శీర్షిక.
నమః సుమాంజలి.
-------------------------------
శాంతియుత పోరాట పట్టుదల తో,
సాధించిన ,దేశ స్వాతంత్ర్యం.
"జాతి పిత గాంధీజీ " కలల పంట.
పింగళి వెంకయ్యగారి, దేశ భకి నిరతి-
గాంధీజీ గారి బాటలో నడిపించిన శక్తి.
ఇద్దరి దేశ సమైక్యతాభావనా దృష్టితో..
రుాపొందిన జాతీయ పతాక సృష్టి. ,
ముాడు రంగుల మచ్చటైన -
భావనా రుాప సంపత్తి-
ఆకుపచ్చ ,కాషాయ రంగుల సమ్మేళనం
సర్వ మత, సమైక్యతా భావానికి నిదర్శనం.
తెల్లని తెలుపు ,మధ్యలో చక్ర సుదర్శనం.
సత్య -అహింసా ఆచరణల నిత్య సందేశం.
ఎన్నటికీ స్ఫుార్తినిచ్చే మహోత్కృష్ట
"పతాక రుాప కర్త " ఆలోచనా సరళి.----
ఆవిష్కరించిన "పింగళి వెంకయ్య" గారికి,
నమఃసుమాంజలి.
-----------------------
రచన,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్్. మహారాష్ట్ర.
8097622021
----------------------
హామీ..
ఈ కవిత , ఏ మాధ్యమునందు ప్రచురితం కాని , నా స్వీయ రచన.
----------------------------------------
No comments:
Post a Comment