Friday, February 11, 2022

ప్రసిద్ధ కవుల మాట

*తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన
 పదపల్లవాలలో ఇవి కొన్ని. 
 వీటిని ఎవరు రాశారో  చూద్దాం...*

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 
     నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 
*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*

2. ‘‘కప్పివుంచితే కవిత్వం,
     విప్పి చెబితే విమర్శ’’
*డా.సి.నారాయణరెడ్డి*

3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ,
     ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 
*కాళోజి*

4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 
*నన్నయ*

5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 
*సుబ్బారావు పాణిగ్రాహి*

6. ‘‘రాజే కింకరుడగు 
     కింకరుడే రాజగు’’ 
*బలిజేపల్లి లక్ష్మీకాంతం*

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 
     వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 
*బసవరాజు అప్పారావు*

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని 
     తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 
*గుర్రం జాషువా*

9. ‘‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట, 
      నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 
*కాళ్ళకూరి నారాయణరావు*

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో 
        వ్రాయబడని కావ్యాలెన్నో’’ 
*దాశరధి*

11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 
*నార్ల వెంకటేశ్వర రావు*

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 
*తిరుపతి వెంకట కవులు*

13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 
*గురజాడ*

14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 
*గరిమెళ్ళ సత్యనారాయణ*

15. ‘‘పరమేశా గంగ విడుము, పార్వతి చాలున్‌’’ 
*శ్రీనాథుడు*

16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు...   
        ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 
*పోతన*

17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
      తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 
*గద్దర్*

18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 
*శ్రీ శ్రీ*

19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను,
       మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 
 *వెన్నలకంటి*

20. ‘‘రావోయి బంగారి మావా 
       నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 
*కొనకళ్ల వెంకటరత్నం*

21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన 
       చుల్కన కాదె యేరికిన్‌’’
*అల్లసాని పెద్దన*
 
22. ‘‘ఏ గతి రచియించిరేని,
        సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 
*చేమకూరి వేంకటకవి*

23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 
*త్యాగయ్య*

24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 
*ధూర్జటి*

25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన 
        అప్పుడు బంధువులు వత్తురు’’ 
*బద్దెన*

26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు,
        దానహీను జూచి ధనము నవ్వు’’ 
*వేమన*

27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 
*కంచర్ల గోపన్న*

28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 
*సుద్దాల హనుమంతు*

29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు 
       ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 
*ఆరుద్ర*

30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా 
       సవతిబిడ్డల పోరు మనకేలా’’ 
*వేముల శ్రీ కృష్ణ*

31. ‘‘వీరగంధము తెచ్చినారము, 
        వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 
*త్రిపురనేని రామస్వామి*

32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 
*బాలాంత్రపు రజనీ కాంతరావు*

33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ 
       తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 
*అడవి బాపిరాజు*

34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
*కరుణశ్రీ*
 
35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా 
        పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా 
        నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 
*గుడ అంజయ్య*

36. ‘‘తను శవమై - ఒకరికి వశమై 
        తనువు పుండై - ఒకరికి పండై 
        ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 
*అలిసెట్టి ప్రభాకర్*

37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే 
        మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 
*సావిత్రి*

38. ‘‘నేను పుట్టకముందే....
        దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 
*ఖాదర్ మొహియుద్దీన్*

39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను,
        నీ ఆదేశాన్ని మన్నించలేను"
*బాలగంగాధర తిలక్*

40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన 
        నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 
*అన్నమయ్య*

41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు   
        విఘ్నాయాససంత్రస్తులై’’ 
*ఏనుగు లక్ష్మణ కవి*

42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 
*పాలగుమ్మి విశ్వనాథం*

43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,
        ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 
*చలం*

44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి 
       మా అమ్మే రాణి అయినా, 
       గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
*విమల*
 
45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది 
        కూకుండనీదురా కూసింతసేపు’’ 
*నండూరి సుబ్బారావు*

46. ‘‘మాయమైపోతున్నడమ్మా మ


To see more posts like this and join KAVIYATRA , click here 👇👇

https://kutumbapp.page.link/qjFG6zYDNtbcF6Ta6

No comments:

Post a Comment