4/08/2021.
గో.ర. సం. వారి రక్షాబంధన్ ఈ- సంకలనం కొరకు.
అంశం: రక్షాబంధన్ ప్రాముఖ్యత.
శీర్షిక : శ్రీరామ రక్ష.
ప్రక్రియ : వచన కవిత
పుట్టి నపుడు తల్లి ఒడి బిడ్డకు రక్ష.
మనిషిగా ఎదిగేందుకు తండ్రి అండ రక్ష.
ప్రపంచం తెలుసుకునేందుకు
జ్ఞానమిచ్చు గురువు రక్ష.
సుఖ దుఃఖాల బాటలో నమ్మక
స్నేహబంధం మనకు రక్ష.
పాప పుణ్యాల బాటలో
భగవంతుని ప్రార్ధన రక్ష.
భార్యకు భర్త అనురాగం రక్ష.
కుటుంబంలో అక్క చెల్లెళ్ళకు
అన్నదమ్ముల అనుబంధం రక్ష.
రక్షణతో నిండిన జగమంతా
జరుపుకొనే పండగ రాఖీ పండగ.
శ్రావణ పౌర్ణమి నాడు ఆపద్బాంధవుడు
శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో
ద్రౌపతికిడిన చీరల రక్షను పండగగా ,
జనులంతా జరుపుకొనే సంబరం.
అన్నదమ్ముల చేతికి అక్కచెల్లెళ్ళు
కట్టే రక్షాబంధనం, అన్నదమ్ములు
అప్పచెల్లెళ్ళకిచ్చే అభయమనే వరం ॥
అనాటినుండి ఈ నాటి వరకు
అందరుా జరుపుకొనే ఆదర్శ సంబరం.॥
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
.హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన
No comments:
Post a Comment