[5/29/2021, 19:30] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితా పండుగే
పర్యవేక్షణ: డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీ కుందారపు గురుమూర్తి గారు
సమీక్షణ: శ్రీ డా.నాయకంటి నరసింహ శర్మ గారు
తేది: 29-05-2021: శనివారం
కవితా సంఖ్య: 5.
----------------------------------------
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర
ప్రక్రియ: హయప్రచార రగడ
అంశము: శ్రీనివాస.
-----------------------------------
శంఖ చక్ర గదా ధరా
వేంక టేశ అభయ కరా॥
భక్త పొిష బహుస్వ రుాప
ముక్తి మొాక్ష ముాల రుాప ॥
విమల చరిత విశ్వ నేత్ర
కమల నయన ఘనసు గాత్ర ॥
కలభ గమన కరుణ లోల
సులభ ప్రాప్త సుగుణ జాల॥.
వర ప్రదాత వంద్య మాన.
సుర వినుత సుజన ధ్యాన॥
అభయ కరా అఘవి నాశ
శుభక రాసు జ్ఞాన పోష ॥
మంగ పతీ మధుర శ్రీశ.
భంగ గర్వ భయవి నాశ ॥
ఆప్త, ఘనా అసుర నాశ ॥ ॥
సప్త గిరిశ శ్రీని వాస ॥
వేద విదిత వేంక టేశ
నాధ లోల నటన టేశ ॥.
శరణు శరణు శ్రీని వాస
శరణు శరణు శ్రిత పరేశ ॥
సవరించి పంపినదండి.
[6/11/2021, 14:07] p3: శుక్రవారం : 11/6/2021
అంశం : ఐచ్ఛికం.
ప్రక్రియ : దీర్ఘ కవిత.
కవిత సంఖ్య : 02.
మ.సా.క.సం...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
---------------.
శీర్షిక : కాగితం గోడు.
స్వశ్ఛమైన మల్లెల వంటి తేట తెల్లని
మనసులా,ఒక్క మచ్చకుాడా లేక నిర్భయంగా విహరిస్తున్న కాగితానికి ,ఇప్పుడు,బయటకు రావాలంటే భయమేస్తోంది.॥
తన తోటి సఖులు, -రంగు రంగుల వర్ణాల
నెచ్చెలులతో కలిసి, పేపర్ మిల్లు గుడారాల్లో
గుంభనంగా దాగునుంది దీనంగా..
ఒకప్పటి రోజుల్లో......తమ ఉనికి-
ఎంత ఆహ్లాదంగా ఉండేదనీ...
.పెండ్లి పిలుపులకు , సెంటు పుాసుకొని
సన్నాయి మేళాల సందడులతో ,
ఆహ్వాన పత్రికై అలరించేది.॥
భగవదారాధనా శోభలకు శుభ -
లేఖలుగా మారి,పసుపు కుంకాల
పచ్చ బొట్లతో నిండి, పరవశియై
కళ కళ లాడేది.॥
రవి వర్మ..పికసో..బాపుాల వంటి
చిత్రకారుల కుంచెలతో, రంగు రంగు వలువల
అందాలని సంతరించుకొని అద్భుత
సౌందర్యరాసియై .....
ఆనంద లోకాల్లో విహరించేది.॥
వలపు పిలుపుల వర్ణనలతో నిండిన
చెలికాని సందేశమై , అది చదువుతున్న
చెలియ సిగ్గుల , నునుపు దేరిన బుగ్గల,
కాంతి తో దోబుాచులాడేది.॥
రుాపాయి నుండి మొదలైన ముద్రలతో
మధ్యతరగతి నుండి మాముాలు
జనాల వరకు గల నిత్యావసరాల నిండు
లక్శ్మిగా పుాజలందుకునేది.॥
ధర్మ నిరతి గల స్వాతంత్ర్య పోరాటకుల
కీర్తి చిత్రాల చెలిమి తో
కొలువు తీరి ఉండేది.॥
వలసినన్ని వార్తా విశేషాల న్యాయ బద్ధ-
నిబంధనల చిట్టాలకు , పుటల దాస్యం చేసేది.॥
వసి వాడని , పసి పిల్లల అట పాటల
ఆనందాలకు, వర్షాకాలపు నీటి పడవగా మారి,
అనుభుాతుల అలలపై కేరింతలు కొట్టేది.॥
ఇలా ఎన్నెన్నో తీపి గుర్తుల జ్ఞాపకాల కధలు..
కాలంతో పాటు కరిగిపోతుా ...మసి కొట్టుకు పోయేయి.
తమ విలువ కనపడని కాలుష్యంలో పడి
మట్టి -కొట్టుకుపోయింది.॥
ఇప్పుడు తమ బతుకు ఎలాగుందంటే.....
పెళ్ళిళ్ళ పిలుపులకు బెత్తెడు ముక్కలో చిరునామాను మొాసి...చదివేసిన
క్షణం లోనే చినిగి , చెత్త బుట్టలో చేరిపోతోంది.॥
గుడి నిర్వాహకుల గొంతెమ్మ కోర్కెల- రుసుము
పుాజల , బారెడు జాబితాల పట్టీలతో ,
గుడి బయట గోడకు అంటించబడి -కళాహీనమైన
ముఖంతో వెల- వెల బోతోంది.॥
అర్ధం పర్ధం లేని, మొాడర్న్ ఆర్ట్ రంగులతో,
బారెడు కొలతల బుాతు బొమ్మలతో, బేరపు
సొమ్ముకు ,అమ్ముడుపోతోంది.॥
ఉత్కంఠ పరచే ఉత్తరం జాగాలో..
ఏసిడ్ దాడుల ఏహ్యపు బెదిరింపులను
సుాచించే ఎత్తుగడల రాతలకు రగిలే- కన్నీటి
కావ్యమయింది .॥
అతి తక్కువ ముద్రతో ,అందరి కడుపుా
నింపి , ఆనందపరచెే తన విలువ,
వేల రుాకలకు పెరిగి వేలంపాటలో
వెలివేయబడి, వెక్కిరింతలపాలయ్యింది.॥
అబద్ధపు రాజకీయ ప్రమాణాలకు
సాక్షిీ భుాతమై , ప్రపంచ ప్రజానీకాన్ని పేజీలతో
వంచించే వార్తావెలయాలిగా స్థిరపడతామేమొా
అన్న భయం క్షణం- క్షణం వెంటాడుతోంది.
ఎన్నో సద్ధర్మ , సాంప్రదాయ , కావ్య
కళా -ఖండాల నిక్షిప్త నిధులను అలరించిన-
మా దొంతు పుటల భాగ్య రాసులు...
మారే కాలంతో ముడివడి , భాషా పటుత్వం
లేని భావ జాలాల మార్పుల్ని జీర్ణించులో లేక,
వంశాభివ్రుద్ధికి నోచుకోని శాపగ్రస్తులుగా మిగిలిపోతామేమొా అన్న ఆవేదనతో
హా- హా -కారాలు చేస్తున్నాయి. ॥
సామాన్య మానవునికి అందుబాటులో లేని
మా అంతరంగ ఆవేదన" స్విస్" బేంకు ఖాతాల-
కారాగారంలో చిక్కుకొని కన్నీరు కారుస్తోంది.॥
పాడి - పంటల పచ్చదనానికి కావలసిన
సరంజామాని సమకుార్చని , స్వార్ధపరుల
సోకు సౌలభ్యాల రంకు రుసుముగా, చేతులు మారుతుా ,చితికిపోతున్న జీవితానికి..
అంత మెప్పుడో ఎరుగని వింత ఆట పత్రాలుగా
మిగిలిపోతామన్న భయంతో ఆక్రోసిస్తున్న అభాగ్యులం . ॥
ఏ రోజు కారోజు ఎన్ని చేతులు మారవలసి వస్తుందో,
ఎన్ని రంగులు పులుముకో వలసి వస్తుందో,
ఏ వెల" లేని " విలువకు దిగజార వలసి వస్తుందో-
అని బెదురుతుా బతుకుతున్న , మొండెం లేని
ముదనష్టపు జాతకులం.॥
గొంతెత్తి అరవలేక, మమ్మల్ని మేము
తీర్చి దిద్దుకోలేని, అసహాయ - అంగవైకల్య -
హీన చరితలం,॥
కరన్సీ పేరుతో ముద్రింపబడుతుా దీనమైన
స్థితికి దిగజార్చబడుతున్న, శక్తిహీన కాగితపు కాంతా-కనకాలం. ॥
అంటుా బావురుమంది....
వెట్టి చాకిరీ చేస్తున్న , వట్టి వెర్రి తెల్ల కాగితం.
---------------------------------------------------------------
[8/5/2021, 15:41] p3: మహతీ సాహితీ కవిసంగమం
అంశం: సహితమే సాహిత్యం
ప్రక్రియ: ఇష్టపదులు
తేది: 5.8.21
శీర్షిక: సాహిత్యంతో చెలిమి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
మసాకసం: 37
ఈ మాసం కవిత సంఖ్య: 3
1.
సాహిత్య లోకాన సార మౌ గ్రంధాలు
ఎరిగించినవి ఎన్నొ ఎరుగనీ విషయాలు
పద్యాలు గద్యాలు పలుకు పాఠాలెన్నొ
మేధస్సు నిండినవి మేలైన నీతులుా
అలరే పురాణాలుా అవి పెద్ద గ్రంధాలు
చదువ సంస్కృతులను చాటు ఇతిహాసాలు
సాంప్రదాయపు విధులు సరినేర్వవలెనన్న
చదువు సాహిత్యమే జగము నెరిగెదవన్న ॥॥
2.
వేల కీర్తులనేలె వేమన్న పద్యాలు
సుఖపు బాటను జుాపు శుభాషితమ్ములవిగ ॥
ఛందస్సు నిండినవి చదువ పద్యములెపుడు
కందాల అందాల కడు రమ్యమౌ యతులు॥
ప్రాస నియమాలతో ప్రాణమే పోసేరు
కవులు ధీటులు వారు కనుగొన్న నియమాలు ॥
సద్ధర్మ బాటలుా సంస్కృతుల తేటలుా
చిట్టి పొట్టీ కధలు చిన్నారులకు నిధులు ॥॥
3
అట్టి సాహిత్యమును అనవరతము చదువగ
ఉర్రుాతలుాగె మది ఉత్సాహమదె నిండ.
ఆటవెలదుల ప్రాస తేట గీతుల మాట
కంద, సీసపు బాట కవుల సాహితి వేట
అందమౌ సాహిత్య మందరిని అలరించు
సద్గ్రంధముల చదువు సఖుల మరువ ॥
సాహిత్యమే చెలిమి సాహిత్యమే బలిమి
సరి ఈశ్వరీ మాట సత్య మిది ఓ మనుజ ॥॥
[8/6/2021, 17:45] p3: .6/08/2021
అంశం : ఐచ్చికం.
శీర్షిక : ఝండా కు వందనం..
మ.సా.క.సం.: 37.
ఆంగ్లేయుల పరిపాలనలో
భారత ప్రజల అవమానాలు
బానిసత్వపుబాటలో
ఎదుగు బొదుగు లేని జీవితాలు॥
బ్రిటిష్ వారి ఆధిపత్యానికి
తల వంచిన భారతీయులు.
భారత స్వాతంత్ర్య పోరాటానికై
ఉద్యమ బాటలో దేశ భక్తులు ॥
కోల్పోయినారెందరో ప్రాణాలు
కొల్లగొట్టబడిన స్త్రీల మానాలు.
పట్టుబడిన వారికి సంకెళ్ళు
ఎదురు తిరిగినవారి
తిరిగిరాని ప్రాణాలు.॥
పట్టుబట్టిన గాంధీజీ నడచిన
బాటలో, ఉప్పు సత్యాగ్రహాలు.
దాండీమార్చ్ తో చేసిన
శాంతియుత పోరాటాలు ॥
"పింగళి వెంకయ్య" చేసిన
స్వాతంత్ర్య ముక్తి "ఝండా సృష్టి".
"బంకిం చంద్ర చటర్జీ "రాసిన
దేశభక్తి నిండిన"జన గణ మణ"
గీతి, నిండిన ఉద్యమ స్ఫుార్తి.॥
కులమత వివక్షతల నిరసనలు
ముాడురంగుల జండాలో
సత్యం,ధర్మం శాంతి నిండిన
సమానత్వపు జీవిత సారాలు॥
వెరసి,లభించిన దేశ స్వాతంత్ర్యం
గాంధీ, నెహ్రూల పోరాటాల ఫలితంం
బానిసత్వ ముక్తి పొందన దినం
ఆగష్ట్ 15ను, మరువలేదు జనం.॥
నేటికీ జనం జరుపుకుంటున్న
భారత స్వాతంత్ర్య దినోత్సవం .
ఎగురుతున్న ఝండాకు చేద్ధాం
వందనం,కలసి మనమందరం ॥
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
*************************
[10/7/2021, 20:56] p3: అంశము: *బుద్దుని బాటలో...*
తేది: 7.10.2021
మ సా క సం: *37*
శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత స్థాపకుడు, "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥
నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష నీడను పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥
సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥
జ్ఞాన బోధ చేయుట జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు ఆదర్శపు బాటలు ॥
అంటు రోగం కన్న .అధైర్యం ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।
ఆచరించని మాట అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే మార్గ మదే కనపడును.
మంచి మాట బాటలు మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥
పై ఇష్టపదులు నా స్వంత రచనలు.
[10/8/2021, 20:26] p3: అంశం: ఐచ్ఛికం
తేది: 01-10-2021
మసాక.సం: 37
కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక: నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య: 4.
ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥
అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥
ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని దయగుణి తవ చరణం శరణం
చంద్రఘంట రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ శాంకరి భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ, పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి నాద వేద రుాపిణి ॥
విశ్వ శక్తి రుాపిణి విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి అష్ట అస్త్ర ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి రుాపిణి అంబ సింహ వాహినీ॥
ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥
శక్తి భద్ర కాళికె శాంకరి సుర మొాదితె
మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
యొాగ తంత్రాత్మికే ఆజ్ఞా చక్రార్చితే
కాత్యాయని భగవతి కాళీ జయ దుర్గే ॥
భగమాలిని భైరవి పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే దుర్లభే శివాత్మికే ॥
అష్టమావతారిణి ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ సుఖ మంగళ కారిణి ॥
శుాల,డమరు ధారిణి ముాల మంత్ర కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని
శక్తి దుర్గ రుాపిణి శరణు శంభు కామిని ॥
సిద్ధిధాత్రి శ్రీకరి బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥
సర్వ సిద్ధి వరదే శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే నామ విజయ కీర్తే ॥
***********************
[10/9/2021, 18:17] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు*
సమీక్షణ: *శ్రీ కొనింటి రమేష్ గారు*
తేది: *09-10-2021: శనివారము*
దత్తపది: *గిరిజ- శైలజ- హేమజ- అగజ*
దత్తపది: *గిరిజ- శైలజ- హేమజ- అగజ*
పద్య ప్రక్రియ : మత్త కోకిల.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా : కల్యాణ్ : మహారాష్ట్ర
అంబ ఈశ్వరి ఆది శక్తివి అందు కోనుతి శాంకరీ
శుంభ దైత్యుని భంజనీ ప్రియ శంభు మొాదిని పార్వతీ
శంభు రాణివి ,సార పుాజలు సాధ్వి జేతు సుమంగళీ
గుంభ నమ్ములు నీదు మాయలు గుమ్మ శ్రీ"గిరిజా"త్మనే॥ ॥
బిందు రుాపిణి "శైలజా"ఘని బంధ మొాచని పావనీ
ఇందు లోచని ఇందిరా సఖి ఈశ్వరాఖిల మొాహినీ
గంధ లేపని పాపనాశి సుగంధ హార సుభుాషణీ ॥
మంద గామిని దుర్గ హారిణి మంత్రమాతృకె మానినీ॥
భామ సుందర భుాషితాంగిని "హేమజా"మర నాయికా॥
కామరుాపిణి కాంత కౌళిని కాల రుాపిణి కాళికా
శ్యామ సుందరి సార సుస్వర స్వాదు మంజుల గాయికా
కోమ "లాగజ" గామి నీసతి పార్వతీ పర దేవతా ॥
కోమలాంగి దశావతారిణి కోటి సుార్య ప్రకాశినీ
భామ దుర్గతి నాశినీ నమొ పార్వతీ పరమేశ్వరీ ॥
కామకార్య విలోలినీ శివ కామినీ వర దాయినీ
ధామ శ్రీపుర వాశినీ భవతారిణీ సింహ వాహినీ॥
ఈ పద్యములు న స్వీయ రచనలు.
[10/11/2021, 20:16] p3: చిత్ర కవిత.
శీర్షిక : ఆడతనం ఆడపిలకు శాపం.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021
కలి ఏలుతున్న రాజ్యంలో
కామాంధుల కుాటమి.
కన్ను మిన్ను కానరాని
కర్కసుల కామ జ్వాలలలో
క్షణం క్షణం రాలిపోతున్నతున్న
ఎదగని చిరు ప్రాయం.
కర్కశ కామ జ్వాలల్లో
కాలిబుాడిదౌతున్న అడతనం.
ఆడతనం ఆడపుట్టుకకొక శాపం॥
ఎవర్ని నమ్మాలో ఎక్కడ ఎదగాలో
తెలోని పసి బాలల అమాయకత్వం
బంధువులే రాబందులైన వైనం.
ఇంటింటా అబలల కన్నీటి కథనాలు.
కామ పిశాచానికి బలౌతున్న
పసి పిల్లలు,అమ్మలు,అక్కలు,చెల్లెళ్ళు.
ఆడవారికి అడతనమే ఒక శాపం ॥
అవకాశమిస్తే అన్నిరంగాల లో
అందలాలనందుకోగల అత్మ విస్వాసం .
బయటి ప్రపంచంలో
బావురుమంటున్న మానవత్వం ।
ఆడదాని మనుగడకు
ఆడతనమే అడ్డౌతున్న శాపం.॥
మేధస్సు నిండిన మనుషుల్లో
మానవత్వం కరువైన బుద్ధిలోపం.
ప్రపంచం మంతా వావి వరుసలు లేని
పాచి నిండిన నరకకుాపం..
అడపిల్లకు అడతనమే ఒక శాపం ॥
ఇంటి ఆడపిల్ల అక్కరకు రాని చుట్టం.
ఆరక్షణావకాశాలు అందుబాటుకు
తేవలేని అసమర్దతలు నిండిన
పనికిమాలిన చట్టం.
లింగ బేధాల లైంగిక దాడుల లో
స్త్రీ లకు ఇంటి రక్షణే కరువైన
కన్నీటి నిస్సహాయం.
ఆడతనం ఆడదానికి ఒక శాపం.॥
[10/12/2021, 19:13] p3: 12/10/2021
అంశం : వేదవ్యాసుడు.
కవిత సంఖ్య 2.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
వేదాలను నాల్గుగా విభజించిన జ్ఞానతడు
క్రష్ణద్వైపాయనునిగ పేరున్న ఘనుడు
భారత, భాగవతాదుల రచియించిన గురుడు.
అష్టాదశ పురాణాలు అందించిన వ్యాసుడు ॥
బాదరాయణునిగా ప్రసిద్ధి చెందిన వ్యాసుడుక
ఆషాఢ శుద్ధ పౌర్ణమి , వ్యాసుని జన్మదినం
మహాభారతతాది కావ్య గ్రంధకర్త.
జయకావ్య గ్రంధకర్త , అదే మహాభారత కథ॥
భగవద్గీత విష్ణుసహస్రనామాది
దివ్య రచనలు రచియించిన వేద నిధి.
బ్రహ్మ సుాత్రాలలో వేద వేదాంగాలను
నిక్షిప్తంచేసిన వ్యాస కర్త.॥
పతంజలీ యొాగ శాస్త్రలకు అధార కర్త.
విశిష్ట అక్షర భిక్షను మనకిచ్చిన వ్యాస ముార్తి
ఈనాటి నమన ఆధ్యాత్మిక గ్రంధాల సారం
శ్తీ విష్ణ్వావతారుడైన వ్యాసగురుని ప్రసాదం ॥
పరాశర మహర్షి , సత్యవతీల పుత్రుడు
భరత వంశాభివృద్ధి కారకుడు.
శ్రీ విష్ణు అవతారియైన జ్ఞాన సద్గురువు.
సప్త చిరంజీవుల లో ఒకడైన వ్యాసుడు॥
ప్రపంచ వాజ్మయంలో ప్రసిద్ధిచెందిన
విద్వాంసుడు తానొక్కడే ఐన వ్యాసుడు-
వేద వాజ్మయాన్ని విభజనలు చేసి
క్రమపద్ధతిలో మనకందించిన సార గురుడు.॥
తత్త్వ జ్ఞానాన్ని సార్వజనికం చేసి
అష్టాదశ పురాణ కధలను అందరికీ
అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ మార్గదర్శి ॥
చిత్త శాంతిని కలిగించే భాగవత పురాణం
పంచమ వేదమైన మహాభారత గ్రంధాలను
రచించిన ఇతిహాస కారకుడు వేదవ్యాసుడు
పరిపుార్ణ తత్త్వ జ్ఞాన గుణ నిధి.॥
ఆత్మ-అనాత్మల విషయాలను
సరళ శైలి లో బోధించిన తత్త్వోపదేశకుడు.
శివుని గుార్చి చేసిన తపోవరముచే
సుకమహర్షి వంటి పుత్రుని పొందిన ఘనుడు॥
వ్యాస నామ మొాక వ్యవస్థ, ఒక పీఠము.
ఇరువదిఏడవ వ్యాసునిగా ప్రసిద్ధిచెందిన
పరాశర పుత్రుని జన్మదినమునే మనము
వ్యాసపుార్ణమగా, గురుపుార్ణమగా.
స్మరించుకుంటున్న దివ్యమైన దినము॥
వ్యాస పీఠము వాజ్మయ పఠనీయ
దేవతా పీఠము. అచటినుండి
గణపతి కలమునుండి జాలువారిన
ఆర్షవాజ్మయ అక్షర జలధారలలో
అధ్యయన స్నానాదులుగావించి
ఆచరణల ద్వారా పునీతులమవుదాం ॥
జై శ్రీ వ్యాస గురవే నమః
ఈ కవిత నా స్వీయ రచన.
[10/13/2021, 14:35] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
కవితాసంఖ్య 3.
1.
భాగ్యరాసివి కోమలీకర పాశ శుాల ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ ఫలప్రద యొాగినీ హితకారిణీ
శక్త్య నంతరుణార్ణ వర్ణిణి శాంకరీ సుఖ కారిణీ
ఆద్య వింధ్యనివాసినీజగ ధాధినేత్రి శుభాననీ ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచనవ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పాలయె శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ ఉమాభవ తారిణీ
శుభ్ర వస్త్రమయిా మనోన్మయి సుందరేశుని భామినీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తిసు మేరు శృంగ నివాసినీ హరుమొాహినీ
మాతమంగళ కారిణీ మహిమాన్వితే మణి భుాషణీ॥
4.
గంధమాలిన మేయశక్తిసు కోటి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసినపారశక్తి స్వరుాపిణీ
ఇందులోచని మందహాసిని ఈప్సితాది ప్రదాయినీ
బిందుమాలిని భాగ్యకారిణి భీతహారిణి భామినీ ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దేవి దైత్యవి భంజనీ
భవ్య సుందరి కాళికేసుర పుాజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాధరీ
మఠ్యతాళసు గీత మొాదిని మాతహంససువాహినీ ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని నిర్మలాశ్రిత పాలినీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ
కార్యకారణి నిర్విశేషిణి కామకర్షిణి కోమలీ
ఉర్వితత్త్వ స్వరుాపిణీ ఘన కౌళినీ కుల యొాగినీ॥
[10/13/2021, 16:20] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
కవితాసంఖ్య 3.
1.
భాగ్యరాసివి కోమలీకర పాశ శుాల ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
శక్త్య నంతరుణార్ణ వర్ణిణి శాంకరీ సుఖ కారిణీ
నిత్య నీరద శ్యామలేశుభ నీళ నిశ్ఛల దేహినీ ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచనవ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ ఉమాభవ తారిణీ
శుభ్ర వస్త్రమయిా మనోన్మయి సుందరేశుని భామినీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీ ఘన సామినీ హరు మొాహినీ
మాతమంగళ కారిణీ మహిమాన్వితే మణి భుాషణీ॥
4.
గంధమాలిన మేయశక్తిసుగాత్రి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసినపారశక్తి స్వరుాపిణీ
ఇందులోచని మందహాసిని ఇందిరావర దాయినీ
బిందుమాలిని భాగ్యకారిణి భీతహారిసు శస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాధరీ
మఠ్యతాళసు గీత మొాదిని మాతహంససువాహినీ ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని నిర్మలాశ్రిత పాలినీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ
కార్యకారణి నిర్విశేషిణి కామకర్షిణి కామినీ
ఉర్వితత్త్వ స్వరుాపిణీ ఘన ఊర్ద్వలోకనివాసినీ ॥
[10/13/2021, 20:18] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
కవితాసంఖ్య 3.
1.
భాగ్యరాసివి కోమలీజయ బాల శుార్య ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
ఋగ్య జుర్విధ సామ గానస్వ రుాపి సుందర గాయకీ
అర్ఘ్య పాద్యసు పుాజితే పర మార్ధ మొాక్షకరీ శుభే ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచన వ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ ఉమాభవ తారిణీ
అగ్ర గామిని ఆది భిక్షుని అర్ధ భాగిని అమ్మణీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీఘన శాలినీ హరు కామినీ
మొాది నీఘన సార సుందర మొాఘ మంజుల భాషిణీ
4.
గంధమాలిన మేయశక్తిసు గాత్రి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసిన పారశక్తి స్వరుాపిణీ మందహాసిని ఇందులోచని మాతహంససువాహినీ ॥
వంద నీసుర బిందుమాలిని వారి జాక్షిసు శస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాత్మనే
కావ్య రుాపిణి గాన మొాదిని కామ కోటి విలాసినీ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని నిర్మలాశ్రిత పోషిణీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ
అత్య నంతసు తీర్థ వైభవ అగ్ని తేజ ప్రకాశినీ
ప్రత్య భిన్న పరాయణీ వర ప్రకృతీపర మేశ్వరీ ॥
[10/15/2021, 10:55] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ వి.టి.ఆర్ మోహనరావు గారు*
సమీక్షణ: *శ్రీమతి.దొంతరాజు విజయలక్ష్మి గారు*
తేది: *15-10-2021: శుక్రవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: : ఇష్టపది.
శీర్షిక నవ దుర్గారుాపిణి.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
నవ రుాపాల వెలసె నవ రాత్రి దుర్గమ్మ
నమ్మిన వారి గాచు నామాల కొలువమ్మ
తెలుగింటి గౌరవం తెలంగణ గౌరమ్మ
భోగాల నిచ్చేటి బోనాలబతుకమ్మ ॥
ఆశ్వీయుజ మాసపు అమావాస్య మొదలుగ
నవరాత్రులు వెలసిన నవ దుర్గ మాయమ్మ .
రోజుకొక్క రుాపము రోజొకలంకారము
అమ్మ అవని గాచెడు అంబ ఈశ్వరీయము ॥
1.బాలత్రిపురసుందరి.
బాలత్రిపురసుందరి భవ్యమైన రుాపము
భావ భక్తి నిండిన భగవతీ స్వరుాపము
శక్తి మంత్ర మహిమలు ముక్తి నిడెడు పుాజలు
ప్రధమ పుాజలందెడు ప్రసన్న మౌ కీర్తులు ॥
2..శ్రీ గాయత్రి దేవి :
ముాల శక్తి మంత్రము మచ్చటైన రుాపము
నీల ధవళ వర్ణము నిత్య దర్శనీయము
గాయత్రీ తేజము ఘన ద్వితీయ రుాపము
త్రిసంధ్యా సమయము త్రిఫల మంత్ర పఠనము
సహస్ర నామ మంత్ర సార పుార్ణ తేజము
ఓజ తేజ సారము మొాక్ష మిడెడు మంత్రము
పంచముఖీ తేజము పంచ భుాత మయముా
ఆయురారోగ్యాది అద్భుత ఫల సారము ॥
3. శ్రీ మహాలక్ష్మి దేవి :
మంగళమౌ రుాపము మాంగళ్య కారకము
మహాలక్ష్మి తేజము మహిమాన్విత రుాపము.
మాన్యాష్ట సిద్ధి కరి మాత తృతియ రుాపము
అష్ట రుాపి అమ్మణి కష్ట నష్ట వారిణి ॥
4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి.
అవని అన్నపుార్ణా అన్నదాయపర్ణా
ఆదిశక్తి శివ సతి అన్న దాన కారిణి
జీవనాధారిణీ జీవకోటి పోషిణీ
క్షుద్బాధా నాశినీ క్షు దర్వీధరి మానినీ ॥
నవరాత్ర్యవతారిణి నాశాత్కలి హారిణీ
ధాన్య కారిణీ ఘని ధరణి క్షామ నాశినీ
శరణాగత వత్సలే శంకరార్తిశమనీ
కాశీ పుర వాసినీ కామదహను భామినీ.
5. శ్రీ లలితాంబా రుాపిణి.
శ్రీ లలితా శివసతి శ్రీకరి గణ పాలిని
అంబ త్రిపుర సుందరి అరుణోజ్వల భాసిని
కామిత ఫలదాయిని కలిమల ఖలు హారిణీ
ఉపాసినీ, సువాసినీ ఉమా అభయ కారిణీ॥
ముని గణ సంసేవిని ముల్లోక పాలినీ
ఖడ్గ మాల ధారిణీ కనక దివ్య భుాషణి
ఇక్షు కోదండ ధరి ఈప్సిత వర దాయినీ
శ్రీ చక్ర వాసినీ స్థిత బిందురుాపిణి ॥
6. శ్రీ మహా సరస్వతీ స్వరుాపిణి.
7.
శ్రీ మహా సరస్వతి శ్రిత జ్ఞాన ప్రదాయిని
అక్షరస్వరుాపిణి అక్ష మాల ధారిణి.
హంస వాహినీ ఘని హంసిని జన జీవని
వాణి వీణా ధరీ వాజ్మయి విశ్వంభరి .॥
7. శ్రీ మహా దుర్గా రుాపిణి.
శ్రీ సింహ వాహినీ శ్రీ దుర్గ భవానీ
దుర్గమాది వారిణీ దుర్గ దుఃఖ హారిణి.
దుర్గమాసురదమని దుర్గముాగ్ర రుాపిణి
సుఖ సౌఖ్య ప్రదాయినీ సుందరి శివ మొాదిని॥
8. శ్రీ మహిషాసుర మర్ధిని.
శక్తి రుాపి శాంకరి ముక్తి దాయినీశ్వరి
మార హరుని రాణీ మంగళీ మనోహరి
మాత శుాల పాణీ మహిషాసుర మర్దని
శీఘ్ర ఫల ప్రదాయినీ వ్యాఘ్ర వాహినీ ఘని॥
9 శ్రీరాజరాజేశ్వరి దేవి అవతారము
అపరాజిత ముార్తీ అంబా జగదీశ్వరి
రాజ రాజేశ్వరీ రమణి చిత్స్వరుాపిణి
శ్యామలే కోమలే శ్యామల శువ గౌరీ
కుంకుమార్చిత పదే కులయొాగిని కౌళిని ॥
పాహి పాహి పార్వతి పరే పవిత్ర జనని
ప్రసిద్ధ కార్య కరణి ప్రసీద పాహి పావని
వంద్య వేద రుాపిణి వర శుభ కాత్యాయని
మంత్ర మాన్యే ధనీ మహిత విజయ కారణీ ॥
[10/16/2021, 20:59] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు*
సమీక్షణ: *శ్రీ కొనింటి రమేష్ గారు*
తేది: * 16-10-2021: శనివారము*
దత్తపది: * పర్వము- గర్వము- మర్వము- సర్వము*
రచన, శ్రీమతి, పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.కల్యాణ్ : మహారాష్ట్ర .
మ సా క సం సంఖ్య : 37.
ప్రక్రియ : ఆట వెలది.
గర్వమున్నసురుల ఘనభంజ నివినీవు
పర్వములకు పెద్ద పడతి వమ్మ
మర్వమున్న పుాల మాల వేణిని దాల్చు
సర్వ ములకు శక్తి సార సాక్షి ॥
పర్వ ములను జేసి పాపములను బాయ
సర్వములను మరచి శరణు కోర
గర్వ మునదె నణచి గాచి బ్రోచెడుతల్లి
మర్వమెపుడు నిన్ను మార జనని ॥
[10/16/2021, 22:58] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు*
సమీక్షణ: *శ్రీ కొనింటి రమేష్ గారు*
తేది: * 16-10-2021: శనివారము*
దత్తపది: * పర్వము- గర్వము- మర్వము- సర్వము*
రచన, శ్రీమతి, పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.కల్యాణ్ : మహారాష్ట్ర .
మ సా క సం సంఖ్య : 37.
కవిత సంఖ్య 4.
ప్రక్రియ : ఆట వెలది.
గర్వమున్నసురుల ఘనభంజ నివినీవు
పర్వములకు పెద్ద పడతి వీవు
మర్వమున్న పుాల మాల వేణిని దాల్చు
సర్వములకు శక్తి శరణు శరణు ॥
పర్వ ములను జేసి పాపములను బాయ
సర్వములను మరచి శరణు కోర
గర్వ మనునదణచి గాచి బ్రోచెడుతల్లి
మర్వమెపుడు నిన్ను మాత మహిని ॥
[10/19/2021, 18:59] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితాపండుగే..
పర్యవేక్షణ: శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు
సమీక్షణ: శ్రీమతి డియస్వీ మహాలక్ష్మి గారు
తేది: 19/10/21
అంశము: సాహిత్యాంశము.
మహాకవి కాళిదాసు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ. సా క సం : 37.
కవితా సంఖ్య : 02.
ప్రక్రియ: ఐచ్చికము.
శీర్షిక : కవి కుల శ్రేష్ఠి .
(వచన కవిత).
సంస్కృత కవియైన కాళిదాసు
గొప్ప శువ భక్తుడు.నాటక కర్త.
కవికుల గురువుగా పేరున్న
ఇతడు హిందుా పురాణ ,
తత్త్వాలకు సంబంధించిన
ఎన్నో కావ్య-నాటకాలను
రచించిన ప్రతిభావంతుడు.
కాళికాదేవి అనుగ్రహము
పొందిన వర ప్రసాదుడు.
నవ రత్నములుగా పేరుగాంచిన
విక్రమార్కుని ఆస్థాన కవులలో
ఒకఁడైన కాళిదాసు
ఉపమానోపమేయములను
అతిచక్కగా పోల్ఛు సమర్ధుడు.
అంతేగాక శాకుంతలము,
మాళవికాగ్నిమిత్రము,
విక్రమోర్వశీయము అను
నాటకములును, రఘువంశము,
మేఘసందేశము, కుమారసంభవము
అను కావ్యములు రచించి
ఉత్తమ కవిగా పేరొందన ఘనుడు.
ఈయన ఇంకా, నళోదయము,
శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల,
కవికంఠ పాశము, కర్పూరమంజరి,
భోజచంపువుఅనే గ్రంథములను,
మేఘసందేశమనే కావ్యమును,
శ్యామలా దండకమును రచించి
కవికుల గురువుగా కీర్తించబడినాడు.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే l
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ll
వంటి అత్యద్భుతమైన ఉపమాలంకార
సౌందర్యం గల శ్లోక రాజములను
రచించి ఉత్తమ కవిగా అద్భుత
ఉపమానాలతో కవితాలోకాన్ని
అలరించిన కాళిదాసు కవితా
సౌందర్యం ఏనాటికీ రతగని పెన్నిధి.
అనడంలో అతిశయొాక్తి లేదు.
ఈ వచన కవిత నా స్వీయ రచన.
[10/27/2021, 17:36] p3: మహతీ సాహితీ కవి సంగమం.
తేది: 28-10-2021: బుధవారం
అంశము: ఐచ్ఛికము
ప్రక్రియ: పద్యము మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య :3.
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ పాహిమం
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥
క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా
క్రిష్ణ వేణుసు నాద నందిత క్రిష్ణ పార్ధసు సారధీ॥
దేవకీ వసు దేవ నందన దేవ, దానవ భంజనా
భావ భక్తసు దాస పోషక భాగ్య దాయక పావనా ॥
భుావరాభువ నైక పాలక భుారి కారు ణ్యాఘనా
పావ నాఘన శాప మొాచ పరేశ పంకజ లోచనా॥
బాల లీలల పల్లె గాచిన భాగ్య భక్త జనావనా
గ్వాల మురళీ లోల లోచన గర్వ, కాలుష వారణా
జాల గోకుల బాల బాంధవ జార చోర జనావనా
పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥
మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా
లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా
పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా
కేళి లీలవి నోద నాఖలు కాల కాళియ మర్దనా॥
శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక చిద్ఘనా
బాల లీలసు వేష మానుష బంధ పాపవి మొాచన
కాల కారణ జన్మ ధారణ కావు మాఖగ వాహనా
నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా ॥
ఇంది రారమణా హరీనమొ ,ఇందు శీతల హాసనా
వంద్య మానసు సేవ్య మానద్వి పాద, పంకజ లోచనా
గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా
సుంద రాసుకు మార మేయవ సుంధరోద్ధర దేవరా ॥
శ్యామ సుందర భాగ్యదాయక సాయి సద్గుణ నాయకా
భామ సత్యహృ ధామ శ్రీపతి ,భార దుర్నర కాంతకా
కోమలాంగ సువేద వందిత కోటి సుార్యప్ర కాశకా
సోమ సుార్యసు లోచనా హరి శోభ నాసుఖ కారకా॥
దేవ పార్ధసఖా పరాత్పర దేహ విశ్వస్వ రుాపకా
కావ రావయ కంజ లోచన కామితార్ధ ప్రదాయకా
సేవ సేతును వేద మూరుతి శంఖ చక్రగ దాధరా
గోప గోపి జనార్దనా ప్రియ గోకులా పరిపాలకా॥
జీవ కోటికి రక్షణీయగ జన్మ మెత్తిన మాధనా
పావ నానఘ పద్మ లోచన పాహి భాగ్యవిదాయకా ॥
ధావరా గిరిధారి నామురళీ మనోహర మొాహనా
రావ నామశ్రి క్రిష్ణ పాండవ రక్షకా శుభ కామనా ॥
హామీ :
మత్తకోకిల పద్యాలు నా స్వీయ రచనలు
[10/27/2021, 19:23] p3: మహతీ సాహితీ కవి సంగమం.
తేది: 28-10-2021: బుధవారం
అంశము: ఐచ్ఛికము
ప్రక్రియ: పద్యము మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య :3.
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ పాహిమం
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥
క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా
క్రిష్ణ వేణుసు నాద నందిత క్రిష్ణ పార్ధసు సారధీ॥
దేవకీ వసు దేవ నందన దేవ, దానవ భంజనా
భావ భక్తసు దాస పోషక భాగ్య దాయక పావనా ॥
భుావరాభువ నైక పాలక భుారి కారు ణ్యాఘనా
పావ నాఘన శాప మొాచ పరేశ పంకజ లోచనా॥
బాల లీలల పల్లె గాచిన భాగ్య భక్త జనావనా
గ్వాల మురళీ లోల లోచన గర్వ, కాలుష వారణా
జాల గోకుల బాల బాంధవ జార చోర జనావనా
పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥
మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా
లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా
పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా
కాల లీలవి నోద నాఖలు కాళ కాళియ మర్దనా॥
శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక చిద్ఘనా
బాల లీలసు వేష మానుష బంధ పాపవి మొాచనా
కాల కారణ జన్మ ధారణ కావు మాఖగ వాహనా
నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా ॥
చంద నాదిసు గంధ లేపిత చారు చంద్రసుహాసనా
వంద నీయసు సేవ్య సుందర పాద,పంకజ లోచనా
గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా
సుందరా సుకుమారమేయ వసుంధరోద్ధర దేవరా ॥
శ్యామ సుందర భాగ్యదాయక సాయిసద్గుణ నాయకా
భామ సత్యహృధామ శ్రీపతి ,భార దుర్నరకాంతకా
కోమలాంగ సువేదవందిత కోటి సుార్యప్రకాశకా
సోమ-సుార్యసు లోచనా హరి శోభనా సుఖ కారకా॥
దేవ పార్ధస ఖాపరాత్పర దేవ విశ్వస్వ రుాపకా
కావరావయ కంజ లోచన కామితార్ధప్రదాయకా
సేవ జేతును వేద మూరుతి శంఖ-చక్ర-గదాధరా
జీవ కోటి జనాది రక్షక జీవనోత్తర కారకా ॥
జీవ కోటికి రక్షణీయగ జన్మ మెత్తిన మాధనా
పావనానఘ పద్మలోచన పాహి భాగ్యవిధాయకా ॥
ధావరా గిరిధారి నా మురళీధరా మన మొాహనా
రావ బ్రోవగ క్రిష్ణ ,పాండవ రక్షకా శుభకామనా ॥
[10/27/2021, 21:00] p3: ఎట్టకేలకు ధన్యనైతిని ఏమిభాగ్యము గుర్వరా
చట్ట రీతిని చాల జెప్పిరి చాక చక్యము తోనయా
దిట్ట మాత్రలు గట్టి ప్రాసలు తట్ట గల్గుటె మీ"దయా
పట్టజాలను సంత సంబును పాద అంజలి మీకయా॥
[10/28/2021, 18:46] p3: మహతీ సాహితీ కవిసంగమం.
అంశం : వాయునందనుడు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ. సా క సం : 19.
కవితా సంఖ్య : 03
శీర్షిక : వజ్రకాయుడు.
(వచనం )
యాదవరాజైన కుంతిభోజరాజు
కుమార్తె కుంతీదేవి,వసుదేవుని
చెల్లెలు, శ్రీకృష్ణునికి మేనత్తయే
గాక పాండురాజు భార్య,
పాండవులకు తల్లి. ఆమె అసలు
పేరు పృధ ॥
చిన్నతనంలో దుార్వాసుడిచ్చిన
అనునుగ్రహ కారణంగా, ఆమె
కోరుకున్నపుడు ఏదేవుడిని స్మరిస్తే
ఆ దైవానుగ్రహం వలన సంతానాన్ని
పొందగలిగే వరం పొందుతుంది.
ఆ వరోత్సాహంతో వివాహానికి
ముందే కుంతి, సుార్యదేవుని జపించగా
వర ప్రభావ ఫలితంగా సుార్యుని వలన
కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో
కుంతికి జన్మించిన వాడు కర్ణుడు.।
కుంతికి ,పాండురాజుతో వివాహామైన
పిదప చాలాకాలం వరకు సంతానం
కలగలేదు.
ఒకపరి
మహర్షులంతా" బ్రహ్మ "సందర్శనానికి
సత్యలోకం వెళుతున్న సమయంలో,
పాండురాజు తాను కూడా భార్యా
సమేతంగా వెళ్ళబోయి
అపుత్రశ్యాగతిర్నాస్తి" అనే వేద
వచనాన్ని తలచుకొని బాధ పడుతున్న
తరుణంలో పాండురాజు తో,
యోగ దృష్టిధనులైన మునులు,
దైవ ప్రసాదముతో నీకు పుత్రులు
కలిగే యొాగముందని పలుకగా,
ఆతని ప్రథమ పత్ని యైన
కుంతీ ద్వారా "వర " ప్రసాద విషయం
తెలుసుకున్న పాండురాజు ప్రోద్బలంతో ,
వాయుదేవుని అంశతో,కుంతికి జన్మించిన
వజ్రకాయుడు, పంచపాండవులలో
రెండవ వాడైన వాడు భీముడు.॥
కౌరవానుజుడైన దుర్యోధనుడు
అతి బలుడైన భీమునిపై అసుాయతో
భీముని నీటిలో పడవేసి చంపడానికి చేసే
ప్రయత్నంలో , నాగలోకానికి చేరి
వెయ్యి ఏనుగుల బలంతో తిరిగి వచ్చిన
వజ్రకాయుడు భీమసేనుడు.॥
భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ
కౌరవ పాండవులలో సాటిలేని వీరునిగా
పేరొందిన ఘన గదా ధరుడు భీముడు॥
మల్లయుద్ధ యొాధుడైన భీముడు
మల్ల యుద్ధంలోజరాసంధుని, బకాసురున్నీ
అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి.
హిడింబాసురుణ్ణి వధించి, ఆతని సోదరి
హిడింబిని వివాహమాడి, ఘటోత్కచుడనే
పుత్రుని . పత్ని ద్రౌపదిచే "శ్రుత సోముడు"
అనే .ఇరువురు పుత్రులను బడసినవాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు
అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని
నిర్జించినవాడు, ధుర్యోధన దుశ్శాసనాది
కౌరవులు నూర్గురినీ వధించాడు ఐన
అతిబల భీమకాయుడు భీమసేనుడు ॥
[10/29/2021, 05:35] p3: మహతీ సాహితీ కవిసంగమం.
28/10/2021 (గురువారము).
అంశం : వాయునందనుడు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ. సా క సం : 19.
కవితా సంఖ్య : 03
ప్రక్రియ : ఇష్టపది.
శీర్షిక : వజ్రకాయుడు.
(వచన కవిత )
కుార్మి యాదవ రాజు కుంతిభోజరాజుకు
పలుక గారములేలు పట్టి భోజ పుత్రిక ॥
కోరుకున్న దేముడే కోరు సంత తిచ్చునని ,
వాసిగ దుార్వాసుడు వరమొసగెను ఆమెకు ॥
పసి ప్రాయపు ధ్యానము వరమడిగిన మంత్రము
పఠియించిన ఫలముా పసి బిడ్డకు జన్మము
నీట విడెచె బాలుని నిజ భయమున కుంతీ.
రహస్యమును దాచెను రాత్రి పవలు వగచెను ॥
సరి సమయము వచ్చెను సఖి కుంతి వివాహము
కురువంశపు రాజుతొ గుాడిన శుభ సమయము
యొాగ సంతానమదె యొాగ్యతగలదనుచును
యోగ దృష్టిధనులైన యొాగులు సరి పల్కెను॥
కురువంశ సంజాతుడు కుంతీ వర పుత్రుడు
భీషణ ఘన కాయుడు భీముడు జనియించెను
పాండు రాజు భార్యగ పాండవులకు తల్లిగ
కుంతి పేరుగాంచెను కులసతిగా నిలిచెను.॥
పాండవానుజుడితడు బలవంతుడు భీముడు.
వాయు పుత్రుడీతడు వరలతిబల కాయుడు
సరి నాగుల వరముతొ సహస్ర కరి బలుడు
మాత్ర గదా ధరుడుా మల్ల యుద్ధ యొాధుడు ॥
జంపె బకాసురునుా జరాసంధు చీల్చెను
హిడింబసురు దునిమెను "హిడింబి "పెండ్లాడెను.
ఘటోత్కచ,శ్రుతసోము ఘన పుత్రులు భీమకు
హిడింబీ, ద్రౌపతుల హిత పుత్రులు ఇరువురు ॥
అమ్మ మాట మరువడు అన్నయాజ్ఞ మీరడు
అతడె భీమసేనుడు అతి వజ్రకాయుడుా
కురుక్షేత్ర సమరము కుల హీనుల దమనము
అనుజులు కౌరవులను అంత మిడిన ఘనుడుా॥
ఆరు అక్షౌహిణుల అదె కౌరవ సైన్యము
నిర్జించిన వీరుడు నిజ భుజ బల భీముడు
భారతమున బలుడుా, భరత కీర్తి చరితుడు
ఈశ్వరికిల యిష్టుడు ఇటువంటి సొిదరుడు ॥
[10/29/2021, 18:55] p3: అంశం : ఐచ్ఛికం.
శీర్షిక : శ్రీ సాయి గానం.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర.
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య : 5.
పల్లవి .
-------------
మనవుడై పుట్టి మహనీయుడైనాడు
మా దేవుడు గురు సాయీశుడూ .. !మానవుడై !
అనుపల్లవి :
కానరాని ఘన మహిమలు గలవాడు
కారణజన్ముడు కరుణాసముద్రుడు ! మానవుడై !
చరణం :
--------
మానడు నిత్యము జపమూ, తపమూ ..
దాన గుణనిధీ దాచడు ధనమూ
తనమతమెరుగడు మనమతమడుగడు
మనుగడ యేదైన మమ్మేలువాడు !మానవుడై !
చరణం
----------
నిష్ఠను పాటించు జీవనగమనము
యిష్థ మైన విధి పరోపకారము
కష్థజీవులను కాపాడుగుణము
కామితార్ధముల నొసగే దైవము !మానవుడై !!
--------------------------------------------------
[10/29/2021, 21:12] p3: అంశం : ఐచ్ఛికం.
శీర్షిక : శ్రీ సాయి గానం.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహా రాష్ట్ర.
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య : 5.
పల్లవి .
-------------
మనవుడై పుట్టి మహనీయుడైనాడు
మా దేవుడు గురు సాయీశుడూ .. !మానవుడై !
అనుపల్లవి :
కానరాని ఘన మహిమలు గలవాడు
కారణజన్ముడు కరుణాసముద్రుడు ! మానవుడై !
చరణం :
--------
మానడు నిత్యము జపమూ, తపమూ ..
దాన గుణనిధీ దాచడు ధనమూ
తనమతమెరుగడు మనమతమడుగడు
మనుగడ యేదైన మమ్మేలువాడు !మానవుడై !
చరణం
----------
నిష్ఠను పాటించు జీవనగమనము
యిష్థ మైన విధి పరోపకారము
కష్థజీవులను కాపాడుగుణము
కామితార్ధముల నొసగే దైవము !మానవుడై !!
--------------------------------------------------
[11/1/2021, 18:23] p3: 1/11/2021.
అంశం : చిత్రకవిత.
మ.సా.క.సం : 19.
కవిత సంఖ్య . 1.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
పద్య ప్రక్రియ : ఆటవెలది.
మనిషి స్వార్ధ పరుడు మహిపాడు ధనమేల
మనిషి మృగమ దాయె మదము నిండె
ఆస్థి కొరకు వేట అన్నదమ్ముల కోత
తారు మారు జగతి తలలు మొలిచె ॥
[11/3/2021, 16:16] p3: 03-11-2021: బుధవారం
అంశము: ఐచ్ఛికము
ప్రక్రియ: కందపద్యము.
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య : 3.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
కం॥
శ్రీశా శ్రీగిరి మందిర
వాసా వైకుంఠ పరేశ వరగుణ శీలా
ఈశా ఈప్సితవర-జగ
దీశా పలుకంగ రావ దినకర తేజా ॥
కం॥
పలుకర పన్నగ శయనా
చిలుకర దయ రంగరంగ చిద్ఘన రుాపా
నిలువర నినునే వేడితి
కలువల కనులున్నవాడ కమలజ నాభా ॥
కం॥
దీపపు వళులను పేర్చితి
పాపములను పారద్రోల పరుగున రారా
ఆపద బాపెడు వాడవు
నీపదముల నమ్మినాను నీరజనాభా ॥
[11/3/2021, 20:10] p3: రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
కం॥
శ్రీశా శ్రీగిరి రమణ-హ
రేశా శ్రితపాలకా పరేశా కృష్ణా
ఈశా ఈప్సితవర-జగ
దీశా పలుకంగ రావ దినకర తేజా ॥
సవరించి పంపినది..ధన్యవాదాలండీ..🙏🙏
[11/4/2021, 19:28] p3: 4/11/2021. గురువారము.
అంశం : దీపావళి.
ప్రక్రియ : ఇష్టపది .
మ.సా.క.సం: 19.
కవిత సంఖ్య : 4.
శీర్షిక : ఐదు రోజుల పండగ.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అమావాస్య దినమున అడుగిడినది నిండుగ.
ఐదురోజులవరకు ఆచరించు పండగ.
అసురబాధలణగిన ఆనందపు పండగ.
ఐశ్వర్యము లొసగిన అలరు దీప పండగ.॥
1.ధన త్రయొాదశి"
ఆశ్వయుజ త్రయొాదశి అదెగ "ధన త్రయొాదశి"
ఆతల్లి ధనలక్ష్మి అడుగిడే మహాదశి.
కుబేర సహిత లక్ష్మి కుార్మి యొసగు భాగ్యము
"ధన్వంతరి జయంతి "ధనారోగ్య బలముా ॥
2..నరకచతుర్దశి"
"నరకచతుర్దశి"నదె నరకాసుర మరణము
నరకు వధానందము నలుగుతోడ స్నానము.
బాణసంచారాల బాణాసుర నిరసన
తీపి పంపకాలవె తీర నసురుల భయము॥
3..దీపావళి.
సత్య శక్తి రుాపిణి సంధించెను బాణము.
నరకునిలను గుాల్చెను నభము పుాలు కురిసెను
ఆశ్వయుజ అమవాస్య అదె నరకుని అంతము
దీపకాంతి నిండిన దీపవళుల అందము ॥
4..బలి పాడ్యమి "
బలినణచిన దేముడు బహుబల సంపన్నుడు
వామనావతారుడు వాడే శ్రీకృష్ణుడు
"బలి పాడ్యమి "రోజున బలి రాజు వేడుకలు
గోవర్ధన మెత్తిన గోపాలుని పుాజలు ॥
5. భగిని హస్త భోజనం.
కార్తీక శుభ విదియ కడు మంగళ ప్రదము
"భగినింట భోజనము " భయ,మృత్యు వారణము .
ఆప్యాయత నిండిన అనుబంధ కారణం .
అన్న, చెల్లి ప్రేమకు ఆదర్శ మౌదినం ॥
శ్రీ క్రిష్ణుడు దేముడు శ్రీలొసగవతారుడు
ఇహ పర సాధనతొ ఇచ్చు శాంతి సిరులు
జగదీశ్వరి కొలచిన జగన్నాధుడడీతడు
జయమొంద కొలువరెే జగదీశుని జనులుా॥
దీపాల పండగకు దీవెనల విందు గొను
రక్త బంధాలకుా రక్షణిడుటె ధర్మము
రాక్షసత్వ మణచుటే రమాకాంతు కార్యము
సమానత్వ భావము సర్వులకు శుభముా॥
హామీ: ఈ ఇష్టపది నా స్వీయ రచన.
[11/5/2021, 18:17] p3: అభేరి రాగం .
రచన:
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముర్తి.
కల్యాణ్ మహారాష్ట్ర
పల్లవి
-----------
మరి మరి కొలువరే శ్రీపతి చరణాలు
సేయరే గోవింద గోవిందు భజనలు ॥ మరి మరి ॥
1. చరణం.
వడి వడి తెలవారే తీయరే గంధములు
తిరువరు సేయరే సింగారములు
మరుమల్లెలు మందారపు మాలలు
చేర్చరే పదముల తులసీ సుగంధాలు ॥ మరి మరి ॥
2. చరణం.
--------------
పాడరే పడతులు మంగళ గీతాలు
వేడరె జనులుా విడ భవ బంధాలు ...
కోరరే కైవల్య ధామపు సిరులు
చేరరే సిరిపతి వెలయు శ్రీ గిరులు ॥ మరి మరి ॥
[11/10/2021, 17:01] p3: తేది: *10-11-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *కందము*
మ.సా.క.సం.: 19.
కవిత సంఖ్య : 2.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
1. కంద పద్యములు.
ఆ రణమందున పార్ధుని
సారధివై సమరమందు సకలము నీవై
భారము నంతయు గైకొని
సారపు గీతను దెల్పిన సఖశ్రీ కృష్ణా ॥
2.
సమ బుధ్ధి నిడిన జ్ఞానులు
తమ కర్మ ఫలము త్యజించి ధరణిని మనుచున్
భ్రమణము జనన మరణపు
గమనమ్ముల ముక్తులౌచు గణులౌ నిలలో ॥
[11/11/2021, 20:47] p3: మహతీ సాహితీ కవి సంగమం
మ.సా.క.సం.19
కవిత సంఖ్య 3.
11/11/2021
అంశం: పాండవ మధ్యముడు.
ప్రక్రియ: ఇష్టపది .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
దేవేంద్ర నందనుడు దేవి కుంతీ సుతుడు
పాండవుల మధ్యముడు పరమాత్ము సఖుడితడు॥
బహు బలుడు,తేజుండు బాణాస్త్రధారుండు
సాత్యకీ సఖుడితడు సరి సవ్యసాచితడు ॥
అందమైన వానిగ ఆరోగ్యవంతునిగ
పాండవుల అనుజునిగ పతి అతడు ద్రౌపదికి ॥
విలువిద్య ఘనునకుా వినయశీలులు సతులు.
శుభద్ర , చిత్రాంగద శుభము లొసగెడువారు .॥
అజ్ఞాత వాసాన అతడేగ బృహన్నల
మహా భారత కధకు మహిని కీలకు డితడు
అరణ్య వాసమునదె ఆచరించీ తపము
పరమేశు మెప్పించి పాశుపతాస్త్రమొందె ॥
కర్తవ్య నిష్ట నిడు కార్యసాధకుడితడు
కడు బంధు ప్రీతి నిడు కరుణ గల్గిన నరుడు.
సంగ్రామ సమయాన సరి బంధువుల జుాచి
తనవారి జంపుటది తగదు తగదన్నాడు ॥
భగవంతుడు కృష్ణుడు భామదె వహియించి
సారధిగ నిలిచేను సరి బోధ జేసేను
నాటి భగవద్గీత నేటికిల సుాక్తిగా
జ్ఞాన మార్గము గుాపు జ్ఞాన నిధి యైనదిగ॥
ఆది భగవద్గీత కర్జునుడు కారకుడు .
సార తత్త్వము దెల్పు సామి శ్రీకృష్ణుడుా
గీత యొక్కటి చాలు గీర్వాణ ఫలమదే
వినుము ఈశ్వరి మాట వివరమెరుగగ ఇలను॥
[11/16/2021, 16:39] p3: 16/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
1.
ఘోరుడను ఋషిపుత్రుడు ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి కణ్వుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా ప్రాశస్త్యము నొందెను॥
2.
వేద మంత్ర ద్రష్ట- రు గ్వేదమంత్ర పుాజ్యుగా
చతుర్వేదమందున చర్చ కణ్వ ప్రార్ధన .
విశ్వమిత్రు జేరెను విధి పుత్రి శకుంతల
కణ్వుాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥
3
గాడమైన యొాగము గాంధర్వ వివాహము
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసును శాపము
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥
4 .
శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥
5
యాత్ర జేయ కణ్వుడు యాదవ పురమేగెను
సరసమాడు యాదవులు శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను ముప్పుగనదె మారెను ॥
6
యాదవులు నశించెను యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా గనినట్టే చదివెను
జగదీశ్వరి మురిసెను జగమునకెరిగించెను ॥.
[11/17/2021, 18:43] p3: 17/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
ప్రక్రియ : కంద పద్యములు .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
నారా యణనీ నామము
నోరారగ జపము జేతు నోముగ నెపుడున్
పారాయణ జేతు జనో-
ద్ధారా నను బ్రోవవేర ధరశుభ చరణా ॥
శ్రీపతి నీవని వేడితి
ఆపదలను బాపరావ ఆపద్బాంధా
పాపములను శమియించవె
దీపము వలె వెలుగు జుాపు దీనోద్ధరణా ॥
నారాయణ నీ మంత్రము
పారాయణ జేయు వారు పావను లౌచున్
దారా సుతులను విడి,మన-
సారా నినుకొలి చెపాద సన్నిధి జేరన్ ॥
[11/18/2021, 14:36] p3: మహతీ సాహితీ కవి సంగమం.
18/11/2021. గురువారం.
అంశం :కార్తీక పుార్ణిమ .
మ.సా.క.సం. : 19.
కవిత సంఖ్య : 3.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .
కార్తీక మాసముా ఘన శుక్ల పక్షముా
పున్నమి తిధి దినముా పుార్ణ చంద్రోదయము॥
హరి హరులకిద్దరికి అది ప్రీతి మాసముా
పురాణ ప్రాశస్త్యము పుాజ్య ఋషుల విదితము ॥
హరి హరుల నామము హర్షమునజపించుచు
మునులు జనులు వారిని ముదముగ పుాజింతురు॥
నెల రోజుల పుాజలు నెలకొను పుణ్యములు
శుభ కృత్యముల ఫలము శుద్ధమౌను మనసులు॥
వ్రతములు పుాజలకును ప్రాశస్త్యము పౌర్ణమి
ఇద్దినమున పుాజలు ఇచ్చును శుభ ఫలములు ॥
శివాలయమునందును శివార్చనలు జరుగును
మహాన్యాసపుార్వక మంత్రాభిషేకములు॥
ఋత్వికులు చేసెదరు ఋద్రాభిషేకములు
సహస్ర లింగార్చన సకల సిద్ధి సాధన ॥
లభియించు మనుజులకు లయకారుని వరములు
కోటి జన్మ ఫలములు కోరు సిరి సంపదలు ॥
కార్తీకపురాణము కడు భక్తితొ చదువుము
పసుపు కుంకాల పుాజ పడతులకానందము ॥
నదులందు స్నానము నమ్మికతో చేయుచు
హరిహరులను తలచిన హరియించును పాపము ॥
దివ్య కార్తీకముా దీపారాధనముా
తులసికోట ఎదురుగ తృప్తి గ వెలిగింతురు ॥
అఖండ దీపాలుా ఆకాశ దీపాలు
అరటి దొన్నెలో ధీప ఆరాధన జేతురు.॥
విషవాయు శుద్ధగును విషజ్వరములు తగ్గును
కాలుష్యము తగ్గును కలుగునారోగ్యముా ॥
త్రిపురాసురులగుాల్చ త్రిపుర పుార్ణిమనాడు
హరుడందరి శక్తితో అసురులనిల గుాల్చెను ॥
అందరికానందము హరిహరుల ధ్యానముా
ఆనంద దీపమే ఆనందా దీపము ॥
ఈ నెల కార్తీకము ఈశ్వరి సేవించెను
ఈశ్వరి పుాజలుగొని ఈశుడె దీవించెను ॥
ఈ ఇష్టపది , నా స్వీయ రచన.
[11/20/2021, 20:00] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
తేది:*20-11-2021*
అంశం: *దత్తపది*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ: ఆటవెలది.
క్రమ సంఖ్య: 19
కవితా సంఖ్య : 4.
ఇంటి (దీప) మాలి ఇడుముగౌ రవప్రేమ.
(ధుాప) మింట వేయ దురిత శమము
(తాప) మెక్కి నరుడు తప్పుజేసి నయెడల
(పాప) మిలను పెరిగి పగులు ధరణి ॥
చిన్న (దీప) మున్న చీకట్లు తొలగును
(ధుాప) మేయ క్రిములు దుార మౌను
కోప (తాప )ములతొ కోల్పోవు సుఖములు
(పాప) భీతి ధర్మ పథము జుాపు ॥
[11/20/2021, 21:53] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
తేది:*20-11-2021*
అంశం: *దత్తపది*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ: తేటగీతి
క్రమ సంఖ్య: 19
కవితా సంఖ్య : 4.
(దీప) దానము జేయుట దివ్య మౌను
(ధుాప )మిడిభవు నికొలువ దుఃఖ శమము
(తాప )సహరుని పుాజింప తరుణ మిదియె
(పాప) ములబాపు కార్తీక పర్వ మిదియె॥
[11/22/2021, 15:47] p3: 22/11/2021. సోమవారం.
మహతీ సాహితీ కవి సంగమం .
చిత్ర కవిత.
ప్రక్రియ : ఆటవెలది .
శీర్షిక : కలి ప్రవేశం.
మ.సా.క.సం.: 19.
కవిత సంఖ్య : 01.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
పిచ్చి ముదిరెనిలను పిల్లకుా పెద్దకుా
సిగ్గు లేని వింత సిత్ర మిదియె
చేత నున్న దేదొ చేస్తున్న పనియేదొ
తెలివి లేని పనుల తెగువ జుాడు ॥
అమ్మ తనము లేదు ఆడరుా పములేదు.
రంగు లేసి మురిసె రమణు లెల్ల
పిల్ల దాని చేరి పిచ్చి చేష్టలు చేసె
ఖర్మ గాదటె కలి కాల మిదియె ॥
[11/24/2021, 11:36] p3: మహతీ సాహితీ కవి సంగమము.
24)11/2021.
అంశము : ఐచ్ఛికము.
ప్రక్రియ : కందపద్యములు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
మ.సాక.సం : 19
కవిత సంఖ్య 2.
అతివకు అణకువ అందము
మితి మీరిన మాట లొద్దు మితములె ఘనమౌ
మతినిడి మసలిన గౌరవ--
మతిసఖు లనుగుా డిచెడకు మహిలో మనగన్ ॥
ఇల్లదె సర్గము ఇల--స్త్రీ
తల్లంటిది మనకు గాద ధరలో యనుచున్
తొల్లదె పలికితిరెందరొ
కల్లలు యైనవి పలుకులు కలికాలమునన్ ॥
యొాగము లష్టాదశముల
రాగము విడికర్మజేయ రణ నీతనుచున్
భాగము సవ్యసాచికదె
ఆగమ పంచమముజెప్పి నావుగ కృష్ణా ॥
[11/25/2021, 19:28] p3: 25/11/2021
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : వన భోజనాలు .
శీర్షిక : ప్రకృతి మనకు వరం.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
మ.సా.క.సం.: 19.
కవిత సంఖ్య : 3 .
ప్రక్రియ : ఇష్టపది .
కార్తీకమాసముా కడు పుణ్య మాసముా
కలసి పుాజలుజేయ కలుగునట పుణ్యముా।
హరి హరులు ఇద్దరును హరియించు పాపములు
వెలిగించ జ్యోతులను వేయి నోముల ఫలము ॥
ఉసిరి వృక్షము నందు ఉందురట వాసముా
కొలువున్న దేవతల కొలుచు మీ మాసముా।
సాలగ్రామము నిడి సందడుల భజనలుా
పాలాభి షేకాలు పలు పుాజలు వ్రతములు ॥
ఫల పుష్ప ములనిచ్చు పచ్చన్ని తరువులను
పెక్కు మక్కువ తోడ పెంచి పోషీంచెదరు.।
మనము పీల్చే గాలి మన పాడి పంటలవి
చెట్లు ఇచ్చిన ఫలమె చేటు చేయని ఘనమె ॥
వన భోజనాదులుా వరుస పంక్తుల నిడుచు
జాగరణలవె జేసి జయములవె పొందెదరు.।
పిల్ల పెద్దలు చేరి పిలుపు అలుపులతోడ
అడెదరు ఆటలుా పాడెదరు పాటలు ॥
ప్రకృతి సంపదల నిల ప్రాశస్త్యమును తెలిసి
వనభోజనాదులను వలచి సేవించెదరు.॥
ఆ చెట్ల నీడలో ఆచరించిన విందు
ఆరోగ్య కరమౌను ఆనంద కరమౌను ॥
ధార్మికపు గ్రంధాల దర్మనీయము విందు
సుాతమహర్షి చేసె సుందర వన బోజనము
కార్తీక మాసాన కార్తీకపురాణము
ఉసిరి చెట్టు నీడ ఉత్సాహమున చదువు ॥
అరటి ఆకున విందు అర్ధమున్నది వినుము
విస్తరాకుల లోన విందు భోజన ఫలము ।
మన సాంప్ర దాయాలు మన సంస్కృతులు మెండు
ఏ పద్ధతేదైన ఎరుగ విషయములుండు ॥
ఉసిరి కాయల పైన ఉజ్వలపు జ్యోతులిడి
కార్తీక పున్నమిని కడు దీపములు బెట్టు
అరటి దొన్నెలలోన అర్ఘ్య దీపములిడి
ఆ గంగలో విడిచి ఆ తల్లినే కొలువు ॥
నీటి కొరతలు రాక నిత్య హరితము తోడ
విలసిల్ల నీ పుడమి విలువ తెలిసీ మనుమ ॥
బీదసాదలకిడుమ బియ్యముా గోధుమలు
వనభోజనాదులలొ వలపు పంటలె మెరయు ॥
ఎంత జెప్పిన గాని ఏమి జేసిన గాని
తీర్చలేనిది ఋణము తిరుగ పొందని ధనము.
వనములే లేకున్న వడలు గద మన జన్మ
ఈశ్వరీమాటిది ఇది నిజముగా నమ్ము ॥
[11/26/2021, 15:15] p3: మహతీ సాహితీ కవి సంగమము.
26/11/2021.
అంశము : ఐచ్ఛికము.
ప్రక్రియ : బాలల గేయం.
అందాల ఓచిలకా... సినిమా పాట పేరడీ..
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
మ.సాక.సం : 19
కవిత సంఖ్య : 4
పల్లవి:
అందాల ఓ పాపా...
వినరావె నా మాటా.
అనుపల్లవి:
నే కధలెన్నొ చెపుతానుా..నీ
మది మంచె తలచేనుా..
చరణం. 1.
పెద్దల మాటవు వినవేలా
పిలచిన పలుకవు కులుకేలా..
ముద్దుపాపవని దరికిరమ్మని
పిలచిన విసుకది ఎందుకనీ
అక్లరెందుకే చదవమందుకే
బ్రతుకు భారమని
తలచుటెందుకే ॥ అందాల॥
చరణం 2.
ఆన్ లైన్ చదువులు చదవాలీ
మొాబైలు ఆటలె విడవాలీ
పనికిరానివీ చుాచుటెందుకే
వయసు మించినా మాటలెందుకే...
పెరుగు వయసులో మంచినేర్చితే..
అడుగు అడుగునా పుాలబాటలే ...॥ అందాల ॥
చరణం:3.
కలసిరానిదీ కాలమిదీ
కాలరాసినా బ్రతుకులివీ..
అడుగు తడబడే బ్రతుకు ఆటలో
తోడురారు నీకెవరు బాటలో
ఎదురుదెబ్బలకు ఓడిపోనిదీ
మేధ నిండిన మనిషి జన్మిది..॥అందాల ॥
చరణం 4.
అమ్మా నాన్నలె దైవాలుా
పెద్దలె జ్ఞాన దీపాలుా
వారి మాటలో వెలుగు బాట జని
మాట తీపితో పొందు కీర్తినీ..
ధనము మించినది మంచి తలపులే
మంచి నడతలే మహిని గెలుపులే..॥అందాల ॥
[11/27/2021, 16:58] p3: తేది: 27-11-2021: శనివారము.
దత్తపది: ధర్మము- అర్ధము- కామము- మోక్షము ( పురుషార్థాల విశిష్టత ).
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ: పద్యము.
మ.సా.క.సం : 19.
కవిత సంఖ్య : 5.
పద్య ప్రక్రియ : ఆటవెలది.
(ధర్మ )పథము విడకు , ధనలోభ మదివీడు
(అర్థం) మదియె మనిషి కవని బ్రతుక
(కామ) మదియె నిన్ను కడునాశ నముజేయు
(మొాక్ష ) జీవి గమను మొాద మదియె ॥
ప్రక్రియ : కంద పద్యము.
(ధర్మము) తోడను మెలుగుచు
కర్మములను జేయు నీవు (కామము) విడచిన్
మర్మము పర(మార్ధము) లివె
నిర్మల మది(మొా క్ష)మొంద నిత్యాచరణన్॥
[11/29/2021, 15:22] p3: తేది: *29-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: *ఐచ్ఛికం".వచనం .
శీర్షిక : తాను తీసుకున్న గోతిలో తానే..సమాధి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
మ.సా.క.స..19.
కవిత సంఖ్య : 1.
స్వాతంత్ర్యానికి ముందు బానిసగా బ్రతికిన మనిషి
స్వాతంత్ర్యానంతరం తన మేధకు పదును పెట్టేడు.
చదువు సంస్కారాలతో పాటు సుఖజీవితానికి
కావలసిన సదుపాయాలు , ఇళ్ళు , యంత్రాంగాలు
భుా వాహనాలు, ఆకాశ యానాలు , క్షిపణులు
ఇలా ఎన్నో, తన మేధస్సుకు పదును పెట్టి, భరతావని
చరిత్రకు కీర్తి కిరీటం తొడిగేడు.
కాలం గడుస్తున్న కొద్దీ రాజులు మారారు.
రాజ్యాంగాలు మారేయి. నీతి- నియమాలు
దారి తప్పేయి. మనిషిలో స్వార్ధం పెరిగింది.
మమతలు, మానవత్వం , నశించేయి .
వావి వరుసలు, రక్త సంబంధాలుా కుాడా మరచి
కాముకులై మృగాల్లా వ్యవహరిస్తుా
ముందుకు దుాసుకు పోయిన మనిషి--కేంద్ర-
రాజకీయ స్వార్ధపు దురాగతాలకు,నలిగిపోయేడు.
తమ ఓటు హక్కును "నోట్ల"కట్టగా మార్చుకొని.
మనీకి, మందుకి లోబడి అదే జీవితానందమని
తలచి తిరిగి బానిసగా మారేడు. మనిషి జ్ఞానాన్ని మందుతో దోచుకున్న రాజకీయ దుండగులు మనిషి మెదడును దొలిచి మేధో రసాన్ని పీల్చి , పిడిచి
పిప్పి చేస్తుా, మనిషి కనుగొన్న ప్రగతి పథాల సిరి-సంపదల ఖనులను, ప్రైవేటీకరణ పేరుతో విదేశాలకమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టేరు.
మనీషి గా ఎదగవలసిన మనిషి, "మనీ" షి"లకు
లోబడి , రాజకీయ వైఫల్యాల విష పరిమాణానికి
లోనౌతున్న తమ జీవితాలను తిరిగి చక్కదిద్దుకుందామనుకొనే లోపే, రాజకీయ మాంత్రికులు తమ లోగల తెలివి , బుద్ధి, ఆలోచనలు గల మెదడు సారాన్ని తమకి తెలీకుండానే, రోజు రోజుకుా పీల్చి, పిప్పి చేస్తున్న సంగతి తెలుసుకొని,
తాము పుార్తిగా దోచుకోబడ్డాడని, రాజకీయ రణ నీతులకు తిరిగి తాము పుార్తి బానిసలుగా మారేమని తెలుసుకొని ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో, నిలువుగుడ్లేసు కొని, దిగ్భ్రాంతికి లోనవుతున్నాడు .
హతవిధీ...మనిషి మనిషితో ఆడుకొనే ఈ
ఆటలకు అంతమెప్పుడో...
హామీ:
ఈ రచన నా స్వీయ కవిత.
[11/30/2021, 13:34] p3: మహతీ సాహితీ కవి సంగమం.
తేది: *30/11/2021* (మంగళవారం)
అంశము: *సాహిత్యాంశము*
*(కశ్యప మహార్షి)*
ప్రక్రియ: *ఐచ్చికము*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
మ.సా.క.సం.19
కవిత సంఖ్య : 2.
శీర్షిక : కశ్యప ప్రజాపతి.
"శతపథ బ్రాహ్మణంలో" చెప్పిన విధంగా
కశ్యప రుాపుడైన ఇతడు ప్రజాపతులలో ముఖ్యుడు.
"అథర్వ వేదంలో కశ్యపుడు," కాలంలోంచి
పుట్టిన ప్రప్రథమ మానవుడని చెప్పబడినది.
నేటి "వైవస్వత మన్వంతరం" , వివస్వత మనువు
పేరుతో చెప్పబడుతోంది.
"వివస్వత మనువు" తండ్రి కశ్యప ప్రజాపతి.
" వాల్మీకి రామాయణం" ప్రకారం బ్రహ్మ దేవుని పుత్రుడు .
అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరైన కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
కశ్యపుడు దక్షునికి గల 27 మంది కుమార్తెలలో 13 మందిని, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము చేసుకుంటాడు.
కశ్యపునకు వీరిలో
"అదితి "వలన సుార్య వంశానికి మూలపురుషులైన
ఆదిత్యులునుా,
"దితి" వలన రాక్షసులైన
హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులును ,
"వినత "వలన గరుత్మంతుడు, అనూరుడునుా,
కద్రువ వలన నాగులునుా,
"భాగవత పురాణం" ప్రకారం కశ్యపునికి ఒక "ముని "వలన అప్సరసలునుా జన్మించారని పురాణ కథనాలు.
అంతేకాదు జల, జీవ ,జంతు చరాలు, కృుార మృగాలు, గోవులు, పక్షులు, మానవులు, చెట్లు చేమలు, గంధర్వులు , చెడు ఆత్మలు కాక
అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ
ఇలా ఒకటేమిటి
చరాచర సృష్టి కంతటికినీ కారణభుారుడైనవాడు
కశ్యపుడు.
హిందూ సమాజ సంప్రదాయములలో , పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు.
ఎవరికైనా తమ యొక్క గోత్రం తెలియనప్పుడు తమది "కాశ్యప గోత్రమని" చెప్పుకోవచ్చును.
"అరిష్టనేమి" అనే పేరుగల కశ్యపునికి
"పరశురాముడు" భూమినంతతినీ దానం చేస్తాడు. .
అంతటి ప్రాధాన్యత గల "కాశ్యప ప్రజాపతి" జయంతిని "హస్తా నక్షత్రంతో కూడి ఉన్న శ్రావణ శుద్ధ పంచమి" నాడు ఆచరించడం మన సాంప్రదాయం.
[12/1/2021, 18:25] p3: 1/12/2021....
మహతీ సాహితీలో ,
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *ఉత్పలమాల*
మ.సా.క.సం.19
కవిత సంఖ్య : 4
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
రాసితి వీవు పాటలను రాయుచు రాయుచు
వీడి పోవగన్
మేలగు గాన బాంధవుడ మేటిగ పాటల
రాయుమా యనీ
అక్షర కన్య లెల్ల కడు ఆత్రముగా నిలువంగ
జుాచి తా--
జేసిన దేమి లేదనియు చిందెను హాసము
రామ శాస్త్రియే॥
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అశ్రునివాళితో...
[12/2/2021, 20:35] p3: 2/12/2021.
అంశం: భక్తి భావనలు .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మ.సా.క.సం: 19.
కవిత సంఖ్య : 4
ప్రక్రియ : ఇష్టపది .
ప్రతిఫలము నాశించ ప్రతిమ పుాజలు మాను
మనసు లగ్నము చేసి మహదేవు ప్రార్ధించు ॥
నిస్వార్ధ చింతనము నిజ భక్తి మార్గమది.
నిత్య పుాజలసేవ నీ వెంచు మార్గమది ॥
సత్య నిర్మల భక్తి సారసాక్షుడె మెచ్చు
నిత్య కర్మల ఫలము నీ కంటనీయడుగ
తానె కర్మకు కర్త తానె ధర్మసు కీర్తి
అన్నియును తానౌచు ఆత్మ నుండెడు శక్తి ॥
ఉపవాస దీక్షలుా ఉత్కృష్ట బోధలుా
భగవదారాధనకు భహు మంచి మార్గములు
నిశ్ఛలపు స్థితి లేని నిత్య పుాజలకన్న
నిర్మలపు మదిజేయు నిత్య సాధనె మిన్న ॥
పరుల నొప్పించకను పరనింద వేయకను
పరమాత్ము సేవించ ఫలిత మెంతో మిన్న ॥
మనసులో పరమాత్మ మను గదా నీతోనె
మహినీశ్వరీమాట మను భక్తి భావాన ॥
[12/4/2021, 18:52] p3: తేది: * 4-12-2021: శనివారము*
దత్తపది: * ఇడ్లి- దోశ- పూరి- వడ* (
ప్రక్రియ: ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల -జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
మ.సా.క.సం : 19
కవిత సంఖ్య : 4
పుాజ్య శంఖ మునదె (పుారిం)చ క్రిష్ణుండు
వదలె ధనువు నరుడు (వడ)లి కృంగి
దొడ్డ గురుల జంప ( దోస)మ్మ న(నిట్లీ( డ్లీ )
విధము హరి జెప్పె విధిగ గీత ॥
[12/6/2021, 18:35] p3: *06-12-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: *ఐచ్ఛికం*
శీర్షిక : ఓ మనిషీ ! మేలుకో !
(వచన కవిత.)
మ.సా.క.సం : 19.
కవిత సంఖ్య : 5.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
*అభివృద్ధి పేరుతో అస్తవ్యస్త రాజకీయాలు.
*ప్రజల సొమ్ము దోచుకొనే రాజకీయ వ్యుాహాలు.
*అవసరానికందని ప్రభుత్వ పథకాలు.
*సమాజ బాధ్యతెరుగని ప్రజా పావులు.
*సభ్య సమాజానికి తావివ్వని కులమత బేధాలు.
*వావి వరుసలెంచని వరుస క్రుార చర్యలు.
• ప్రజలను మభ్యపెట్టే తీరులో రాజకీయ కార్యకలాపాలు.
• మన దేశ ప్రగతికి తీరని లోపాలు.
• విదేశీ వ్యామొాహంతో వీధికెక్కిన బ్రతుకులు.
• పరిశుభ్రత పాటించని పరనిందాప్రతాపులు.
• పెరుగుతున్న జనాభాతో ప్రగతి పథ అవరోధాలు.
• పచ్చదనం కరువైనా ప్రగల్ఫాలు పలికే ప్రతినిధులు.
• ప్రదుాషణతో నిండుతున్న భారత బహిరంగ స్థలాలు.
• స్వార్ధం నిండిన నాయకుల స్వశ్ఛ భారత్ ప్రణాళికల వైఫల్యాలు.
• అధికార బలానికి ఆహుతౌతున్న ప్రజా ప్రగతి పథ సాధనాలు
• పరదేశ ప్రైవేటీకరణ కు లోనౌతున్న స్వదేశీ సంపత్తులు.
• నిర్వీర్యమౌతున్న మేధకు నీరుగారుతున్న జనాలు.
• పెరుగుతున్న జనాభాకు, తరుగుతున్న భుాభాగాలు.
• పరిశుభ్రతకు తావివ్వని పనికిరాని బాసలు.
•కుళ్ళిన వ్యవస్థలో కాపురముంటున్న కరోనా వంటి కణాలు.
• రోడ్ల బారుల్లో నిండుతున్న రోగుల శవాలు.
• దారి కానరాక, చేసే ముాకుమ్మడి దహనాలు.
• బొమికల పునాదులేసి లేపుతున్న ఆకాశ హార్మ్యాలు.
• నీటి కరువుకు నిర్వీర్యమౌతున్న పంట భుాములు.
• అన్నదాత కన్నీరే అవని నిండు శాపాలు.
• అసహాయుల హాహాకారాలు,రైతన్నల అత్మహత్యల అక్రోశాలు.
• బడగు బ్రతుకుల్లో ఆరిపోతున్న ఆశా దీపాలు.
• పెరుగుతున్న ధరల వలలో పెనుగులాడుతున్న జనాలు.
•ఊపిరాడని జనాల మస్తిష్కంలో పగ నిండిన పొగలు.
• ఆ పొగల సెగల సంకేతాలు ,అరాచకం అగ్నిలో దహనమవ్వకముందిడే...మేల్కొల్పుకు చిహ్నాలు॥
•
***************************************
[12/7/2021, 20:16] p3: మహతీ సాహితీ కవి సంగమం .
7/12/2021.
అంశం : శ్రీనాధుని రచనల లో మీకు నచ్చినది
శీర్షిక : చాటు పద్యాలు.
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య 2.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
బాల్యములోనే మరుత్తరాట్చరిత్ర అనే
బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు.
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్టుడయాడో చాటువుల ద్వారా కూడ అంతే
ప్రసిద్ధిగాంచినవాడు.
కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన యైన శ్రీనాధుడు.
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది.తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన అతని చాటు పద్యాలు ఎంతగానో ప్రాశస్త్యం పొందేయనడంలో సందేహం లేదు.
వాటిలో
నాకు నచ్చిన కొన్ని చాటుపద్యాలు..
సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్॥
పల్నాటి సీమలో నీరు లేక పంటలు పండక క్షామం
వచ్చి అల్లలాడుతున్న ప్రజలను చుాచి తట్టుకోలేని శ్రీనాధుడు ఆ పరమేశ్వరుని "గంగమ్మ" ను విడవయ్యా అంటుా చెప్పిన చమత్కార పద్యం...
అర్ధింపుతో పాటు నిందనుకుాడా జోడించి
భిక్షుకుడవైన నీకు ఈ కరువులో ఇద్దరు భార్యలెందుకయా? గంగమ్మను విడిచిబెట్టంటుా చెప్పిన పద్యం..
2వ పద్యం
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్
ఈ కరువునిండిన పల్నాడులో రసికతకు చోటెక్కడ.
రంభయైనా నేకులే వడకాలి , మన్మధుడైనా జొన్నకుాడే తినాలంటుా..చెప్పిన పద్యం..
సర్వజ్ఞ భుాపాలుని దర్శనార్ధం వెళ్లేడు.
పెదకోమటి వేమారెడ్డికినీ , సర్వజ్ఞ భుాపాలునికినీ మధ్య నున్న వైరం తెలిసిన శ్రీనాధుడు
సర్వజ్ఞ భుాపాలుని
శివునికి , మీకుా తప్ప సర్వజ్ఞ భుాపాలుడను నామం మరెవరికుంది. అని పొగడి ప్రశంస లందుకున్నాడు .
అతడు చదివిన పద్యమిది..
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే ॥
శ్రీనాధుడు...పెదకోమటి వేమారెడ్డి దగ్గరకు వచ్చి
రెండవ పాదం లో జనపాలున .."..కేయుర్విన్ జెల్లును.".అని చదివి వినిపించి , మీకు విరోధియైన ఆతనిని ఈ విధంగా తిట్టి వచ్చేనని చెప్పి, ఆతనిచే సన్మానాలందుకున్నాడు.
3.
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!
నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.
అలాగే అరవ దేశానికి వెళ్ళినపుడు
అచటి ఆడవారిని గుార్చి చెప్పిన పద్యం ..
4.
మేత గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల (
ఈ రకంగా ఎన్నో చమత్కారాలు నిండియున్న ఈతని
రచించిన చాటు పద్యాలు జనరంజకములై ప్రసిద్ధి గాంచేయి. ఇలా శ్రీనాధుని రచనలగురించి ఎంతచెప్పినా తక్కువే..
[12/10/2021, 16:16] p3: 10/12/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
ప్రక్రియ : ఐచ్ఛికం.
శీర్షిక : అప్పగింతలపాట.
రచన: సంగీతం : గానం:
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
మ.సా.క.సం..19.
కవిత సంఖ్య : 5
పల్లవి :
కంటిపాప నీవమ్మా మా ఇంటికీ
కన్నులనీరిడకమ్మా ఏనాటికీ..
అను పల్లవి :
మెట్టినింటి దీపమై ఏలు రాణివై
పుట్టినింటి పేరునిలుపు ఏనాటికీ నీ ॥పుట్టినింటి ॥
॥కంటిపాప॥
చరణం:1
అత్త-మామ లోనె చుాడు అమ్మా నాన్ననుా....
ప్రేమతోడ చేయుమమ్మ
వారి సేవనుా....
ఆడబిడ్డ నీ బిడ్డగ నెంచి సాకుమీ...ఆమె
నీ దరిని పొందాలీ తల్లి ప్రేమనీ..
మసలుకోమ్మ మంచిగాను ఇరుగు పొరుగుతో...
మంచి ఇల్లాలుగ పేరు గాంచు నీ నడతతో...॥॥కంటిపాప॥
చరణం : 2.
పుట్టినింటి జ్ఞాపకాలు తీపి గురుతులే..
నిలుపు అత్తింటి గౌరవమే నీకు కీర్తిలే...
కలసి మెలసి ఉండుటలే
శాంతి-సౌఖ్యముా...
కట్టుకున్నవాని వలపదే నీకు సర్గముా...
మెట్టినింటి లక్ష్మి గా పేరు తెచ్చుకో...
పుట్టినింటి పేరు నిలుపు మంచి దారి నడచుకో...
॥కంటిపాప నీవమ్మా మా ఇంటికీ...
కన్నులనీరిడకమ్మా ఏనాటికీ..
మెట్టినింటి దీపమై ఏలు రాణివై..
పుట్టినింటి పేరునిలుపు ఏనాటికీ నీ ॥పుట్టినింటి ॥
****************************************
[12/15/2021, 18:46] p3: మహతీ సాహితీ కవిసంగమం
తేదీ:--15--12--2021
అంశం : ఐచ్ఛికం
ప్రక్రియ:--పద్యం
ఛందస్సు:--ఉత్పలమాల.
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మ.సా.క.సం..19
కవిత సంఖ్య : 3.
1.
కాలము మారిపోయె గద
కర్కశమౌ కణ బాధ లేలగన్ ॥
మేలము లాయెగా బ్రతుకు
మేలగు మందులు లేవులే వెటన్ ॥
కాలుడె కాటువే సెగద
కామము నిండెను ఖర్మమీ గతిన్ ॥
ఏలిక కండ్లుముా సుకొనె
ఏమియు చేయగ లేకనీ స్థితిన్ ॥
2.
ధర్మము దారి మళ్ళునుగ
దారుణమే, దిగజారు నీతులున్ ॥
కర్మము లాదిగా నెచెడు
కాన్పడు మానస రోగులా ధముల్ ॥
మర్మపు మాయలే జగతి
మానము ,ప్రాణము లెక్కలే నిదౌ ॥
నిర్మమకారులాధములు
నీచులు, హీనులె రాజ్యమేలగన్ ॥
[12/16/2021, 18:34] p3: మహతీ సాహితీ కవి సంగమం.
16/12/2021.
అంశం : గోదాదేవి .
శీర్షిక : పుణ్య చరిత.
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 4.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కవిత ప్రక్రియ : ఇష్టపది .
"విష్ణుచిత్తులు" పేరు విష్ణు భక్తులు వారు
రంగనాధుని గొలుచు రస భక్తి గల వారు
వేల పుాలను దేవ వేకువను లేచేటి
నియమ నిష్టలనేలు నిత్య భక్తులు వారు.॥
పుా దోట లో దొరికె పుాల బాలను బోలు
నోము పంటల ఫలము నొక చిన్ని పాపాయి
"ఆండాళ్ళు "యనుచునుా ఆ పాపకు పేరిడి
అల్లారు ముద్దుగా ఆమెనుా పెంచేరు॥
తండ్రితో ప్రతిదినము తాను పోవుచు గుడికి
తానాలు జేసేది తగు భక్తితో నామె.
శ్రీ రంగ నాధునీ శ్రీ కరుని సుందరుని
మదినిండ నిలుపుకొని మనసార కొలిచేది॥
విష్ణు చిత్తుని పుత్రి విడదు రంగని జపము
చిన్న తనముననుండె చిత్తమాతని పరము.
తండ్రి పుాజకు నామె తగిన పుాలను దెచ్చి
మాలలల్లుచు నుండె మదిని రంగని దలచి ॥
అల్లినట్టీ మాలలమర రంగని మెడకు
స్వయము తాను ధరించి స్వామి కేసెడి దంట
నిర్మలమ్మైనదీ నిత్య మౌ నీ భక్తి
రంగనికి హితమాయె రమణి గోదా భక్తి ॥
విష్ణు చిత్తుడు ఎరిగె వింత పుత్రిక భక్తి
అది పాపమని జెప్పి ఆమె కడ్డము జెప్పె
గుడిలోన శ్రీవారి గురుతు ముఖమే వాడె
ఆండాళ్ళు మెడ దాల్చు ఆ మాలలే కోరె ॥
దివ్యమైనది రుాపు దినములవి గడవంగ
పెరిగె రంగని పైని పెక్కు ప్రేమయెగల్గ
వయసు పెరిగిన బాల వలపు చుాపులతోడ
కోటి జన్మల సతిగ కోరె రంగని పతిగ ॥
ఆమె వ్రతముల జేసె నాకోర్కె తీరుటకు
ఉత్తమంబగు రీతి నుపవాస దీక్షలుా
మార్గ శీర్షమునందు మంచు కురిసెడి వేళ
దలచి రంగని మదిని తానమాడెడిదంట ॥
కీర్తనలు పాడుచుా కీర్తించి శ్రీహరిని
మేలుకొల్పెడిదంట మేలు పుాజలుసేయ
చేయ రంగని పుాజ చెలుల నందరి లేపి
ఆట పాటల మురిసి ఆనాధు గొలిచెనట ॥
ముప్పదియౌ దినములు మురిసి ముార్తిని కొలిచి
మొాదమందెడి దంట మొాహనాంగుని చెంత ॥
ఆ కీర్తనలు నచ్చి, అమె దీక్షకు మెచ్చి
రంగనాధుడె వచ్చె నగుమొాముతోనంట ॥
సతిగ రంగని జేరె సత్ చింతనల నేల
ఆ రంగ నాధునికి అర్ధాంగిగా గోద
ఆదర్శ మాయెనుగ అందరికి నామాత
ఐక్య మాయెను తుదికి ఐశ్వర్య మదె గాద ॥
ఆ కీర్తనలె ఇలను అలరె పాశురములుగ
మార్గశీర్షమునందు మహిమ లిడు మంత్రముగ
గోదమ్మతో గుాడె గోవిందు డేలికగ
నిష్ట నియమము లేలు నిజ భక్తదాసునిగ ॥ .
ఇలలోన ఈశ్వరికి ఇష్టమౌ కీర్తనలు
ఆ రంగనే జేర అసలు సోపానాలు.
తరియింపనందరుా తనిగ నాండాళ్ దలచి
శీఘ్రముగ జేయరే శ్రీరంగ సేవలుా ॥
ఇష్టపది నీశ్వరీ ఇచ్ఛతో రాసినది
గోదమ్మ చరితమును గోవిందు జపమునుా
పుణ్య చరితములెల్ల పురుషార్ధముల నొసగు
పుాజ ఫలమును పొంద పుార్తి చరితను చదువు ॥
హామీ :
పై ఇష్టపదులు నా స్వీయ రచనలు.
[12/21/2021, 19:34] p3: 21/12/2021
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : గణాడ్యుడు.
మ.సా.క.సం : 19.
కవిత సంఖ్య : 2.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
సంతానం లేని దీపకర్ణి అనేరాజు చేసిన పుాజల
ఫలితంగా ఆకాశవాణి నుండి. ".రాజా! యడవిలో
పులి మీద నున్న పిల్లవాని తెచ్చుకో ' అన్న మాట వినిపించింది.
రాజు ఆనంద భరితుడై ఆపిల్లవానికి శాతవాహనుడనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు
బాలునికి విద్యా బుద్ధులు నేర్పించి, వివాహం చేసి రాజుగా పట్టాభిషిక్తుని జేసి తాను వానప్రస్థాశ్రమానికి వెళిపోతాడు.
భార్యకు సంస్కృుతం వచ్చు .కానీ శాతవాహనునికి సంస్కృతం రానందున ఒకానొక సందర్భంలో భార్య అన్న మాటకు జవాబు చెప్పలేక అవమానితుడై ,
తన సభలో, తనకు ఆరునెలలో సంస్క్రుతం నేర్పగలిగినవారు గలరా అని ప్రశ్నించేడు.
అపుడు శర్వ వర్మ , గుణాడ్యుడు అనే పండితులు
సిద్ధమయేరు.
గుణాడ్యుడు సంవత్సర కాలం పడుతుందన్నాడు.
కానీ శర్వవర్మ ఆరు నెలలలో తాను చెప్పగలనని
చెప్పలేకపోతే తాను సంస్క్రుత కావ్య రచనలు మాని , రాజ్యము విడచి అడవికి వెళిపోతానన్నాడు. గణాడ్యుడు తాను ఓడిపోతే తానుకుాడా సంస్కృతాన్ని విడచి యడవులకు వెళిపోతానన్నాడు.
శర్వ వర్మ గణాద్యుని పై అసుాయతో పందెం కట్టి
ఓడిపోతానన్న భయంతో తన గురువునాశ్రయించేడు.
దేవీ ఉపాసకుడైన శర్వ వర్మ గురువాజ్ఞ తో , నిష్ట తో
దేవ్యోపాసన చేసి క్రతకృత్యుడై , దేవీ అనుగ్రహంతో ఆరు మాసాల లో రాజుకు సంస్కృతం నేర్పుతాడు.
అన్న మాట ప్రకారం ఓడిపోయిన గుణాడ్యుడు
అడవులకు వెళ్ళిపోతాడు.
పండితుడైన అతడు ఆ అడవిలోగల జంతు , పిశాచాలతో చరిస్తుా...అదే భాషలో "బృహత్కావ్యమ"నే మహత్తరమైన గ్రంధాన్ని రాస్తాడు
.
గుణాడ్యుడు తెలంగాణ మొదటి లిఖిత కవిగా శాతవాహన రాజైన "కుంతల శాతకర్ణికి" ఆస్థానంలో సంస్కృత కవిగా ఉండే గణాడ్యుడు ...కొన్ని లక్షల శ్లోకాలతోపాటు , ఏడు వేల శ్లోకాలతో ఏడు కథలను వివరించిన "భృహత్కథ "అను గొప్ప గ్రంథరాజమును "దేశి " భాషలో రాసి రాజుకు చదివి వినిపిస్తాడు.
ఆ రోజుల లో "దేశి" భాష "పైశాచిక భాష"గా పరిగణింపబడినందున ఈతని కావ్య గ్రంధ రాజమునకు సరియైన రాజు ఆదరణ గాని ,న్యాయం గాని ,లభించక ప్రాముఖ్యతకు నోచుకోలేని కారణంగా
అవమానితుడైన గణాడ్యుడు తాను రచించిన
బృహత్కథా కావ్యమును ఒకొక్క పుటగా కన్నీటితో కాల్చివేస్తుాండగా అతని హితులు అందులో కొంత భాగాన్ని కాపాడగలిగేరు.
ఆ మిగిలిన గ్రంధ రాజములో పదకొండవ అధ్యాయములో, "త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి ఆ అధ్యాయమే
"పంచవిశంతి" అనే పేరుతో ప్రసిద్ధికెక్కి ప్రాచుర్యము పొందినది.
ఎంతోమంది మహాకవులు శ్లాఘించిన కావ్య గ్రంధమీ
"బృహత్కావ్యం ".
No comments:
Post a Comment