సూర్య వర్ణము అంటే 30అక్షరాలు
5 వరుసలు
6అక్షరాలు
శీర్షిక లో రెండు లేక మూడు అక్షరాలు ఉండాలి
2/01/2022.
ప్రక్రియ : సుార్య వర్ణము.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
1. సమయం.
************
కఠిన సమయం
కరోనా పోలేదు
ఒమిక్రాన్ భయం
దుారము పాటించి
మాస్క్ లు వేయుము॥
2. స్త్రీ .
********
స్త్రీలకు మానము
ప్రాణ సమానము.
అమ్మలా చుాడుము
గౌరవ మీయుము
అదియే ఘనము ॥
****************
3. రైతన్న.
**********
రైతుల గనుము.
మట్టిని నమ్మును.
సేద్యము చేయును.
పంటలు పండును.
పొట్టలు నింపును.॥
**************
4. సైన్యం.
************
దేశాన్ని రక్షించు-
భద్రతా దళాలు .
సేనను గుర్తించు.
దేశానికై వారి
ప్రాణాలే పణము.
***************
5. వైద్యుడు.
************
కాపాడే దేముడు.
నడిచే డాక్టరు.
ప్రాణాలు పొిస్తాడు.
మరో బ్రహ్మౌతాడు.
నమ్మకం ప్రధానం ॥
****************
హామీ: పై రాసిన సుార్యవర్ణములు నా స్వీయ రచనలు.
పువ్వు ,కాయ ,పత్రము, నీరు, జాబిలి ,వర్ణము
3./01/2022.
ప్రక్రియ : సుార్య వర్ణము.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
పువ్వు.
********
ప్రకృతి బాలలు
ఎన్నో రంగుల లో
విరిసే సుమాలు .
పుడమికి అందం
వీచే సుమగంధం.॥
**************
కాయ.
******
దోరపు కాయల్లో
పోషక విలువ
పండిన పండ్లవి
జీర్ణపు రసాలు
ఆరోగ్యౌషధాలు.
*************
పత్రము.
*******
పచ్చని రంగులో
పంచును జీవము
ప్రాణ వాయువును
విడిచే గుణము.
ధన్యమైన జన్మ .
***************
జలము.
*******
ఓషధీ తత్త్వము
జీవన వాహినౌ-
గంగా ప్రవాహము
చరాచరముల
బ్రతుకు సారము..
***************
జాబిలి.
*******
పున్నమి చంద్రుడు
కురిసే వెన్నెల
పుడమి నిండుగా
మురిసే జంటల
ప్రేమకు పండగ .
*************:
వర్ణము.
*******
ఏడు రంగులవి
కలిస్తే వచ్చేది ,
తెలుపు వర్ణము.
అందరం ఒక్కటౌ
శాంతికి చిహ్నము.
*************
హామీ: పై రాసిన సుార్యవర్ణములు నా స్వీయ రచనలు.
No comments:
Post a Comment