నమస్కారం రవిగారుా..🙏🙏
ఈ నెల దిక్సూచి ముందుగానే చేతికి రావడం చాలా ఆనందమనిపించింది.
కొండి మల్లారెడ్డిగారి కవిత , "నేనొక మనిషిని కలుసుకోవాలి " చాలాచాలా లోతుగా ఉంది.
అశోక్ కుమార్ గారి "ఇంకెంత దుారం" ధారావాహిక కరోనా పై కసి రేకెత్తిస్తున్నాది.
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారి
"సమాజంలో కవి ఆచరణ రహస్యం..."
చదువుతుాంటే కవుల గురించి ఆయన చెప్పిన
నిజం కళ్ళు దించుకునేట్టు చేసింది.
( కానీ "కవి "ఒక్కడుా వేల గొంతుకలై ఉద్యమిస్తాడు.
అదే ఉద్యమం ప్రత్యక్షంగా చేయాలనుకుంటే ఒక్కరు కుాడా అడుగులో అడుగేయరు. మనిషిలో ఉన్న ఈ తత్వమే మన ఈ నాటి పరిస్థితికి కారణమేమొా.)..
ఏది ఏమైనా మన దిక్సుాచి పేరుకు తగ్గ ప్రతిభతో,
కధలు, కవితలు, కథనాల కఠిన నిజాలతో ..కవితా లోకాన్ని ఆలోచింపజేస్తుా...అందనంత ఎత్తుకు ఎదుగుతోంది.
కవులలో ఆలోచనలను రేకెత్తించే నిజాయితీగల దిక్సూచి కై ఎంతో మంది ఆతృుతగా ఎదురు చుాడ డమే దుక్సుాచి ప్రత్యేకత.
ఈ వారం నేను రాసిన కవిత దిక్సూచి లో రావడం నాకు గర్వ కారణం. ఈ ఆనందానికి కారకులైన కార్య వర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు .🙏🙏
ఎంతో మంది కవి దిగ్గజాల సారధ్యంలొ నడుస్తున్న మేటి సాహిత్య రధం అవరోధాలు లేని దిగ్విజయ యాత్రలో అందరాని కీర్తి శుఖరాలను చేరుకొవాలని ఆశిస్తుా ....
మీ అభిమాని
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
.
No comments:
Post a Comment