Wednesday, August 4, 2021

మణిపూసల నియమాలు********************

*మణిపూసల నియమాలు*
*******************

◆ ఇందులో నాలుగు పాదాలుంటాయి.

◆ 1,2,4 పాదాలకు అంత్యానుప్రాస మరియు
10,11,12 మాత్రల నుండి ఏదైనా ఒకే సంఖ్య ను ఉపయోగించాలి. అనగా 1 పాదంలో ఎన్ని మాత్రలుంటాయో, 2,4 పాదాల్లోనూ అన్ని మాత్రలే వుండాలి.

◆ 3 వ పాదానికి అంత్యానుప్రాస వుండరాదు.10 నుండి 12 వరకు ఎన్ని మాత్రాలైనా ఉండొచ్చు.

◆ 3, 4 పాదాల్లో కవితా మెరుపుండాలి.

【 లఘువు (I) ను ఒక మాత్రగాను, గురువు (U) ను రెండు మాత్రలుగాను లెక్కిస్తారు.】

ఉదా:...............

అంతరంగ మందున
2  1  2 1  2   1 1=10

ఉన్న చిన్న సందున
2 1  2  1  2  1  1=10

అణువంత నీతివుంటె
1 1  2 1  2 1 2 1=11

ఇన్ని గొడవలుండున
2 1  1 1 1 2 1  1=10

                   లేక

నీరు లేక పోయినా
2 1 2 1 2 1 2=11

గాలి లేక పోయినా
2 1 2 1 2 1 2 =11

సృష్టికి చలనంబు లేదు
2 1 1 1 1 2 1 2 1=12

కాంతి లేక పోయినా
2   1 2 1 2 1 2=11

                లేక

నీవు చెప్పినా వినాలి
2 1 2 1 2   1 2 1=12

నేను చెప్పినా వినాలి
2 1  2 1 2  1 2 1= 12

మంచి మంచి మాటలు
2   1  2   1  2 1 1=10

ఎవరు చెప్పినా వినాలి
1 11 2 1  2  1 2 1=12

              లేక

నాలుగు పాదాల్లోనూ సమాన  (10,11,12 లనుండి ఒకే సంఖ్య ) మాత్రలుండవచ్చు.


✍  వడిచర్ల సత్యం

No comments:

Post a Comment