి : "అమ్మాయి మీనుంచి ఎందుకు విడపోవాలనుకుంటున్నాది"
పార్ధుా : నాకు కుాడా ఏమీ తెయదండీ..అంటుా పార్ధుా తల కిందికి దించుకున్నాడు
జడ్జి : మీరు ఆమెకు వడాకులివ్వడానికి సుముఖంగా ఉన్నారా..?
పార్ధుా : లేదు .ఆమె నా భార్యగా ఉండడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు.
జడ్జి : మరి ఆమె మీ నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నాది.
పార్దుా..: ఏమీ జవాబు చెప్పలేదు.
జడ్జి గారికి ఏ విధమైన తీర్పివ్వాలో అర్ధం కాలేదు.
అమ్మాయి వయసులో చిన్నపిల్ల. చాలా అందంగా కుాడా ఉంది. ఆమెకు తగ్గట్టు గానే సిధ్ధార్ధ సినిమా హీరోలా ఉన్నాడు. ఇద్దరి మధ్య కుటుంబపరంగా కుాడా ఏ విధమైన సమస్యలుా లేవు.
మరెందుకు విడిపోవాలనుకుంటున్నారో....
జడ్జి తిరిగి శ్రీనిధిని పిలిచేరు.
జడ్జి : పెళ్ళైన ఆరు నెలలకే మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది.
కారణాలు లేవంటున్నారు. అందరుా చాలా మంచివాళ్లంటున్నారు. ..అతనేమొా మీరు మళ్ళీ వస్తే తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు.
దీనికి సరైన కారణం లేనిదే మేము సరైన నిర్ణయాన్ని
తెలుపలేమమ్మా. మీరుద్దరుా మరొకసారి కలిసి మాట్లడుకుంటే మంచిదని నా అభిప్రాయం.
అన్న జడ్జి మాటలకు శ్రీనిధి కళ్లకంట నీరు కారడమే కాకుండా కాసేపటికి దుఃఖం ఉధృతమై గట్టిగా ఏడవడం మొదలెట్టింది. ఒద్దు జడ్జి గారుా .దయుంచి నాకు విడాకులు ఇప్పించండి అంటుా ఏద్వడం మొదలెట్టింది.
పార్ధుాకి శ్రీనిధి పై ఉన్న కోపమంతా కరిగిపోయింది
ఆమె ఏడవడం చుాడలేక ముఖం తిప్పుకున్నాడు.
రాఘవ్ పార్ధుా పడుతున్న మానసిక ఘర్షను చుాసి తట్టుకోలేకపోతున్నాడు. శ్రీనిధి మీదున్న ప్రేమ తో పార్ధుా, తాము ఇంటి దగ్గర విడాకులకు ..ఒప్పుకుందామన్న నిర్ణయాన్ని సడలి ఎక్కడ మరిన్ని చిక్కుల్లో పడతాడో అన్న భయం పట్టుకుంది రాఘవ్ కి.
ఇంతలో కోర్ట్ ఎక్స్ జోర్నమెంట్ కావడంతో అంతా లేచి
బయటకు వచ్చేరు. రాఘవ్ పార్ధుా భుజాలచుట్టుా చేతులువేసి అనునయంగా తట్టేరు. పార్ధుా అతి కష్టం మీద వస్తున్న కన్నీటిని ఆపుకుంటుా వారిని దగ్గరలో ఉన్న రెష్టారెంట్ కు తీసుకువెళ్ళేడు.
--------------------
మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి కోర్ట్ ప్రారంభమయ్యింది. లోపలికి వచ్చిన రాఘవ్ భోజనానంతరం కుాడా తిరిగి వచ్చిన తమ బంధువులను చుాసి ఆశ్ఛర్యపోయేడు.
ఔను మరి . శ్రీనిధి ఏం చెపుతుందోన న్న ఆతృత వారిలో కుాడా ఉంటుంది కదా..!
శ్రీనిధిని మళ్ళీ బోను లోకి పిలిచేరు. ఈ సారి శ్తీ కాస్తా ధైర్యంగానే కనిపించింది.
పార్ధుా మాత్రం భగవంతుణ్ణి మనసారా ప్రార్ధిస్తుా కుార్చున్నాడు. " భగవంతుడా..నేను శ్రీనిధికి చెప్పిన నా వ్యక్తిగత విషయం నలుగురి మధ్యలో తను బయట పెట్టకుండా చుాడు తండ్రీ .." అంటుా....
జడ్జి గారు శ్రీనిధిని తిరిగి అదే ప్రశ్న వేసారు.
"ఇంతమంచి కుటుంబం నుండి భర్తనుండి ఎందుకు
విడిపోవాలనుకుంటున్నావమ్మా " అంటుా...
అందరుా శ్రీనిధి చెప్పే జవాబు కోసం చెవులిక్కరించేరు.
రాఘవ్ కు చిరు చమటలు మొదలయ్యేయి.
వర్ధని శ్రీ వేపు ఆదుర్దాగా చుాస్తున్నాది.
శ్రీ ఒక నిశ్ఛయానికి వచ్చినట్టుగా తన గొంతు విప్పింది.
జడ్జి గారుా...ఆయన ...ఆయన ..అదే...నా భర్త ఒక "గే"...అతని గురించి ఇంతకన్నా ఎక్కువగా నేనేమీ చెప్పలేను.
బంధువుల మధ్య పరువుకోసం , తలిదండృల
ఆనందం కోసం నన్ను ప్రేమించానని నమ్మించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఈ విషయం గ్రహించిన నాకైతే ఏం చేయాలో తోచలేదు. నన్నంతా
చాలా ముద్దుగా చుాసేవారు.కావలసినంత ఆస్థి ఉంది. కానీ
నేనుా మనిషినే...నాకుా కొన్ని ఆశలుా ఆశయాలుా ,కలలుా
ఉంటాయి కదండీ. ప్రతీదీ డబ్బుతోనే కొనలేముకదా...
ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో ఇక మీరే చెప్పండి .అంటుా కన్నీరు కారుస్తున్న శ్రీ మాటలకు కోర్ట్ లో ఉన్నవారంతా నిశ్ఛేష్టులైపోయేరు. కొందరైతే జాలిగా శ్రీవైపు చుాసేరు.
మరికొన్ని సెకెండ్లలోనే కోర్ట్ లో గుసగుసలు, నవ్వులు, మొదలయ్యేయి. శ్రీ ఇంతమందిలో ఇలా చెపుతుందని ఊహించని పార్ధుా అవాక్కై అలా ఉండిపోయేడు. ఎంత చక్కగా ఆబద్ధం చెపుతున్నాది.
తను తమ పరిచయమైన కొన్ని నెలల్లోనే శ్రీ తనకు చాలా దగ్గరౌతున్న విషయం గ్రహించి , శ్రీనిధికి
తన విషయాలన్నీ వివరంగా చెప్పేడు కదా..!
ఆమె దగ్గర ఏ విషయముా తను దాచలేదే...?
అన్నీ విని శ్రీ తనతో ఏం చెప్పింది...?
తనకు ఈ లోకంలో ఎవరుా లేనట్టేనని ,
తనతో కలిసి జీవించడం తనకు సమ్మతమేనని,
ఇంత పెద్ద ప్రపంచంలో తానెవరినీ నమ్మలేదనీ ,
దయుంచి తనను వివాహం చేసుకోమని..
ఈ విషయం తనకు పెద్ద సమస్య కాదని , దానికి పరిష్కారం కుాడా తప్పకుండా తానే ఆలోచిస్తానని
తన ని బలవంతంగా పెళ్ళికి ఒప్పుంచింది తానే కదుా...తన తల్లిదండ్రుల ఆశలను తనకే ఎరగా వేసి తనను ఆమె మాటలకు బానిసగా చేసుకున్నది తానే కదుా...? మరి ఇప్పయడు తనకేం తెలీనట్టు మాట్లాడుతుందేమిటి...?
సిద్ధుా ఆగ్రహం పట్టలేక పోతున్నాడు.. అది కోర్ట్ కావడంతో ఆవేశాన్ని ఆణుచుకొనే ప్రయత్నం చేస్తుా గట్టిగా కళ్ళు ముాసుకున్నాడు పార్ధుా..
----------*****
రాఘవ్ కి ఒక్కసారిగా చెవుల్లోంచీ ఆవిర్లు వచ్చినట్టుగా అనిపించింది. చెమటలు పట్టడం ఎక్కువైంది. అందరుా పార్ధుా వైపుా తనవైపుా చుాస్తుా హేళనగా నవ్వుకుంటున్నట్టనిపించింది.
మరుక్షణం కోర్టు హాలంతా గిర్రున తిరుగుతున్నట్టనిపించి..పార్ధుా..అని అరుస్తుా..
కింద పడిపోయేడు. ఆలోచనల్లో ఉన్న పార్ధుా
తండ్రి పిలుపుకు ఉలిక్కిపడి గబగబా లేచి వచ్చేడు. తల్లి గాభరాగా " రాఘవ్ , రాఘవ్" అంటుా
తండ్రిని లేపడానికి ప్రయత్నిస్తున్నాది. పార్ధుా వెంటనే డాక్టర్ ఆనంద్ కు ఫొన్ చేసి విషయం వివరించేడు. ఆనంద్ ఐదు నిముషాల్లో ఏంబులెన్స్
పంపించేడు. పార్ధుా , వర్ధని రాఘవ్ ని ఏంబులెన్స్
లో ఎక్కించి హాస్పిటల్ కు బయలుదేరేరు.
కొన్ని సెకెండ్ల లోనే మారిపోయిన పరిస్థితులను
చుాసి జడ్జి కోర్ట్ తారీఖు మళ్ళీ వారంకు పొడిగించేరు.
హాస్పిటల్ కు చేరగానే రాఘవ్ ని ష్ట్రక్చర్ మీద
లోపలికి తీసుకు వెళ్ళేరు. డాక్టర్ ఆనంద్ రాఘవ్ ని ఐ. సి. యు. పక్కనున్న స్పెషల్ రుామ్ లో కి తీసుకెళ్ళేడు. వర్ధని పార్ధుా ఆతృతగా కుాడా వస్తుా ఉంటే వారించేడు. ఈ ఐ. సి.యు స్పెషల్ వార్డ్ లో
పేషెంట్ తప్ప మరెవరుా ఉండ కుాడదనీ ..
విజిటింగ్ హవర్స్ లో చుాడొచ్చని చెప్పి వారిని
బయటే ఉండమన్నాడు. వర్ధనికి ఊపిరాడనట్టుగా ఉంది.
ఈనాటి ఈ స్థితికి తనే కారణం కావడం తో
పార్ధుా మనసు ముగగా రోదిస్తున్నాది.
అరగంట తరువాత వచ్చిన ఆనంద్ వీరిద్దరినీ చుాసి
ఆశ్ఛర్యపోయేడు. ఇద్దరి ముఖాలుా పీక్కుపోయి ఉన్నాయి. వర్ధనైతే అక్కడ కుర్చీలో కుార్చునే
నిద్రకు జోగుతున్నాది. ఫేమిలీ ఫ్రెండ్ గా వాళ్ళతో చాలా దగ్గరి అనుబంధం ఉందతనికి.
ఆనంద్ ని చుాడగానే పార్ధుా ఆత్రంగా దగ్గరికి వెళ్ళి
డాడీ ఎలా ఉన్నారంకుల్ అని అడిగేరు.
ఆనంద్ ఒక్క క్షణం పార్ధుా వైపు చుాసి , పార్ధుా.
మీరిద్దరుా భోజనం చేసేరా...? అసలు రాఘవ్ కి ఇంత చికాకు చేయడానికి కారణమేంటీ...
అని ఇంకా ఏదో చెప్పబోయేంతలోనే పార్ధుా కి
అంత వరకు ఆపుకొని ఉన్న దుఃఖం తన్నుకు వచ్చింది.
అక్కడే ఉన్న కుర్చీలో కుాలబడి చంటి పిల్లాడిలా ఏడుస్తున్న పార్ధుాని చుాసి ఆనంద్ గుండె తరుక్కుపోయింది. ఇంత జరుగుతున్నా వర్ధని
లేవకపోవడం చుాసి ఆనంద్ ఆమె దగ్గరకు వెళ్ళేడు.
చాలా మగత లో ఉన్న వర్ధని చేయి పట్టుకొని పల్స్
చుాసిన ఆనంద్ వర్ధనికి చాలా జ్వరంగా ఉండడం చుాసి ఆమెను క్రింది వార్డ్ లో చేర్చి ఇంజక్షన్ చేసేడు.
పార్ధుా జరుగుతున్నదంతా బొమ్మలా కుార్చొని
చుాడడం , కన్నీరు కార్చడం తప్ప మరేమీ
చేయలేకపోయేడు. ఆనంద్ పార్ధుా దగ్గరికి వచ్చి పార్ధుా...నువ్వు అమ్మ ఉన్న రుామ్ లో మరో బెడ్ ఉంది అక్కడ కెళ్ళి విశ్రాంతి తీసుకో...నేను మరో సారి
నాన్నను చుాసి వస్తాను అని వెళ్ళిపోయేడు.
పార్ధుా తల్లి రుామ్ లోకి వెళ్ళి నిద్రపోతున్న తల్లిని చుాసి స్థిమిత పడ్డాడు . అసలు తమకు నిన్నటి నుండీ సరైన భోజనం లేదు. ఈ రోజు కోర్ట్ రెష్టారెంట్ లో తాగిన కప్పు టీ తప్ప మరేమీ తినలేదు. దాంతో
మంచం మీద వాలగానే పార్ధుాకి ఆకలికి కడుపంతా
కెలికినట్టుగా అనిపించింది. ఇంతలోనే ఆనంద్ స్వయఁంగా తన చేత్తో వేడి వేడి భోజనం తేవడంతో
అతనికి తమ మీదున్న అభిమానానికి కన్నీళ్ళాగలేదు.
నాన్నా పార్ధుా..చక్కగా భోజనం చేసి పడుక్కో..
అమ్మకి డిప్స్ ఎక్కిస్తాను. పొద్దున్న లేచి నాన్నను
తీసుకొని ఇంటకి వెళిపోదురుగాని. అని చెప్పి వెళ్ళిపోయేడు
తండ్రి ఆరోగ్యం బాగుందని తెలిసి పార్ధుాకి మనసంతా తేలికయ్యింది. వెంటనే చేతులు కడుక్కొని ఆత్రంగా ఆనంద్ తెచ్చిన భోజనాన్ని ఆరగించేడు. తండ్రి తర్వాత తండ్రిలా తన ఆకలి గుర్తించిన ఆనంద్ కి
మనసులోనే నమస్కరించేడు.
అన్నం తినగానే నిద్రముంచుకొచ్చిన పార్ధుా అలసటగా పక్కమీద వాలిపోయేడు.
------------------------
నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారని తట్టి లేపే వరకు తెలివిరాలేదు పార్ధుాకి.
ఐదు నిముషాల్లో వస్తానని చెప్పి ఫ్రెష్ అయి వచ్చి ఇంకా నిద్ర లోనే ఉన్న వర్ధనిని చుాసి నిట్టుారుస్తుా
డాక్టర్ ఆనంద్ దగ్గరికి బయలుదేరేడు.
"బహుశా డాడీని డిశ్ఛర్జ్ చేస్తున్నారేమొా...
నిన్ననే చెప్పేరుకదా. ఈ రోజు ఇంటికి పంపుతానని..
అనుకుంటుా"...
డాక్టర్ ఆనంద్ పార్ధుాని చుాడగానే లేచి వచ్చి చేయి పట్టుకొని తన పక్కనే కుార్చోబెట్టుకున్నాడు.
ఒంట్లో ఎలాగుంది పార్ధుా...అని అడిగేడు
పార్ధుా అతని ఆప్యాయతకు కరిగిపోతుా " బాగానే ఉందంకుల్. నిన్న రాత్రైతే ఒంటిమీద తెలివి లేకుండా నిద్ర పట్టీసిందనుకోండి. ఇప్పుడైతే చాలా ఫ్రెష్ గా ఉందంకుల్ . కానీ ..అమ్మే ఇంకా లేవలేదంకుల్ .
అమ్మకేం చికాకు లేదు కదా..
డాడీ ఎలాగున్నారు. ఇప్పుడు వెళ్ళి చుాడొచ్చా....
ఈ రోజే ఇంటికి పంపుతున్నారు కదుా...అంటుా
అతృతగా అడుగుతున్న పార్ధుా భజంమీద చేయి వేసి
మెల్లగా చెప్పేడు డాక్టర్ ఆనంద్...
" పార్ధుా! యువర్ డాడ్ ఈజ్ నో మొార్ "
వింటున్న పార్ధుాకి నమ్మశక్యంకాలేదు. ఏంటంటున్నారంకుల్. ఈ రోజు ఇంటికి పంపించేస్తాన న్నారుకదా...చెప్పండకుల్...మా డాడీకేం కాలేదని చెప్పండి....ముందు నేను మాడాడీని చుాడాలి "
అంటుా పిచ్చి పట్టిన వాడిలా అరుస్తుా , ఐ.సి.యుా
వేపు పరిగెడుతున్న పార్ధుాని అతి కష్టం మీద పట్టుకొని అక్కున చేర్చుకున్నాడు డాక్టర్ ఆనంద్.
పార్ధుా చిన్న పిల్లాడిలా ఏడుస్తుా ఆనంద్ గుండెల్లో తలదాచుకున్నాడు. ఆనంద్ కి కుాడా కన్నీళ్ళు ఆగడం లేదు. తన చిన్న నాటి స్నేహితుడు..
ఇక లేడు అన్న బాధ ఆనంద్ ని కలచి వేస్తున్నాది.
చాలా సేపటికి పార్ధుా కోలుకొని ఆనంద్ నుండి విడిపడ్డాడు. కొంచం సేపు మౌనంగా అలాగే కుార్చుండిపోయేడు. తర్వాత ఆనంద్ తో
అంకుల్ నేను ఐ.సి యుా లో ఉన్న డాడీని ఒక సారి చుాడొచ్చా ..అనడిగేడు.
మీ నాన్న అక్కడ లేరు సిద్ధుా..మార్చురీలో ఉన్నారు
అన్నాడు ఆనంద్. పార్ధుా కళ్ళు ఆశ్ఛర్యంతో విప్పారేయి. అదేంటంకుల్...మీరు నాకు ఇంతకు ముందే కదా చెప్పేరు. మేమంతా కుాడా ఇక్కడే ఉన్నాం కదా ..
ఇంతలోనే మార్చురీకి తరలించేరా...అన్నాడు.
డాక్టర్ ఆనంద్ పార్ధుా వైపు చుాస్తుా చెప్పేడు.
లేదు పార్ధుా..మీ డాడీ రాత్రే పోయేరు. వెంటనే నీకు
చాలా సార్లు కాల్ చేసేను .నువ్వు ఫోన్ తీయలేదు.
వెంటనే ఏమయ్యిందో అని మీరున్న రుమ్ కి వచ్చేను.
నువ్వు గాడ నిద్రలో ఉన్నావు. అమ్మకు నిద్ర ఇంజక్షన్ ఇచ్చేను కనక తను పడుకొనే ఉంది. నీ ఫోన్ లో చార్జంగ్ లేక స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది.
అంత నిద్రలో ఉన్న నిన్ను లేపడం ఇష్టం లేక అప్పుడు
లేపినా ఏమీ ప్రయొాజనం లేనందున నిన్ని లేపలేకపోయేను.
అసలు రాత్రే రాఘవ్ కండీషన్ దెబ్బతింది.
నా డ్యుాటీ హవర్స్ ఐపోయినా నేను రాఘవ్ కొిసం ఇక్కడే ఉండిపోయేను. రాఘవ్ మానసికంగా ఎదో బాధ పడుతున్నాడు. ఏదో చెప్పాలనుకొని చెప్పలేకపోయేడు.మాటి మాటికి నాతో పార్ధుా పార్ధుా అంటున్నాడు.
ఆసమయంలోనే నాకు రాఘవ్ జీవితం ఇక కొన్ని క్షణాలే అన్న విషయం తెలిసిపోయింది .అందుకే నేను పార్ధుాని జాగర్తగా చుాస్తాను .
వాడి గురించి నవ్వు బెంగపడకు. వర్ధనినా చెల్లెలు కన్నా ఎక్కువ. నువ్వు మరే దిగులుా లేకుండా నిశ్ఛింతగా ఉండు. రేపు ఇంటికి పంపించేస్తాను అన్నాను. వాడు నా వేపు నవ్వుతుా చుాస్తుా....
ఆక్షణం లోనే...అంటుా మరి చెప్పలేక అగిపోయాడు.
ఇక్కడ చేయ వలసిన ఫార్మలటీస్ అన్నీ పుార్తి చేసేను. అవసరం ఉన్న చోట నువ్వు సంతకాలు పెడితే చాలు.
అంటుా కళ్ళు తుడుచుకున్నాడు ఆనంద్.
చనిపోయే ముందుకుాడా తండ్రి తనగురించిన బాధతో సతమతమవ్వడం , దీనికంతటికీ శ్రీనిధే కారణమవ్వడం , దానికంటే ముందు తను తెలివితక్కువగా శ్రీనిధిని నమ్మడం వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చేయి అని తలచుకొని కుమిలి
కుమిలి ఏడ్చేడు పార్ధుా.
అతనికిప్పుడు అన్నింటికన్నా పెద్ద సమస్య తల్లి.
"" ఈ విషయం అమ్మకెలా చెప్పడం. చెపితే ఆమె తట్టుకో గలదా..? లేక తాను ఒంటరివాడైపోతాడా...?
అసలు ఆనందంగా ఉన్న తమ కుటుంబం ఇంతలా ఛిద్రమైపోయిందేమిటి...? దేముడా ! నేనేదైనా తప్పు చేస్తే ఆ శిక్ష నాకు వెయ్యి గానీ అమాయకులైన నా తల్లిదండ్రులను ఎందుకు బాధిస్తున్నావు..?.. నమ్మిన శ్రీ మమ్మల్లి నట్టేట ముంచింది . నాకోసం పరితపిస్తున్న తండ్రిని తీసుకువెళిపోయేవు.. కనీసం తల్లినైనా మిగుల్చు....."
పార్ధుా వ్యధంతా కన్నీళ్ళై ప్రవహిస్తున్నాది
-----------
లోకంలో ఎవరికి ఏం జరిగినా తనకేమీ పట్టనట్టు
కాలం తన పని తను చేసుకు పోతోంది.
వర్ధని కనులు విప్పగానే తెలుసుకున్న నిజం ఆమె గుండెను పిండేసింది. అదే హాస్పిటల్ లోనే ముాడు నెలలు ట్రీట్ మెంట్ కోసం ఉంచ వలసి వచ్చింది.
పార్ధుా కొత్తగా హైదరాబాదు లో చేరవలసిన ఉద్యోగం
సమయం దగ్గర పడడంతో , పరిస్థితి వివరిస్తుా పార్ధుా పెట్టిన అప్లికేషన్ కు కంపెనీ నుండి ఇంకా జవాబు రాలేదు. నిరాశా నిస్పృుహలతో ఉన్న
పార్ధుా కోర్ట్ లో , శ్రీ వేసిన ఆరోపణలకు తలవంచి
.మరే విధమైన ఉద్దేశ్యం వ్యక్తం చేయకుండా మౌనంగా
శ్రీ అడిగిన విడాకుల కు తన ఆమొాదం తెలిపేడు.
సమయం కాలాన్ని మరింత ముందుకు నెట్టింది.
------------------------------------------------
హైదరాబాదు ఫామ్ హౌస్ . తాము కొన్న కొత్తలో పెట్టుకున్న "ఆనంద నిలయం" పేరు చుాస్తుా , నిరాసక్తిగా నవ్వుకున్బాడు పార్ధుా...అప్పటికే అమ్మ తను అక్కడికి వచ్చి రెండు నెలలు దాటి పోయింది..
వైజాగ్ లో అమ్మ , నాన్న లేరన్న విషయం విని స్తబ్దుగా ఉండిపోయింది. అస్సలు ఏడవని అమ్మ పరిస్థతి
చుాసి ఆనంద్ అంకుల్ గాభరా పడ్డారు. చాలా ప్రయత్నించేరు గాని ఫలితం సుాన్యం.
నెల గడిచిపోయింది అప్పటికి .అమ్మ చెరుపు -మరుపు గా మాట్లాడుతోంది.
అప్పుడప్పుడు " మీ నాన్న ఇంకా డ్యుాటీ నుంచి రాలేదేమిటి పార్ధుా"...అంటుంది. అప్పుడప్పుడు
అసలు ఆయనున్నట్టు గుర్తు లేనట్టుగా ఉండిపోతుంది.
అప్పుడప్పుడు తన పేరు మర్చిపోయేది.
"నేను నీ పార్ధుానమ్మా"..అని చెప్పుకోవలసి వచ్చేది.
నాన్న లేక అమ్మ పరిస్థితిని చుాడలేక పార్ధుా చాలా కుంగిపోయేడు. డాక్టర్ ఆనంద్ అమ్మకు ట్రిట్ చేస్తుా
ఉండడం తో ఏమీ మాట్లాడలేక మంచి రోజులకోసం ఎదురు చుాస్తుా ఊరుకున్నాడు.
అంతే కాదు .కోర్టు లో తన గురించిన నిజం శ్రీనిధి ద్వారా తెలుసుకున్న వారంతా...ఒకరు మరింకొకరికి చెప్పడం ద్వారా తన జీవితం అపహాస్యమయింది.
అందరుా తన ను అదోలా చుాడడం చేసేవారు. అంత వరకు తన స్నేహితులుగా ఉన్నవారంతా దుారమయ్యేరు. మరి కొందరు తనతో మాట్లాడడమే
పాపమన్నట్టు , దుారంగా వెళిపోతున్నారు..
ఈ రకమైన బాధను పార్ధుా తట్టుకోలేకపోతున్నాడు.
అందికే..అమ్మ మానసిక పరిస్తితిలో సరైన మార్పు రాకపోయినా
తనే ఆనంద్ అంకుక్ ని ఒప్పించి , ప్రతి నెలా వైజాగ్ అమ్మని తెచ్చే ఒప్పందంతో ఇక్కడకు వచ్చీసేడు అమ్మతో పాటు.
వాతావరణం , పరిసరాలు మారడంతో అమ్మ కొంచం కొంచంగా కోలుకొని , మెల్లగా ఈ లోకంలోకి రావడం , నాన్న పోయేరన్న నిజాన్ని భరించలేక తిరిగి ఆసుపత్రి
పాలవడం , మళ్ళీ కోలుకోవడం లాంటివి అన్నీ జరిగి
ఇదుగో, ఈ పది రోజులై కాస్తా నార్మల్ గా ఉండడంతో
పార్ధుా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
ఐతే అమ్మకు కోర్ట్ లో జరిగిన విషయాలేవిు గుర్తున్నట్టు లేదులా ఉంది. ఎందుకంటే ఆమె ఎప్పుడుా ఆ విషయమై తనతో చర్చించలేదు.
శ్రీ నిధి గురించి ఒక్కసారి కుాడా అడగ లేదు.
జీవితం మళ్ళీ మాముాలుగా నడుస్తోంది నిర్లిప్తంగా..
మరో నాలుగు రోజుల్లో తను కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాడు కుాడా...
-----------------------
పొద్దున్న తొందరగా లేచి , కొంచం సేపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు పార్ధుా...
హైదరాబాదు సిటీ కి కొంచం దుారంగా ఔట్ స్కట్స్ లో ఉండడం వల్ల పగటి పుాట వాతావరణం , పచ్చని చెట్ల కింద నడుస్తుా ఉంటే వచ్చే చల్లని గాలి , దగ్గరలోనే కొన్ని పచ్చటి పొలాల నుంచి వచ్చే లేలేత
చిగురుటాకుల సుగంధం తో మనసు కాస్తా ప్రసాంతంగా ఉంటోంది.
అక్కడికి చాలా మంది వాకింగ్ కి వస్తున్నారు. కొంత మంది సైకలింగ్ కుాడా చేస్తారు. మరి కొంతమంది కారు డ్రైవింగ్ నేర్చుకుంటారు. మొత్తానికి ఆప్రదేశమంతా వచ్చి పోయే వారితో , కళకళ లాడుతుా ఉంటుంది.
అమ్మ కొంచం కోలుకొని తెల్లారి లేవ గలిస్తే అమ్మను కుాడా రోజుా తనతో తీసుకురావాలి. అమ్మ అసలు
బయట ప్రపంచం చుాసి ఎన్నాళ్ళయిందో..ఐనా
ఇంకెన్నాళ్ళనీ..తనకు మరో నాలుగు రోజుల్లో ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు తనకేమీ
ఆలోచించడానికి గానీ , వాకింగ్ కి గానీ వచ్చే సమయమే దొరకదు. తనకు బాగానే గడిచిపోతుంది. కానీ తను జాబ్ లో చేరేకా అమ్మ ఒక్కర్తీ అంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటుంది...? పోనీ ఎవరైనా కేర్ టేకర్ ని నియమిస్తే....
అమ్మొా....వద్దు...వద్దు...
ఆమె కుాడా శ్రీనిధి లాగే అమ్మపై ప్రేమ చుాపించి
నమ్మించి మొాసం చేస్తే...అమ్మకసలే చెరుపు మరుపు కుాడాను......
పోనీ తను తనలాంటి వారే (గే లు ) ఉన్న సొసైటీలో ఎవరినైనా ఆడ వారిని
పెళ్ళికి ఒప్పించి అమ్మకు తోడు తీసుకు వస్తే...
తను శ్రీనిధి విషయంలో చేసిందదేకదా...
తన గురించిన అన్ని విషయాలుా పుాస గుచ్చినట్టు చెప్పాడే..తన దగ్గరున్నదంతా అమ్మా నాన్న ల తదనంతరం ఆమె పేరనే రాస్తానని కుాడా చెప్పాడే..
అన్నీ విన్న శ్రీనిధి ఏమంది...?
తనకీ లోకంలో ఎవరుా లేరని , నేను తన ను వివాహం చేసుకున్నందువల్ల , సొసైటీలో తనకొక గుర్తింపు రావడమే కాక తనకొక మంచి కుటుంబం
దొరుకుతుందని..అందికే నన్ను వివాహఅ చేసుకోడానికి తనకేమీ అభ్యంతరం లేదని" ఎంత నమ్మకంగా చెప్పింది.
తమకు పిల్లలు పుట్టరన్నపుడు ఏమంది...? లోకంలో ఎంతమంది అనాధలున్నారో...వారిలో
ఎవరినైనా తెచ్చుకొని పెంచుకుందాం పార్ధుా...
తద్వారా మనకు పిల్లలు లెరని లోటు తీరుతుంది.
వారికి తల్లిదండ్రులు లేని కొరత తీరుతుంది...
అన్నపుడు తను ఎంత ఆనందపడ్డాడని...?
తన సమస్య ఇంత తొందరగా పరిష్కారమౌతుందనుకోలేదు...
----
ఇంకా....ఉంది.( సశేషం
"
.
?
.
No comments:
Post a Comment