2.వ పాశురము.
పాల సంద్ర మందు ఫణిశేష తల్పాన
పద్మ నాభు డతడె పవ్వ ళించు
మేలు కొలుపు పాడి మేటి కీర్తుల వేడి
శ్రీశు పదము లిడక శరణ మనరె ॥
కురుల పుాలిడ కండి కులుకు బోణులాల
పరుల బాధ బెట్టు పలుకు లొద్దు
సత్య భాష ణమ్ము సరిదాన ధర్మమ్ము
సత్య వ్రతము జేయ సాధు గుణము ॥
3.వ పాశురము.
మూడు లోక ములను ముప్పాద ములగొల్చి
బలిమి బలిని అణచు బాలు డతడు
విష్ణు రుాపు డతడు వినరారె సఖులార చెలులార
వటువు వామ నుండు వాని కొలుతు ॥
No comments:
Post a Comment