అంశం : వరకట్న పశాచి .కవిత.
శీర్షిక : సమాజం మారాలి.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
01/07/2022
శ్రీశ్రీ కళావేదికలో...
అంశం : వరకట్న పిశాచి .
శీర్షిక : వరకట్నం, ఒక సాంఘిక దురాచారం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
వరకట్నం, ఒక సాంఘిక దురాచారం.
ఒకప్పుడు సాంప్రదాయాల ముసుగులో
ఆడ ,మగ వివక్షతలకు ఆజ్యం పోస్తున్న
అనధికార ఆరడులు నిండిన పాపం ॥
ఆడపిల్లకు అక్షర జ్ఞానం కల్పించని
అహంకారం నిండిన అన్యాయపు తీర్మానం
పసిపిల్లగా ఉన్నపుడే పలుపు తాడును
పసుపు తాడుగా వేసిన దురాచారం. ॥
వరకట్నం పేరుతో వరుస వేధింపులు
ముందడుగేయనీయని పురుషాహంకారాలు
అత్తింటివారు అధికారంతో పెట్టే ఆరళ్ళు
ఆబలల కన్నీళ్ళకు అసలైన సాక్ష్యాలు ॥
నేడు గృహ హింస, వరకట్నవేధిపులకు
శిక్షలు అమలు జేసిన న్యాయ స్థానం .
అత్త మామలకు జైలు శిక్ష అమలుకు
సాక్ష్యాధారాల నిరుాపణలు ముఖ్యం ॥
వరకట్నాన్ని నిషేధించిన ప్రభుత్వ చట్టం.
స్త్రీ ల సాధికారతతో రోజు రోజుకుా-
పెరుగుతున్న విడాకుల కేసుల ఘట్టం,
భారీ ఎత్తున దుర్వినియోగం అవుతోన్న
'ఐ.పి.సి 498 ఎ' సెక్షన్. ॥
మారుతున్న కాలంతో పాటు
మార్చుతున్న ఆచార వ్యవహారాలు.
పశ్ఛాత్య పోకడలతో స్త్రీ పురుషుల తేడాలేక
కాలరాయబడుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు ॥
No comments:
Post a Comment