Monday, February 14, 2022

గజల్ రాయడం ఎలా...? వివరణ....

[7/27/2021, 10:47] ఇష్టపది సత్యం మాష్టారు: *పరిశీలించండి* 

 *లేదుకదా..,...... రధీఫ్....6 మాత్రలు* 

 *దాటేదీ* 
 *గొప్పేదీ* 
 *ఎదురేదీ* 
 *మిన్నేదీ* 
 *మిన్నేదీ* ......... *ఖాఫియాలు* 

మొదటి షేర్ మత్లాను

అలాగే ప్రతి షేర్ నియమాలను 
గమనిస్తూ భావం ఉట్టిపడే గజల్ రాయగలరు

మనకంతా మమతదారి *దాటేదీ*  *లేదుకదా* 
మంచిమనసు కన్నమించి *గొప్పేదీ*  *లేదుకదా*

ప్రేమకున్న  విలువకన్న ఏమున్నది వెదికినంత
ఎదగుడిలో నింపుకున్న *ఎదురేదీ* *లేదుకదా* 

పేగుపంచి పెంచినట్టి తనకన్నా గొప్పెవరూ
అమ్మ మనకు దైవమేను *మిన్నేదీ* *లేదుకదా*

పుట్టినిల్లు మెట్టినిల్లు గౌరవాన్ని ఇనుమడించె
మగువ మనసు మించిపోయి *ఇంకేదీ* *లేదుకదా*

ఆడపిల్ల నడియాడే ఇల్లంతా బంగారము 
*రామ* నవమి నాటిమాట *దాటేదీ* *లేదుకదా*
[7/27/2021, 10:49] ఇష్టపది సత్యం మాష్టారు: శుభోదయం
గజల్ రాయాలని ఇష్టం, పట్టుదల  ఉన్నందున తప్పక చక్కగ రాయగలరు..

మీ కోసం ఈ క్రింది వివరాలు..

గజల్ వ్రాయడమెలా ?
*******************
మొదట 
గురులఘువులు గుర్తించడం తెలియాలి.
గురువులు: 
దీర్ఘాక్షరాలు, 
కా కీ కూ కే కో 
కై కౌ ( ఐ ఔ చేరిన అక్షరాలు )
కం గం నిం - సున్న చేరినవి
విసర్గ తేరిన అక్షరాలు దుః 
సంయుక్తాక్షరానికీ ద్విత్వానికి ముందున్న అక్షరాలు
సున్న - సు గురువు
లక్క - లగురువు
పత్తి - ప గురువు
సత్య- స గురువు
పద్య - ప గురువు
విజ్ఞ - వి గురువు 
ఇక
ఏవి లఘువులు - మిగిలినవి 
మరి ఇక...
గజల్ లో గణాలు ఉండవు . మాత్రలు తెలియాలి
గురువు -2 మాత్రలు
లఘువు - 1 మాత్ర
3 మాత్రల పదాలైతే త్రిస్రగతి
4 మాత్రల పదాలై తే చతురస్ర గతి
5 మాత్రల పదాలు వాడితే ఖండగతి
రెండు రకాల గతులు కలిపితే మిశ్రగతి

ఉదా: 
3 మాత్రలు- రామ
4 మాత్రలు - రాముడు
5 మాత్రలు- రాముడే

 3+ 3 =6 - కలిసి సాగు
4+4 =8 - కదిలే కాలం
3+4 = 7 -కలల అలజడి 
ఇలా పదం తయారు చేసుకోవచ్చు 

గజల్ కు శీర్షిక‌ ఉండదు‌ వచన కవిత లా..

మత్లా = గజల్ లో మొదటి ద్విపద ( రెండు పాదాలు)
ఉదా
గుండెభాష నీకంతా తెలుసునులే కంటికొలికి
వెలుగంతా నింపుకునీ మెరియునులే కంటికొలికి

ఇందులో 
కంటికొలికి : రదీఫ్ అంటారు. 
తెలుసునులే, మెరియునులే..( చివర '..నులే' గుర్తించండి)వీటిని ఖాఫియా అంటారు

షేర్ = గజలలోని మిగిలిన ద్విపదలు..
ఇందులో మొదటి పాదం కేవలం మాత్రలు పాటిస్తూ 
సాగుతుంది. దీనిలో తెలుసునులె వంటి కాఫియా -కంటికొలికి వంటి రదీఫ్ అక్కరలేదు
రెండవ పాదం మత్లాలోని విధంగా కాఫియా, రదీఫ్ తో  రాయాలి 
ఉదా 
మూగభాష లోతెంతో నినుచూసిన చాలంతే 
మౌనంలో అర్దమెంతొ వొలుకునులే కంటికొలికి

ఇలా మత్లా‌, షేర్లు కలిపి, 5, 7, 9....ద్విపద లుగా రాస్తారు.
అన్ని ద్విపదాలూ ఒకే‌అంశం మీద రాయాలసిన‌ అవసరం లేదు..పలు అంశాల‌పై‌రాసి‌ ఒక గజల్‌ గా కూర్చవచ్చు..

చివరి ద్విపదలో కవి పేరు ( తఖల్లూస్) వచ్చేలా చూస్తే గజల్ ఎవరిదని తెలుసుకోవచ్చు. 
ఉదా: 
కనురెప్పల బంధంలో మరచిపోని సంగతులే
"రామ"శరము సంధిస్తూ వదులునులే కంటికొలికి

ఇక 
ఓ పూర్తి గజల్ ఇక్కడ : ( మీకు నచ్చుతుందో లేదో తెలియదు ..కానీ కింద పోస్ట్ చేస్తున్నా ..సరళంగా)

గుండెభాష నీకంతా తెలుసునులే కంటికొలికి
వెలుగంతా నింపుకునీ మెరియునులే కంటికొలికి

మూగభాష లోతెంతో నినుచూసిన చాలంతే 
మౌనంలో అర్దమెంతొ వొలుకునులే కంటికొలికి

మంత్రమేదొ వేస్తావుగ నీదరినే చేరినంత
మరలిపోని కథనంతా చూపునులే కంటికొలికి

చీకటినే చీల్చినీవు అందమంత అద్దినావు
కలవరింత కలలెన్నో కదులునులే కంటికొలికి

కనురెప్పల బంధంలో మరచిపోని సంగతులే
రామశరము సంధిస్తూ వదులునులే కంటికొలికి
@@@@@@@@@@@
ఇందులో 
రదీఫ్ : కంటికొలికి
ఖాఫియా: తెలుసునులే,మెరియునులే,వొలుకునులే,చూపునులే,
కదులునులే,వదులునులే..

తఖల్లూస్: రామ‌  ( రామశర్మ పేరుగా)

గతి: 6-6-6-6

Note: 
1.
గజల్ బేసిక్స్ మాత్రమే ఇచ్చాను confusion ఉండకూడదని...
2. గజల్ లో కొంత స్వేచ్ఛ ( మరీ ఎక్కువగా కాదు) ఉదాహరణకు  'అర్ధమెంతొ ' అని రాయవచ్చు "అర్ధమెంతో ' బదులుగా ...వచన కవితలో ఐతే ఇలా రాయకూడదు. ఇదొక పదం ఉదాహరణ.
3. గజల్ లో తఖల్లూస్ ఉండకపోయినా పరవాలేదు 
4. వేరే రూపంలోనూ ఉన్న గజల్స్ మరోసారి..

ధన్యవాదాలు
[7/27/2021, 15:56] ఇష్టపది సత్యం మాష్టారు: రధీఫ్ ముందు వచ్చే కాఫియాలు ఒకే ప్రాసలో లేవండీ
[7/27/2021, 15:57] ఇష్టపది సత్యం మాష్టారు: అందాలె బంధాలె చెందాలె కందాలె... ఇలా
[7/27/2021, 17:23] p3: ప్రక్రియ : గజల్.



శీర్షిక  :   నా ప్రేమ.


ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలె  నాచెలీ

ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన 
బ్రతుకంత నీ తలపు బంధాలె నాచెలీ 

నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలె నాచెలీ

 నీమొాము లోనిండెనాచంద్ర కళలవే ఆకళలె కలలంద చందాలె నాచెలీ

కదిలేటి ముంగురులె మేఘసందేశమై
కవ్వించ ననుచేరు కందాలె నాచెలి

 కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేత రంగాలె  నాచెలీ

నీ ప్రేమ తెలిసేను నిన్ను నే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
[7/27/2021, 17:25] ఇష్టపది సత్యం మాష్టారు: 👌👌
[7/27/2021, 17:34] ఇష్టపది సత్యం మాష్టారు: అన్ని కాఫియాల శబ్దం లె వస్తే.. ఈ పాదంలో లు వస్తుంది అండీ.
గజల్ లో శబ్ద ప్రాధాన్యత (ఉచ్ఛారణ) ఉంటుంది అండీ
[7/27/2021, 18:13] p3: శీర్షిక  :   నా ప్రేమ. 


ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలు  నాచెలీ

ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన 
బ్రతుకంత నీ తలపు బంధాలు నాచెలీ 

నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలు నాచెలీ

 నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
 ఆకళలె కలలందచందాలు నాచెలీ

కదిలేటి ముంగురులె మేఘ సందేశమై
కవ్వించ ననుచేరు కందాలు నాచెలి

 కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేతరంగాలు  నాచెలీ

నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ

సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
వయ్యారి నీసొగసు విందులుా నాచెలీ

అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు వైవేయు సంకెళ్ళు  నాచెలీ

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
[7/27/2021, 21:49] p3: ప్రక్రియ : గజల్ ..
శీర్షిక : అలనాటి  జ్ఞాపకాలు .


అలనాటి రోజులని తలచేవు ఏలనీ
మారింది నీవనీ తెలుసుకోవేలనీ..

ఆగాలి ఆనీరు  ఆపుడమి ప్రకృతీ
ఆనాటి వేననీ  తలుచుకోవేలనీ ॥

బంధాలె బరువాయె ఈనాటి మనిషికీ
విడరాని బంధాల కలుపుకోవేలనీ  ॥

ఆ అమ్మ ఆ అక్క ఆచెల్లి  ఆచెలీ
ఆప్రేమ నీదిగా మసలుకోవేమనీ ॥

స్వార్ధమే జీవముా ధనమాయె ముాలముా
నిస్వార్ధ బాటలో నడుచుకోవేలనీ  ॥

కరువాయె ధర్మముా  బరువాయె బంధముా
అవినితి బాటనే  వదుకోవేలనీ ॥

తరిగేను విలువలుా తొలగేను వలువలుా 
మనదైన సంస్కృతిని మరచేవు ఏలనీ ॥

మేధావి తానని  మారినది మనిషనీ
తెలిసినీ తలపులను మార్చుకోవేలనీ ॥

ఆనాటి కాలమే ఈనాడు ఉండగా
కాలాన్ని తిరగేసి వగచేవు ఏలనీ॥


శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.


హామీ:
ఈ నా  "గజల్ " ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
[7/27/2021, 23:05] ఇష్టపది సత్యం మాష్టారు: ఇది ఓకే అండీ.. నా చెలీ కి ముందు తప్పక లు లేదా లె ఒకే అక్షరం వచ్చే విధంగా చూడండి.
[8/17/2021, 17:28] ఇష్టపది సత్యం మాష్టారు: దుర్నీతుల దురాచార దుశ్శాసన  పాలనలో
నిశ్ఛయమౌ నియమమేది యసలులేదు  ఈజగాన ॥

అన్యాయపు అక్రమాల అగడాల సమాజాన
స్వార్ధమేలు మనిషికేమొ సుఖములేదు ఈజగాన ॥

వయసుమీర తల్లితండ్రి బరువాయెను బ్రతుకులోన
కన్నపేగె ,కాలరాసె , వలపులేదు ఈజగాన ॥

ఆడతనము అమ్మతనము అప్పచెల్లి అన్నమాట
వావివరుస బంధమన్న మాటలేదు ఈజగాన ॥

అవినీతులె రాజ్యమేలె ఆదర్శమె అణగారే
న్యాయమైన ధర్మమైన బాటలేదు  ఈజగాన ॥
[10/15/2021, 13:37] p3: [10/14, 19:14] p3: తెలుగు వెలుగు సాహిత్యవేదిక ..కొరకు'
గురువారం: 14/10/2021.
అంశం : ఐచ్ఛికం.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ : గజల్.

శీర్షిక : నీలాల ఆకాశంలో....

నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥

వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥

మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥

పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥

నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై  పలకాలని ఉన్నది.॥

ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥
[10/14, 22:51] +91 6305 543 917: 1️⃣3️⃣పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు! వెన్నెల వెలుగు గా,రాగాల గీతిక గా,మరుమల్లే సందేశం గా,పాటల పల్లకి లో పరువాల  కన్నేనై....వర్ణన అద్భుత: కా నీ మీరు,విరహం సూఫీ తత్వం పట్టు కోవడం లేదు..అప్పుడు గజల్ కి ప్రాణం వస్తుంది. ఈ సారి వ్రాస్తారు కదా! చప్పట్లు. 👏👏👏👏👏👏💐👌💐👍🌷
[10/15/2021, 13:38] p3: మాష్టారుా ..ఈ సుాఫీ తత్వం  అంటే ఏమిటో తెలియజేయగలరా ..ప్లీజ్
[10/15/2021, 13:39] p3: పై న నేనురాదిన గజల్ , దానికింద ఒక సమీక్ష  ఉన్నాది గమనించి వివరించ ప్రార్ధన..🙏
[10/15/2021, 13:47] ఇష్టపది సత్యం మాష్టారు: భగవంతునిపై ప్రేమ , భగవంతునిలో సంలీనమైన భావనతో రాయడం అండీ.. రచనలో ప్రేమ , భక్తి ఒకేసారి కనిపించాలి.. ప్రియుని గురించి రాసినా భగవంతుడు, భగవంతుని గురించి రాసినా ప్రియుడు పదాలలో కనిపించాలి. నాకు అర్ధం అయింది ఇదీ మేడమ్ సూఫీతత్వం గురించి. 🙏🙏
[10/15/2021, 13:49] ఇష్టపది సత్యం మాష్టారు: మీ గజల్ లో అంతర్లీనంగా విరహవేదన , సూఫీతత్వం కనిపిస్తున్నది. 👌👌


***************

[10/15/2021, 16:29] +91 6305 543 917: మిత్రులకు సాహితీ వందనం....
ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో 'సురారం శంకర్' గారి 'సౌపర్ణిక' గజల్ సంపుటి పై నేను రాసిన సమీక్ష.....తప్పకుండా చదవండి....
పత్రిక యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు...🙏

🌷 హృదయ కాంతుల మెరుపు సౌపర్ణిక 🌷

శబ్ద సౌందర్యంతో కూడిన కవిత్వం వినసొంపుగా ఉంటుంది...
అందులో అద్భుతమైన భావం ఇమిడి ఉంటే మనోహరంగా ఉంటుంది....
లయగా సాగుతున్న కవిత్వాన్ని చదువుతున్నప్పుడు....పెదవులు పాటలాగా పాడాలని మారాం చేస్తాయి...మనసైతే భద్రపరచుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది...

గజల్ ప్రక్రియకు ఈ అద్భుతమైన లక్షణాలన్నీ ఉన్నందువల్లేమో కవులు తమ భాషల్లో గజల్ సౌందర్యాన్ని ప్రవహింపజేస్తున్నారు....

గజల్ మొదట అరబ్బీ, పర్షియన్ భాషల్లో మొదలైనా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది...ఇది మాత్రా ఛందస్సు తో కూడిన ప్రక్రియ....

పంక్తుల జతను షేర్ అంటారు. మొదటి షేర్ ను మత్లా....చివరి షేర్ ను మక్తా అంటారు...చివరి షేర్ లో రచయిత తన పేరును చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది....దీనిని తఖల్లుస్ అంటారు...ఆ పేరు కూడా భావంలో ఇమిడి పోవాలి...
గజల్ లోని భావవ్యక్తీకరణలో చమత్కారం ముఖ్యం...గజల్ లో వస్తువు ముఖ్యంగా ప్రేమ, విరహం , తాత్వికత ఉంటుంది...విరహాన్ని మరీ దుఃఖిస్తున్నట్లుగా కాకుండా కాస్త ప్రేమలో ముంచి రాస్తే మరింతగా గుభాళిస్తుంది....

ఇప్పుడు 'సౌపర్ణిక' లోని కొన్ని షేర్లను పరిచయం చేస్తున్నాను

//మనసును ఎందుకు మరిమరి మరిమరి భ్రమ పెట్టుకుంటామో తెలియదు
'చిరుగును' చూసి 'చిగురని' ఎందుకు ఒప్పేసుకుంటామో తెలియదు//ఈ మత్లా లో  మనసు పడే వేదన గురించి హృద్యంగా రాశారు....ఒక్కోసారి కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా...మనం ఒప్పుకోము...మనకు నచ్చిన విధంగానే జరుగుతున్నట్లు భ్రమలో ఉంటాము...అలాంటప్పుడే చిరుగులు కూడా చిగురులుగా కనిపిస్తాయి...కానీ ఇది కూడా గాయ పడిన మనసుకు ఊరటే....

//నిలిచిపోయే పాటనే ఇల 'రాసి' వెళతాను
గుండె మీటే మాటకే 'ఓటేసి' వెళతాను
సత్యమేదో తెలిసినాక సంకెలల బ్రతుకెందుకు 
స్వార్థ చింతన నిక్కడే 'వదిలేసి' వెళతాను//...ఈ గజల్ లో మంచి తాత్వికత ఉంది...
మన జీవితం ఎప్పుడూ ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి...మనం ఇంక లేము అని తెలిసినప్పుడు మన మాటలు మన మంచితనం కొన్నాళ్ళ వరకైనా అందరికీ గుర్తుండి పోవాలి. అందుకే మనిషి స్వార్థాన్ని వదులుకోవాలని కవి అంటున్నారు....ఇందులోనే నాలుగవ షేర్లో ఇలా అంటున్నారు...
//కోటి జన్మలు ఎత్తినా, ఈ కోరికల సడి తీరునా?
సంతృప్తి పాదును ఇప్పుడే 'సరిచేసి' వెళతాను// ....ఎంత గొప్ప భావం....మనిషిలో కోరికలెప్పుడూ సడి చేస్తూనే ఉంటాయి , అందుకే మనం ఉన్న దాంతోనే సంతృప్తి పడడం నేర్చుకోవాలంటున్నారు....

 //చిరునవ్వు కన్నా అందమైన 'స్వాగతం' ఉందా?
బాల్యాని కన్నా మధురమైన 'జ్ఞాపకం' ఉందా?//....చక్కగా చెప్పారు చిరునవ్వు కన్నా మించిన స్వాగతం లేదు అలాగే చిరునవ్వు కన్నా మించిన ఆభరణమూ లేదు...మనసులో ఎంత బాధ ఉన్నా కొద్ది మంది పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరదు...ఒక్కోసారి బాధలను ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఆ చిరునవ్వే ఇస్తుంది...అందుకే చిరునవ్వును ఎవరూ దూరం చేసుకోకూడదు...మోవికి అందాన్ని ఇస్తుంది....అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంక అందులోనే కవి అంటున్నారు బాల్యానికన్నా మధురమైన జ్ఞాపకం ఉందా అని...ఎవరికీ ఉండదు అంతకన్నా మధురమైన జ్ఞాపకం....

//నా పూలతోటలో పూలన్నీ ఎవరో 'త్రుంచుకు' వెళ్ళారు
మధురోహల నా ఏకాంతాలను ఎవరో 'దోచుకు' వెళ్ళారు//...ఎంత అందమైన భావవ్యక్తీకరణ....నా తోటలోని పూలన్నీ ఎవరో తుంచేశారు....అచ్చంగా నేను ఊహల్లో విహరిస్తుంటే నా ఏకాంతాలను ఎవరో దోచుకు వెళ్ళినట్లుగా అంటున్నారు...ఏకాంతాలను పూలతో పోల్చడం ఎంతో బాగుంది.

//ఎపుడో అపుడు నువ్వూ నేనూ 'కలువక' పోతామా?
ఇద్దరి ఎడదల పొగిలిన సుద్దులు 'నుడువక' పోతామా? //....ఎవరికైనా ఈ వాక్యాలు నచ్చుతాయి...
నువ్వూ నేనూ నింగి నేలా ఏమీ కాము కదా కలువక పోవడానికి...ఎపుడో ఒకప్పుడు తప్పక కలుస్తాము ఆక్షణం ఇన్నాళ్లూ మన ఇరువురి హృదయాలలో దాచుకున్న  ఊసులన్నింటినీ ఒకరికొకరం వినిపించుకుంటాము....
ఇందులోనే ఇంకో షేర్లో ఇలా అంటున్నారు...
//నీదో గమ్యం నాదో గమ్యం, ఇద్దరి మధ్య అగాధం
అయినా ఒకరికి ఒకరం మనసుని 'చాటక పోతామా' ?// ....నీ గమ్యం వేరు నా గమ్యం వేరు మళ్ళీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధం ఉంది అయినా కూడా ఎప్పటికైనా మన మనసులు మళ్ళీ ఒకటవకుండా ఉంటాయా అని అనడంలో గొప్ప ఆశావాద దృక్పథం ఉంది....ప్రేమ విఫలమైతే చావాల్సిన అవసరం లేదు....ఎదురు చూద్దాం ఎప్పటికైనా కలుస్తామనే ఆశతో....లేదా మనసులో ఉన్న వాళ్ళ జ్ఞాపకాలతోనైనా జీవిద్దాం...

//జాబిల్లికి చెయ్యందిస్తే నీతో కరచాలనమే
హరివిల్లుకు హృదయాన్నిస్తే నీతో నా పరిచయమే//...ఎంత మధురంగా ఉందీ షేర్....ఆమెతో స్నేహం జాబిల్లికి చేయందించినట్లుగా , ఆమెతో పరిచయం హరివిల్లుకు హృదయాన్నిచ్చినట్లుగా ఉంది అంటూ అందమైన పోలికలతో చెప్పారు...
ఇందులోనే ఇంకో షేర్....
//ఈ లోకం పచ్చిక నిండా నీ పద ముద్రలే
చిరుగాలికి ముచ్చట చెబితే నీతో సంభాషణమే//.....ఈ లోకం పచ్చిక నిండా నీ పదముద్రలే అంటే ఆమె నడిచే దారంతా వసంతం పరచుకుంటోందని, గాలితో చెప్పే మాటలన్నీ నీతో మాట్లాడినట్లే ఉంటుంది అనడం లో గాఢమైన అనురాగం దాగి ఉంది....

//ఏ అక్షరానికి తెలియదు తన 'ఉనికి బలమెంతో'
ఏ పావురానికి తోచదు తన 'రెక్కల బలమెంతో' //....
నిజమే కదా అక్షరాలకున్న బలం ఎంతటిదో ఎవరికీ తెలియదు....అదే విధంగా ఎవరి శక్తి వాళ్ళకు ఎప్పటికీ తెలియదు....కాలమే అన్నింటినీ తెలియజేస్తుంది....కొన్ని సార్లు మనం నిమిత్త మాత్రులుగానే ఉండిపోవాలి. 

ఈ 'సౌపర్ణిక' సంపుటిలోని ప్రతి గజల్ అద్భుతంగా ఉంది....తేనె ధారల్లో తడిసిన భావన కలుగుతుంది ఎవరికైనా...ప్రతి గజల్ ని  రెండు సార్లు చదవాలనిపించేంత చక్కగా ఉంది...

మంచి గజళ్ళు చదువుతుంటే మనసును సున్నితమైన పరిమళమేదో చుట్టుకున్న భావన కలుగుతుంది....ఇంకాసేపు చదవాలనే కోరిక కలుగుతుంది...అచ్చంగా సూరారం శంకర్ రచించిన 'సౌపర్ణిక' గజల్ సంపుటి లాగానే....

మరెన్నో అద్భుతమైన పుస్తకాలను పాఠకలోకానికి అందివ్వాలని కోరుకుంటూ సురారం శంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

సమీక్షకురాలు
శాంతి కృష్ణ, గుoటూరు.
[10/15/2021, 16:29] +91 6305 543 917: ---( పాత పోస్ట్... ఫేస్బుక్ గుర్తు చేసింది. కొత్త మిత్రుల కోసం మళ్ళీ... ఇదివరకే చదివినవారు అసహనానికి గురి కావద్దని మనవి-------------------)
--------------------
గజల్ తరంగిణి (వ్యాసాలు)
----------------------
--------- " మిథున కవితా వనం " ద్వారా Madam Leela kay & అడ్మిన్స్ పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న ధారావాహికకు స్వాగతం ... !  సు స్వాగతం ... !! 

--------- గతవారం తరువాయి---- 

------------- గతవారం గజల్ ఛందస్సు గురించి కొంత మేర తెలుసుకున్నాం--- 

------  ఉరుదు గజల్ ఛందస్సు నుండి  తెలుగు భాషా  పరిమితులకు ఒదిగేంత మేర  ఉరుదూ ఛందస్సును మాత్రమే మనం  గ్రహించినాము .. అంతకు మించి అనగా పూర్తి స్థాయి ఉరుదూ గజల్ ఛందస్సును ఉన్నదున్నట్లు మనం  తెలుగులో  ఉపయోగించుకోవడం లేదనీ , ఆ అవసరం కూడా మనకు లేదనీ నా పరిశీలనలో తెలియవచ్చిన నిజం..  

ఉదా।।

---------- ఉరుదూలో గణాన్ని " రుక్న్ "మ అంటారు . గణాలను " ఇర్ కాన్ " అంటారు. 

------- ఉరుదూ లో 5 మాత్రల గణాలు =2 , ( 1) ఫఊలున్ --- ( తెెలుగులో " య "గణము  IUU . )  ఫ=। , ఊ= U, లున్ =  U , -----అలాగే , (2) ఫాయిలున్ . తెలుగులో ఇది "ర" గణము UIU , 

----------  7 మాత్రల గణాలు =5 , 
1) ముస్త ఫయిలున్  UI II U (  తెలుగులో  గణము లేదు ) 

2) మఫయిలున్ IIIU ( do) 

3) ఫాయిలాతున్ UIUU (do ) 

4) ముత్ ఫాయిలున్ U U IU (do)

5) మఫ ఉలాన్ IIIU ( do ) 

(** Note := పై గణాలలోని గురు లఘువులను నేను తెలుగు భాషా ఛందస్సును అనుసరించి గణించినాను . ఉరుదూ ఛందస్సు ప్రకారం అయితే ప్రతి పొన్ను అక్షరం ఒక లఘువు I గా గణించవలసి ఉంటుంది . అలా రాస్తే కొందరు Confuse అవుతారని రాయలేదు. ) 

------ పై గణాలతో బహర్ లు ఏర్పడ్డాయి..  అవి సుమారు  19వరకు ఉన్నాయని పెన్నా గారు పేర్కొన్నారు ... అవి వరుసగా -------- 

1) హజజ్
2) రజజ్ 
3) రమల్
4) ముత్ కారిబ్ 
5)ముత్ దారిక్ 
6) కామిల్ 
7)వాఫర్ 
8) మున్ సరహ్ 
9) ముజారా 
10)సరీఅ 
11) ఖఫీఫ్ 
12) ముజత్తాన్ 
13) ముక్త జబ్ 
14) తవీల్ 
15) మదీద్ 
16) బసీత్ 
17)  జదీద్ 
18) కరీబ్ 
19) మశాకిల్ 

Note := ఇవే కాకండా మాత్రల హెచ్చు తగ్గులతో మరిన్ని బహర్ ఏర్పరచుకున్నారు.

------------- పైన పేర్కొనిన  ఉరుదూ ఛందస్సు నిబంధనలు., బహర్ లు పాఠించడంలో మనకు ఏమాత్రం సౌలభ్యత లేదు 1,2 మినహా ---- మరో ముఖ్య  విషయం -- ఉరుదూలో   పొన్నును ( ్ )  ఒక మాత్ర గా   ( అనగా లఘువు గా) లెక్కిస్తారు . తెలుగులో పొన్నును దానికి ముందు ఉన్న హ్రస్వా క్షరానికి కలిపి U   గురువు గా గణిస్తాము. దీర్ఘాక్షరం తరువాత వస్తే దానిని కూడా U గా గణిస్తాము. అదే ఉరుదూ లో అయితే దీర్ఘాక్షరం తరువాత వచ్చే పొన్నును ఒక లఘువు I గా గణిస్తారు..... 

------- కావున తెలుగు గజల్ రచయితలు ఉరుదూ గజల్ బహర్ ల ఛందస్సు ను మక్కీకి మక్కీ అనుసరించ వలెనన్న నిబంధన ఏమాత్రం అవసరం లేదని నా  పరిశీలనకు వచ్చిన  విషయంగా నేను భావిస్తున్నాను . 

----------- ఇకపోతే , కాఫియా , రదీఫ్ ల సంగతి ....... ? 

........ ఇప్పటికీ ఈ విషయంలో చాలా మంది  తెలుగుి గజల్ కవులు సందిగ్దంలో ఉన్నట్లు నేను గ్రహించాను . 

-------- నిజానికి ఇదేమంత అర్ధం కాని విషయం కాదు. కాస్త శ్రద్ధ కావాలి అంతే-----  

----దీనిని  శబ్ద బ్రహ్మ డా।। సినారె గారి గజల్ ఉదా।। తో  తెలుసుకుందాము----  

1) చిన్న దీపమని అనుకోకు అది  చీకటినే కాల్చేస్తుంది 
జనమేం చేస్తుందనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది 

2) ఎంత తెగించిన సాహసమో నినదించే  ఊరేగింపులకు 
వట్టి పిడికిలే అనుకోకు అది చట్టాలను    పేల్చే స్తుంది 

------------- పై రెండు షేర్  లలో చివరి అంత్య ప్రాసలైన """""  కాల్చేస్తుంది ,  మార్చేస్తుంది , పేల్చేస్తుంది. కాఫియాలు అవుతాయి .  ఈ గజల్ లో రదీఫ్ లేదు. కనక ఇది బేమురద్దఫ్ గజల్ అవుతుంది . 

------------- మరో ఉదాహరణ డా।। సినారె గారిదే. 

1) అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో 
కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో 

2) ఏ సిరులూ పొందని సంతృప్తి ఏమిటో 
కళాసరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో 

4) నిట్టూర్పు సెగల్లో గీపెట్టే మౌనం 
ఉబికే సుడిగాడ్పులోన ఒదిగి తెలుసుకో 

---------- పై షేర్ లలో ---- మత్లా లోని  పాదాల చివరి రెండు పదాలు " తెలుసుకో "  , అలాగే  2) , 3) షేర్లలోని రెండవ పాదం చివరి పదాలు " తెలుసుకో " అనేవి '"  రదీఫ్ " లు అవుతాయి . 

-------- మరి కాఫియాలు ఏవి ? 
 
-------- మత్లా పాదాంతంలోని  రదీఫ్ (తెలుసుకో )కు ముందు వాడిన ----- 1) అడిగి , కరిగి  మిగిలిన 2వ షేర్ లోని రెండవ పాదంలోని  రదీఫ్ (తెలుసుకో )కు ముందు పదమైన "కడిగి .""" 3) వ షేర్లో రెండవ పాదం చివరి పదమైన రదీఫ్ ( తెలుసుకో )కు ముందు పదమైన "ఒదిగి"" కాఫియాలు అవుతాయి... 

--------- రదీఫ్ లేకుండా రాసే గజల్ల ను , బేమురద్దఫ్ ,  లేక గైర్ మురద్దఫ్ గజల్లంటారు..  ఎలా రాసినా భాష , భావుతలను జోడు గుర్రాల్లా నడిపించగలగాలి . 

------ ఇంకా ఉంది ,  

---------- ఈ వారం గజల్ తరంగిణి ని తెలుగు గజల్ మహాకవి డా ।। సినారె గారి కి స్మృత్యంజలిగా సమర్పించుకుంటూ శలవు తీసుకుంటున్నాను...  

------- వొచ్చే వారం మరిన్ని వివరాలతో మీ, ముందుంటాను. ....  ఆదరిస్తున్న అందరికీ నమస్సులతో --

-- మీ సూరారం శంకర్. 16.06.2017.
[10/15/2021, 16:58] +91 6305 543 917: గజల్ పుట్టిందే సూఫీ తత్వం లో.సూఫీ తత్వం అంటే భగవంతుడు నిరాకారుడు. సూఫీ తత్వం లో ఇక్కడ వున్నాడు.అక్కడ లేడు అనే ప్రశ్నే లేదు.మనం ఎందులో భగవంతుని చూడా లనుకున్నా అందులోనే ఉంటాడు. *ఋగ్వేదంలో.. ఏ కం తత్ విప్ర బహుదా వదంతి* అంటే భగవంతుడు ఒక్కడే! అనేక రూపాలలో చెబుతాం!ఇది ఇస్లాం తత్వం కు పూర్తి వ్యతిరేకం.*లా ఇలా హి ఇల్ల లాహ్*..అల్లా ఒక్కరే! మనం చేసే ప్రతి పూజ అందుకునే వాడు ఆ అల్లా ఒక్కడే. ఇస్లాం తత్వంలో అల్లా ఒక్కడే దేవుడు...సూఫీ తత్వం లో *అల్లా* అనే ప్రశ్నే లేదు. రమాదేవి లో వున్నాడు.మీలో వున్నాడు.మీరు ఎవరిలో చూస్తే వారిలోనే భగవంతుడు ఉంటాడు . అదే కదా మన.భారతీయ సిద్ధాంతం కూడా!
[10/15/2021, 16:59] +91 6305 543 917: మీరు ఎవరో గానీ తెలుసుకోవాలనే తత్వం ఉన్నందుకు అభినందనలు! విజయ దశమి శుభాకాంక్షలు!🌷💐🙏🏿💐🌷👌

No comments:

Post a Comment