Monday, January 3, 2022

సావిత్రీబాయ్ ఫుళే

అంశం :  మాత సావిత్రీబాయిఫుాళే .

 రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )


శీర్షిక  :మహిళ , మహోన్నత శిఖరం 

 అంతర్గత ఆవేశానికి ప్రతిరుాపం.
 స్త్రీ ల హక్కులకోసం తపించిన 
 సామాజిక విప్లవకారిణి .
తొలి మహిళా సంఘ సంస్కర్తగా-
 స్త్రీ ల విముక్తికై  నిరంతర పోరాటం.
 స్త్రీల విద్యాభివృద్ధికై చేసిన ఉద్యమం.
నాడు ఆమె చేసిన పోరాటాల ఫలితం ,
  స్త్రీల ఉన్నత విద్యలకు సోపానం.
 కులం, పితృస్వామ్యంపై 
 కలం యుద్ధం నడిపిన కవయిత్రి.
భర్త జ్యోతీరావ్ ఫుళే సహకారంతో
 నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం 
 పణంగా పెట్టి సమష్టిగా చేసిన పోరాటం .
 శూద్రుల, అస్పృశ్యుల, మహిళల -
  హక్కుల కోసం పోరాటం చేయటం -
  సామాజిక బాధ్యత అనేది -
  ఆ దంపతులు విశ్వాసం.
కుల, వర్గ,లింగ,వివక్షతలు, ఆమె
 పట్టుదలకు తలవంచిన వివశతలు.
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి 
మహిళా ఉపాధ్యాయురాలు.
స్త్రీ హక్కు సందేశాలు విస్తృతంగా   
ప్రచారం చేస్తుా ,బాధ్యలు నిర్వహిస్తూ 
నడిపిన అనేక ఉద్యమాలు.
ఫలితం వితంతువులకు వివాహాలు .
భర్తతో కలిసి శూద్రకులాల బాలికలకోసం 
పూనేలోమొదటి పాఠశాల ప్రారంభించిన
పంచమే ఇల్లుగా  అనాధలు అక్రమంగా పుట్టి రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకున్న 
అమ్మగా  "సావిత్రీబాయిఫుాళే "ఘనత ,
 కుల వ్యతిరేక ఉద్యమాల్లో  స్త్రీ 
హక్కుల పారాటంలో సావిత్రిబాయి 
 నిర్వహించిన పాత్ర మరువలేనిది . 
"సావిత్రీబాయిఫుాళే "ప్రతీ స్త్రీ కి
ఆదర్శ ప్రాయమైన అద్భుత చరిత.
మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం 
ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదన్న
 సందేశాన్ని హేతువాదంగా తమ కవితల లో 
 నింపిన"క్రాంతి బాయి " సావిత్రీబాయి ఫూలే 
ఆధునిక భారతదేశ చరిత్రలో  ఎప్పటికీ
ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
అంశం :  మాత సావిత్రీబాయిఫుాళే .

 రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )


శీర్షిక  :మహిళ , మహోన్నత శిఖరం 

 అంతర్గత ఆవేశానికి ప్రతిరుాపం.
 స్త్రీ ల హక్కులకోసం తపించిన 
 సామాజిక విప్లవకారిణి .
తొలి మహిళా సంఘ సంస్కర్తగా-
 స్త్రీ ల విముక్తికై  నిరంతర పోరాటం.
 స్త్రీల విద్యాభివృద్ధికై చేసిన ఉద్యమం.
నాడు ఆమె చేసిన పోరాటాల ఫలితం ,
  స్త్రీల ఉన్నత విద్యలకు సోపానం.
 కులం, పితృస్వామ్యంపై 
 కలం యుద్ధం నడిపిన కవయిత్రి.
భర్త జ్యోతీరావ్ ఫుళే సహకారంతో
 నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం 
 పణంగా పెట్టి సమష్టిగా చేసిన పోరాటం .
 శూద్రుల, అస్పృశ్యుల, మహిళల -
  హక్కుల కోసం పోరాటం చేయటం -
  సామాజిక బాధ్యత అనేది -
  ఆ దంపతులు విశ్వాసం.
కుల, వర్గ,లింగ,వివక్షతలు, ఆమె
 పట్టుదలకు తలవంచిన వివశతలు.
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి 
మహిళా ఉపాధ్యాయురాలు.
స్త్రీ హక్కు సందేశాలు విస్తృతంగా   
ప్రచారం చేస్తుా ,బాధ్యలు నిర్వహిస్తూ 
నడిపిన అనేక ఉద్యమాలు.
ఫలితం వితంతువులకు వివాహాలు .
భర్తతో కలిసి శూద్రకులాల బాలికలకోసం 
పూనేలోమొదటి పాఠశాల ప్రారంభించిన
పంచమే ఇల్లుగా  అనాధలు అక్రమంగా పుట్టి రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకున్న 
అమ్మగా  "సావిత్రీబాయిఫుాళే "ఘనత ,
 కుల వ్యతిరేక ఉద్యమాల్లో  స్త్రీ 
హక్కుల పారాటంలో సావిత్రిబాయి 
 నిర్వహించిన పాత్ర మరువలేనిది . 
"సావిత్రీబాయిఫుాళే "ప్రతీ స్త్రీ కి
ఆదర్శ ప్రాయమైన అద్భుత చరిత.
మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం 
ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదన్న
 సందేశాన్ని హేతువాదంగా తమ కవితల లో 
 నింపిన"క్రాంతి బాయి " సావిత్రీబాయి ఫూలే 
ఆధునిక భారతదేశ చరిత్రలో  ఎప్పటికీ
ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.



 
  


 
  

No comments:

Post a Comment