Tuesday, August 3, 2021

రక్షా బంధన్ కవిత

4/08/2021.ఉమెన్ వారియర్స్ కు పంపినది
అంశం : రక్షాబంధన్.

శీర్షిక : ఆపదలో అభయం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


కృుారుడు శిశుపాలుడు.
కడు వికృత స్వరుాపుడు.
ఐనాడు  శ్రీకృష్ణుని స్పర్శతోడ 
సుందరుడు.॥

అతని వల్లనే కొమరుడు
కడతేరుట సత్యమని
ఎరిగిన  శృతదేవికోరె
 పుత్ర  బిక్ష.శ్రీకృష్ణుని ॥
 
నుారు తప్పులు దాటిన 
వధియింతును ఆతనినని.
మాట ఇచ్చి తప్పులెన్నొ
క్షమియించెను కృష్ణుడు ॥.

 తప్పులన్ని నుారు దాట
చంపె వాని జిష్ణుడు .
పోరునదే  స్వల్పముగా
 గాయపడెను  కృష్ణుడు॥
 
రక్తము చిందిన క్రిష్ణకు  
 కట్టు కట్టె  ద్రౌపతి.
 ఆ ప్రేమకు సంతసించి  
అభయమిచ్చె శ్రీపతి.॥

జుాదములో ఓడిరదే 
పాండవులు సతి ద్రౌపతిని .
దుశ్యాసనుడవమనింప
వలువ లొలిచె ద్రౌపతివి ॥

అసహాయ స్థితిలొ కోరె
శరణాగతి  ద్రౌపతి.
శ్రీకృష్ణుడు అభయమిచ్చి
చీరలొసగె భగినికి ॥

ఆ ఘటనయె రక్షగ నిల 
ఖ్యాతికెక్కె అభయమై.
జనులందరు హర్షమంది 
పటించిరామొాదులై.॥

శ్రావణ పౌర్ణమి నాడదె
 రక్షా బంధన దినముగ
జరుపు కొంటిరిలనందరు
ఆనందపు పండగ ॥

రక్ష కట్టిరక్కా- చెల్లెళ్ళు 
భువిని  అన్నలకు. 
ఆభయమిచ్చి దీవింతురు
అన్నలు తమ చెల్లెళ్ళకు.॥
 
 
.హామీ:
ఈ  కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన











No comments:

Post a Comment