పెన్నా రచయితల సంఘం కొరకు.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.
---------------------
శీర్షిక .
తెలుగు తేనె.
-------------------
"దేశ భాషలందు తెలుగు లెస్స"..
అన్న మాట శ్రీ కృష్ణదేవరాయలు నోట...
"రాజ భాష" గా తెలుగు భాష ప్రతీ చోటా-
పెక్కు" అక్షరమాలలు" కలిగిన ప్రాచీన భాష.
ఎన్నో "సాహిత్య వైభవాలు" నిండిన ముత్యాల పేట.
అనేక గ్రంధ, నాటక ,పద్య, పురాణాల పుాదోట .
విజయ నగర సామ్రాజ్య కీర్తి కిరీటాలనేలిన---
అష్టదిగ్గజాలైన అస్థాన కవుల నోటి పంట.
గ్రాంధిక భాషా ప్రయొాగాల తెలుగు సాహిత్యం--
రాను రనుా..భాషాభివృద్ధి చెందుతుా..
భాషోద్యమకారుడైన శ్రీ "గిడుగు రామముార్తి" గారి
"సరళ భాషా ఉద్యమాల "కృషి ఫలితంగా,
వ్యవహారిక భాష లో , పాఠ్యాంశ గ్రంధాల లో
రాయబడి- అందరుా చదువుకొనే విధంగా ,
రుాపాంతరం చెందిన "తేట తీయని తెలుగు" భాష.
" డాక్టరేట్ , "కళాప్రపుార్ణ" , అనే బిరుదులను-
పొందిన " శ్రీ గిడుగు రామముార్తి " గారి జయంతి-
రోజున మనం జరుపుకొనే " తెలుగు భాషా దినోత్సవం"
ఈ నాటి మన వ్యవహారిక భాషా సాఫల్యతకై
మనం వారికిచ్చే ఘన నీరాజనం.
-------------------------------------------------------------
హామీ..
"తెలుగు తేనె" అనే శీర్షిక గల ఈ కవిత-
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని ,
నా స్వీయ కవిత.
---------------------------------------------------
No comments:
Post a Comment