Monday, December 27, 2021

రైతు

24/12/2021.
అంశం : రైతు.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.


అన్నం పరబ్రహ్మ స్వరుాపమంటారు.
అటువంటి  అన్న ప్రసాదం రైతన్న కష్ట ఫలం  .   
మట్టి తల్లిని నమ్ముకొని మెరిసే పచ్చని పంటకై 
మేనప్పగించిన మేటి మట్టి మడిసి రైతన్న.
ఆందరికీ రెండు పుాటలా కడుపునింపే అన్నదాత.
పగలనక రేయనక కాయ కష్టం చేసి పండించిన 
పంటనుండి మనకు పంచిన జీవామృతం.
మనందరి ఆకలి తీర్చే అద్భుత ఓషధీ ఫలం.
రైతు పడే కష్టానికి ఆతనికి దక్కే ప్రతిఫలం .
బ్రతుకు పోరాటంలో ఓడి, తలవంచిన హలం...
అప్పుల ఊబిలో కుారుకుపోయిన వెన్నెముక --
రైతు పథకాల కల్లబొల్లి కథలకు ముక్కలైన వైనం.
నమ్ముకున్న వారే నట్టేట ముంచితే...
మాటాడే స్వతంత్రాన్ని పోగొట్టుకున్న 
మానవ సమాజ పరిస్థితుల మౌన బాటలు.
మట్టి బ్రతుకుల మనుగడ సాగేందుకు 
ముందడుగు వేయలేని అసమర్ధతకు నిదర్శనాలు. 
అన్నెం పున్నెం ఎరుగని అన్నదాతల
ఆత్మహత్యలకు కారణాలనేకం .
మన జీవిత స్వాశకు మనమే "ఉరి "వేసుకొనే శాపం.

No comments:

Post a Comment