*హంసిక* :-
లక్షణాలు:-
1) మూడు పాదాల ప్రక్రియ.
2) మూడు పాదాలలో కలిపి 30 నుండి 35 అక్షరాలుండాలి.
3) ఒకటవ పాదము మరియు మూడవ పాదము ఆదిప్రాసలో ఉండాలి
4) రెండవ పాదము మరియు మూడవ పాదము అంత్యప్రాస లో ఉండాలి.
గమనిక :- *ఆది ప్రాసకు పాదం లోని తొలి అక్షరాన్ని తీసుకోవాలి.*
ఉదాహరణ:-
1)
చతికిల పడిపోకు ఓటమి ఎదురైందని
సరిచేసుకో లోపాలను
చక్కగా పొందేవు గెలుపును
2)
ఓపికతో ప్రయత్నించు విడవక
ఆలోచిస్తూ నిత్యం కొత్తగా
ఓటమి అన్నది నీ దగ్గరకు రాదుగా
3)
కాంక్రీట్ కారడవిలో స్వేద సన్యాసం
ఆద్యంతాలకై ఎదురుచూపుల కోలాటం
కాంక్షతో కాసుల పోరాటం
4)
వీడాలనుంది ఈ ఇరుకు భువిని
ఎందుకో ఏమో మనసులో
విహరించాలని ఉంది మరో లోకంలో
5)
గరీబు కోటలో గంజన్నమైనా
అమీరు ఇంట్లో పరమాన్నమైనా
గరళము కాదు సుధేగా ఏదైనా
6)
చీకటి గుహలో అంకురము
వెలుగుల కడలిలో వృక్షము
చివరికి చితిలో ద్రవ్యము కాయము
7)
బాసలు వీడెను నిదురను
చెప్పులు ఏలెను రాజ్యము
బాణము చేసెను దుష్ట సంహారము
No comments:
Post a Comment