Monday, July 25, 2022

ఒంటరితనం (కధానిక).

శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .

ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు.
కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.
అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం ?
లాభం ..
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.

తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే మనిషి విలువ తెలియలేదు. డబ్బుంటే చాలు.అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడు.
భార్యతో ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె
నాలుగు గోడల మధ్య  పని నిండిన రాట్న మయ్యింది. .
తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
డబ్బిచ్చానుగా...అన్నాడు.
ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువ ఇవ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి ఇష్టాఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అన్నాడు. అంతేకాదు తను వాళ్ళతో నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.
ఇంట్లో ఉన్నా ఎప్పుడుా సరదాగా మాట్లాడలేదు. 
తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.తినేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. 
ఆందరుా డబ్బు దాసులే...ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు
తన  పదవీ విరమణకు ఆఫీసులొ ఎవరుా తనను అభినందించలేదు.
తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు

అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోయేరు....
చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.

ఆ రోజు....
ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.
రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు.
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయిఅన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి " అన్న మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవడం తెలియ లేదు. అందికే
ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.

ఒంటరితనం ఆలోచనల్లోకి , ఆలోచన బాధలోకి , బాధ భయంలోకి మారేయి.
కానీ తన ఒంటరితనంలో మార్పు రాలేదు.
ఒకరోజు నోరు విడిచి పిల్లల్ని  అడిగేడు ".ఎక్కడికైనా వెళ్దామా."..అని. 
నోట్ల కట్టలు తెచ్చి నాముందుంచి...
"ఎక్కడికెళ్ళాలనిపిస్తే  వెళ్ళండి నాన్నా ..అఫీసులు, పిల్ల ల చదువులుా ఉన్నాయి.మాకు కుదరదు అన్నారు.
అదిగో అప్పుడు తెలిసింది బాధకి అర్ధం ..
బ్రతుక్కి అర్ధం..జీవిత సత్యం...
జీవితంలో ధనం నిండిన  అహంకారంతో
తనేం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు.
అందరుా ఉన్నా ఎవ్వరుాలేని ఒంటరితనం...
భరించలేని స్థితిలో  ఒక రోజు రోడ్డుపై పడిపోయేడు.
అంతే మరి లేవలేకపోయేడు.
వెన్నెముక విరిగిందన్నారు..మరి తిరగలేవన్నారు.
పిల్ల లు ఖరీదైన ఆసుపత్రిలో తనను జాయిన్ చేసేరు. నోట్ల కట్టలుా చెక్కు బుక్కులుా తనకందించేరు.
అన్ని సదుపాయాలతో ఒంటరిగా మిగిలిపోయేడు..
ప్రతీ రోజుా ఎవరైనా తనకోసం వస్తారేమొా 
అన్న అశతో ..కొన్ని .నెలలబట్టీ ఎదురు చుాస్తున్నాడు.
"ఒంటరిగా..".....
********************************

10/07/2022.
అంశం : ఒంటరితనం.
శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .

ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు.
కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.
అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం ?
లాభం ..
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.

తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే తనకు మనిషి విలువ కుాడా తెలియలేదు. డబ్బుంటే చాలు అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడుగానీ
భార్యతో ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె
నాలుగు గోడల మధ్య  పని నిండిన రాట్న మయ్యింది. .
తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
డబ్బిచ్చానుగా...అన్నాడు.
ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువ ఇవ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి ఇష్టాఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అన్నాడు. అంతేకాదు తను వాళ్ళతో నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.
ఇంట్లో ఉన్నా ఎప్పుడుా సరదాగా మాట్లాడలేదు. 
తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.తినేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. 
ఆందరుా డబ్బు దాసులే...ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు
తన  పదవీ విరమణకు ఆఫీసులొ ఎవరుా తనను అభినందించలేదు.
తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు

అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోయేరు....
చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.

ఆ రోజు....
ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.
రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు.
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయిఅన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి " అన్న మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవడం తెలియ లేదు. అందికే
ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.
*******:::***:::::::::::::::

10/07/2022.
అంశం : ఒంటరితనం.
శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .

ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు. కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం లాభం ..?
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.
తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే మనిషి విలువ తెలియలేదు. డబ్బుంటే చాలు , అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
బయటి సుఖాలకు అలవాటు పడిన తను ఇంటి పనుల నిమిత్తమై ఒక బీదింటి అమ్మాయిని భార్యగా తెచ్చుకున్నాడు.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడు తప్ప
భర్తగా తన భార్యతో  ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె నాలుగు గోడల మధ్య  బందీ ఆయింది. పనికి బానిసయ్యింది.
ఒంటరితనం భరించలేక తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
"డబ్బిచ్చానుగా"...అన్నాడు.
 ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువనివ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి కష్టా-ఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా వాళ్ళని తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అనేవాడు. అంతేకాదు తను వాళ్ళతో ఎప్పుడుా నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.
 కానీ, తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.
 తినేవాడు. తాగేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. కానీ
అందరుా తన డబ్బుకి దాసులే...అదే అహంకారంతోఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు.
తన  పదవీ విరమణ తర్వాత తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు.
అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోతుా ఉంటే....
 చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.
ఆ రోజు....ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు. తాతా అన్న మాట తనెప్పుడుా వినలేదు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు. 
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయి. అన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి "అనే బానిసగా చుాసిన భార్య  మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవలేక పోయాడు. ఈనాడుా తన దగ్గర బోలెడంత డబ్బుంది. కానీ తనడబ్బుతో ఎవరికీ అవసరం లేకపోయింది. కానీ తనకిప్పుడు మనుష్యులు , మనిషి ప్రేమ కావాలి . ఎలా...?
ఇంట్లో ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అంత వరకు తనవెంట తిరిగిన ప్రతీ ఒక్కడుా 
పిల్లల దగ్గర సెటల్ అయ్యేమంటుా దుారమయ్యేరు.
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.
స్వార్ధం, అహంకారముా నిండిన తన ప్రవర్తనకు జరుగుతున్న వర్తమానం సాక్ష్యమయ్యింది.
ఒంటరితనం ఆలోచనలుగా , ఆలోచనలు బాధగా, బాధ భయంగా మారింది .
 తన ఒంటరితనం మరింత పెరిగినట్టయింది.
 ఒకరోజు నోరు విడిచి పిల్లల్ని  అడిగేడు ".ఎక్కడికైనా వెళ్దామా."..అని. 
నోట్ల కట్టలు తెచ్చి నాముందుంచి...
"ఎక్కడికెళ్ళాలనిపిస్తే  వెళ్ళండి నాన్నా ..అఫీసులు, పిల్లల చదువులుా ఉన్నాయి.మాకు కుదరదు అన్నారు.
అదిగో అప్పుడు తెలిసింది బాధకి అర్ధం ..
బ్రతుక్కి అర్ధం..జీవిత సత్యం...
జీవితంలో ధనం నిండిన  అహంకారంతో
తనేం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు.
అందరుా ఉన్నా ఎవ్వరుాలేని ఒంటరితనం...
భరించలేని స్థితిలో  ఒక రోజు రోడ్డుపై నిలువునా పడిపోయేడు.
అంతే మరి లేవలేకపోయేడు.
వెన్నెముక విరిగిందన్నారు..మరి తిరగలేవన్నారు.
పిల్లలు ఖరీదైన ఆసుపత్రిలో తనను జాయిన్ చేసేరు. నోట్ల కట్టలుా చెక్కు బుక్కులుా తనకందించేరు.
అన్ని సదుపాయాలతో ఒంటరిగా మిగిలిపోయేడు..
బతకడానికి డబ్బు కావాలి , గానీ డబ్బే బతుకు కాదు.
డబ్బుతో ఎన్ని కొన్నా ఆనందాన్ని మాత్రం  కొనలేమన్న నిజం నిప్పులా కాలుస్తోంది. ఐనా..
రావుగారు  ప్రతీ రోజుా ఎవరైనా తనకోసం వస్తారేమొా 
అన్న అశతో ..కొన్ని .నెలలబట్టీ ఎదురు చుాస్తునే ఉన్నారు.. In
"ఒంటరిగా..".....

No comments:

Post a Comment